గోలి హనుమచ్ఛాస్త్రి గారూ "రౌద్ర మన్నది లేకున్న భద్ర మేది" పూరణ బాగుంది. కానీ మీ రెండు పద్యాల చరణాలు కలిపితే ఇంకా బాగుంది. బహుశా వ్యాకరణ/ఛందస్సు రీత్యా సరిపోదనుకుంటాను.
నవ రసంబులు కావలె నరుని కెపుడు వాటి మోతాదు సరి జూచి వాడు కొనిన నిద్ర పోగొట్టు మోతాదు రౌద్ర రసము చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము
నమస్కారములు లక్కరాజు వారి పద్యం చక్కగా ఉంది. తక్కువ పద్యాలు వ్రాసినా ఎక్కువ బాగుంటాయి " నేను చూడండి. నాలుగులో మూడు తప్పులే " బాగా రాయడానికి ఏదైనా ఉపాయం ఆలోచిచాలి . డాక్టర్ కదా ! మంచి సలహా ఇవ్వచ్చు కదా ?
బాబోయ్ నేను పద్యం వ్రాయలేదు. రాజేశ్వరి గారూ నేను కవినిగాను. కవిత్వాన్ని ఆస్వాదించటం మాత్రమే తెలుసు. గోలి హనుమచ్ఛాస్త్రి గారి రెండు పద్యాలలో రెండు రెండు చరణాలు తీసుకుని నాలుగు చరణాలు చేసాను. చందోబద్ధమో కాదో కూడా తెలియదు.
కవి మితులారా, ఉదయంనుండి ఒక ముఖ్యమైన పనిలో వ్యస్తుణ్ణై ఇంతకు ముందే బ్లాగు తెరిచాను. ఇన్ని పూరణలు చూసే సరికి మహదానందంతో పాటు వీటన్నిటినీ ఇప్పటి కిప్పుడే చదివి గుణదోషవిచారణ చేయాలనుకునే సరికి నిజంగానే ‘నీరసం’ వచ్చింది. సరే చూద్దాం ... అన్నట్టు సమస్యను ఇచ్చే సమయంలో ‘చేరెన్ + ఈ రసంబు’ అనే సంధితో ‘నీరసాన్ని’ పోగొట్టవచ్చు నన్న ఆలోచనే రాలేదు. అలా ఆలోచించిన మిత్రులకు నమోవాకాలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ నవరసాల పూరణలు నవరత్నాలై శోభిల్లుతున్నాయి. అభినందనలు. ‘శృంగారరస’ పూరణలో ‘సౌఖ్యప్రదము’ అన్నపుడు ‘ఖ్య’ గురువై గణదోషం వస్తుంది. ‘సౌఖ్యదమ్ము’ అంటే సరి! ‘పేరు’ కు బదులు ‘మేటి’ అనవచ్చు కదా! ‘కరుణరస’ పూరణలో ‘వికలము + అగును’ అన్నచో యడాగమం రాదు కదా! ‘వికలమె యగును‘ అనవచ్చు.
శంకరార్యా ! సార్థకమైన సవరణలకు ధన్యవాదములు. మొదట ఒక పూరణ మనే చేసాను.నీరసం లో నీ వేరు చేసిన తదుపరి అన్ని రసముల గ్రోలవలె నని అనిపించింది. అందులకు అవకాశాన్ని ఇచ్చిన మీకు ప్రత్యెక కృతజ్ఞతలు. లక్కరాజు గారూ ! ధన్యవాదములు. తేట గీతి కనుక ఏ పాదం ఎటు ఉంచినా ఇబ్బంది లేదు. మిస్సన్న గారూ !కిశోర్ గారూ ! ధన్యవాదములు. 'నీరసమ్మున్న' సమస్యను నీరసం లేకుండా ఉత్సాహంగా పూరించిన కవి మిత్రు లందరకు అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, చిత్రసీమలో నవరసాల భ్రష్టత్వాన్ని వివరిస్తూ చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు. ‘హావ భావన హీనత’ అన్నదాన్ని ‘హావ భావ విహీనత’ అంటే ఇంకా బాగుంటుంది కదా! * వసంత కిశోర్ గారూ, మీ నవరసాల పూరణలు నవనిధులై సాహితీ సంపదను పంచుతున్నాయి. అభినందనలు. ‘శృంగరరస’ పూరణలో ‘సరస సల్లాప సరసోక్తి’ అన్నపుడు ‘సరస’శబ్దం పునురుక్త మయింది. అక్కడ ‘మధురోక్తి’ అంటే ఎలా ఉంటుంది? ‘వీరరస’ పూరణలో ‘వీతరాగుల వంచును వీరరసము’ అంటే బాగుంటుందని నా సలహా. ఎన్ని రకాల నవ్వులున్నాయో చెప్పిన మీ ‘హాస్యరస’ పూరణ అద్భుతం! ‘రౌద్రరస’ పూరణలో ‘భద్రత + అనునది’ అన్నప్పుడు సంధి లేదు. ‘భద్రతయె చూడ’ అందామా? ‘భయానకరస’ పూరణలో ‘అడలు కంపించు నొడలు భయానకంబు’ అంటే ఎలా ఉంటుంది? ‘బీభత్సరస’పూరణలో ‘రగులు జుగుప్స , భీభత్స - రసమ నంద్రు’ అన్నప్పుడు గణ సంధి దోషాలున్నాయి. ‘రగులును జుగుప్స భీభత్స రసమటంద్రు’ అందాం.
మందాకిని గారూ, మీ పూరణ చమత్కారభరితమై అలరించింది. అభినందనలు. కాకుంటే ‘భీభత్స’ శబ్దానికి మీరిచ్చిన రూపం భీభత్సంగా ఉంది సవరణకు లొంగనంతగా! * మిస్సన్న గారూ, అవగుణాలను పోలిన అవరసాలతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ, మీరూ మూర్తి గారి బాటను పట్టి చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, చక్కని విరుపుతో మంచి పూరణ నిచ్చారు. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, మీ రసాలు నిజంగా ‘నీరసాన్ని’ పోగొట్టేవే. చక్కని పూరణ. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * లక్కరాజు వారూ, రాజేశ్వరక్కయ్యా, ధన్యవాదాలు.
'హావ భావ విహీనత ' చాలా బాగుంది గురువు గారూ . ధన్యవాదములు. మిస్సన్న గారూ మీ అవరసమ్ములలో నవ రసాలు యిమిడి ఉన్నాయి. బాగుంది మీ పూరణ.
అక్కయ్య గారూ మీ పూరణ అదిరింది. చేరే టైపాటుని 'చేరె ' గా మారుస్తే గురువు గారు మీ పద్యములో దోషము పట్ట లేరని పందెము కాస్తాను. ( దోషములు యెంచాలంటే ప్రక్క పుటలో నా పద్యము ఉంది. )
జీవనంబున నరులకు చేవనిచ్చి
రిప్లయితొలగించండినిత్యసత్యము, పోగొట్టు నీరసమ్ము
హాయి గొలుపుచు మురిపించు హాస్య రసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.
చిత్రసీమలో చొచ్చిన చెత్త కేడ్చి
రిప్లయితొలగించండిహావ భావన హీనత హాస్య మొంది
పాట మాటల భ్రష్టమ్ము బాధ పడగ
చేరె నవరసమ్ముల లోన నీరసమ్ము !
శాస్త్రీజీ మీ హస్యము వలన నీరసము పోయింది
రిప్లయితొలగించండిమూర్తి గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఏ రసాన్ని సరిగా ఒలికించలేని నేటి చిత్రసీమను చూసి నిజంగానే నవరసాలకు నీరసం వచ్చింది .... బాగుంది....
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిశాస్త్రీజీ ! మీ హాస్యరసం బావుంది !
మూర్తీజీ ! మీ నీరసము కూడా బావుంది !
01)
__________________________________
కవుల కల్పన చేతను - కలత మీఱ
కఠిన హృదయము నైనను - కరుగ జేసి
కనుల కన్నీరు గార్పించు - కరుణ రసము
చేరె నవరసమ్ములలోన - నీ రసమ్ము !
__________________________________
కిషోర్ జీ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండికరుణ రసంతో మొదలైన మీ పద్య ధార నవ రసాలను అందుకోవాలని నా అభిలాష .
మదిని కలతల అలలను మరుగు పరచు
రిప్లయితొలగించండిచక్క దిద్దును మానవ జీవ సరళి
శాంతమన్నది లేకను సౌఖ్య మేది
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.
ప్రేమయన్నది నిత్యము పెంపు నొందు
రిప్లయితొలగించండిసకల జీవుల కియ్యది సౌఖ్య ప్రదము
రసము లన్నిట శృంగార రసము పేరు (పేరొందినది)
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.
కిశోర్ జీ ,హనుమఛ్ఛాస్త్రి గారు మీకు నవరసాలకు గురువు గారు అవకాశ మిచ్చారు.వర్ష ధార కురిపించండి !
రిప్లయితొలగించండిశాస్త్రీజీ !మీ శాంత ,శృంగారాలు బావున్నాయ్ !
రిప్లయితొలగించండి02)
__________________________________
సుదతులను గూడి పురుషుండు - సుమధురముగ
సరస సల్లాప సరసోక్తి - సలుపువేళ
చిలుక శృంగార రసమును - చిలుక రౌతు
చిత్త మలరంగ జేయును - చిత్రముగను !
చేరె నవరసమ్ముల లోన - నీ రసమ్ము !
__________________________________
భయము లేనిచొ మారు ప్ర వర్తనమ్ము
రిప్లయితొలగించండిభక్తి యన్నది మది నిల్పి భయము విడుడు
భయము అవసర మేరికి బాగు పడగ
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.
కఠిన మెప్పుడు చేయును గాయములను
రిప్లయితొలగించండికరుణ వీడిన సృష్టి వికలము యగును
కదలు చుండును జగమంత కరుణ తోడ
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.
సత్యమన్నది మరచి నిస్సత్తువయిన
రిప్లయితొలగించండికార్య నిర్వహణమ్మది కరగి పోగ
చేర నడపును ముందుకు వీర రసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహద్దు దాటగ భీభత్స మగును నరుని
రిప్లయితొలగించండిజీవితమ్మున, సరిహద్దు చేరి మీర
ఫలిత మిదిమని చెప్పు భీభత్సరసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము
రౌద్ర మన్నది లేకున్న భద్ర మేది
రిప్లయితొలగించండిచిద్ర మగునని దేవుడే రుద్రుడాయె
నిద్ర పోగొట్టు మోతాదు రౌద్ర రసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము
03)
రిప్లయితొలగించండి__________________________________
క్రోధమును బూని , కూళుల - గూల్చు వేళ
కోమలం బైన హృదయంబు - భీమమగును
తాపసుల గూడ వంచును - కోపరసము(వీరరసము)
చేరె నవరసమ్ముల లోన - నీ రసమ్ము !
__________________________________
నవ రసంబులు కావలె నరుని కెపుడు
రిప్లయితొలగించండివాటి మోతాదు సరి జూచి వాడు కొనిన
అద్భుతమ్మని మది నెంచు, అద్భుతమ్మె;
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి04)
రిప్లయితొలగించండి__________________________________
స్మితము హసితము,విహసిత - మతిహసితము
ప్రహసిత మపహసిత మను - పలు విధముల
నలర జేసెడి లాస్యమె - హాస్యరసము !
చేరె నవరసమ్ముల లోన - నీ రసమ్ము !
__________________________________
05)
రిప్లయితొలగించండి__________________________________
మేఘ మందున ప్రభవించు - మెఱపు జూడ
అంబు రాశిని పయనించు - నలల జాడ
బుద్బుదంబగు జనులకు - నద్భుతమ్ము !
చేరె నవరసమ్ముల లోన - నీ రసమ్ము !
__________________________________
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ "రౌద్ర మన్నది లేకున్న భద్ర మేది" పూరణ బాగుంది. కానీ మీ రెండు పద్యాల చరణాలు కలిపితే ఇంకా బాగుంది. బహుశా వ్యాకరణ/ఛందస్సు రీత్యా సరిపోదనుకుంటాను.
రిప్లయితొలగించండినవ రసంబులు కావలె నరుని కెపుడు
వాటి మోతాదు సరి జూచి వాడు కొనిన
నిద్ర పోగొట్టు మోతాదు రౌద్ర రసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము
06)
రిప్లయితొలగించండి__________________________________
భక్తి భావము పెంచును - యుక్తముగను
శాంతి సౌభాగ్యముల గూర్చి - సౌరు బెంచు
సత్యమందున నిలుపును - శాంత రసము !
చేరె నవరసమ్ముల లోన - నీ రసమ్ము !
__________________________________
07)
రిప్లయితొలగించండి__________________________________
ఛిద్ర మైపోవు జనులకు - చిత్తమంత
భద్ర తనునది కరవగు - నిద్ర రాదు
క్షుద్ర శక్తుల నిలయము - రౌద్ర మనిన !
చేరె నవరసమ్ముల లోన - నీ రసమ్ము !
__________________________________
వీర రౌద్రమద్భుత శాంత బీభయత్స
రిప్లయితొలగించండిహాస్య శృంగార కరుణ భయానకములు.
తెలిసి చదువుకొనుమ! దెట్టి దెట్టు లొచ్చి
చేరె,నవరసమ్ములలోన నీరసమ్ము!
తెలిసిచదువుకొనుమ! అదెట్టిది? ఎట్టులొచ్చిచేరె?
08)
రిప్లయితొలగించండి__________________________________
చీక టింటిని యొంటిగ - చేరి నపుడు
గబ్బిలంబులు సర్పాలు - కంట బడిన
జలదరించును యొడలంత - భయము వలన ! (భయానకం)
చేరె నవరసమ్ముల లోన - నీ రసమ్ము !
__________________________________
09)
రిప్లయితొలగించండి__________________________________
కాష్ఠ మందున శవములు - కాలు చుండ
రాజ వీథిని విపరీత - రయము గనిన
రగులు జుగుప్స , భీభత్స - రసమ నంద్రు !
చేరె నవరసమ్ముల లోన - నీ రసమ్ము !
__________________________________
గోలి మహానుభావా! కిశోర మహోదయా! జోహార్లు!
రిప్లయితొలగించండిశక్తి లేకున్న మనిషి నిస్సత్తు వగును
రిప్లయితొలగించండివత్తిడికి లొంగి పూర్తిగా వాడి పోవు
పలుక జాలడు మగతగా పండి యుండు
చేరె నవరసమ్ములలోన నీరసమ్ము.
(చేరెను + అవ రసమ్ములలోన)
నవ రసమ్ములను నటించు నటులు పోయె
రిప్లయితొలగించండిచెడెను వారసుల్ చేరగ చిత్ర సీమ
వెకిలి చేష్టలే నటనగ పేరు మోయ
చేరె నవరసమ్ములలోన నీరసమ్ము!!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅభినయించుచు చూపిన అన్నికళలు
జేరె నవరసమ్ములలోన. నీరసమ్ము
కలుగు విశ్రాంతి లేకున్న. అలుపు దీర
నిమ్మరసమును గైకొను నెమ్మదిగను
నవరసములన నివియని నళినిజెప్పె
రిప్లయితొలగించండిచేరె నవరసమ్ములలోననీరసమ్ము,
చింత , మిరియాల రసములు, చెఱుకు రసము,
నిమ్మరసమును,ద్రాక్ష, దానిమ్మ రసము,
పాద రసమును, మామిడి పళ్ళ రసము.
మంద పీతాంబర్ గారూ మీ పూరణ "నవరసములన నివియని నళినిజెప్పె" బాగుంది. పద్యం నడక స్మూత్ గ ఉంది.
రిప్లయితొలగించండినమస్కారములు
రిప్లయితొలగించండిలక్కరాజు వారి పద్యం చక్కగా ఉంది. తక్కువ పద్యాలు వ్రాసినా ఎక్కువ బాగుంటాయి " నేను చూడండి. నాలుగులో మూడు తప్పులే " బాగా రాయడానికి ఏదైనా ఉపాయం ఆలోచిచాలి . డాక్టర్ కదా ! మంచి సలహా ఇవ్వచ్చు కదా ?
బాబోయ్ నేను పద్యం వ్రాయలేదు. రాజేశ్వరి గారూ నేను కవినిగాను. కవిత్వాన్ని ఆస్వాదించటం మాత్రమే తెలుసు. గోలి హనుమచ్ఛాస్త్రి గారి రెండు పద్యాలలో రెండు రెండు చరణాలు తీసుకుని నాలుగు చరణాలు చేసాను. చందోబద్ధమో కాదో కూడా తెలియదు.
రిప్లయితొలగించండిచంద్రశేఖర్:
రిప్లయితొలగించండిహాస్య శృంగార రసముల యనుభవంబు
మరచి మదమత్సరము నింపి మాయదారి
పంచనబడు నిస్సారపు బ్రతుకు సరళిఁ
చేరె నవరసమ్ములలోన నీరసమ్ము
కవి మితులారా,
రిప్లయితొలగించండిఉదయంనుండి ఒక ముఖ్యమైన పనిలో వ్యస్తుణ్ణై ఇంతకు ముందే బ్లాగు తెరిచాను. ఇన్ని పూరణలు చూసే సరికి మహదానందంతో పాటు వీటన్నిటినీ ఇప్పటి కిప్పుడే చదివి గుణదోషవిచారణ చేయాలనుకునే సరికి నిజంగానే ‘నీరసం’ వచ్చింది. సరే చూద్దాం ...
అన్నట్టు సమస్యను ఇచ్చే సమయంలో ‘చేరెన్ + ఈ రసంబు’ అనే సంధితో ‘నీరసాన్ని’ పోగొట్టవచ్చు నన్న ఆలోచనే రాలేదు. అలా ఆలోచించిన మిత్రులకు నమోవాకాలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ నవరసాల పూరణలు నవరత్నాలై శోభిల్లుతున్నాయి. అభినందనలు.
‘శృంగారరస’ పూరణలో ‘సౌఖ్యప్రదము’ అన్నపుడు ‘ఖ్య’ గురువై గణదోషం వస్తుంది. ‘సౌఖ్యదమ్ము’ అంటే సరి! ‘పేరు’ కు బదులు ‘మేటి’ అనవచ్చు కదా!
‘కరుణరస’ పూరణలో ‘వికలము + అగును’ అన్నచో యడాగమం రాదు కదా! ‘వికలమె యగును‘ అనవచ్చు.
శంకరార్యా ! సార్థకమైన సవరణలకు ధన్యవాదములు. మొదట ఒక పూరణ మనే చేసాను.నీరసం లో నీ వేరు చేసిన తదుపరి అన్ని రసముల గ్రోలవలె నని అనిపించింది. అందులకు అవకాశాన్ని ఇచ్చిన మీకు ప్రత్యెక కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిలక్కరాజు గారూ ! ధన్యవాదములు. తేట గీతి కనుక ఏ పాదం ఎటు ఉంచినా ఇబ్బంది లేదు.
మిస్సన్న గారూ !కిశోర్ గారూ ! ధన్యవాదములు.
'నీరసమ్మున్న' సమస్యను నీరసం లేకుండా ఉత్సాహంగా పూరించిన కవి మిత్రు లందరకు అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిచిత్రసీమలో నవరసాల భ్రష్టత్వాన్ని వివరిస్తూ చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
‘హావ భావన హీనత’ అన్నదాన్ని ‘హావ భావ విహీనత’ అంటే ఇంకా బాగుంటుంది కదా!
*
వసంత కిశోర్ గారూ,
మీ నవరసాల పూరణలు నవనిధులై సాహితీ సంపదను పంచుతున్నాయి. అభినందనలు.
‘శృంగరరస’ పూరణలో ‘సరస సల్లాప సరసోక్తి’ అన్నపుడు ‘సరస’శబ్దం పునురుక్త మయింది. అక్కడ ‘మధురోక్తి’ అంటే ఎలా ఉంటుంది?
‘వీరరస’ పూరణలో ‘వీతరాగుల వంచును వీరరసము’ అంటే బాగుంటుందని నా సలహా.
ఎన్ని రకాల నవ్వులున్నాయో చెప్పిన మీ ‘హాస్యరస’ పూరణ అద్భుతం!
‘రౌద్రరస’ పూరణలో ‘భద్రత + అనునది’ అన్నప్పుడు సంధి లేదు. ‘భద్రతయె చూడ’ అందామా?
‘భయానకరస’ పూరణలో ‘అడలు కంపించు నొడలు భయానకంబు’ అంటే ఎలా ఉంటుంది?
‘బీభత్సరస’పూరణలో ‘రగులు జుగుప్స , భీభత్స - రసమ నంద్రు’ అన్నప్పుడు గణ సంధి దోషాలున్నాయి. ‘రగులును జుగుప్స భీభత్స రసమటంద్రు’ అందాం.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చమత్కారభరితమై అలరించింది. అభినందనలు.
కాకుంటే ‘భీభత్స’ శబ్దానికి మీరిచ్చిన రూపం భీభత్సంగా ఉంది సవరణకు లొంగనంతగా!
*
మిస్సన్న గారూ,
అవగుణాలను పోలిన అవరసాలతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీరూ మూర్తి గారి బాటను పట్టి చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ రసాలు నిజంగా ‘నీరసాన్ని’ పోగొట్టేవే. చక్కని పూరణ. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
లక్కరాజు వారూ,
రాజేశ్వరక్కయ్యా,
ధన్యవాదాలు.
పాపం గురువుగారికి నీరసం వచ్చి ఉంటుంది. ఇన్ని రసాలను టేస్ట్ చేసి కామెంట్ చేసే టప్పటికి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి'హావ భావ విహీనత ' చాలా బాగుంది గురువు గారూ . ధన్యవాదములు. మిస్సన్న గారూ మీ అవరసమ్ములలో నవ రసాలు యిమిడి ఉన్నాయి. బాగుంది మీ పూరణ.
రిప్లయితొలగించండిఅక్కయ్య గారూ మీ పూరణ అదిరింది. చేరే టైపాటుని 'చేరె ' గా మారుస్తే గురువు గారు మీ పద్యములో దోషము పట్ట లేరని పందెము కాస్తాను.
( దోషములు యెంచాలంటే ప్రక్క పుటలో నా పద్యము ఉంది. )
" రసము లందున శృంగార రసము మిన్న
రిప్లయితొలగించండిముదము కలిగించి గెలిపించు మునుల నైన
కరుణ శాంతము లనునవి కాన లేము
చేరె నవరసమ్ము లలోన నీరసమ్ము "
ధన్య వాదములు మూర్తి గారూ ! [ ఈ రోజు కంప్యుటర్ సరిగా లేదు ]
రౌద్ర మద్భుత బీభత్స రసము, వీర
రిప్లయితొలగించండిహాస్య శృంగార కరుణ భయానకములు,
దెలియుడీ, శాంతమ,నుచున దెట్టు లొచ్చి
చేరె,నవరసమ్ములలోన నీరసమ్ము!
గురువుగారూ, బీభత్సము అలా రాయకూడదనుకోలేదు, మన్నించండి.
మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
రిప్లయితొలగించండిశంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
మూర్తీజీ ! ధన్యవాదములు !
శాస్త్రీజీ ! ధన్యవాదములు !
మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !