10, ఆగస్టు 2011, బుధవారం

సమస్యా పూరణం -421 (సాయీ రూపమ్ము మనకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్.

31 కామెంట్‌లు:

  1. ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు ;

    తోయముల గాలి యందుట
    ఆయతముగ నగ్ని నందు నాకసముననున్
    ఈ యవని శోభ నుండెడి
    సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్ !

    సాయి = స్వామి

    రిప్లయితొలగించండి
  2. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    వేగంగా స్పందించినందుకు సంతోషం. పూరణ బాగుంది. అభినందనలు.
    అయితే అందరికంటే ముందుండాలనే ఆత్రం వల్ల టైపాట్లు, చిన్న లోపాలు ... నా సవరణ ...
    ‘తోయముల గాలి యందు(న)
    (నా)యతముగ నగ్ని (యం)దు (నాకాశములో)
    (నీ) యవని .....

    రిప్లయితొలగించండి
  3. గురువు గారూ ధన్యవాదములు. అవి లోపాలే ! ఈ వయస్సులో అందఱి కంటే ముందుండాలని కాదు, భోజనానికి మా ఆవిడ తొందర పెడుతుండడము వలనే !

    రిప్లయితొలగించండి
  4. ఓయీ ! మార్చుము ! పూజలు
    చేయకు పగిలిన బొమ్మకు ; చెప్పితి వినుమా !
    తీయక నే జేసినచో
    సాయీ రూపమ్ము, మనకు సంకటము లిడున్ !

    రిప్లయితొలగించండి
  5. మాయా మేయ జగత్తున
    సాయీ నుడివిన పలుకులె సర్వులకెల్లన్
    శ్రేయో దాయకముగద,క
    సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్!!!

    రిప్లయితొలగించండి
  6. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, ఆగస్టు 10, 2011 11:00:00 AM

    మాయారూపధరుండై,
    వేయగు దుష్కర్మములను వేడ్కగ జేయన్,
    పోయితి నరకము, ఓ మన
    సా, యీ రూపమ్ము మనకు సంకటములిడున్.

    మాయారూపధరుండై = మాయ వలన నరరూపధారినై అనే అర్థములో..........

    రిప్లయితొలగించండి
  7. తీయని ఆహారమ్ములు
    మాయని అనురాగములును మాయలు; జగమున్
    రోయక యుంటివి. నా మన
    సా, యీ రూపమ్ము మనకు సంకటములిడున్.

    రిప్లయితొలగించండి
  8. ఆ యచ్చర లనుట వినుడు!
    ప్రేయసులను గొంతు గోసి ప్రేమింతు రిటన్
    మాయురె!యిది మేదిని!తెలు
    సా! యీ రూపమ్ము మనకు సంకటములిడున్

    రిప్లయితొలగించండి
  9. పాయని దయకు నిధానము,
    హాయికి కడ లేనిచోటు, నమృత మయము,రా
    మా!యన - కృష్ణా!యన మన
    సాయీ రూప(మ్మె)మ్ము- మనకు సంకటము లిడున్?

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    ‘కసాయి’మీది మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ‘మనసా! యీ రూపము ...’ సమస్యను సిద్ధం చేస్తున్నప్పుడు నేను పూరించాలనుకున్నది. మీరు పట్టేసారు, అద్భుతమైన పూరణ. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీరూ శాస్త్రి గారి బాట పట్టి చక్కని పూరణ నిచ్చారు. చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ రెండు పూరణలలో మొదటిది శ్రేష్ఠంగా ఉంది. రెండవ పూరణలో పద్యం, భావం బాగున్నాయి. కాని చివర ప్రశ్నార్థకం పెట్టి తప్పించుకుంటారా? మంచిది. అది మీ చమత్కారం అనుకుంటాను. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    కిశోర్ జీ ! తరగతులకు డుమ్మా కొడుతున్నారు. కారణం .....

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందరి పూరణలు మనోజ్ఞంగా భాసిస్తున్నాయి.

    హనుమంతుడు సముద్రం దాటే సమయంలో సురస అనే నాగమాతను ఎదుర్కొంటాడు. ఆ సందర్భంలో తోటి నాగులు సురసను వారిస్తూ అన్నట్లుగా నా ఊహ:

    హాయిగ లీలగ దాటెడి
    నాయాసము మాట లేక నంబుధి నతడే
    వాయు సుతుడట! చనకు! సుర-
    సా! యీ రూపమ్ము మనకు సంకటము లిడున్.

    రిప్లయితొలగించండి
  13. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, ఆగస్టు 10, 2011 9:44:00 PM

    ధన్యవాదములు గురువు గారూ,

    అంతా మీ ఆశీర్వాద ఫలమే కదా.

    రిప్లయితొలగించండి
  14. సరదాకు మరొకటి:

    వేయగ జిహ్వకు వేడిగ
    చేయును మైమరపు! కాని సిడిముడి చేయున్
    మేయగ ప్రతి దినము ' సమో-
    సా ' యీ రూపమ్ము మనకు సంకటము లిడున్ !

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతిశాస్త్రిబుధవారం, ఆగస్టు 10, 2011 11:34:00 PM

    మిస్సన్నగారూ అద్భుతమైనపూరణ. అభినందనలు

    రిప్లయితొలగించండి
  16. శ్రుతి పేయము మీ పద్యము
    మతి మంతులు సంపతయ్య మందాకినులన్
    శ్రుతి వాక్యము వలె జెప్పిరి
    ప్రతిభాయుతులైన మిమ్ము ప్రస్తుతి జేతున్

    రిప్లయితొలగించండి
  17. శ్రీపతిశాస్త్రిగురువారం, ఆగస్టు 11, 2011 12:06:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    {ఒక గోమాత స్వగతం}

    రాయిగ మారిన మనిషి క
    సాయీ రూపమ్ము మనకు సంకటములిడున్
    రేయింప్రొద్దుల నాతడు
    జేయించును దయను వీడి జీవుల బలులున్

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతిశాస్త్రిగురువారం, ఆగస్టు 11, 2011 12:53:00 AM

    హనుమచ్చాస్త్రిగారు మన్నించప్రార్థన. 2వ పాదం 3వ గణము జగణం గాని లేక నల గణం గాని ఉండాలికద. మీపద్యంలో *పగిలిన బొమ్మకు* బదులు *పగిలినది బొమ్మ* అని వ్రాస్తె సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ పతి శాస్త్రి గారూ ! మీరు చెప్పే వరకు గమనించలేదు సుమా ! ధన్యవాదములు.
    సవరణతో ...

    ఓయీ ! మార్చుము ! పూజలు
    చేయకు పగిలిన ప్రతిమకు ; చెప్పితి వినుమా !
    తీయక నే జేసినచో
    సాయీ రూపమ్ము, మనకు సంకటము లిడున్ !

    రిప్లయితొలగించండి
  20. మిస్సన్న గారూ,
    మీరు సీరియస్ గా చెప్పినా , సరదాకు చెప్పినా రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ సహృదయతకు ధన్యవాదాలు.
    ‘... మీ పద్యము
    లతి విజ్ఞులు సంపతయ్య మందాకినులున్’ అంటే ఎలా ఉంటుంది. మీరు పద్యము అని ఏకవచనం ప్రయోగించారు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ గోమాత స్వగతం బహుబాగున్నది. అభినందనలు.
    ‘గణదోషాన్ని’ గుర్తించి హెచ్చరించినందుకు ధన్యవాదాలు. నేనూ గమనించలేదు.

    రిప్లయితొలగించండి
  21. గోడమీది బిపాసాబసు చిత్రపటం చూస్తూ వెళితే యాక్సిడెంట్లే:

    01)
    ___________________________________

    మాయా వలువలు; మించిన
    హేయపు భంగిమల నిలచి - హృదయము లోనన్
    గాయము జేయు గద ,బిపా
    సా ! యీ రూపమ్ము, మనకు సంకటము లిడున్ !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  22. వసంత కిశోర్ గారూ,
    బిపాసా రూపంతో మీ పూరణ అదిరింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. మిత్రులందరి పూరణలూ ముచ్చటగానున్నవి !

    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  24. నాయకులకు మ్రొక్కుచు నిల
    మాయల మారులను గొలిచి మా కులనేతౌ
    నాయుడె సాయీ యనగనె
    సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్

    రిప్లయితొలగించండి
  25. ద్వారక శంకరాచార్య రోదన:


    తోయజ లోచన! వినుమా!
    సోయగమే లేనివాడు సోమరి పోతే!
    సాయీబే వీడయయో!
    సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్


    https://www.google.co.in/amp/s/www.indiatoday.in/amp/india/story/sai-babas-worship-causing-maharashtra-drought-says-shankaracharya-317347-2016-04-11

    రిప్లయితొలగించండి


  26. సాయము చేయ మనసునకు
    కాయము విభుని కొరకై ప్రకాశము గాంచున్
    ఛాయ,మలినములతో మన
    సా! యీ రూపమ్ము మనకు సంకటము లిడున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి