4, ఆగస్టు 2011, గురువారం

సమస్యా పూరణం -415 (కవితాగానమ్ము లోక)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కవితాగానమ్ము లోకకంటక మయ్యెన్.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి

ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

  1. కవినేననియనుకొంటిని
    కవితల పేరున పదముల గణమును నానా
    కవనములనుఁబలుకగనే
    కవితాగానమ్ము లోకకంటకమయ్యెన్

    రిప్లయితొలగించండి
  2. కవినేననియనుకొంటిని
    కవితల పేరున పదముల గణమును, నానా
    కవనములనుఁ బలుకగ నా
    కవితాగానమ్ము లోకకంటకమయ్యెన్

    గణము - సమూహము

    రిప్లయితొలగించండి
  3. నవ జీవన సంక్రాంతికి
    రవి యంతటి ఘనుడు సుకవి - రచనా విధులన్
    కవి తన బాధ్యత లరయమి
    కవితా గానమ్ము లోక కంటక మయ్యెన్

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  4. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, ఆగస్టు 04, 2011 12:47:00 PM

    నవనీత సమానము గద
    కవితాగానమ్ము, లోకకంటకమయ్యెన్
    అవినీతి నాయకత్వము,
    యవివేకము, దుర్బలతలు, యత్యాసలతోన్.

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతి శాస్త్రిగురువారం, ఆగస్టు 04, 2011 12:53:00 PM

    అవమానించెడు పదముల,
    కవితావస్తుత్వమెందుగానక, విద్వ
    త్కవులే మెచ్చని నేటి,కు
    కవితాగానమ్ము లోకకంటకమయ్యెన్.

    రిప్లయితొలగించండి
  6. క: కవి కోకిలబలుకుల తో

    భువి పరవశమొందె నాడు భుజబలలోకం

    చెవిలో, నేడు సరిగమల

    కవితా గానమ్ము లోక కంటక మయ్యెన్|

    రిప్లయితొలగించండి
  7. భవసాగరమీదుటలో
    కవిహృదయములే శిలవలె ఘనతరమయ్యెన్
    నవకవిత మధురత విడెను.
    కవితా గానమ్ము లోక కంటక మయ్యెన్|

    కవులను వారలు సంఘపు
    భవితకు మేళులు కలుగగఁ బలికిరి నీతుల్
    చెవియొగ్గి వినక నందురు-
    కవితా గానమ్ము లోక కంటక మయ్యెన్|

    రిప్లయితొలగించండి
  8. శ్రీపతి శాస్త్రిగురువారం, ఆగస్టు 04, 2011 2:44:00 PM

    అవమానించిరి కవులను,
    కవిహృదయము క్షోభపడగ కావ్యంబులనున్,
    అవినీతియు, వక్రకథలు, కు
    కవితాగానంబు లోకకంటకమయ్యెన్.

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, ఆగస్టు 04, 2011 4:44:00 PM

    రవి గారూ..

    సంస్కృతము నేర్చుకోవాలని నాకు చాలా అభిలాష. దయవుంచి ఏదైన ఒక మార్గము వుంటే చెప్పరూ.

    గురువు గారూ,

    సంస్కృతం నేర్చుకోవాలనుకునేవారికి కొన్ని పాఠ్య పుస్తకాలను చెప్పగలరా??

    రిప్లయితొలగించండి
  10. మందాకిని గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    భవసాగరమీదుటలో
    కవిహృదయములే శిలవలె ఘనతరమయ్యెన్ ....?
    మీ మూడవ పూరణ చాలా బాగుంది.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    పాదఖండనతో చక్కని భావాన్ని పలికించారు పూరణలో. బాగుంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    కుకవితా గానాన్ని నిరసించిన మీ రెండు పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    భుజబలలోకం ...?

    రిప్లయితొలగించండి
  11. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    గూగుల్ లో Sanskrit lessons అని వెదకండి. కావలసినన్ని సైట్లు దొరుకుతాయి.
    ఉదాహరణకు ...
    http://acharya.iitm.ac.in/sanskrit/tutor.html
    http://www.learnsanskrit.org/
    సంస్కృతపాఠాల ‘e-books' కోసం ...
    http://sanskritebooks.wordpress.com/category/sanskrit/learn-sanskrit-sanskrit/
    తెలుగులో కావాలంటే ఈ బ్లాగు చూడండి
    http://naasaahityam.blogspot.com/search/label/Sanskrit

    రిప్లయితొలగించండి
  12. సీ: మంద వారి కవిత మధు రాతి మధురమ్ము
    మిస్సన్న పద్యమ్ము మినుప గారె
    ఘన వసంతుని కైత గంగా ప్రవాహమ్ము
    చంద్ర శేఖరు పద్య శైలి సౌరు
    గన్నవరపు వారి కమనీయ వైఖరి
    గోలి హనుమఛ్చాస్త్రి గూర్చు విధము
    సంపత్ కుమారుని సలలిత పదరీతి
    శ్రీపతి శాస్త్రి విశేష ప్రతిభ

    గీ: మరియు మందాకినీ పద్య పరిమళాలు
    నొక్కచో గూర్చి పద్య సాయుజ్య మేమి
    లేని నాబోటి కొనర గీలించి నట్టి
    శంకరార్యుని మిగుల బ్రశంశ జేతు

    రిప్లయితొలగించండి
  13. సంపత్ కుమార్ శాస్త్రి గారూ, గురువులు చెప్పారు.

    మీకు పుస్తకాలు కావాలంటే, సంస్కృత భాషాప్రచార సమితి వారి పుస్తకాలు హైదరాబాదులో నాంపల్లి పుల్లారెడ్డి స్వీట్ల దుకాణం ఎదురుగా ఒక గుడి ఆవరణలో లభిస్తాయి. ఇంకా కాశీకృష్ణాచార్యులవారి పుస్తకం, ఉస్మానియా యూనివర్సిటీ వారి ప్రచురణ ఒకటి దొరుకుతున్నాయి. హిందీ మాధ్యమం ద్వారానయితే కాలే గారి పుస్తకం ఒకటి ఉన్నది. వీలైతే గురుముఖతః కనీసం ఆరునెలలైనా నేర్వండి.

    ఇవన్నీ చెప్పానని నన్నేదో కవిని, పండితుణ్ణి దయచేసి చేయకండి. ఇది సమాచారం మాత్రమే.

    రిప్లయితొలగించండి
  14. రవి గారూ, కాశీకృష్ణ "మా" చార్యులవారి పేరు ప్రస్తావించి నా బాల్యం గుర్తు చేశారు. మేము వారూ ఒకే వీధిలోవుండేవారము. బహుశ: ఆధునిక కాలంలో శుద్ధ సంస్కృత పండితులలో ఘనులు వారేనేమో! ఇంకోసారి వారి గురించి వ్రాస్తాను.

    రవిగారి సలహాకి ఇంకొక చేర్పు- అలాగే వెంపటి కుటుంబశాస్త్రి గారి రాష్ట్రీయ సంస్కృత సంస్థానం (న్యూ ఢిల్లీ) సంస్కృతస్వాధ్యాయ: - ప్రథమదీక్షా పుస్తకాలు దొరుకుతాయి. అలాగే వారు V.C.D. లు కూడా తయారు చేసి విడియో పాఠాలు విడుదల చేశారు. అవి చాలా సహకరిస్తాయి. గురుముఖత: నేర్చుకోవలసినది చాలా వుంటుంది. మనం పెద్దవాళ్ళైపోయాము కాబట్టి, కొంత స్వతహాగా నేర్చుకొని వెళితే తేలిక. ఆశ్చర్యకరంగా, మాకు అమెరికాలో ఫోను ద్వారా సంస్కృత పాఠాలు ఉచితంగా నేర్పేవారూ వున్నారు. గురువులూ వున్నారు. మీరు ఈ తీరంలో వుంటే చెప్పండి. వివరాలు ఇస్తాను.

    రిప్లయితొలగించండి
  15. గురువుగారూ,
    ధన్యవాదములు.
    రొటీన్ పనులలో కవిహృదయం స్పందించటం మానేసి, వాళ్ళ మనసులు రాళ్ళవలె అయ్యాయని, ఈ నేపథ్యంలో కవితా గానము మధురత కోల్పోయి కవితా గానము లోకమునకు కంటకంగా ఉంది, ఏ మాత్రం అందంగా లేదు అని నా ఉద్దేశ్యం.
    పెద్దలు రాజారావుగారు ఎంతో మంచి ధారతో రాస్తూ, మిగిలిన వాళ్ళని ప్రశంసించడం చూస్తే వారి గొప్ప మనసు అర్థం అవుతుంది. వారికి, మిత్రులందరికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. L.V.RAJA RAO గారూ
    మీ సీసం "మంద వారి కవిత మధు రాతి మధురమ్ము" చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  17. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, ఆగస్టు 04, 2011 10:11:00 PM

    గురువు గారూ,

    శతథా ధన్యవాదములు. వీలున్నప్పుడు ఖచ్చితంగా సంస్కృతం నేర్చుకొనడానికి ప్రయత్నిస్తాను. సందేహ నివృత్తి కొరకు మీరు వుండనే వున్నరు కదా.

    రవి గారికి మరియు చంద్రసేఖర్ గారికి, నా ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను. అడిగిన తక్షణమే సమయం వెచ్చించి సలహాలను ఇవ్వగల మీవంటివారలు పరిచయం కావడం నా అదృష్టం.

    రిప్లయితొలగించండి
  18. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, ఆగస్టు 04, 2011 10:28:00 PM

    రాజా రావుగారూ,

    సహస్రాధిక వందనములు. మీ యొక్క ప్రశంస నన్ను ఆకాశపుటంచులదాక తీసుకెళ్ళిందంటె నమ్మండి.

    రిప్లయితొలగించండి
  19. శివనామము నుడువక,మా
    ధవు మహిమల మది దలుపక ,దానవ సములౌ
    నవనీశుల తెగపొగడెడు
    కవితా గానమ్ము లోకకంటక మయ్యెన్!!!


    శ్రీ రాజారావు గారు కవులను ప్రోత్సహిస్తూ వ్రాసిన ప్రశంసా పూర్వక పద్యం ఆనందాన్నిచ్చింది .రాజారావు గారు మీకు ధన్య వాదాలు.

    రిప్లయితొలగించండి
  20. సరదాకి ...........

    అవి స్వరములె? దుస్సహములు,
    అవి శృతి లయ రాగ తాళ మగునే? వాణిన్
    అవమాన పరుప కాపుము
    కవితా! గానమ్ము లోకకంటక మయ్యెన్!

    రిప్లయితొలగించండి
  21. శ్రీ రాజారావుగారి పెద్దమనసుకు జోహార్లు.

    రిప్లయితొలగించండి
  22. రాజారావుగారూ ! ధన్యవాదములు !
    మరీ మునగ చెట్టెక్కించేస్తున్నారు !
    మీ సుహృద్భావానికి జోహార్లు !

    రిప్లయితొలగించండి
  23. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    కావు మను కాకి గోలను
    ఆవాహన జేయు రీతి - నార్భాటముగా
    చావడి జరిగెడు దుర్భర
    కవితా గానమ్ము లోక - కంటక మయ్యెన్ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  24. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    కవిమిత్రులను ప్రశంసించిన మీ మంచిమనసుకు, స్నేహశీలానికి అందరి పక్షాన ధన్యవాదాలు.
    *
    లక్కరాజు శివరామ కృష్ణారావు గారూ,
    ధన్యవాదాలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    ‘ఇమ్మనుజేశ్వరాధముల’ తెగడిన మీ పూరణ సుందరంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘సరదాకి’ అంటూనే సరసమైన పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. వసంత కిశోర్ గారూ,
    మీ ‘లేటేస్ట్’ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. చవు లూరించెడు భాషను
    యువతయె నవతలకు నెట్టి, ఓ ! నో ! యనగన్
    చెవి యొగ్గి వినగ తెనుగున
    కవితా గానమ్ము, లోక కంటక మయ్యెన్ !

    రిప్లయితొలగించండి
  27. చవి జూడక గణతంత్రము
    రవి గాంచని కాననమున రాక్షసు లగుచున్
    భువి నాదే యను నక్సలు
    కవితాగానమ్ము లోకకంటక మయ్యెన్

    రిప్లయితొలగించండి
  28. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. సవరించుచు కంఠమ్మును
    వివశత్వపు పెండ్లిచూపు విన్యాసంబున్
    కువలయ నేత్రది గార్దభ
    కవితాగానమ్ము లోకకంటక మయ్యెన్

    రిప్లయితొలగించండి