17, ఆగస్టు 2011, బుధవారం

దత్తపది - 15 (కొమ్మ, ఆకు, కాయ, పండు)

కవిమిత్రులారా,
"కొమ్మ, ఆకు, కాయ, పండు"
పై పదాలను ఆయా అర్థాలలో కాకుండా ఉపయోగించి
మహాభారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.
(మందాకిని గారికి ధన్యవాదాలతో ...)

32 కామెంట్‌లు:

 1. ఆకులతలు లేక ఆటలు ముగియించి
  కాయములను వీడి గడచి పోవ
  పండుగ వలె కాదు పడతుల బ్రతుకులు
  కుంతి గాధ తెలిసి కొమ్మ! వినుమ!

  రిప్లయితొలగించు
 2. అందరికీ వందనములు !
  మందాకినిగారూ ! బావుంది !

  వస్త్రాపహరణంనాడు చేసిన ప్రతిఙ్ఞను దీర్చ, భీముడు
  దుష్ట దుశ్శాసనుని సంహరించి, గుండె చీల్చి, వాని
  రక్తంతో కురులు ముడివేసినపుడు ద్రౌపది :
  01)
  ________________________________

  చీర లాగి , కొమ్మ - చీకాకు బెట్టంగ
  కదన మందు వాని - కాయ మెక్కి
  పండు చీల్చు రీతి - గుండెను చీల్చిన
  పతిని గాంచి మురిసె - పండు గంచు !
  ________________________________

  రిప్లయితొలగించు
 3. శంకరార్యా ! వేరే అర్థాలతో కాకుండా అవే అర్థాలు నుపయోగించి
  వ్రాయాలంటేనే కష్టముగా నున్నది !

  02)
  ________________________________

  కీచ కుండు నాడు - కృష్ణ వెంట బడగ
  చేరి భీము డంత - చెట్టు నూపె !
  కొమ్మ మీద నెంతొ - కుదురుగా నుండిన
  ఆకు ,కాయ , పండ్లు - యవని జారె !
  ________________________________

  రిప్లయితొలగించు
 4. ఆ కుమతి వలనఁ వ్యాకుల
  మున్ కలి గెనె! కీచకునకు మూడెను, పండున్
  సూకరుఁ బాపము, చీల్చెద
  నా కాయము; భీముఁ బలుకుఁనమ్ముము కొమ్మా!

  వసంతకిశోర్ గారూ, మీ పూరణలు బాగున్నవి.
  అలాగంటారా?అలోచించవలసిందే!

  రిప్లయితొలగించు
 5. వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది కృష్ణునిపై ప్రయోగించిన ఖడ్గ బంధము.

  జ్ఞాన ధన మన! పరాకు న
  గా నగ నగునా? సుపూజ్య గైకొమ్మ ర మా
  మా నస వర! కాయతగున్
  గానగ నను గావ పండు గది నిజము సుమా.

  ..ధ.... గా.గు న్ త య కా.ర!వ స న
  జ్ఞా న!పరాకునగునా ? సు పూజ్య గై కొమ్మ,రమా!
  ..మ.... గ నను కావ పండుగది నిజముసు

  రిప్లయితొలగించు
 6. మందాకిని గారూ! మీరచనాసక్తి నాకెంతో సంతోషం కలిగిస్తోంది.
  ఐతే మెలకువలు కూడా అవసరం అని భావించి నాకు తెలిసిన చిన్న సూచన చేస్తున్నాను.
  రెండవ పాదంలో
  మున్ అని ప్రయోగిస్తే న్+క=న్క ఔతుంది కదా?
  ప్రాసాక్షరం సంయుక్తాక్షరమైతే మిగిలిన ప్రాసాక్షర నియమం పాటించాలి కాబట్టి
  ప్రాస పూర్వాక్షరం అజంతమై ఉంటే పరవా లేదు కాని హలంతమైతే మాత్రం ప్రాసక్షరంలో సంయుక్తమైపోతుంది.అప్పుడు అట్టి సంయుక్తాక్షరానికే ప్రాస వేయాలి. గమనించకలరు

  రిప్లయితొలగించు
 7. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, ఆగస్టు 17, 2011 5:54:00 PM

  యుద్ధానంతరము విజయాన్ని పండుగ వలె జరుపుకొందామని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెపుతున్నట్లుగా......

  చేకొమ్మా శస్త్రంబుల
  నాకుత్సిత కౌరవాదులంతముకొఱకై,
  నీకాయము దుర్భేద్యము,
  చేకొని పండువను జరుప శీఘ్రము గాగన్.

  రిప్లయితొలగించు
 8. మందాకిని గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  రెండవపూరణలో ప్రాసదోషం గురించి ‘చింతా’వారి వివరణ, సూచన గమనించారు కదా!
  ‘ఆ కుమతి వలనఁ వ్యాకుల
  మే కలి గెనె! కీచకునకు మృత్యువె, పండున్’ అందామా?
  *
  వసంత కిశోర్ గారూ,
  రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘పండు చీల్చు రీతి’ అని పండును అదే అర్థంలో వాడారుకదా!
  ఆ పదాలను అవే అర్థాల నుపయోగించి వ్రాయడమే కష్టం అంటూనే రెండవ పూరణ వ్రాసి చూపించారు. బాగుంది.

  రిప్లయితొలగించు
 9. చింతా రామకృష్ణారావు గారూ,
  మీ ప్రతిభకు నావద్ద కొలపాత్రలు లేవు. దత్తపదిని ఖడ్గబంధంలో ఇమిడ్చి పూరించిన వారు ఆంధ్రసాహిత్యచరిత్రలో మీరే ప్రథములు. ధన్యోऽస్మి!
  మందాకిని గారి పూరణలోని దోషాన్ని చెప్పి చక్కని సూచన లిచ్చినందుకు ధన్యవాదాలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 10. శంకరార్యా ! ధన్యవాదములు !
  చివరి పాదంలో ఇంకో "పండు "వేరే అర్థంలో నున్నది !
  గమనించుడు !

  రిప్లయితొలగించు
 11. ఆర్యులు రామకృష్ణా రావు గారి ఖడ్గ బంధ దత్తపది అద్భుతం.

  రిప్లయితొలగించు
 12. చంద్రశేఖర్:
  ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో, (శ్రీ కృష్ణ రాయబార సమయంలో):
  ఆ కులపెద్దలఁ జేకొని
  వాకొనుమా! పట్టుగొమ్మ, పండుముదుసలిన్
  కాకలు దీరిన భీష్ముని
  కాకు పరచుట తగదు వరకాయక! వినుమా!

  రిప్లయితొలగించు
 13. దుండగు డౌ సుయోధనుని ద్రుంచెను వజ్ర నికాయు డైన భీ-
  ముండు, జయమ్ము పాండవుల ముంగిట వ్రాలెను, పండుటాకు భీ-
  ష్ముండు హరిన్ స్మరించుచును ముక్తిని పొందెను, కొమ్మ ద్రౌపదిన్
  గుండెకు హత్తుకొన్న దదె కుంతియు నాకులముల్ నశింపగన్.

  రిప్లయితొలగించు
 14. శ్రీపతిశాస్త్రిబుధవారం, ఆగస్టు 17, 2011 10:23:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  గురువుగారు, దత్తపది అంత్యాక్షరము దీర్ఘంగా ఉండవచ్చా? దయచేసి తెలుపప్రార్థన.నా ప్రయత్నంలో తప్పులున్న మన్నింపప్రార్థన.

  చేకొమ్మా ఘనగాండివమ్మునిపుడే ఛేదింతునా కౌరవున్
  ఆకూనన్ బలిగొన్న కర్ణునికికన్ ఆయుస్షులే తీరగా
  ఆకాయంబును నేల గూల్చెదను నే నాఖండలున్ సాక్షిగా
  లేకున్నన్నిలపండు పాపములు ఏలీలన్ యుపేక్షించుదున్

  పద్మవ్యూహంలో అభిమన్యుని మరణ వార్త విన్న అర్జునుడు పైవిధంగా పలికినాడు.

  రిప్లయితొలగించు
 15. ఆ కుమతినిఁ నేఁ జంపెద
  సుకుమారీ, తెలుసుకొమ్మ, సుందరి! నేడీ
  శోకము తొలగును, ధూర్తుని
  ఆ కాయపు పాతకములు హహ్హా ! పండున్.

  గురువుగారు, చింతావారు ఇచ్చిన సూచనలు గుర్తు పెట్టుకుంటాను. ధన్యవాదములతో.

  రిప్లయితొలగించు
 16. ఇప్పుడే "ఎకాయకి" అనే చక్కని తెలుగు పదం గుర్తుకొంచ్చింది. చివరి పాదం మార్పుతో:
  ఆ కులపెద్దలఁ జేకొని
  వాకొనుమా! పట్టుగొమ్మ, పండుముదుసలిన్
  కాకలు దీరిన భీష్ముని
  కాకు పరచిన కడచెదవె కాయకి పుత్రా (శుంఠా)!

  రిప్లయితొలగించు
 17. కృష్ణుని సహాయార్థియై వచ్చిన దుర్యోధనుని మనోగతము (పడక సీను) :-

  పండు కొనెను పెరుగు వెన్న పాల దొంగ
  కొమ్మలెందరో వీనికి! కొంటె వాడు!
  వీనికా యభివాదము? నేను సలుప!
  ఆ కులుకుల పేడి పదము తాకు గాని!!

  రిప్లయితొలగించు
 18. ఆకురుసేనలన్గనియె అర్జున! నీవిట నీరుగారుటల్ (నీరసింతువే?)
  నీకులగౌరవమ్మగునె?నిత్యమె కాయము? బాంధవమ్ములున్?
  ప్రాకక "మేడిపండువలె పార్ధుని ధీరత" యన్నవాదులున్
  వీకమునొందికొమ్మికను వింటిని, పారగ శత్రుసైన్యముల్

  రిప్లయితొలగించు
 19. చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. ముఖ్యంగా ‘కాకు పఱచుట, వరకాయక’ పదప్రయోగం ప్రశంసనీయం. అభినందనలు.
  సవరించిన పూరణ కూడా బాగుంది. అది ‘ఎకాయెకి’, ఎకాయకి కాదు!
  *
  మిస్సన్న గారూ,
  గంగా ప్రవాహంలా ధారాశుద్ధిగల వృత్తంలో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  ‘వజ్రనికాయుడైన’ అని ‘కాయ’ శబ్దాన్ని మార్చవచ్చునా? ‘వజ్రనికాయదేహ భీముండు’ అనవచ్చు కదా!
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  బాగుంది మీ శార్దూల పూరణ. అభినందనలు.
  *
  మందాకిని గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
  *
  ఊకదంపుడు గారూ,
  ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
  ‘కొమ్మ’ను ‘కొమ్మికను’ అన్నారు. ‘కొమ్మదియె’ అంటే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించు
 20. గురువుగారూ ధన్యవాదాలు.
  మీ సవరణ చక్కగా సరిపోయింది.

  రిప్లయితొలగించు
 21. పండుగ వంటఁ జేసిరట పాటలనాటలపాండుపుత్రులన్
  నిండుమనంబుతో జనులు నీలపుకాయపు ధారుడైన కృ
  ష్ణుండునుఁ మోదమొందగను షోడశ కర్మలకొమ్మనందురే!
  కొండల యంత రాగమును కూర్మిని యాకురువంశమందెనే!

  మిత్రుల పూరణలన్నీ అద్భుతంగా ఉన్నాయి .ఇలాంటి సమస్య ఇచ్చిన గురువుగారికి ధన్యవాదములు. అందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించు
 22. మందాకిని గారూ,
  మనోహరమైన పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించు
 23. ఆ కులమ్మేల ? రాధేయు నంతరాత్మ
  కాయ మన్నది వేరైన కలిసె ! నేడు
  పండు గనుచును రారాజు ప్రక్క జేరి
  అంగ రాజ్యము చే కొమ్మ యనుచు నిచ్చె !

  రిప్లయితొలగించు
 24. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మొదటి రెండు పాదాలు కొంత ‘గడబిడ’గా ఉన్నా మొత్తానికి పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 25. శంకరార్యా ! ధన్యవాదములు.
  మరొక ప్రయత్నము చేయుచున్నాను.
  మయసభ నుండి అవమానము తో వచ్చిన రారాజు మనస్థితి...

  ఆకులటకృష్ణ మదమెక్కి యచట నవ్వె
  కాయమున గాదు మనసుకు గాయ మయ్యె
  పండుకొనగాను నిద్దుర పట్ట దాయె
  కొమ్మ పొగరును దించగా కోరె మనసు .

  రిప్లయితొలగించు
 26. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  దత్తపదులు పోటీలో ‘ఫస్ట్ ప్రైజ్’ మీదే. అంత అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించు
 27. కొమ్మ ద్రోవది మనమున క్రమ్మినట్టి
  యాకులత నెల్ల దీర్పంగనాజి, బాహు
  బలమహాకాయవిక్రమాచల నిభుండు
  పవన సూనుండు గదపండువన్ యొనర్చె

  రిప్లయితొలగించు
 28. పార్వతీశ్వర శర్మ గారూ,
  మీ పూరణ సర్వోత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించు