ఇతని పేరేమిటి?
సీ. ఖాండవమ్మను పేరు గలిగినట్టి దదేది?వెలుఁగు నిచ్చెడునట్టి వేల్పెవండు?
జలమందు ముదమున జన్మించు పువ్వేది?ఉచ్చైశ్శ్రవాఖ్యమై యొప్పు నేది?
స్తంభమున జనించి దనుజుఁ జంపె నెవండు?దట్టమౌ వని కే పదంబు గలదు?
వనిలోన సీతఁ బట్టిన రాక్షసుఁ డెవండు? *శిబి దేనికొఱకు నిచ్చెఁ దన పలలము?
తే. గీ.అన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు రెండవ యక్షరా లరసి చూడ
దేశరాజకీయములలోఁ దేజరిలిన
తెలుఁడువాఁడి నామమ్మగుఁ దెలుపఁగలరె?
*(రావణుఁడు కాదు)
కవిమిత్రులారా,
సమాధానాన్ని వివరిస్తూ మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండి‘విహారము’ తప్ప మిగిలినవన్నీ సరియైనవే. అభినందనలు.
‘దట్టమౌ వని కే పదంబు గలదు?’ ఈ ప్రశ్నకు సమాధానంలో రెండవ అక్షరం హ్రస్వమైన ‘హ’కారమే. చాలామంది పొరబడుతున్నట్లు దీర్ఘమైన ‘హా’ కాదు. గమనించవలసిందిగా మనవి.
రిప్లయితొలగించండిమందాకిని గారూ,
రిప్లయితొలగించండిస్థూలంగా మీ సమాధానం సరైనదే. అభినందనలు. 2వ పదాన్ని కొద్దిగా సవరించాలి. 6వ పదం గురించి పై వ్యాఖ్యను గమనించండి.
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండిఇప్పటికి ఇచ్చిన పదాలు సరైనవే. ఆరవపదం రెండవ అక్షరం ‘హ’.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండివారిని గురించి అద్భుతమైన పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
నిజమే! 6వ పదం తప్పే. రెండవపదంలో చిన్న సవరణ.
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
రిప్లయితొలగించండివారిపై ఉత్తమమైన పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
వివరణ ... ?
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఇప్పుడు సరైన 6వ పదాన్ని పట్టుకున్నా, ముప్రత్యయం పెట్టలేదు. అనుస్వారంతో అది మూడక్షరాల పదం అవుతుంది కదా! :-)
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండి2పదం విషయంలో ఇప్పుడు 100% కరెక్ట్!
గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానం ...
రిప్లయితొలగించండివిపినము, సవితృడు, వనజము, తురగము, నృసింహుడు, విహారము, విరాధుడు ,పావురము
పి.వి.నరసిం హా రావు
మందాకిని గారి సమాధానం ...
రిప్లయితొలగించండివిపినము,సవితుఁడు,వనజము, తురగము, నృసింహుఁడు, మహారణ్యం,విరాధుడు, పావురము.
పివి నరసింహారావు
కోడీహళ్ళి మురళీమోహన్ గారి సమాధానం ...
రిప్లయితొలగించండివిపినము
సావిత్రుడు
వనజము
సురతేజి
నృసింహుడు
_ హా _ _
_ రా _ _
పావురము
పి.వి.నరసింహారావు
మైత్రీదినోత్సవ శుభాకాంక్షలతో-
లక్కాకుల వెంకట రాజారావు గారి సమాధానం ...
రిప్లయితొలగించండికం:
ద్యావా పృధ్వీ వ్యాపిత
ధీవిలసిత బుధ్ధిశాలి - తెలుగు పుడమి పై
ప్రావీణ్యుడు బహుభాషల
పీ వీ నరసింహ రావు పేరు దలంతున్
గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానం ...
రిప్లయితొలగించండిహాహా ! హ్రస్వ ' హ ' అయితే యెప్పుడో చెప్పేసే వాడిని
గహనము
మందాకిని గారి సమాధానం ...
రిప్లయితొలగించండిసవితృడు, గహనము
మిస్సన్న గారి సమాధానం ...
రిప్లయితొలగించండివిపినము సవితుడు వనజము తురగము నృసింహుడు గహనము విరాధుడు పావురము
కూల బోనున్న ఆర్ధిక మూలములను
గట్టి జేసి వ్యవస్థకు పట్టునిచ్చి
సంస్కరించిన మేధావి! సహన శీలి!
పీవి నరసింహ రావుని పేరు యిద్ది !
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఈ సందర్భంలో సవిత్రుడు, సవితృడు రెంటిలో
ఏ పదం సరైనదీ దయచేసి చెప్పండి.
అలాగే సవితుడు అనే పదం సరైనది అవునా కాదా కూడా చెప్పండి.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిసవిత, సవితృడు, సావిత్రుడు సూర్యుని పర్యాయపదాలే. ‘సవితుడు’ మాత్రం తప్పు.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి