9, ఆగస్టు 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 122

శ్లో.
కేశవం పతితం దృష్ట్వా
ద్రోణో హర్ష ముపాగతః |
రుదంతి కౌరవా స్సర్వే
హా కేశవ! కథం గతః ||

పడిపోయిన కేశవుణ్ణి చూచి ద్రోణుడు సంతోషించాడు. కౌరవులంతా "అయ్యో, కేశవా! ఎలా పోయావు?" అంటూ ఏడ్చారు.
కృష్ణుడు పడిపోవడం, అందుకు ద్రోణుడు సంతోషించగా కౌరవులు దుఃఖించడం విపరీతంగా ఉంది కదా! ఇప్పుడు అసలైన అర్థాన్ని చూద్దాం ...

కే = నీటిలో, పతితం = పడిపోయిన, శవం = మృతకళేబరాన్ని, దృష్ట్వా = చూచి, ద్రోణః = మాలకాకి (ఒక జలపక్షి), హర్షం = సంతోషాన్ని, ఉపాగతః = పొందింది. కౌరవాః = నక్కలు, సర్వే = అన్నీ, శవ = ఓ పీనుగా!, కే = నీటిలో, కథం = ఎలా, గతః = పడిపోయావు?, (అని), రుదంతి = ఏడ్చాయి.
భావం - నీటిలో పడ్డ శవాన్ని చూచి మాలకాకులు తమకు ఆహారం దొరికిందని సంతోషించాయి. నక్కలేమో తమ ఆహారం నీళ్లలో పడి తమకు దక్కకుండా పోయిందని ఏడ్చాయి.
( శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
కేశవుఁడు సచ్చెఁ గౌరవుల్ ఖిన్నులైరి.
(ఇక్కడ ‘నీటిలో పడ్డ శవం, నక్కలు’ అనే అర్థాలను తీసికొనలేము)

19 కామెంట్‌లు:

  1. ప్రతిన బూనిన విజయుని బాగు తెలిసి
    సంగ రమునందు జంపగా సైంధవుని శి
    రస్సు ద్రెంపెడు మార్గమ్ము రయము జెప్ప
    కేశవుఁడు ; సచ్చెఁ, గౌరవుల్ ఖిన్నులైరి.

    రిప్లయితొలగించండి
  2. శ్రీహరికి జరాసంధు డజేయు డగుట
    భీము గొంపోయె నాతని పీచ మణచ
    నేగతిని జావ కున్నను సైగ జేసె
    కేశవుడు - సచ్చె - గౌరవుల్ ఖిన్నులైరి

    రిప్లయితొలగించండి
  3. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, ఆగస్టు 09, 2011 6:09:00 PM

    భూనభోంతరములనెల్ల బ్రోచునెవరు?
    కడకు రణమున సైంధవు గతియదేమి?
    భీష్మ కురుసింహపతనమ్ము పిదప జూడ,
    కేశవుడు, సచ్చె, గౌరవుల్ ఖిన్నులైరి.

    రిప్లయితొలగించండి
  4. కేశవుడు శివుడయె, నెఱింగి తెలుపు శివు
    డెవరు? పుట్టిన మానవుఁ డేమి యయ్యె?
    పాప ఫలితమేమయ్యెను భారతమున?
    కేశవుడు; సచ్చె; గౌరవుల్ ఖిన్నులైరి.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీరు గోలి వారి బాటే పట్టారు. పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ప్రశ్నోత్తరరూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవపాదంకూడా ప్రశ్నరూపంలో ఉంటే ఇంకా బాగుండేది.
    *
    మందాకిని గారూ,
    అమ్మో! మీ తెలివికి జోహార్లు! సమాధానం ముందే చెప్పి, ప్రశ్న వేసి అదే సమాధానం రాబట్టారు. భేష్! బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నిండు పేరోలగంబున నింద లేయ,
    నూఱు తప్పుల వరకుతానూఱుకోని,
    చక్ర మునువేసె శిశుపాలు వక్ర మణచ
    కేశవుడు,సచ్చె,గౌరవుల్ ఖిన్ను లైరి !!!

    రిప్లయితొలగించండి
  7. అర్జునకు సారధిగ మారి అదను చూసి
    ద్రోణ భీష్ముల నిర్జింప తోవ జూపె
    కేశవుఁడు, సచ్చెఁ గౌరవుల్, ఖిన్నులైరి
    వినుచు ధృతరాష్ట్ర దంపతుల్ విదురు మాట.

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, ఆగస్టు 09, 2011 10:36:00 PM

    హరి గారు.........

    మీ పద్యం చాలా బాగుందండి. అద్భుతమైన పూరణ. సరియైన పాద విరుపులు.

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, ఆగస్టు 09, 2011 10:39:00 PM

    ధన్యవాదములు గురువు గారూ. ప్రతియొక్కరి పూరణకు బదులందిస్తూ మీరు మాకిస్తున్న ప్రేరణకు, ఉత్సాహానికి వెల కట్టలేమండి. ఇది కేవలం మా పూర్వజన్మ సుకృతం.

    రిప్లయితొలగించండి
  10. ముసలము జనించె ముని శాపము వలన, యదు
    కులము నాశనమొందెను కలహమందు
    బొటన వ్రేలికి తగిలెను బోయ తూపు
    కేశవుఁడు సచ్చెఁ గౌరవుల్ ఖిన్నులైరి!!

    (కౌరవుల్ = కురు వంశమున జనించిన వారు)

    రిప్లయితొలగించండి
  11. హరి గారూ,
    మంచి భావంతో పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.
    అయితే ‘సచ్చెఁ గౌరవుల్..’? సచ్చిరి కౌరవుల్ .. కదా ..
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    అత్యుత్తమమైన పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారూ, ధన్యవాదములు.
    అంతా మీ లాంటి పెద్దల ఆశీర్వాదం.

    రిప్లయితొలగించండి
  13. గురువు గారూ నమస్కారం నా పూరణ మీరు గమనించనట్లుంది

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. మంద పీతాంబర్ గారూ,
    మీ సమస్యను చూసాను. ‘వక్ర మణచ’ ప్రయోగం గురించి అడగాలనీ అనుకున్నాను. ఎందువల్లనో వ్యాఖ్యానించడం మరిచిపోయాను. క్షంతవ్యుణ్ణి!
    ఇక మీ పూరణలో మంచి విషయాన్ని ప్రస్తావించారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. అవును శంకరయ్య గారు. హరి, శ్రీకాంతాచారి - ఈ ఇద్దరూ ఒక్కరే! :)

    రిప్లయితొలగించండి
  17. నిర్జించు,చంపగ అనే అర్థంలో "వక్ర మణచ" యతిప్రాస కోసం వాడాను సరియైన పదం కాదనుకొంటే "సంహరింప "అని వాడదాము.అలాగె రెండవ పాదంలో "నూఱు/నూరు" , "నూఱుకోని/నూరుకోని" లలో ఏ పదం సరియైనదోతెలుపగలరు.

    రిప్లయితొలగించండి