10, ఆగస్టు 2011, బుధవారం

చమత్కార పద్యాలు _ 123

‘గుళు గుగ్గుళు గుగ్గుళు ’
ఒకసారి సభలో భోజమహారాజు ‘గుళు గుగ్గుళు గుగ్గుళు’ అనే సమస్యనిచ్చి కవులను పూరించమన్నాడట. దానికి కాళిదాసు పూరణ ...
జంబూఫలాని పక్వాని
పతంతి విమలేజలే |
కపికంపిత శాఖాభ్యః
గుళు గుగ్గుళు గుగ్గుళు ||

(కోతులు ఊపిన కొమ్మలనుండి పండిన నేరేడుపళ్ళు క్రింద చెరువునీళ్ళలో పడగా ‘గుళు గుగ్గుళు గుగ్గుళు’ అనే శబ్దం వచ్చింది.)
కవిమిత్రులారా,
కాళిదాను స్ఫూర్తితో క్రింది సమస్యను పూరించండి.
టప టప టప టప్ప టప టప టప.

33 కామెంట్‌లు:

 1. చెట్టపట్టు లాడి చెలికాడు,చెలియతో
  చెట్టునీడ జేర చెలువమూరి
  అభ్ర మపుడు కురిసె నా నీటి బొట్టులే
  టప!టప!టప!టప్ప!టప!టప!టప!

  రిప్లయితొలగించు
 2. పొటుకు పెట్టు నింట పోచమ్మ పలుచోట్ల
  పెట్ట గ్లాసు, చెంబు, ప్లేటు, గిన్నె,
  చట్టి, ముంత, బిందె : చప్పు డిట్లాయెగా
  టప టప టప టప్ప టప టప టప.

  రిప్లయితొలగించు
 3. వాన వచ్చెనమ్మ వరదల్లు వచ్చెను
  మిద్దె మీద నీరు మిగులఁజేరి
  జారి పడెడు శబ్ద సంగీతమో! భళా!
  టప టప! టప టప్ప టప! టప టప!

  రిప్లయితొలగించు
 4. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, ఆగస్టు 10, 2011 12:11:00 PM

  దివ్వె వెలుగులందు దీపావళీ సంబ
  రములు జరుపు కొనుచు, రయముగాగ,
  సరము కాల్చు తఱిని శబ్దంబులివ్విది
  టప టప టప టప్ప టప టప.

  సరము = దెపావళి టపాసులలో ఒక రకం ( అందరికి తెలుసనుకుంటాను )

  రిప్లయితొలగించు
 5. తడవ తడవ గుడిసె తాటాకు కప్పుపై
  టప టప టప టప్పు టప టప టప
  చినుకు చినుకు పడగ కునుకేమొ రాదాయె
  తడిసి తడిసి, చలికి తరుణి వణికె !!!

  రిప్లయితొలగించు
 6. అవని రాలి చినుకు లాకుపై టపటపా
  పువ్వుపైటపటప గువ్వపైట
  పటప కుర్రజంటపై వారి కోర్కెపై
  టపటపటప టప్ప టపటపటప

  రిప్లయితొలగించు
 7. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ అనే ‘టైంమెషిన్’లో నన్ను నా బాల్యానికి తీసుకువెళ్ళి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే‘ అందులో తడిపి నాలో ‘ఆత్మబలం’ పెంచారు. మీ పద్యంతో ఎన్నో మధురస్మృతులు నన్ను పలకరించాయి. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  శ్రేష్ఠమైన పూరణ మీది. అభినందనలు.
  ‘పొటుకుపెట్టు’... చక్కని పదప్రయోగం.
  *
  మందాకిని గారూ,
  సంగీతమాధుర్యాన్ని చవిచూపిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  వివిధశబ్దవిన్యాసాలను చేసే దీపావళి టపాకాయల్లో ‘టపటపటప’మనే మతాబులూ ఉన్నాయి. అద్భుతమైన పూరణ. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  ఒక మనోహర శబ్దచిత్రాన్ని కళ్లముందు ఆవిష్కరించారు. చాలా బాగుంది. అభినందనలు.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  కుర్రజంట కోరికలపై టపటపలా? చక్కని పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించు
 9. వేగు చుంటి చెలియ విరహాగ్నినన్,దగు
  నార్ప ననగ- రెప్ప లార్పె లలన
  "టపటపటప టప్ప టపటపటప"మని
  ఔననగనొ? కాదొ? అరయ నైతి.

  రిప్లయితొలగించు
 10. మొగుడు జుట్టి పట్టి మోదగానింటిలో-
  టపటపటప టప్ప టపటపటప
  పంతులమ్మ బడిన బాదెబాలలనిట్లు
  ఠపఠపఠప ఠప్ప ఠపఠపఠప

  రిప్లయితొలగించు
 11. మందాకిని గారూ
  "వాన వచ్చెనమ్మ వరదల్లు వచ్చెను" మీ పూరణ బాగుంది.

  రిప్లయితొలగించు
 12. అజ్ఞాత గారూ,
  అత్యద్భుతమైన పూరణలు మీవి. మొదటి పూరణలోని మీ భావన మనోహరంగా ఉంది. రెండవపూరణలో ఛలోక్తి అలరించింది. అభినందనలు.
  *
  లక్కరాజు వారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 13. శంకరార్యా ! ధన్యవాదములు.
  సమస్య పూరణలను టప టప టపా పూరించిన కవి మిత్రు లందరకు అభినందనలు.

  రిప్లయితొలగించు
 14. డప్పుగొట్టి సాగె లంచా వతారము
  దాని బట్టె యన్న తగిన రీతి (అన్నా హజారే)
  రక్తి గట్ట రాలు రాజకీయ లటులు
  టప టప టప టప్ప టప టప టప!

  రిప్లయితొలగించు
 15. అజ్ఞాత చెప్పిన పద్యాలు రెండూ బ్రహ్మాండంగా ఉన్నాయి. సమస్యకు వన్నె తెచ్చాయి.

  రిప్లయితొలగించు
 16. గోలుమాలులన్ని కోర్టు దృష్టికి వచ్చె
  అంతు తేల్చుమనుచు ఆనతిచ్చె
  నేల రాలు నింక నేల నేలిన వారు
  టప టప టప టప్ప టప టప టప

  రిప్లయితొలగించు
 17. గురువు గారూ,
  రావు గారూ,
  ధన్యవాదములు.
  వైవిధ్యము ప్రదర్శిస్తూ పూరించిన మిత్రులందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించు
 18. చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  చదువరి గారూ,
  మీ పూరణ ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 19. టీము ఇండియాది !క్రీము చూడుం డిద్ది !
  ఇంగలండు కేగె! నింటి బెంగ
  కుంగ దీసె నేమొ ! కూలెను విక్కెట్లు !
  టప టప టప టప్ప టప టప టప

  రిప్లయితొలగించు
 20. "కోట్లు వచ్చెనెటుల?"కోర్టు తెలుపుమన
  "కాలమిదియె మనకు కలసి రాదు
  కక్షఁ గట్టిరనుచు కార్చె కన్నీటిని
  టప టప టప టప్ప టప టప టప"

  రిప్లయితొలగించు
 21. శ్రీపతిశాస్త్రిబుధవారం, ఆగస్టు 10, 2011 11:17:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  కపులు గొన్ని జేరి కాసిన వృక్షాల
  నెక్కి యూపుచుండ నేల రాలె
  పండు గాయలెన్నొ పడిన శబ్ధంబులే
  టప టప టప టప్ప టప టప టప

  రిప్లయితొలగించు
 22. ఈ సమస్య పాదాన్ని చూడగానే - నేను ఆటవెలది అని గుర్తుపట్టలేక పోయిన సంగతిని పద్యం లో పెట్టటానికి - ప్రయత్నిస్తూ -


  గుర్తుఁబట్టనైతి గురినిల్పి చూసినా
  నడక జూడదోచె నవ్యముగను
  నయము!నాటవెలది!నడచెనంతిమమున- [ లేక నడచెకడకునిట్లు: ]
  టప టప టప టప్ప టప టప టప.

  [శ్లేష తోపకుండు గాక!]

  రిప్లయితొలగించు
 23. శ్రీపతిశాస్త్రిబుధవారం, ఆగస్టు 10, 2011 11:25:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  వేరుశనగ దెచ్చి వేయించునప్పుడు
  వేడి హెచ్చుగాగ వేగమంది
  విచ్చుకొనెడి వేళ వచ్చు శభ్దంబులే
  టప టప టప టప్ప టప టప టప"

  రిప్లయితొలగించు
 24. శ్రీపతిశాస్త్రిగురువారం, ఆగస్టు 11, 2011 12:24:00 AM

  అజ్ఞాత, చదువరి యిరువురికి అభినందనలు. మీరు అజ్ఞాతవాసం వీడి {క}వనవాసం ఎప్పుడు చేస్తారు?

  రిప్లయితొలగించు
 25. కవి మిత్రులు చంద్ర శేఖర్,చదువరి, మిస్సన్న,శ్రీపతి, జీ యస్ యన్, వూక దంపుడు గార్ల పూరణలు వైవిధ్య భరితముగా వున్నవి. అందరకూ అభినందనలు.

  రిప్లయితొలగించు
 26. మిస్సన్న గారూ,
  వికెట్లను ‘టపటప’ రాల్చిన మీ పూరణ కడుంగడు మెచ్చదగింది. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  సమయోచితమైన పూరణ. అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  కాళిదాసు పూరణకు అనువాదంలాంటి మీ పూరణ చాలా బాగుంది.
  వేరుశనగ వేయించి నోరూరించారు. అందులో కలుపుకు తినడానికి మీ పద్యమే బెల్లం. ‘మధుర’మైన పూరణ.
  అభినందనలు.
  *
  ఊకదంపుడు గారూ
  మీ ఆటవెలది నడవడమే కాదు .. నయనానందంగా నాట్యం చేస్తున్నది. బాగుంది పూరణ. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారి లోటు కనిపిస్తోంది.

  రిప్లయితొలగించు
 27. పూరణలు వై విధ్యంగా ఉండి ఆనందాన్ని కలిగించాయి కవుందరికి అభినందనలు.

  రిప్లయితొలగించు
 28. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  సినిమా హాల్లో విశ్రాంతి సమయంలో ముందు కమ్మని వాసన దరి జేరుతుంది !
  దగ్గరకెళ్ళి చూస్తే తెల్లని పేలాలు టప టప మంటూ పేలుతూ గిన్నెలో నుండి
  వర్షపు చినుకుల్లా రాలుతుంటాయి ! నోరూరుతుంది ! ఏంజేస్తాం ? తప్పదు మరి !


  01)
  ___________________________________

  విమల కాంతి తోడ - పేలుచున్న వపుడు
  టప టప టప టప్ప - టప టప టప !
  విశ్రమించు వేళ - పేలాలు గొని దిన
  కొట్టు వాని నెవరు - కోరుకొనరు ?
  ___________________________________

  రిప్లయితొలగించు
 29. వసంత కిశోర్ గారూ,
  పేలాలూ టపటప మంటాయి కదా! నాకు ఆ ఆలోచనే రాలేదు. మీ ఊహాశక్తికి జోహార్లు. మీకు ‘టపటపా’ చప్పట్లు!

  రిప్లయితొలగించు