30, ఆగస్టు 2011, మంగళవారం

సమస్యా పూరణం -443 (కరుణామయులన్న వారు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కరుణామయులన్న వారు కాలాంతకులే.
ఈ సమస్యను పంపిన
కందుల వరప్రసాద్ గారికి
ధన్యవాదాలు.

50 కామెంట్‌లు:

 1. త్వరపడి మాటను తూలరు
  పరిమితి దాటిన నెవరిని పరికించుచు, ఛీ !
  నరికిన పాపము లేదని
  కరుణామయులన్న, వారు కాలాంతకులే !

  రిప్లయితొలగించు
 2. హరుడంటివ కరుణాత్ముడు
  మరుడతనికి తెలియు గదర మర్మంబంతన్
  కరి గాపు మకరి దాపయె
  కరుణామయు లన్న వారు కాలాంతకులే !

  ( కరి గాపు = కరిని రక్షించిన విష్ణువు , దాపు = భయము )

  రిప్లయితొలగించు
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  అపర భగీరథుడు, రైతుబాంధవుడే మన
  ఆధునిక కాలాంతకుడు :

  01)
  _________________________________

  కరుణించెను కొడుకు నెటుల
  సరి, తెలిసెను జనులకు, మరి - సాక్ష్యము తోడన్ !
  అరుదగు నా తెలివిని గన
  కరుణామయులన్న వారు - కాలాంతకులే !
  _________________________________

  రిప్లయితొలగించు
 4. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, ఆగస్టు 30, 2011 7:28:00 AM

  గురువుల కడు దూషించెడు,
  భరణముకై ప్రజలశువుల భక్షించెడు యీ
  నరరూప రాక్షసులనిట
  కరుణామయులన్న, వారు కాలాంతకులే.

  రిప్లయితొలగించు
 5. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, ఆగస్టు 30, 2011 7:49:00 AM

  వరమున్, సురగణముల, భూ
  సురులన్, బుధ, ఋషివరేణ్య శుద్ధాత్మల సం
  హరణము జేసెడి వారల
  కరుణామయులన్న, వారు కాలాంతకులే.

  రిప్లయితొలగించు
 6. కరుణ నటించుచు, దుష్టులు
  ధరనేలుచునుం డ్రిదేమి దౌర్భాగ్యమొ? యా
  పరమాత్ముడెఱుగు నిజమును.
  కరుణామయులన్న - వారు - కాలాంతకులే!

  కరుణాత్ముఁడొక్క దైవమె.
  కరుణన్ వెలయింగ, ముగియ, కల్పన చేయున్.
  తరి తప్పనట్టి వ్యక్తులె
  కరుణామయులన్న! వారు కాలాంతకులే?

  రిప్లయితొలగించు
 7. అపర భగీరథుడు, రైతుబాంధవుడే మన
  ఆధునిక కాలాంతకుడు :

  02)
  _________________________________

  భరణము పెంచెను ప్రజలకు
  హరణము గావించె జనుల - యాస్తుల నెన్నో !
  సరి లేరు వాని సాటిల !
  కరుణామయులన్న వారు - కాలాంతకులే !
  _________________________________

  రిప్లయితొలగించు
 8. అపర భగీరథుడు, రైతుబాంధవుడే మన
  ఆధునిక కాలాంతకుడు :

  03)
  _________________________________

  కరి మ్రింగు వెలగ రీతిని
  సిరి మ్రింగెను సుతున కిచ్చె - సేద్యము కొఱకై
  పొరబడి యందురు గానీ
  కరుణామయులన్న వారు - కాలాంతకులే !
  _________________________________

  రిప్లయితొలగించు
 9. సేద్యము = నోట్లతో ఓట్లు కొని పదవులు పొంది
  పండించే అవినీతి పంట(పెంట)

  రిప్లయితొలగించు
 10. అపర భగీరథుడు, రైతుబాంధవుడే మన
  ఆధునిక కాలాంతకుడు :

  04)
  _________________________________

  కరుణంత కొమరు మీదనె
  సరణంతయు సంగ్రహించు - సంపద మీదే !
  మరియాద మరచి నాతని
  కరుణామయులన్న వారు - కాలాంతకులే !
  _________________________________

  రిప్లయితొలగించు
 11. అపర భగీరథుడు, రైతుబాంధవుడే మన
  ఆధునిక కాలాంతకుడు :

  05)
  _________________________________

  తరమగునె శేషు కైనను
  పరమేష్టికి నైన వాని - బాబుకు నైనన్
  పరిగణము సేయ దోపిడి !
  కరుణామయులన్న వారు - కాలాంతకులే !
  _________________________________

  రిప్లయితొలగించు
 12. ధరనెవ్వరేని తా ఖ
  ర్పరుఁడను గానని నుడివిన పరికించదగున్
  అరయగ తమంత తామే
  కరుణామయులన్న వారు కాలాంతకులే!

  రిప్లయితొలగించు
 13. శ్రీపతిశాస్త్రిమంగళవారం, ఆగస్టు 30, 2011 9:24:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  పరికింపగ గో ముఖమున
  తిరుగాడెడు పెద్దపులుల తీరున,వారిన్
  మరినేమనగలము, మనము
  కరుణామయులన్న, వారు కాలాంతకులే

  రిప్లయితొలగించు
 14. గురువు గారికి ధన్యవాదములు, నమస్కారములతో
  వసంత కిశోర్ గారి నాలుగు పూరణలు అద్భుతంగా ఉన్నవి.
  నా భావము గురువు ( వసంత కిశోర్ ) గారుపలికించినారు. నేను వారిని తలచుకొని ఉచ్చినది.

  రిప్లయితొలగించు
 15. దరిజేరి కష్ఠ సుఖముల
  బరికించుచు బ్రాణి కోటి బరి రక్షించే
  పరమాత్మను దప్ప నొరుల
  గరుణామయులన్న - వారు కాలాంతకులే

  రిప్లయితొలగించు
 16. పరమదయామయుడగు నా
  పరమాత్ముని, జగములన్నిఁ బరిపాలించే
  వరదుండను దక్క నొరుల
  గరుణామయులన్న వారు కాలాంతకులే

  రిప్లయితొలగించు
 17. కరములు మోడ్చిన కురుయును
  వరములు హరిహరులనుండి,పరపీడనకై
  వరములవినియోగించిన
  కరుణామయులన్నవారు కాలాంతకులే!

  రిప్లయితొలగించు
 18. సరి ! సరి ! తమ 'కరి మింగిన'
  సరసాన్విత పూరణము వసంత కిశోరా !
  పరికింపగ మది కింపగు
  నరయంగా పద్య సరణి హాయి నొనర్చెన్

  రిప్లయితొలగించు
 19. జిగురు సత్యనారాయణమంగళవారం, ఆగస్టు 30, 2011 5:33:00 PM

  పెరిగెను కుక్కలు వీథిన
  కఱవగ పిక్కను బలముగ, ఘనమగు శిలతో
  తఱమగ కుక్కను, వలదని
  కరుణామయులన్న వారు కాలాంతకులే!!

  రిప్లయితొలగించు
 20. నా పూరణ ....
  (ఈ లేటు వయసులో చెప్పదగిన పద్యం కాదనుకోండి!)
  ఒక విరహిణి ఉపాలంభనము .....

  స్మర! మలయానిల! గంధమ!
  హరిణాంకా! మీరు చల్ల నగువారె కదా!
  విరహాగ్నిని పెంచితిరే!
  కరుణామయు లన్నవారు కాలాంతకులే.

  రిప్లయితొలగించు
 21. జిగురు సత్యనారాయణమంగళవారం, ఆగస్టు 30, 2011 6:59:00 PM

  చిర కాలపు వ్యాది వలన
  మరణముకై చూడ రోగి మంచమునందున్
  కరుణన్ జంపగ రోగిని
  కరుణామయు లన్నవారు కాలాంతకులే!!

  రిప్లయితొలగించు
 22. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  శివకేశవు లిద్దరినీ కరుణామయులుగాను, కాలాంతకులుగానూ చేసిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ ఐదు పూరనలూ ‘అపరభగీరథుణ్ణీ, రైతుబాంధవుణ్ణీ’ సంబోధించినా దేనికదే ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా రెండవపూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  మొదటి పూరణలో ‘ప్రజలశువుల’ ... ? ‘ప్రజల యుసురు’ కదా!
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలు సర్వశ్రేష్ఠంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ (మనతెలుగు) గారూ,
  ఎవరూ తమను తాము ‘ఖర్పరుడ’ నని ఒప్పుకోరు కదా! చక్కని పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించు
 23. జిగురు సత్యనారాయణమంగళవారం, ఆగస్టు 30, 2011 7:16:00 PM

  కరుణామయుండు పాత్రను
  ధరించి మన్ననలు పొంది తా దోపిడికిన్
  సరసకుఁ జేరిన చిత్రమె
  కరుణామయు లన్నవారు కాలాంతకులే!!

  రిప్లయితొలగించు
 24. జిగురు సత్యనారాయణమంగళవారం, ఆగస్టు 30, 2011 7:21:00 PM

  చిన్న మార్పు తో:-

  కరుణామయుడను పాత్రను
  ధరించి మన్ననలు పొంది తా దోపిడికిన్
  సరసకుఁ జేరిన చిత్రమె
  కరుణామయు లన్నవారు కాలాంతకులే!!

  రిప్లయితొలగించు
 25. శ్రీపతి శాస్త్రి గారూ,
  గోముఖవ్యాఘ్రాల గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  వసంత కిశోర్ గారిపై మీ పద్యం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
  *
  మందాకిని గారూ,
  మనోహరమైన పూరణ. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘కురుయును’ ... ?
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ మూడు పూరణలూ ముచ్చటగా ఉన్నాయి. అభినందనలు.
  ముఖ్యంగా ‘మెర్సీ కిల్లింగ్, విజయచందర్’ లపై పూరణలు ఉత్తమంగా ఉన్నాయి.

  రిప్లయితొలగించు
 26. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
  మీ పూరణ లేటు వయసులో చెప్పినా లే 'టేస్టు' గా వున్నదండీ ! ...

  రిప్లయితొలగించు
 27. అమ్మ మాస్టారూ, మొత్తానికి ఇన్నాళ్ళకి శంకరయ్య గారిలో వరూధినీ ప్రభావిత ప్రవరాఖ్యుడిని చూడగలిగాము :-) చక్కటి భావ కల్పన! బాగుంది. కవి కల్పనకి వయసుతో నిమిత్తం లేదని పూర్వకవులెందరో చేసి చూపారు కదా! మనం వారి బాటలోనే నడుద్దాం సార్!

  రిప్లయితొలగించు
 28. పరికింపక పరుల వెతల
  నరులను పీడించువారు నరహంతకులౌ !
  కరుణగ తీయని పలుకుల
  కరుణా మయులన్న వారు కాలాంతకులే !

  రిప్లయితొలగించు
 29. రాజారావుగారికి ధన్యవాదములు !

  పారంగతుడవు నీవే (రావూ)
  పూరణ నితరులను మెచ్చు - పుణ్యుడవోయీ !
  పారావారము నీ హృది
  పారాయణి నిన్ను బ్రోచు - వాలాయముగా !

  రిప్లయితొలగించు
 30. విరహాగ్నిని రగులుతున్న
  వరూధిని వెతల దీర్ప మాయా వరుడగు గం !
  ధర్వుడు ముదముగ వలచిన
  కరుణా మయుడన్న వారు కాలాంతకులే !

  " మనసెప్పుడు గుప్పెడే తమ్ముడూ ! దానికి వయో బేధాలు లేవు "

  రిప్లయితొలగించు
 31. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  శంకరార్యా ! ధన్యవాదములు !
  మనసుకు వయసు మీరడమేంటి స్వామీ ! అది నిత్య యవ్వనం !వయసులో నున్నవాళ్ళు కూడా యివ్వలేని ప్రశస్తమైన పూరణ నిచ్చారు !
  అభినందనలు !

  రాజేశ్వరక్కాయ్ ! ఈ రోజు నీ పూరణ పరమ ప్రశస్తం !

  రిప్లయితొలగించు
 32. అయ్యో ! అక్కాయ్ ! రెండవ పూరణ లో - మళ్ళీ ----

  రిప్లయితొలగించు
 33. రాజేశ్వరక్కయ్యా,
  మీ రెండు పూరణలలో మొదటిది నిర్దోషంగా. వసంత కిశోర్ గారు చెప్పినట్లు ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  రెండవ పూరణలో భావం ప్రశంసనీయం, కాని తమ్ముడికి పని కల్పించారు. మొదటి పాదంలో బేసిగణంగా జగణం వేసారు. రెండవపాదంలో గణదోషం. నా సవరణలు ...
  విరహాగ్నిని రగిలెడి యా
  వరూధినిని వలచి కపటి ప్రవరుండయి గం ....
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి, చంద్రశేఖర్, వసంత కిశోర్ గారలకు రాజేశ్వరక్కయ్యకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 34. హరి ! హరి ! యా విరహాగ్నికి
  సరసుడ ! యీ బ్లాగు వీడి చనబోరు గదా !
  సరి మిత్రుల పరిహాసపు
  విరి తూపుల శంకరార్య ! వెఱ పెరుగరుగా !

  రిప్లయితొలగించు
 35. శ్రీపతిశాస్త్రిమంగళవారం, ఆగస్టు 30, 2011 10:00:00 PM

  గురువుగారు ధన్యవాదములు

  రిప్లయితొలగించు
 36. శ్రీ చింతా రామ కృష్ణారావు, గురువుగార్ల పూరణలు మనోజ్ఞంగా ఉన్నాయి.
  మిత్రులందరూ ఒకరిని మించి మరొకరు పోటీపడి అపురూపమైన పూరణలను సమర్పించారు. అందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించు
 37. రాజీవుగాంధీ హంతకులను ఉరి తీయరాదని తమిళనాట ఆందోళనలు
  సాగుతున్న నేపథ్యంలో ..........

  నర హంతకులౌ వారిని
  ఉరి తీయగ రాదటన్న యుచితమె ? దయకున్
  సరిహద్దు లేదె ? హంతకుఁ
  కరుణామయుడన్న వారు కాలాంతకులే.

  రిప్లయితొలగించు
 38. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, ఆగస్టు 30, 2011 10:55:00 PM

  ధన్యవాదములు గురువు గారూ. మొదటి పద్యము నచ్చకనే రెండవ పద్యం వ్రాసినాను. మీరు కూడా అదే భావాన్ని వ్యక్తపరిచినారు. ధన్యవాదములు. మీ పూరణ సర్వశ్రేష్టమై విరాజిల్లుతోంది.

  రిప్లయితొలగించు
 39. రాజేశ్వరి గారు,
  మూడవ పాదములో ప్రాస సంయుక్తాక్షరము వేసారు.

  రిప్లయితొలగించు
 40. నమస్కారములు. సత్యనారాయణ గారూ !
  అదే " ద్విత్వ ,సంయుక్తా క్షరముల దగ్గరే " గణ విభజనకు నాకు సందేహాలు తీరటల్లేదు .

  రిప్లయితొలగించు
 41. రాజేశ్వరక్కయ్యా,
  ప్రాస సవరింపబడిన మీ పద్యం .......

  విరహాగ్నిని రగిలెడి యా
  వరూధినిని వలచి కపటి ప్రవరాద్భుత రూ
  పరియై ముదముగ వలచిన
  కరుణా మయుడన్న వారు కాలాంతకులే
  (రూపరి = సౌందర్యము కలవాడు)

  రిప్లయితొలగించు
 42. మిస్సన్న గారూ,
  సమయోచితమైన పూరణ. అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  లక్కాకుల వెంకట రాజారావు, మిస్సన్న, సంపత్ కుమార్ శాస్త్రి గారలకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 43. గురువు గారూ అనూహ్యముగా వరూధిని పలుకులతో అల్లసాని వారిని దింపేసారు. మాటలతో ఆడుకోవటములో తప్పేముంది. పెరిగిన వయస్సు కవచము మనకు భలే ఉపయోగ పడుతుంది మీ పూరణ చాలా బాగుంది. కిశోర్ జీ గారి కరి మింగిన వెలగ పండు పూరణ కూడా నాకు చాలా నచ్చింది.

  రిప్లయితొలగించు
 44. న్యాయముగా ద్విత్తాక్షరాలకు సంయుక్తాక్షరాలకు రెట్టింపు మార్కులు వెయ్యాలి.

  రిప్లయితొలగించు
 45. కరములలో బాంబులతో
  నరులను శిశువులను పేల్చు నక్సలు వీరు
  ల్నరయగ మహనీయులు బహు
  కరుణామయులన్న వారు కాలాంతకులే

  రిప్లయితొలగించు
 46. కరువుల కాలము రాగనె
  నరువులనిడి బ్రోచి వేచి నక్కల వోలెన్
  సరసపు రేటుకు గుంజుచు
  కరుణామయులన్న వారు కాలాంతకులే

  రిప్లయితొలగించు