11, ఆగస్టు 2011, గురువారం

సమస్యా పూరణం -422 (భద్రకాళి బెదరి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
భద్రకాళి బెదరి పారిపోయె.

30 కామెంట్‌లు:

 1. భక్తి యెక్కు వాయె భజన లెక్కువయయ్యె
  కాళి ముఖము బదులు కాంగి రేసు
  అమ్మ గారి ముఖము నందముగా దీర్చ
  భద్ర కాళి బెదరి పారి పోయె !

  రిప్లయితొలగించు
 2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించు
 3. హనుమచ్చాస్త్రి గారూ అద్భుతం గురువుగా రన్నట్లుగా.

  రిప్లయితొలగించు
 4. అందరికీ వందనములు !
  శాస్త్రీజీ ! సమయోచితమైన పూరణ ! బావుంది !

  నాలుగు రోజుల నుండి ఆరోగ్యం సరిగా లేక మిత్రులందరికీ దూరమయ్యాను !
  ప్రస్తుతం బాగానే యున్నాను గాని, చాలా నీరసముగా నున్నది !

  రిప్లయితొలగించు
 5. వసంత మహోదయా నీరసం తగ్గేదాకా విశ్రాంతిగా ఉండండి .

  రిప్లయితొలగించు
 6. శంకరార్యా ! మిస్సన్న గారూ ! కిషోర్ జీ ధన్యవాదములు.
  వసంత్ జీ ! విశ్రాంతి తీసుకోండి . తరువాత విజ్రుంభించ వచ్చు.

  రిప్లయితొలగించు
 7. తెనాలి రామలింగడు సినిమాలో
  జంతుబలులు యివ్వబోయిన వాళ్ళను వారించి, వెళ్ళగొట్టి
  నీకు బలి కావాలంటే నన్ను మింగని దేవి నాక్షేపిస్తే
  కాళికాదేవి ప్రసన్నురాలై రామలింగని ముందు ప్రత్యక్షమై
  నీ కేది కావాలో కోరుకో మని ఒక పాత్రతో పాలు
  ఒక పాత్రతో పెరుగూ యిస్తుంది :

  01)
  _________________________________

  పీధ మొంది తేని - విఙ్ఞాన మిచ్చును
  పెరుగు యిచ్చు నీకు - సిరుల ననగ
  పాలు పెరుగు కలిపి - భక్షించె లింగడు !
  మురిపె మొంది దేవి - మ్రోల నిలచి !

  శాప మిడెను వాని - సాహసమును జూసి
  "ధనము నీదు కొఱకు - పనికి రాదు
  వికట కవివి కమ్ము- వెటకారమా " యని
  భద్ర కాళి బెదరి - పారిపోయె !
  _________________________________
  పీధము = పాలు

  రిప్లయితొలగించు
 8. దేశమంత జూడ దేవుని మాన్యాలు
  కలిసి మింగు నట్టి కపట జనులు
  కోలుకత్త వెళ్ళి కొట్టెయ్య నగలన్ని
  భద్రకాళి బెదరి పారిపోయె.

  రిప్లయితొలగించు
 9. శాస్త్రి గారి పూరణ చక్కగా ఉంది అభినందనలు .
  వసంత కిషోర్ త్వరగా స్వస్తులై బ్లాగును అలరించాలని కోరు కుంటున్నాను.

  ముఖ్య మంత్రిగారు మ్రొక్కంగ వెడలిరి
  దార్లు మూసి వేసి కార్ల లోన,
  భద్రతా బలగాలు భక్త జనుల గొట్ట
  భద్ర కాళి బెదరి పారి పోయె!!!

  రిప్లయితొలగించు
 10. అద్రి కద్రు లమ్మి హాంఫట్ మని దినెడు
  గనులఘనులు భూబకాసురులును
  కొలువు దీరి యున్న యిలను జాగా లేక
  భద్రకాళి బెదిరి పారి పోయె

  రిప్లయితొలగించు
 11. ఏలీల బ్రస్తుతింయును
  గోలి హనుమ గార్ని యతడు గూర్చిన పద భా
  వాలు సమస్యపరిష్కా
  రాలితరుల కెట్టు లబ్బు! రమణీయ గతుల్

  రిప్లయితొలగించు
 12. నా పూరణ లోని మూడవ పాదంలో గణదోషం దొర్లినట్లుంది .ఆ పాదాన్ని యిలా సవరిస్తున్నాను

  "భక్త జనుల గొట్ట భద్రతా బలగాలు"

  రిప్లయితొలగించు
 13. వీధి పంపు వద్ద వీరంగమాడెను
  భద్రకాళి; బెదిరి పారి పోయె
  నారి కూటమి. లలన యొకతి కొత్తగా
  వచ్చె.రాజు కొనెను చిచ్చు మరల.

  రిప్లయితొలగించు
 14. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, ఆగస్టు 11, 2011 2:32:00 PM

  శూలమందు జంపె శుంభనిశంభుల
  భద్రకాళి, బెదరి పారిపోయె
  నసురసైన్య గణములత్యంత భీతితో
  జయము జయమటంచు జగము బలికె

  రిప్లయితొలగించు
 15. చంద్రశేఖర్:
  తరళ నేత్ర రూప దాక్షిణ్య సంపన్న
  రమణుడౌ నిను, రణ రంగ మందు
  రావణుఁ దెగటార్చు రౌద్రానగని, రామ
  భద్ర! కాళి బెదరి పారిపోయె!

  రిప్లయితొలగించు
 16. దేశ రక్షఁ జేయ దేవి కదలినట్టు
  నాఁడు యపర వీర నారి, యవనిఁ
  ఝాన్సి నేలు వనిత ఝళిపించ ఖడ్గమ్ము
  యుద్ధ భూమి విడిరి యోధులపుడు

  వచ్చుచున్నదదిగొ పరదేవతారూపి
  భద్రకాళి; బెదరి పారిపోయె
  క్షుద్ర సైన్యమంత; క్షోభను పడుచున్న
  జగము సంతసమున జయము పల్కె.

  రిప్లయితొలగించు
 17. కం: శ్రీలక్ష్మి యగుట సిరులిడు
  శ్రీలలితయు నగుట తమ కశేష శుభాలన్
  కళలిడు శ్రీశారదగుట
  లలితమ్ముగ మిత్రు లార ! లక్ష్మి సతతమున్

  రిప్లయితొలగించు
 18. వసంత కుమార్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  కలకత్తా కాళికనే బెదరగొట్టారు. బాగుంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  బందోబస్తుల వల్ల భక్తులే కాదు, దేవతలు కూడా బెదరిపారిపోతున్నారన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  గోలివారిపై మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.
  *
  రవి గారూ,
  ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  ‘శూలమందు’ అన్నచోట ‘శూలహతిని’ అంటే ..?
  *
  చంద్రశేఖర్ గారూ,
  రామభద్ర రౌద్రరూపానికి కాళి బెదిరిందా? బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
  *
  మందాకిని గారూ,
  ఝాన్సీరాణిని భద్రకాళితో పోల్చిన మీ పూరణ అత్యుత్తమం. అభినందనలు.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  రేపటి వరలక్ష్మీవ్రతానికి ఇప్పుడే సంకల్పం చెప్పినట్టుంది మీ పద్యం. ధన్యవాదాలు.
  ‘శారద + అగుట’ అన్నప్పుడు సంధి లేదు. ‘శ్రీవాణి యగుట / గీర్వాణి యగుట’ అందాం.

  రిప్లయితొలగించు
 19. మాస్టారూ, ధన్యవాదాలు. మరి మా రామభద్రుడు లలిత లావణ్య రూప సంపన్నుడు, (శ్రీకృష్ణ: శ్యామలా దేవీ, శ్రీ రామో లలితాంబికా). మారాముడికి అంతకోపం రెండు సార్లే వచ్చిందట. కాకాసురుడితో ఒకసారి (బ్రహ్మాస్త్రం విడవవలసినపుడు), మరి నాపద్యంలో (కల్పన) ఇంకోసారీ.

  రిప్లయితొలగించు
 20. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
  మిత్రులందరి పూరణల తో అ(బె)దర గొట్టారు.
  రాజారావు గారూ ! అంతా మీ అభిమానం. సహృదయత. నేను విద్యార్థినే.
  మీ గనుల ఘనుల పద్యం మాత్రం ... ఘనంగా లేదూ ? ధన్యవాదములు.

  రిప్లయితొలగించు
 21. విజయ దశమి పూజ వేడుక లప్పుడు
  భువిని వీడి వేగ దివికి నేగె
  కర్ణ బేధి శబ్ద ఘన రాక్షసాళికి
  భద్రకాళి బెదరి పారిపోయె.

  రిప్లయితొలగించు
 22. మిత్రుల పూరణలు అద్భుతంగా ఉన్నాయి. కిశోర్ జీ మీరు త్వరగా కోలుకోవాలని సదా సంపూర్ణ ఆరోగ్యముతో ఉల్లాసంగా ఉండాలని కోరుకొంటున్నా.

  తరము మార్పు ;

  భద్రకాళి తోడ భద్రయ్య బతుకంత
  భయము గానె సాగె వాయి లేక.
  క్రొత్త కోడ లింట కుడి చేయి నదలింప
  భద్రకాళి బెదరి పారి పోయె !

  రిప్లయితొలగించు
 23. మిత్రులందరి పూరణలూ ముచ్చటగానున్నవి !

  శంకరార్యా ! ధన్యవాదములు !
  మిస్సన్నమహాశయా ! ధన్యవాదములు !
  శాస్త్రీజీ! ధన్యవాదములు !
  పీతాంబరధరా ! ధన్యవాదములు !
  మూర్తీజీ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించు
 24. మా చిన్నపుడు మా వీధిలో ( క్రొత్తగ్రహారము-విశాఖపట్టణము ) కొర్లమ్మను చూసి పిన్నా,పెద్దా కూడా భయపడే వారు. ఆమెపై సరదాగా ;

  కొత్తవలస లోన కొర్లమ్మ నెఱుగరే ?
  కొంగు బొడ్డు దోపి గుడికి యేగి
  పాత కక్ష బూని భంగింప పూజారి
  భద్రకాళి బెదరి పారి పోయె !

  రిప్లయితొలగించు
 25. మూడవ పాదము సవరణ

  పాత పగను బూని భంగింప పూజారి

  రిప్లయితొలగించు
 26. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, ఆగస్టు 12, 2011 6:35:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  మూర్ఖుడైనవాడు ముత్యమై నిలచాడు
  భద్రకాళి బెదరి పారిపోయె
  నమ్మ నిన్ను దలచినంత మాత్రముననే
  భయము పిరికితనము పండితునకు
  ( కాళిదాసుకు )

  రిప్లయితొలగించు
 27. మిస్సన్న గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
  అయితే ‘భువిని వీడి వేగ దివికి నేగె’ అన్నారు. ‘దివిని వీడి వేగ భువికి నేగె’ అనాలనుకుంటాను. టైపాటా?
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  కొత్తకోడలిచేత అత్త బెదరిన మొదటి పూరణ, ‘కొర్లమ్మ’ను ప్రాస్తావించిన రెండవ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  భద్రకాళి తర్వాత సంబోధనా చిహ్నం పెడితే బాగుండేది.

  రిప్లయితొలగించు
 28. డా. మూర్తి మిత్రమా! కొత్త కోడలంటే అంత భయమా, భద్రకాళికా, మీకా (నవ్వుతూ). మీ చివరి పూరణలోని కొర్లమ్మ ధన్యాత్మురాలు. ఎక్కడుందో మహానుభావురాలు!

  రిప్లయితొలగించు
 29. గురువుగారూ ధన్యవాదాలు.
  నా భావాన్ని స్పష్టంగా ప్రకటించ లేక పోయానేమో.
  ' విజయదశమి పందిళ్ళలో హోరెత్తే మైకుల గోల భరించలేను,
  అవేవో అయ్యాక మళ్ళా భూమ్మీదకు వస్తాను 'అని భద్రకాళి వెళ్ళిపోయింది అని నా ఉద్దేశ్యం.
  l

  రిప్లయితొలగించు
 30. గురువు గారూ ధన్యవాదములు.
  చంద్రశేఖర మిత్రమా ! ఈ దేశములో వయోజన రక్షక సేవా సంఘము లని ఉంటాయి కదా ! అయినా వచ్చే కోడళ్ళతో యెలాగైనా సర్దుకు పోదామనే తత్వములోనే ఉన్నాము.ఎప్పుడైనా చెవుల కింపుగాని మాటలు వినవలసి వస్తే, చెముడు నటిస్తే పోయే !
  సంశయిస్తూనే మా కొర్లమ్మను సోనీయా వారి సరసను శంకరాభరణములో కూర్చో బెట్టాను.( మీరు కొర్లమ్మనే ఎక్కువగా గౌరవిస్తారని తలుస్తూ ) ఆవిడ యింకా బ్రతికి ఉంటే శతవృధ్ధురాలయి ఉంటుంది.

  రిప్లయితొలగించు