మందాకిని గారూ, బాగుంది మీ స్వీయానుభవ పూరణ. అభినందనలు. ‘దడదడంచు’ అనేదానిని ‘దడదడమని లేదా త్వరితగతిని’ అంటే బాగుంటుందని నా సలహా. * మిస్సన్న గారూ, సమయోచితమైన పూరణ. వాస్తవమైన విషయాన్ని తెలిపారు. బాగుంది. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, ‘ఆలస్యా దమృతం విషమ్’ అన్న సూక్తి గుర్తుకు వచ్చింది మీ పూరణ చూస్తుంటే. మంచి పూరణ. అభినందనలు.
గురువు గారూ ధన్యవాదములు చేయుచు, కొనుచు అనేటప్పుడు ద్రుతము వస్తూంది, కాని చేయక, కొనక అనే వ్యతిరేకార్ధములో ద్రుతము రాదు. అందు వలన పద్యమును సవరించాను. పప్పులో కాలు వేసాక నాకు తెలుస్తుంది తప్పని.
ముందే సారంగ ధరుణ్ణి వలచిన చిత్రాంగి,రాజరాజు పంపినసారంగధరుని చిత్రపటాన్ని చూసి పెళ్ళికి అంగీకరిస్తుంది ! కాని మంత్రి చేసిన దుర్బోధ తలకెక్కిన రాజరాజు వంచనతో తన కత్తికే బాసికము కట్టి పంపించి , కోడలు కావలసిన చిత్రాంగిని భార్యను చేసుకుంటాడు ! రాజరాజు అంతఃపురము చేరిన తరువాత గాని ఆ విషయం చిత్రాంగికి తెలియదు ! హృదయం వ్రయ్యలైన చిత్రాంగి , వ్రతములేవో చెయ్యాలని చెలికత్తెలతో చెప్పించి కొద్దిరోజులు రాజరాజును అంతఃపురానికి రాకుండా కట్టడి చేసి , తన సమస్యకు కాలహరణమే మార్గమని తలపోసి , సారంగుని కోసం ఎదురు తెన్నులు చూస్తూ కాలం వెళ్ళబుచ్చుతుంటుంది !
ఆ ఘడియ రానే వస్తుంది ! సారంగుని కలసి తన వేదన వెళ్ళబోసుకుంటుంది ! కాని నువ్వు నా తల్లితో సమానురాలవని చెప్పి ఆమెను తిరస్కరిస్తాడు సారంగుడు ! అది వంచనతో కూడిన వివాహమని నెత్తీ నోరూ బాదుకుంటుంది ! వంచనయినా ఏదయినా విధిలిఖితం అనుభవించవలసిందే నంటూ ఆమెను తిరస్కరిస్తాడు సారంగుడు ! విఫలమైన ప్రేమ ! వృద్ధరాజు మోసం ! వంచనతో వివాహం ! ప్రియుని తిరస్కారం ! బ్రద్దలైన హృదయం ! మతి తప్పిన మనసు ! గతి తప్పిన బుద్ధి ! అదే సమయంలో అంతఃపురానికి రాజరాజు రాక ! తనేం చేస్తుందో తనకే తెలియని స్థితిలో సారంగుడే తనను బలాత్కరించబోయాడని రాజరాజుకు ఫిర్యాదు చేస్తుంది ! ఆంధ్ర మహా భారతాన్ని నన్నయ ద్వారా మన కందించిన ఆ మహారాజు మతిమాలి బుద్ధిహీనుడై కన్నకుమారుని కాళ్ళూ చేతులూ నరికిస్తాడు ! విషయం తెలిసిన చిత్రాంగి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకొంటుంది ! కొడుకునే మోహించిందన్న అపప్రధ మాత్రం మూట గట్టు కుంటుంది ! శివాంసా సంభూతుడైన ఒక యోగి కరుణతో సారంగునికి యథారూపు వస్తుంది !
గురువు గారికి ధన్యవాదములు,నమస్కారములతో తే: కాల హరణమే చేకుర్చు గార్యఫలమ ని మన నేతలు నిద్రలో నుండ, రైతు కష్టములు దీర్చ, సురులకు గష్టమై, న దృశ్యమైరి భారతదేశ దృశ్యమందు.
Dr. VishnuNandan garu, Meeku chaalaa dhanyavaadaalu. chakkati suble point pattaaru. mee vyaakarana paatham sraddhagaa nerchukonnaanai cheppagalanu. mee lanti vaaru sankocham lekundaa saana badithene maaku aanandam. ee madhya mee pooranalu karuvainavi. veelu choosukoni prati pooranaa yedo rakamgaa poorinchi mee mudra veyandi. ave maaku cheppaka cheppe pathaalu. English lo type cheyavalasi vacchindi. manninchaali.
ఆర్యా! ఊకదంపుడు గారూ ధనము కలుగ చేసే కేసులు మాకు సమకూరుస్తూ క్షమాపణలెందుకు ? మీకు మేమే కృతజ్ఞతలు చెప్పాలి. కాకపోతే న్యాయవాదులు వలె మాకు ఒక కేసుతో బండి సాగదు. చాలా కేసులు కావాలి. ఈ దేశములో బెక బెక వైద్యులము మా వెనుకనే ఉండే వకీలు పాములను జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి! మీ పద్యము బాగుంది.
డా.విష్ణు నందన్ గారూ మీ గురించే నిన్న తలచు కొన్నాను.శత్రర్ధ చువర్ణము గురించి చదువుదాము అంటే దగ్గఱ వ్యాకరణ పుస్తకము లేక. మీరు యీ దినము ప్రత్యక్షమయి మాకు ఆనందము కలుగ జేసారు. గురువు గారికి తోడుగా మీరు కూడా మాకు వ్యాకరణ పాఠాలు యివ్వండి. ఆనందిస్తాము.
వసంత కిశోర్ గారూ, మీ ‘సారంగధర చరిత్ర’ చెప్పిన తీరు చాలా బాగుంది. గతంలో ఒకసారి ‘భక్త సిరియాళ’ కథ కూడా చెప్పారు. అప్పుడే అన్నాను. మీలో మంచి ‘కథకుడు’ ఉన్నాడని. ఇక మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మంచి విషయంతో సమస్యను పూరించారు. బాగుంది. అభినందనలు. రెండవ పాదంలో యతి తప్పింది. ‘ఫలమ/ను మన నేతలు నిద్రలో నుండ, రైతు’ అంటే సరి! కాకుంటే నిన్నటి ‘అఖండయతి’ పడింది. * మందాకిని గారూ, చక్కని పూరణ. అభినందనలు. ‘జాగు + అనక’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘జాగు చేసె/ జాగు చేయ’ అంటే సరి! ఇక ఇది ఎనిమిది పాదాల ‘తేటగీతిక’ అనుకుంటే నాలుగవ పాదం ప్రథమాక్షరం, వేరువేరు పద్యాలనుకుంటే రెండవపద్యం మొదటి పాదం మొదటి అక్షరం యడాగమమై ఉండరాదు. అది తేటగీతిక అనుకుంటే ‘ఫలమ/ టంచు’ అనీ, విడిపద్యమే అయితే ‘అనుచు’ అనీ ఉండాలి.
వసంత కిశోర్ గారూ, ఇప్పటికైనా అందరికీ ‘అఖండయతి’ పాఠం చూసారా, లేదా? * డా. విష్ణునందన్ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. చంద్రశేఖర్ గారికి (వారితో పాటు అందరికీ) వ్యాకరణ పాఠం చెప్పినందుకు ధన్యవాదాలు. * రాజేశ్వరక్కా, నిర్దోషమైన చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు, ధన్యవాదాలు. * శ్రీపతి శాస్త్రి గారూ, చక్కని పాటను గుర్తుకు తెచ్చిన మీ పూరణలోని వేదాంతధోరణి బాగుంది. మంచి పూరణ. అభినందనలు. అర్ధానుస్వారాన్ని ఎలా టైపు చేయాలో రాజేశ్వరక్కయ్య చెప్పారు కదా! * జిగురు సత్యనారాయణ గారూ, మహిళలు చేసే కాలహరణం గురించి చమత్కారమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
దత్త పదిని నేఁ గోరితి, తలకు మించె
రిప్లయితొలగించండిదక్షులౌమిత్ర గణములు దడదడంచు
చేసినారు. నేఁ బడితిని చిక్కులందు
కాలహరణమే చేకూర్చెఁ గార్యఫలము
మిత్రులంత అందంగా నేను చేయలేకపోయానని, చివరికేదో చేసానని.డంబాలు పలికి అడిగింది గుర్తుకు వచ్చి సరదాగా....
కాంగ్రె సందున కోటరీ ఘనుల మాట:
రిప్లయితొలగించండిఅమ్మ సోనియ త్వరపడ కమ్మ నీవు
తెలుగు వారల తగవును తీర్చ బోకు
కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము.
రచన జేయక పద్యమ్ము రక్తి నిడునె
రిప్లయితొలగించండిపూనుకొనకును కార్యమ్ము పూర్తి యగునె
'కాల హరణమే చేకూర్చుఁ గార్యఫలము '
ననగ గలుగునె ఘనతయు నవని యందు ?
మిస్సన్న గారూ పద్యము అదిరింది
రిప్లయితొలగించండిసవరణ ;
రచన జేయక పద్యమ్ము రక్తి నిడునె ?
పూనుకొనక యే కార్యమ్ము పూర్తి యగును ?
'కాలహరణమే చేకూర్చుఁ గార్య ఫలము '
ననగ గలుగునె ఘనత యీ యవని యందు ?
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ స్వీయానుభవ పూరణ. అభినందనలు.
‘దడదడంచు’ అనేదానిని ‘దడదడమని లేదా త్వరితగతిని’ అంటే బాగుంటుందని నా సలహా.
*
మిస్సన్న గారూ,
సమయోచితమైన పూరణ. వాస్తవమైన విషయాన్ని తెలిపారు. బాగుంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
‘ఆలస్యా దమృతం విషమ్’ అన్న సూక్తి గుర్తుకు వచ్చింది మీ పూరణ చూస్తుంటే. మంచి పూరణ. అభినందనలు.
గురువు గారూ ధన్యవాదములు
రిప్లయితొలగించండిచేయుచు, కొనుచు అనేటప్పుడు ద్రుతము వస్తూంది, కాని చేయక, కొనక అనే వ్యతిరేకార్ధములో ద్రుతము రాదు. అందు వలన పద్యమును సవరించాను. పప్పులో కాలు వేసాక నాకు తెలుస్తుంది తప్పని.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
సారంగధర చరిత్ర :
ముందే సారంగ ధరుణ్ణి వలచిన చిత్రాంగి,రాజరాజు పంపినసారంగధరుని
చిత్రపటాన్ని చూసి పెళ్ళికి అంగీకరిస్తుంది !
కాని మంత్రి చేసిన దుర్బోధ తలకెక్కిన రాజరాజు వంచనతో
తన కత్తికే బాసికము కట్టి పంపించి ,
కోడలు కావలసిన చిత్రాంగిని భార్యను చేసుకుంటాడు !
రాజరాజు అంతఃపురము చేరిన తరువాత గాని ఆ విషయం చిత్రాంగికి తెలియదు !
హృదయం వ్రయ్యలైన చిత్రాంగి , వ్రతములేవో చెయ్యాలని చెలికత్తెలతో చెప్పించి కొద్దిరోజులు రాజరాజును అంతఃపురానికి రాకుండా కట్టడి చేసి ,
తన సమస్యకు కాలహరణమే మార్గమని తలపోసి ,
సారంగుని కోసం ఎదురు తెన్నులు చూస్తూ కాలం వెళ్ళబుచ్చుతుంటుంది !
01)
_______________________________________
వనిత మనసును హరియించ - వాని సుతుడు
రమణి చిత్రాంగి , పెండ్లాడె - రాజరాజు
వంచనను కట్టి కత్తికి - బాసికమును !
వాని బారిని పడకుండ - వ్రతము లనుచు
వనిత గోరెను కొన్నాళ్ళ - వరకు గడువు
వలపు ఫలియించ కుండునా ?- వరుని జేర
కాల హరణమే చేకూర్చు- గార్య ఫలము !
_______________________________________
ఆ ఘడియ రానే వస్తుంది ! సారంగుని కలసి తన వేదన వెళ్ళబోసుకుంటుంది !
రిప్లయితొలగించండికాని నువ్వు నా తల్లితో సమానురాలవని చెప్పి ఆమెను తిరస్కరిస్తాడు సారంగుడు !
అది వంచనతో కూడిన వివాహమని నెత్తీ నోరూ బాదుకుంటుంది !
వంచనయినా ఏదయినా విధిలిఖితం అనుభవించవలసిందే నంటూ
ఆమెను తిరస్కరిస్తాడు సారంగుడు !
విఫలమైన ప్రేమ !
వృద్ధరాజు మోసం !
వంచనతో వివాహం !
ప్రియుని తిరస్కారం !
బ్రద్దలైన హృదయం !
మతి తప్పిన మనసు !
గతి తప్పిన బుద్ధి !
అదే సమయంలో అంతఃపురానికి
రాజరాజు రాక !
తనేం చేస్తుందో తనకే తెలియని స్థితిలో సారంగుడే తనను బలాత్కరించబోయాడని
రాజరాజుకు ఫిర్యాదు చేస్తుంది !
ఆంధ్ర మహా భారతాన్ని నన్నయ ద్వారా మన కందించిన ఆ మహారాజు
మతిమాలి బుద్ధిహీనుడై కన్నకుమారుని కాళ్ళూ చేతులూ నరికిస్తాడు !
విషయం తెలిసిన చిత్రాంగి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకొంటుంది !
కొడుకునే మోహించిందన్న అపప్రధ మాత్రం మూట గట్టు కుంటుంది !
శివాంసా సంభూతుడైన ఒక యోగి కరుణతో సారంగునికి యథారూపు వస్తుంది !
గురువు గారికి ధన్యవాదములు,నమస్కారములతో
రిప్లయితొలగించండితే: కాల హరణమే చేకుర్చు గార్యఫలమ
ని మన నేతలు నిద్రలో నుండ, రైతు
కష్టములు దీర్చ, సురులకు గష్టమై, న
దృశ్యమైరి భారతదేశ దృశ్యమందు.
రావణుండను దైత్యుఁడు రామ పత్ని
రిప్లయితొలగించండిసీత నపహరింపగ; నాతి సీత నమ్మి
జపము తపముల గడపెను జాగు యనక
కాల హరణమే చేకూర్చు గార్య ఫలము
యనుచు మనమునఁ వీడని యాత్మ బలము
తోడ వేచెను శోకము తోడు గాను.
కొన్ని వేళల నిజమగు కొత్త వింత
కాలహరణమే చేకూర్చు గార్యఫలము.
వసంత కిశొ ర్ గారు, కథ సస్పెన్స్ లో ఆపేయకుండా పూర్తిగా చెప్పినందుకు ధన్యవాదములు.
ఊకదంపుడు గారి పూరణ ....
రిప్లయితొలగించండివసుధ న్యాయవాదులకును, వైద్యులకును
ధనము కలుగు"కేసు"యొకటి దక్కినంత;
మరియు నూకదంపుడుగార్కి మాన్య సభల-
కాలహరణమే చేకూర్చుఁ గార్య ఫలము
( నరసింహ మూర్తి గారికి, విష్ణునందనుల వారికి క్షమాపణలతో)
ఊకదంపుడు గారి వ్యాఖ్య ...
రిప్లయితొలగించండి3వ పాదం కొద్దిగా సవరించాను
వసుధ న్యాయవాదులకును, వైద్యులకును
ధనము కలుగుకేసుయొకటి దక్కినంత;
నరయ నూకదంపుడువక్త కన్ని సభల
కాలహరణమే చేకూర్చుఁ గార్య ఫలము
అన్న గోరెడి చట్టము అంతు తేల్చు
రిప్లయితొలగించండిదినము దినమున పెరిగెడి దీక్ష జూచి
కలిసి యోచన జేసిరి కాంగి జనులు
కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము.
"కాలహరణ మేలర హరే" కరుణ జూప
రిప్లయితొలగించండిమనుచు త్యాగరాజలనాడు మథన పడెను
భోగ రాజుల లసులిట భోరు మనిరి
కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము!
మాస్టారూ, రెండో పాదంలో అఖండ యతి వాడాను. అఖండయతి మీద మీ పాఠం బ్రహ్మాండంగా వుంది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివార వర్జ్యమ్ము ఘడియల వాసి జూసి
రిప్లయితొలగించండిమొదలు బెట్టిన పనులన్ని ముదము నిచ్చు
ననుట నెఱుగమే నేడును ,కనుక రాహు
కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము!
చంద్రశేఖరా ! అఖండయతి మీద పాఠమా ???
రిప్లయితొలగించండిశంకరార్యా ! ఇది చాలా అన్యాయం !
చంద్రశేఖరులకు pravate గా ప్రైవేటు చెబుతున్నారా ???
మేం ఒప్పుకోం !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
పాఠాలు----అందరికీ చెప్పాలి !
నమ్మవలె , జ్యోతిషమ్ము శాస్త్రమ్ము సుమ్ము !
రిప్లయితొలగించండిఅమృత ఘటికా కృతములైన అన్ని పనులు
విజయమొందును సర్వదా - వినుము ; రాహు
కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము !!!
మంద పీతాంబర్ గారూ మీ పద్యము నిప్పుడే చూచాను . నేను వ్రాసిన దాని కన్నా మరింత సూటిగా , స్పష్టం గా ఉంది . మనః పూర్వకాభినందనలు ... చంద్ర శేఖర్ గారూ అఖండయతి మీద శంకరయ్యగారి పాఠమైన తరువాత నాదో చిన్న వ్యాకరణ పాఠం !!! చక్కని కరుణా రస భరితమైన పద్యం ...చాల బావుంది ...అయితే - ఆదేశార్థకములూ , విజ్ఞాపనార్థకములూ వ్రాసే పట్టుల ' చేయుమనిరి (చేయుము + అనిరి .)...వ్రాయుమనిరి ...(వ్రాయుము + అనిరి ) ..త్రాగుమనిరి .....(త్రాగుము + అనిరి) ...... నిలబడుమనిరి (నిలబడుము + అనిరి ) , ఈవిధముగా ' ఉకార సంయుక్తముగ వ్రాయవలె....లేనిచో చేయమనిరి....(చేయము + అనిరి) , , వ్రాయమనిరి (వ్రాయము + అనిరి ) ఈ ఇలా వ్యతిరేకార్థము నిస్తాయి కదా !!! అంటే పైపద్యములో " కరుణ జూపుమనుచు ( కరుణ జూపుము + అనుచు ) " త్యాగరాజు రాముడిని వేడుకొన్నాడని......" కరుణ జూపమనుచు (కరుణ జూపము + అనుచు " అని కూడదు ..ఇది ఒకానొక సర్వసాధారణమైన పొరపాటు , అందరూ చేసేదే !!!! మాట మన్నించినందులకు ధన్యవాదాలు , శంకరయ్యగారికి కృతజ్ఞతలు !!!!
రిప్లయితొలగించండిఊకదంపుడు గారూ , క్షమాపణలవసరం లేదు ...ఆ మాటకొస్తే నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలేమో ....మనసారా నవ్వుకునే భాగ్యం కల్పించినందులకు......చక్కని పద్యం.....మంచి భావం !!! అభినందనలు !!!
పద్యమును వ్రాయ గోరితి హృద్యముగను
రిప్లయితొలగించండివ్యర్ధమై పోయె నేరీతి నర్ద మవక
మట్టి బుఱ్ఱకు తోచదు గట్టి పలుకు
కాల హరణమే చేకూర్చుఁ గార్య ఫలము !
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండితలచి నంతనె జరుగవు తక్షణమున
తలచకున్నను నాగవు తవమిదియె
కాలపురుషుని లీలలు కాంచనగునె
కాలహరణమే చేకూర్చు గార్యఫలము
{ఆచార్య ఆత్రేయగారికి నమస్సులతో}
కాలహరణము = కాలమును హరించటం {కాలాన్ని వినియోగపెట్టుకోవడం అనే అర్థంలో}.
అరసున్నను ఎలా పోస్ట్ చేయాలో తెలుపప్రార్థన.
2 వ పాదంలో టైపాటు సవరణ
రిప్లయితొలగించండితలచుకున్నను నాగవు తత్వమిదియె
తలచి నంతనె జరుగవు తక్షణమున
రిప్లయితొలగించండితలచకున్నను నాగవు తత్వమిదియె
కాలపురుషుని లీలలు కాంచనగునె
కాలహరణమే చేకూర్చు గార్యఫలము
రక రకాల చీరలెదుట రహివహింప
రిప్లయితొలగించండివనితలకొకటి యెన్నగ వల్ల కాదు
మగువలు నిలుపఁ జాలరు మనసు, పలు ర
కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము!!
vasanta mahodayaa, akhanda yathi meeda paatham sankaraabharanam home page lo mastaru post cheshaaru. meeru koodaa choodavacchu. naa kantoo vere paatham emii ivvaledu.
రిప్లయితొలగించండిDr. VishnuNandan garu, Meeku chaalaa dhanyavaadaalu. chakkati suble point pattaaru. mee vyaakarana paatham sraddhagaa nerchukonnaanai cheppagalanu. mee lanti vaaru sankocham lekundaa saana badithene maaku aanandam.
రిప్లయితొలగించండిee madhya mee pooranalu karuvainavi. veelu choosukoni prati pooranaa yedo rakamgaa poorinchi mee mudra veyandi. ave maaku cheppaka cheppe pathaalu. English lo type cheyavalasi vacchindi. manninchaali.
ara sunnaa ilaa " @m " taip cheste vastumdi
రిప్లయితొలగించండిఆర్యా! ఊకదంపుడు గారూ ధనము కలుగ చేసే కేసులు మాకు సమకూరుస్తూ క్షమాపణలెందుకు ? మీకు మేమే కృతజ్ఞతలు చెప్పాలి. కాకపోతే న్యాయవాదులు వలె మాకు ఒక కేసుతో బండి సాగదు. చాలా కేసులు కావాలి. ఈ దేశములో బెక బెక వైద్యులము మా వెనుకనే ఉండే వకీలు పాములను జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి! మీ పద్యము బాగుంది.
రిప్లయితొలగించండిడా.విష్ణు నందన్ గారూ మీ గురించే నిన్న తలచు కొన్నాను.శత్రర్ధ చువర్ణము గురించి చదువుదాము అంటే దగ్గఱ వ్యాకరణ పుస్తకము లేక. మీరు యీ దినము ప్రత్యక్షమయి మాకు ఆనందము కలుగ జేసారు. గురువు గారికి తోడుగా మీరు కూడా మాకు వ్యాకరణ పాఠాలు యివ్వండి. ఆనందిస్తాము.
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ ‘సారంగధర చరిత్ర’ చెప్పిన తీరు చాలా బాగుంది. గతంలో ఒకసారి ‘భక్త సిరియాళ’ కథ కూడా చెప్పారు. అప్పుడే అన్నాను. మీలో మంచి ‘కథకుడు’ ఉన్నాడని.
ఇక మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మంచి విషయంతో సమస్యను పూరించారు. బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. ‘ఫలమ/ను మన నేతలు నిద్రలో నుండ, రైతు’ అంటే సరి! కాకుంటే నిన్నటి ‘అఖండయతి’ పడింది.
*
మందాకిని గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
‘జాగు + అనక’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘జాగు చేసె/ జాగు చేయ’ అంటే సరి!
ఇక ఇది ఎనిమిది పాదాల ‘తేటగీతిక’ అనుకుంటే నాలుగవ పాదం ప్రథమాక్షరం, వేరువేరు పద్యాలనుకుంటే రెండవపద్యం మొదటి పాదం మొదటి అక్షరం యడాగమమై ఉండరాదు. అది తేటగీతిక అనుకుంటే ‘ఫలమ/ టంచు’ అనీ, విడిపద్యమే అయితే ‘అనుచు’ అనీ ఉండాలి.
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలోని చమత్కారం అలరించింది. మంచి పూరణ. అభినందనలు.
‘కేసు + ఒకటి’ అన్నప్పుడు యడాగమం రాదుకదా! ‘కేసొకటైన/ కేసొకటియు’ అందామా?
*
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
కాలోచితమైన పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
పూరణ బాగుంది. అభినందనలు.
డా. విష్ణునందన్ గారి సూచన గమనించారు కదా!
*
మంద పీతాంబర్ గారూ,
‘రాహుకాలం’ విషయంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
డా.విష్ణు నందన్ గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిగురువుగారూ, మంచిసూచనలు ఇచ్చినారు.
రిప్లయితొలగించండిధన్యవాదములు
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమన్నించండి ! మీ పాఠం నేను చూడలేదు !
చంద్రశేఖరా ! ఔనుగదూ ! నేనిప్పుడే చూశాను ! ధన్యవాదములు !
విష్ణు నందనా ! సుందరా ! ధన్యవాదములు !
అత్యంత సహజముగా జరిగే పొరపాటది !
చాలా చక్కని విషయం చెప్పారు !
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిఇప్పటికైనా అందరికీ ‘అఖండయతి’ పాఠం చూసారా, లేదా?
*
డా. విష్ణునందన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
చంద్రశేఖర్ గారికి (వారితో పాటు అందరికీ) వ్యాకరణ పాఠం చెప్పినందుకు ధన్యవాదాలు.
*
రాజేశ్వరక్కా,
నిర్దోషమైన చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు, ధన్యవాదాలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కని పాటను గుర్తుకు తెచ్చిన మీ పూరణలోని వేదాంతధోరణి బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
అర్ధానుస్వారాన్ని ఎలా టైపు చేయాలో రాజేశ్వరక్కయ్య చెప్పారు కదా!
*
జిగురు సత్యనారాయణ గారూ,
మహిళలు చేసే కాలహరణం గురించి చమత్కారమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
జ్ఞాని ఆయన ' పీవీ' ప్రధాని గాను
రిప్లయితొలగించండిదేశ మేలెను, ఏమియావేశ పడక
చేసి చూపెను మరియును చెప్పుచుండు
'కాలహరణమే చేకూర్చు గార్యఫలము'
విష్ణునందన్ గారూ, నరసింహమూర్తి గారూ, గురువు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
గురువు గారూ,
కేసు అన్యదేశ్యమని సంధి చేయలేదండి.
భవదీయుడు
ఊకదంపుడు
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండిఅలాంటప్పుడు ‘కేసు ఒకటి’ అని విసంధిగా వ్రాస్తే సరి! యడాగమం రాకూడదు.
గురువు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
యడాగమం గురించి మీ పాఠం కోసమై ఎదురుచూస్తుంటాను.
భవదీయుడు
ఊకదంపుడు
రాజేశ్వరి అక్కయ్యగారికి,గురువుగారికి కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండి