15, ఆగస్టు 2011, సోమవారం

సమస్యా పూరణం -427 (స్వాతంత్ర్యము దేశజనుల)

కవి మిత్రులారా,
అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

49 కామెంట్‌లు:

  1. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంసోమవారం, ఆగస్టు 15, 2011 7:15:00 AM

    అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  2. తాతలు తండ్రులు దెచ్చిరి
    స్వాతంత్ర్యము ;దేశ ప్రజల చావుకు వచ్చెన్
    మాతా పుత్రుల రాజ్యము,
    భ్రాతలు మీ వంతు తెండు రాముని రాజ్యం !!

    రిప్లయితొలగించండి
  3. అందఱికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


    తాతలు తండ్రులు దెచ్చిరి
    స్వాతంత్ర్యము ;దేశ జనుల చావుకు వచ్చెన్
    మాతా పుత్రుల రాజ్యము
    భ్రాతలు మీ వంతు తెండు రాముని రాజ్యం !!

    రిప్లయితొలగించండి
  4. గురువు గారూ మన్నించండి. తొందఱలో వ్యావహారికము దొర్లింది.


    తాతలు తండ్రులు దెచ్చిరి
    స్వాతంత్ర్యము ;దేశ జనుల చావుకు వచ్చెన్
    మాతా పుత్రుల రాజ్యము !
    భ్రాతలు మరి కనులు తెఱచి ఫలములు గనరే !

    రిప్లయితొలగించండి
  5. అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!

    ఏతీరైనను పౌరుల
    స్వాతంత్ర్యము కొల్లగొట్టు శాసనములతో
    భీతావహులై జచ్చిరి
    స్వాతంత్ర్యముదేశ ప్రజల చావుకు వచ్చెన్!!!

    రిప్లయితొలగించండి
  6. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, ఆగస్టు 15, 2011 9:31:00 AM

    ద్యూతములకు నిలయంబై,
    పాతకములకిలను యాటపట్టై, సతతం
    ఘాతకముల క్షోభిల్లెడి
    స్వాతంత్ర్యము దేశ జనుల చావుకు వచ్చెన్.

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు

    01)
    ________________________________

    మేతలు మేసెడి మంత్రుల
    పాతకముల, చూడకుండు - బధిరుడు సింగే (బాసే)
    నీతికి కట్టిరి పాతర
    స్వాతంత్ర్యము దేశజనుల - చావుకు వచ్చెన్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  8. కవిమిత్రులందరికీ స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు!
    డా.మూర్తి మిత్రమా! పూరణ అదిరింది, పదాల కూర్పు బాగుంది. అయితే, "మాతా పుత్రుల రాజ్యము" అంటే ఇందిరాగాంధీ-రాజీవ్ గాంధీ అనియా లేక సోనియా-రాహుల్ అనియా మీ ఉద్దేశ్యం? ఒకటి భూతకాలం, ఇంకోటి వర్తమానం - రెండూ ప్రజలను చావుకు దేచ్చినవే? చదువరుల ఊహకే వదిలేశానంటారా :-)

    రిప్లయితొలగించండి
  9. 02)
    ________________________________

    తాతలు తండ్రులు దెచ్చిన
    స్వాతంత్ర్యము దేశ జనుల - చావుకు వచ్చెన్ !
    గోతులు దీయుచు నేతలె
    సాతానుల వలెను మారి - సర్వము మెక్కన్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  10. 03)
    ________________________________

    పోతే పోనీ దేశము
    ఖాతాలే స్విస్సు నందు - కళకళ లాడన్ !
    నీతిని విడచిన నేతల
    స్వాతంత్ర్యము దేశ జనుల - చావుకు వచ్చెన్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  11. 04)
    ________________________________

    మాతకు వందన మిడరుగ !
    నీతికి నీళ్ళే విడచుట - నేర్చిరి జనులే !
    జాతికి మిగిలె నధోః గతి !
    స్వాతంత్ర్యము దేశ జనుల - చావుకు వచ్చెన్ !
    ________________________________
    మాత = తల్లి = దేశ మాత

    రిప్లయితొలగించండి
  12. 05)
    ________________________________

    వేతన మొకటే చాలదు
    పాతాళపు లోతులకును - ప్రభుతే జారన్
    నీతికి స్థాన మదెక్కడ ?
    స్వాతంత్ర్యము దేశ జనుల - చావుకు వచ్చెన్ !
    ________________________________
    ప్రభుత = ప్రభుత్వ యంత్రాంగం

    రిప్లయితొలగించండి
  13. లోతుల నీతులు! నేతల
    కోతలు, మేతలును! ధరలు కొండల పైనన్!
    జాతికి నోటికి వాతలు!
    స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్

    రిప్లయితొలగించండి
  14. జాతికి ప్రథాని నీవెగ
    ఖ్యాతియె మౌనంబుదాల్చ? ఖల్ నాయకులే
    రీతిగహరించిరో నీ
    స్వాతంత్ర్యము; దేశజనుల చావుకు వచ్చెన్!!!

    రిప్లయితొలగించండి
  15. 06)
    ________________________________

    రైతులు రోడ్డున బడగా !
    మాతా శిశు రక్షణంబు - మాయం బవగా !
    ప్రేతములే నేతలుగా !
    స్వాతంత్ర్యము దేశ జనుల - చావుకు వచ్చెన్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  16. ఇది అందరి విషయం కాదు - కొందరిదే నని మనవి !

    07)
    ________________________________

    పాతివ్రత్య మదే మని
    నాతులు ప్రశ్నించి, నేడు - నానా విధముల్
    సీతలు గీతలు దాటెడు
    స్వాతంత్ర్యము దేశ జనుల - చావుకు వచ్చెన్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  17. నేడు నీతన్నది నేతిబీరలో నెయ్యి వెదకడం లాంటిదే !

    08)
    ________________________________

    తాతలు నేతులు త్రాగిరి !
    మూతుల వాసన గొనుమను - మోహమె మిగిలెన్ !
    ఏతావాతా చివరకు
    స్వాతంత్ర్యము దేశ జనుల - చావుకు వచ్చెన్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  18. ప్రజలు పిల్లులైతే - కోతులే నేతలు !
    చివరకు రొట్టె(దేశము) కోతులదే గద !

    09)
    ________________________________

    పాతకములు పెచ్చు పెరిగె !
    కోతుల పాలాయె రొట్టె ! - కొమ్మమెకములే
    జాతిని పరిపాలించెడు
    స్వాతంత్ర్యము దేశ జనుల - చావుకు వచ్చెన్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  19. 01అ )
    ________________________________

    మేతలు మేసెడి మంత్రుల
    పాతకముల, చూడకుండు - బధిరుడు సింగే !(బాసే)
    నీతికి పాతర కట్టెడు
    స్వాతంత్ర్యము దేశజనుల - చావుకు వచ్చెన్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  20. స్వాతంత్ర్యం తెచ్చినందుకు పశ్చాత్తాప పడవలసిన దుస్థితి గదా
    నేటి పరిస్థితి :


    10)
    ________________________________

    తాతా యని జనులు బిలచు
    మోతీలా మెరయు వాడు - మోహనదాసే
    భీతిల్లును,నేడు గనిన
    స్వాతంత్ర్యము, దేశజనుల - చావుకు వచ్చెన్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  21. తాతాతండ్రులవలెనే
    నేతై,నేలుచుధరణిని, నియమాల్ వదలీ
    మాతగ సుతునకునిచ్చిన
    స్వాతంత్ర్యము, దేశజనుల చావుకు వచ్చెన్ !

    రిప్లయితొలగించండి
  22. [1972]

    భీతిల్లెడి ఆ పొరుగుల
    స్వాతిశయమనకనుమనము సంరక్షింపన్
    ఊతమరికగుట,వారల
    స్వాతంత్ర్యము- దేశజనుల చావుకు వచ్చెన్ !

    ఊతము అరి కగుట,[అరి - ఇక్కడ ఉగ్రవాదులు]

    రిప్లయితొలగించండి
  23. [1975]

    మూతుల్బిగియగట్టిజనుల,
    ఆతల్లి"యమర్జెన్సి"నందు హరియించెనుగా
    నేతలు పోరియె దెచ్చిన
    స్వాతంత్ర్యము; దేశజనుల చావుకు వచ్చెన్ !

    రిప్లయితొలగించండి
  24. ఏతంత్రముతో జేసెనొ
    సీతా హరణంబు,బడెను చిక్కున ,లంకా
    నేతగు దశకంఠుని దు
    స్స్వాతంత్ర్యము దేశ ప్రజల(కు)చావుకు(నుదె)వచ్చెన్ !!!

    రిప్లయితొలగించండి
  25. మాతా ! సోనియ ! వందే
    మాతర మేతరము కైన మాగతి మీరే !
    మాతరమే కాదందురు
    స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్ !

    రిప్లయితొలగించండి
  26. స్వాతంత్ర్యము దెచ్చిన ఘన
    నేతలు కనులార జూచి నేడీ గతియున్ !
    ప్రీతిని జెందక యందురు
    'స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్' !!

    రిప్లయితొలగించండి
  27. బూతులు పలికెడి నేతలు
    ప్రేతముల వలె తగులుకొనె ప్రియతమ జాతిన్
    నేతల మితి మీరిన వాక్
    స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్!!

    రిప్లయితొలగించండి
  28. ఘాతుకములఁ భరియింపక
    తాతలు దొంగలనుఁ దోలి, తరలిరి. యింటన్
    నేతలె దొంగలయి రికను,
    స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్!!

    పరదేశ వాసులు దొంగల్లా దోచుకుంటుంటే, మన పెద్దలు పోరాడి తరిమారు. కానీ మన నేతలు ఇంటి దొంగలయి ఈశ్వరుడు కూడా పట్టుకోలేని దుస్థితి ఈనాడు.

    రిప్లయితొలగించండి
  29. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    ‘ఖలనాయకు’లంటే సరిపోయేది కదా!
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘సతతం’ అని వ్యావహారిక రూపం ప్రయోగించారు. ‘సతమున్’ అంటే సరి! సతతం, సతం రెండూ సమానార్థకాలే.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పది పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నాయి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    శబ్దాలంకర శోభితమై మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘నియమాల్ వదిలీ’ అన్నచోట ‘వదిలీ’ వ్యావహారిక రూపం కదా! ‘నియమచ్యుతయై’ అంటే ఎలా ఉంటుంది?
    మూడవ పూరణలో 1,2 పాదాలలో గణదోషం ...
    ‘మూతుల్బిగగట్టిజనుల,
    ఆతల్లి"యమర్జెన్సి"నిడి హరియించెనుగా’ అందామా?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    వైవిధ్యమైన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    శ్రేష్ఠమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. గురువు గారూ ధన్యవాదములు, కిశోర్ జీ మీ పూరణమౌక్తికములతో శంకరాభరణము వన్నె పెరిగింది.

    రిప్లయితొలగించండి
  31. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
    శంకరార్యా ! ధన్యవాదములు !
    మూర్తీజీ ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  32. గురువు గారూ ధన్యవాదములు,
    ఆతల్ల"త్యవసర"మిడి హరియించెనుగా’
    అంటే - సరైన ప్రయోగమే కదండీ

    రిప్లయితొలగించండి
  33. చూతమటన్నను పల్కదు
    నీతగు మాటొకటినేడు నేతల నోటన్
    భీతిని గొల్పెడు 'భావ'
    స్స్వాతంత్ర్యము దేశప్రజల చావుకు వచ్చెన్!!!

    రిప్లయితొలగించండి
  34. నీతిగ నడచెడు నేతలు
    జాతికి కఱవైన నెడల జరుగునె శుభముల్
    భీతిని కట్టడి జరుగగ
    స్వాతంత్ర్యము దేశ జనుల చావుకు వచ్చెన్ !

    రిప్లయితొలగించండి
  35. పాతకములు మితి మీరగ
    గీతలు దాటెడి వనితలు ప్రేతము లయ్యెన్ !
    కాంతున కదరణ్య రోదన
    స్వాతంత్ర్యము దేశ జనుల చావుకు వచ్చెన్ !

    కంతునకు = భర్తకు , మగవానికి , మగనికి

    రిప్లయితొలగించండి
  36. జాతకములు తారుమారు
    సీతలు గీతలు చెల్లవు సైతాను లైరి వనితల్ !
    పాతాళమె పురుషులకిక
    స్వాతంత్ర్యము దేశ జనుల చావుకు వచ్చెన్ !

    రిప్లయితొలగించండి
  37. ఊకదంపుడు గారూ,
    మీరు మొదట వ్రాసిన దానికి నా సవరణలోనూ గణదోషం. ఇప్పుడు మీ సవరణ ప్రకారం గణదోషం పోతున్నది. కాని ‘తల్లి + అత్యవసర’ అన్నచో సంధిలేదుకదా!
    *
    పింగళి శశిధర్ గారూ,
    భావస్వాతంత్ర్యముపై మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘నీతి + అగు’ అన్నప్పుడు సంధి జరుగక ‘నీతియగు’ అని యడాగమం వస్తుంది. అక్కడ ‘నీతిగ’ అంటే సరి!
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి నేదునూరి గారూ,
    రెండు పూరణలలోను మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    కాకుంటే గణ యతి దోషాలు దొర్లాయి. మీ పద్యాలకు నా సవరణలు ..
    మొదటి పూరణలో ‘గీతలు దాటెడి వనితలు ప్రేతము లయ్యెన్’ యతిదోషం. ‘వనిలతలు - అయ్యెన్’ ఇక్కడ వచనాల అన్వయం లేదు. ‘రీతులు మఱచిన వనితలు ప్రేతము లగుటన్’ అందాం.
    రెండవ పూరణ ....
    జాతకములు తిరుగబడ కు
    జాతలు గీతలు చెల్లని సైతాను సతుల్ (కుజాత = సీత)

    రిప్లయితొలగించండి
  38. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, ఆగస్టు 16, 2011 9:02:00 AM

    ధన్యవాదములు గురువు గారు.

    రిప్లయితొలగించండి
  39. శ్రీగురుభ్యోనమ: నేతల స్వార్థము హెచ్చెను నీతిని పాటించ నట్టి నేరచరిత్రుల్ జాతిని భిన్నము జేయగ స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్మంగళవారం, ఆగస్టు 16, 2011 9:21:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    నేతల స్వార్థము హెచ్చెను
    నీతిని పాటించ నట్టి నేరచరిత్రుల్
    జాతిని భిన్నము జేయగ
    స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్

    రిప్లయితొలగించండి
  40. ఈ బ్లాగును నేను ఈరోజే చూస్తున్నాను. నా పూరణ ఇదిగో..

    తాతల తండ్రుల త్యాగము
    చేతను సిధ్ధించె మనకు స్వేఛ్ఛయె, కానీ
    నేతల స్వార్థము వలనను
    స్వాతంత్ర్యము దేశ జనుల చావుకు వచ్చెన్

    రిప్లయితొలగించండి
  41. తాటిపాక అప్పారావు గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    పంతుల గోపాల కృష్ణ రావు గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    ఇన్నాళ్ళకు నా బ్లాగు మీ దృష్టికి వచ్చినందుకు సంతోషం.
    కందపద్యాన్ని మనోహరంగా వ్రాయగల మీ నేర్పును మీ ‘అపురూపం’ బ్లాగులోని ‘కందాలూ - మకరందాలూ’లో చూచాను. అద్భుతమైన పద్యాలు. ధన్యవాదాలు.
    ఇక మీ పూరణ సర్వశ్రేష్టమై అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  42. మాతౌ భారత దేశము
    చైతన్యపు దిశల లోన సాగుచు నుండన్
    భూతల రోతౌ పాకీ
    స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్


    గమనిక: దుష్టులను దుష్ట సమాసములలో దండింప వలెను.

    రిప్లయితొలగించండి
  43. వ్రాతయు చదువుట రాకయె
    నీతులు చెప్పెడి శఠులిట నేతలు కాగా
    ప్రీతిని గాంధీ తెచ్చిన
    స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్

    రిప్లయితొలగించండి