మిస్సన్న గారూ, గజాసుర వృత్తాంత ప్రస్తావనతో మీ పూరణ ఆమోదయాగ్యమే అని భావిస్తున్నాను. ఏదో ఒక విధంగా సమస్యపాదాన్ని సార్థకం చేయడమే కదా పూరణా నైపుణ్యం. అందులో మీరు కృతకృత్యులయ్యారు. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు. * మందాకిని గారూ, మీ రెండు పూరణలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు. మొదటి పూరణలో ‘గాఢప్రీతి‘ అన్నప్పుడు ‘ఢ’ గురువవుతుంది. ‘గాఢమైత్రి’ బాగుంటుందేమో?
చంద్రశేఖర్ గారూ, ‘పర్యాయపద నిఘంటువు’ చూసి గౌరి శబ్దానికి భూమి అనే అర్థం ఉన్నట్లు నిర్ధారించుకున్నాను. వరాహావతార ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
కరివరదు డన్న హరియగు హరుడునగును,
రిప్లయితొలగించండికరిని గాచెను శ్రీహరి! కరిక ళేబ-
రమును దాల్చెను హరుడును! ప్రమద మొప్ప
గౌరి ముఖమును చుంబించెఁ గరివరదుఁడు!
పెద్దలు శ్రీ రామకృష్ణా రావు గారు, గురువుగారు
నా భావనలో గానీ, పూరణలో గానీ దోషమున్న యెడల
మన్నింప వేడెదను.
చేర కైలాస మొకనాడు చక్రి, యచట
రిప్లయితొలగించండిముద్దులొలికెడు శ్రీ గజ ముఖుని జూచె
ఎత్తు కొమ్మని గణపతి నీయ తల్లి
గౌరి; ముఖమును చుంబించెఁ గరివరదుఁడు.
చిన్న సవరణ తో..
రిప్లయితొలగించండిచేర కైలాస మొకనాడు శౌరి,యచట
ముద్దులొలికెడు శ్రీ గజ ముఖుని జూచె
ఎత్తు కొమ్మని గణపతి నీయ తల్లి
గౌరి; ముఖమును చుంబించెఁ గరివరదుఁడు.
మురిసి శ్రీకరు రమణియు, మూర్ధమందు
రిప్లయితొలగించండిగౌరి ముఖమును చుంబించె. కరివరదుడు,
గజపు చర్మపు ధారుడు గాంచి రచట
కన్ను విందుగ రమణుల గాఢ ప్రీతి.
శుక్లాంబరధరం .. విష్ణుం ..
రిప్లయితొలగించండికరి ముఖమ్మును గలిగిన కంతుడవులె
గుజ్జు రూపివి చదువుల యొజ్జ యనుచు
గౌరి ముఖమును చుంబించెఁ ;గరివరదుఁడు
హరికి సముడని దీవించె గరిక ప్రియుని
తల్లి చేసిన భక్ష్యము దాను తినుచు
రిప్లయితొలగించండిగౌరి ముఖమును చుంబించె; కరివరదుడు
ముద్దు గణపతి చేష్ఠలఁ, ముచ్చటలనుఁ
సంతసమ్మున తిలకించి, సాగిపోయె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమృతమును పంచి యందాల నారబోయు
రిప్లయితొలగించండిమోహినీ రూప లాస్య సమ్మోహి యైన
గరళ కంఠుని జేరి - యక్కజమున గన
గౌరి - ముఖమును చుంబించె గరివరదుడు
--- వెంకట రాజారావు . లక్కాకుల
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిగజాసుర వృత్తాంత ప్రస్తావనతో మీ పూరణ ఆమోదయాగ్యమే అని భావిస్తున్నాను. ఏదో ఒక విధంగా సమస్యపాదాన్ని సార్థకం చేయడమే కదా పూరణా నైపుణ్యం. అందులో మీరు కృతకృత్యులయ్యారు. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
*
మందాకిని గారూ,
మీ రెండు పూరణలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
మొదటి పూరణలో ‘గాఢప్రీతి‘ అన్నప్పుడు ‘ఢ’ గురువవుతుంది. ‘గాఢమైత్రి’ బాగుంటుందేమో?
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగానే ఉంది కదా! ఎందుకు తొలగించారు?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండివిఘ్నములనన్ని తొలగించు వీరుడనుచు
తనదు పుత్రుని జూపించె తన్మయమున
గౌరి, ముఖమును చుంబించె గరివరదుడు
కరిముఖుంజేర్చి ప్రేమతో కౌగిలించి
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
శంకరార్యా ! ప్రాస పూర్వాక్షరం తేడా వచ్చింది ! సరిచేశాను !
01)
_________________________________
తెలివి , తల్లి దండ్రుల చుట్టు - తిరుగు కతన
శరవణోద్భవు గెల్చిన - పరశు ధరుని
గౌరి , ముఖమును చుంబించె !- గరివరదుఁడు
చేకితానుడు , సురలును - చేరి పొగడ !
_________________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశంకరార్యా !ధన్యవాదములు!
రిప్లయితొలగించండిగౌరి గాని గిరితనయ గాదు, గౌరి
రిప్లయితొలగించండియనగ భూమి, మున్నావరా హావతారు
సంగడముఁ గోరిన సరస సంజె వేళఁ
గౌరి ముఖమును చుంబించెఁ గరివరదుఁడు
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండి‘పర్యాయపద నిఘంటువు’ చూసి గౌరి శబ్దానికి భూమి అనే అర్థం ఉన్నట్లు నిర్ధారించుకున్నాను. వరాహావతార ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
గురువు గారూ, నిజమే. గణదోషం సవరించినందుకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅసలు ప్రీతి కన్నా మైత్రి అనే పదమే సూటబుల్గా ఉంటుంది,అక్కడ.
ధన్యవాదాలు, మాష్టారు.
రిప్లయితొలగించండిభాద్రపద శుద్ధచవితిన భాగ్యనగర
రిప్లయితొలగించండిగణపతుల శోభ కనులార గాంచి మురిసి
గౌరి ముఖమును చుంబించె , గరివరదుడు
లేచి చెయిసాచి దలయూచి చూచి మెచ్చె!
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిపూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ నా దృష్టికి రాలేదు. మన్నించాలి.
అతి మనోహరంగా ఉంది పూరణ. అభినందనలు.