3, ఆగస్టు 2011, బుధవారం

సమస్యా పూరణం -414 (ప్రాస యతులు లేక)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ప్రాస యతులు లేక పద్య మలరె.
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

48 కామెంట్‌లు:

 1. అలతి యలతి మాట లందలి భావమున్
  తేట పఱచు చుండ తెల్లముగను
  చదువు వారి మదిని చవులూర దుష్కర
  ప్రాస యతులు లేక పద్య మలరె.

  రిప్లయితొలగించు
 2. సాంబ శివుని పైన శాంభవీసుతుపైన
  లచ్చి పైన ప్రేమ పిచ్చి పైన
  పచ్చచేలలోన పడతులు పాడంగ
  ప్రాసయతులు లేక పద్య మలరె !!!

  రిప్లయితొలగించు
 3. పనసతొనల వలెను పదములు యిమడంగ
  పాలు తేనె లొలుక పంచదార
  పళ్ళరసము పోయు పాయసపు చవిని
  ప్రాస యతులు లేని పద్య మలరె !

  రిప్లయితొలగించు
 4. చంద్రశేఖర్:
  పంటి క్రింద రాళ్ల వలె ప్రాసయతులగు
  బడును కొందరకును పట్టి జూడ
  ప్రాసయతులులేక పద్యమ లరెనంచు
  సంతసించు వారి సరణి వేరు!

  రిప్లయితొలగించు
 5. మిస్సన్న గారూ,పీతాంబర్ గారూ మీ పద్యములు కడు సుందరంగా ఉన్నాయి.

  రిప్లయితొలగించు
 6. చంద్రశేఖర్ మిత్రులు యింతలో మరో సుందరమైన పద్యము చెప్పారు !

  రిప్లయితొలగించు
 7. మూర్తి మిత్రమా ధన్యవాదాలు. నాకైతే మంద వారు మంచి మార్కులు కొట్టేసి నట్లుగా అనిపిస్తోంది.

  రిప్లయితొలగించు
 8. మూర్తిగారూ, మా తాత గారి లాగా నేను కూడా కొంత ఛాందస వాదినేమో! ప్రాస యతులు పద్యానికి రెండు కాళ్ళు, కళ్ళు అని నమ్ముతాను. అవే చక్కని నడక సాగటానికి సహకరిస్తాయి. స్వగతం....

  రిప్లయితొలగించు
 9. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, ఆగస్టు 03, 2011 10:12:00 AM

  బ్రహ్మవిద్య కోరి పాఠశాలకు బోయి,
  భక్తి తోడ నాదు శక్తి మీర,
  శారదాంబనెంచ సంస్కృత భాషలో,
  ప్రాస యతులు లేక, పద్య మలరె.

  రిప్లయితొలగించు
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _________________________________

  అందమైన నొక్క - కందపద్యంబును
  తనివి తీర వ్రాస్తి - తప్పు లేక !
  మిత్రులందరపుడు - మెచ్చుకొనిరి నన్ను
  ప్రాస యతులు లేక - పద్య మలరె !
  _________________________________

  రిప్లయితొలగించు
 11. ప్రాస యతులు వీడి పద్యంబు వ్రాయుడు.
  అనుచు నొకడు పలుక యద్భుతముగ
  యతులు గూర్చి, ప్రాస యతులను వీడితి
  ప్రాస యతులు లేక పద్య మలరె.

  రిప్లయితొలగించు
 12. కవి పండితులందరికీ నమస్సులు.
  నిన్నను పూరణార్థం ఇచ్చిన సమస్యకు మూలము సంస్కృతమున
  ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’
  అనునది.
  పూరించే అభిలాష గలవారు సంస్కృరంలో కూడా పూరించినట్లైతే పైన చేసిన పూరణలలో కొందరు చెప్పినట్లు ప్రాస యతులు లేని పద్యం గా మనం అన్వయించుకో వచ్చును.

  మీరంతా నిరంతరాయంగా ఆసక్తితో అద్భుతమైన ప్రయత్నం చేస్తూ వ్రాస్తున్న పూరణలు పాఠక లోకానికి ఆనందం కలిగిస్తున్నాయి.
  ఈ సమస్యా పూరణ ప్రోత్సహిస్తున్న శ్రీమాన్ శంకరయ్య గారికి, సహృదయులయిన మీకందరికీ నా హృదయ పూర్వక అభినందనలు.

  రిప్లయితొలగించు
 13. సభల యందు నెటుల చదువుదు, పద్యము
  ప్రాస యతులు లేక? పద్య మలరె,
  అచ్చ తెనుగు నందు నతులిత సుందర
  ఛంద రీతి శోభ సహిత మగుచు.

  రిప్లయితొలగించు
 14. శంకరాభరణము శారదాభరణమై
  కవులు పండితులకు కలలు పండ
  సరస భాషణముల సంక్లిష్ట దుష్కర
  ప్రాస , యతులు లేక "పద్య" మలరె


  మాకు మామ యగుట మర్యాదలకు బూని
  విడెము నిచ్చి మనుప విందు గుడిచి
  నాదు పూరణమ్ము నరయ రైతిరి నిన్న
  కంది శంకరయ్య గారు ! కనుడు !

  --- వెంకట రాజారావు . లక్కాకుల

  రిప్లయితొలగించు
 15. "గౌరీముఖం చుంబతి వాసుదేవః" - ఈ శ్లోకం ఛందస్సు ను వివరించగలరు.

  రిప్లయితొలగించు
 16. శ్రీపతి శాస్త్రి గారి పూరణ ...

  భావగర్భితముగ భాషను సమకూర్చ
  అతికినట్లు గుదిరి యతి గణములు
  తేటతేట తెనుగు తేటగీతిగ నిలచె
  ప్రాసయతులు లేక పద్యమలరె

  రిప్లయితొలగించు
 17. గురువు గారికి నమస్కారములు
  ప్రాసయతులనుచును పద్యము వ్రాయక,
  పామరులు బఠించె పద్యములను
  వ్రాసి రావు గారు వాసికెక్కగ నేడు
  ప్రాసయతులు లేక పద్యమలరె|
  రావు గారు= "శ్రీ శ్రీ "వారు

  రిప్లయితొలగించు
 18. రవి గారూ,
  అది 11వ త్రిష్టుప్ ఛందంలోని ‘ఇంద్రవ్రజ’ అనే వృత్తం. దీని గణాలు ‘త-త-జ-గగ(గా)’లు. తెలుగులో యతిస్థానం 8. ప్రాసనియమం ఉంది.

  రిప్లయితొలగించు
 19. మిస్సన్న గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు.
  దుష్కరప్రాస లున్నాయి. మరి దుష్కర యతులు ...?
  *
  మంద పీతాంబర్ గారూ,
  అందమైన పూరణ. పల్లెపడుచుల పాటలాగా అలరించింది. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘పదములు + ఇముడగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పదములె యిముడగ’ అంటే సరి!
  *
  చంద్రశేఖర్ గారూ,
  ప్రాసయతుల ప్రాధాన్యాన్ని గుర్తించిన మీ పూరణ ప్రశంసనీయం. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  ఛందశ్శాస్త్రంతో పరిచయం లేనివారు పద్యం ఎలా ఉన్నా మెచ్చుకుంటారు. మంచి పూరణ. అభినందనలు.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  ప్రాసయతి నియమంలేని వృత్తాలను వ్రాసానంటారు. నేను పూరించాలనుకున్న భావాన్ని మీరు చెప్పారు. ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహంవల్లనే ‘శంకరాభరణం’ ముందుకు సాగుతున్నది.
  *
  మందాకిని గారూ,
  మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.‘ఛందః + రీతులు = ఛందోరీతులు’ అవుతుంది. అక్కడ ‘ఛందములను’ అంటే సరి!
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  అద్భుతమైన పద్యాలు చెప్పారు. ధన్యవాదాలు.
  చెలులతో మీరు పంపిన ‘కారాకిళ్ళీ’ వేసుకొని మీకు ధన్యవాదాలు కూడా చెప్పాను. చూడలేదా?
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
  కాని తేటగీతిలో ‘ప్రాసయతి’ నియమం ఉంది కదా!
  *
  వరప్రసాద్ గారూ,
  శ్రీశ్రీ గారు ప్రాసయతులను వీడి వ్రాసిన పద్యాలు నా దృష్టికైతే రాలేదు (వచనకవితల విషయం వదలివేయండి. అవి పద్యాలు కావు కదా!).
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పామరులు పఠించె’ అన్నచోట ‘పఠించు’ అంటే బాగుంటుంది.

  రిప్లయితొలగించు
 20. శంకరయ్యగారూ!

  నేను ప్రస్తావించింది నిన్నటి సమస్య "గౌరి ముఖ
  మును...." పూరణ లో నండీ !

  రిప్లయితొలగించు
 21. గురువుగారూ,
  ధన్యవాదములు. నేనూ సందేహంగానే వ్రాశాను. సందేహం తీరాలన్నా వ్రాసి మీ సూచనలు పొందటమే దారి కదా!
  ఛందములనుఁ = ఛందములందు అని మీ ఉద్దేశ్యమా? ఛందమందు అంటే కూడా ఒప్పౌతుందా?

  రిప్లయితొలగించు
 22. శంకరార్యా ! ధన్యవాదములు !
  అయ్యో ! నాభావం అది కాదు !
  నా భావం ఏమిటంటే -
  "నేనొక కందపద్యం చందో బద్దంగానే వ్రాశాను !
  మిత్రులు మెచ్చుకున్నారు ! ప్రాసయతులు లేకుండా పద్యం బావుంది " యని !
  ( అంటే ప్రాస - యతి తదితరాలు అన్నీ ఉన్నవి గాని ప్రాసయతులు లేవని - అవి కందపద్యంలో నిషిద్ధం గదా )

  రిప్లయితొలగించు
 23. శంకరార్యా !
  మిత్రులు శ్రీపతిశాస్త్రిగారు కూడా అదే భావంతో పూరించారనుకుంటున్నా !
  "నిషిద్ధం కాకపోయినప్పటికీ ప్రాసయతులు వాడకుండా - యతి ప్రాసలను వాడి తేటగీతి వ్రాశాను "
  అని వారి భావమని నా యూహ !

  రిప్లయితొలగించు
 24. వసంత కిశోర్ గారూ,
  నేను ద్వంద్వసమాసం అనుకున్నాను. మీరు కర్మధారయం చేసారు. ఇప్పుడు మీ భావాన్ని అర్థం చేసుకున్నాను. బాగుంది.
  శ్రీపతి గారి భావాన్నీ నేను సరిగా అర్థం చేసుకోలేదనే అనుకుంటున్నాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 25. మందాకిని గారూ,
  వివిధఛందములందు అని నా భావం.

  రిప్లయితొలగించు
 26. గురువు గారూ, అర్థమయింది.
  మీరు చెప్పిన "ఛందములను" బాగుంది.
  (తెనుగునందు, ఛందమందు అంటే బాగుండదు కూడా.)

  రిప్లయితొలగించు
 27. సభల యందు నెటుల చదువుదు, పద్యము
  ప్రాస యతులు లేక? పద్య మలరె,
  అచ్చ తెనుగు నందు నతులిత సుందర
  ఛందములను, శోభ సహిత మగుచు.

  రిప్లయితొలగించు
 28. భాష యందు బహుళ పాండిత్యమునులేక
  ప్రాస యతులు లేక- పద్యమలరె,
  సఫలమందె నాకు ననుచును మురియగ
  గురువు వలన తొలగె కొలది భ్రమలు.

  రిప్లయితొలగించు
 29. మంచిమార్కు లిచ్చిన మిస్సన్న గారికి , మూర్తి గారికి ధన్యవాదాలు.
  పనసతొనలు,పాలు , పంచదార ,పళ్ళ రసము, తేనెతో కలిపి చేసిన పాయసం వంటి పద్యానికి యింక ప్రాస యతులు అవసరమా అనిపిస్తుంది .

  రిప్లయితొలగించు
 30. గురువుగారూ మీ ప్రశ్నకు తెల్ల మొహం వేయాల్సి వస్తోంది.
  ప్రాస యతుల్లో దుష్కరాలుండా వంటారా. హత విధీ!

  రిప్లయితొలగించు
 31. గురుభ్యోన్నమః

  కస్యాః ముఖం శర్వమనోనిధానమ్?
  ప్రీత్యా త్రినేత్రస్తు కరోతి కిం తాం?
  దృష్ట్వా తు తౌ మోదమవాప్యవాన్ కః?
  గౌరీముఖం; చుమ్బతి; వాసుదేవః

  రిప్లయితొలగించు
 32. రవి గారూ,
  ధన్యవాదాలు. పై శ్లోకానికి నా అనువాదం ...

  ఎవరి ముఖమును హరుఁడు వీక్షించినాఁడు?
  ప్రీతి దాని నేమి యొనర్చెఁ ద్రినయనుండు?
  పొంచి దానిని వీక్షించి మురిసె నెవఁడు?
  గౌరి ముఖమును; చుంబించెఁ; గరివరదుఁడు.

  రిప్లయితొలగించు
 33. మిస్సన్న గారూ,
  వసంత కిశోర్ గారి విషయంలో చేసిన పొరపాటే మీ విషయంలో చేసాను. కర్మధారయాన్ని ద్వంద్వంగా అర్థం చేసికొనడం వల్ల జరిగిన పొరపాటు అది. మన్నించండి. ఏమిటో .. ఈ రోజు నా వల్ల చాలా తప్పులు జరిగిపోతున్నాయి .. (వయోభారమా?) ఏమో?

  రిప్లయితొలగించు
 34. పీతాంబరధరా! అవి అన్నీ రుచికరాలే, కానీ హై షుగర్ కంటెంట్. మీరు వాటి మహిమలో పడి ప్రాసయతులు మరచిపోగానే, మా డాక్టర్ మూర్తి మిత్రులు అప్పుడు షుగర్ కంట్రోల్ కి ఒక గట్టి ఇంజెక్షన్ ఇస్తారు. జాగ్రత, సుమా!

  రిప్లయితొలగించు
 35. మాస్టారూ, మీ వయో భారం కాదండీ, క్లాసు పిల్లకాయలు తెలివి మీరు తున్నారు, తెలివయిన కొత్త పిల్లలు చేరుతున్నారు:-) ఒక్కసారి బెత్తం ఝళిపించండి. అంతా లైన్లోకి వచ్చేస్తాం. ఇంకనించి ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాకుండా క్లోజ్డ్ బుక్ ఎగ్జామ్ పెట్టండి (సరదాకి అన్నాను). చిన్నప్పుడు మాతెలుగు మాష్టారు టెస్ట్ లన్నీ తేలికగా ఇచ్చి క్వార్ టర్లీ అదరగొట్టేవారు.

  రిప్లయితొలగించు
 36. శంకరార్యా ! ధన్యవాదములు !
  ద్వద్వం అనుకోవడం వలన కలిగిన భావనను మీరు వెలిబుచ్చారు !
  ద్వద్వం అనుకున్నప్పుడు యెవరికైనా కలిగే భావన అదే గదా !
  ఇందులో పొరపాటు గాని ,తప్పుగాని , వయో భారం గాని యేముంది ?

  అసలు "ప్రాసయతులు "అనే పదాన్ని "ప్రాస యతులు " అని రెండు
  పదాలుగా వ్రాయడం మా పొరపాటు ! మీరే మన్నించాలి !

  రిప్లయితొలగించు
 37. గురువుగారూ చంద్ర శేఖరులు, కిశోర మహోదయులు అన్నట్లు వయోభారం కాదు ఏమీ కాదు. మేము భావాన్ని సరైన పద్ధతిలో వ్యక్తం చేయకపోవడం వలన వచ్చిన ఇబ్బంది.ఇందులో మీరు విచారించ వలసిన విషయం ఏమీ లేదు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 38. గురువు గారూ ధన్యవాదములు. ప్రాస, యతి అని కాక ప్రాసయతుల భావముతోనే పూరించాను. యడాగమము అక్కడే పొంచి యుంటొంది.జాగ్రత్తగా చూడక పోతే పద్యములోకి " ఒచ్చేస్తుంది ". మీరు దిద్ది నందుకు కృతజ్ఞతలు.

  వయోభారమని మీరు,నేను మరో నలభై సంవత్సారాల తర్వాత అందాము. అంతవరకు మీరు మా పద్యాలలోని తప్పులు దిద్ద వలసిందే !

  రిప్లయితొలగించు
 39. మందాకిని గారూ,
  వసంత కిశోర్ గారూ,
  మిస్సన్న గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 40. శంకరయ్యగారూ,

  నేను ప్రకటించిన సంస్కృతశ్లోకం నా సొంతమండి. అది మూలం కాదు. చింతా వారు సంస్కృత శ్లోకం ప్రయత్నించమంటే ఈ సాహసానికి పూనుకున్నాను. అందులో యతి (విరామం) దోషాలున్నాయనుకుంటున్నాను.

  రిప్లయితొలగించు
 41. సంస్కృతం లో ఉన్న సమస్యను అద్భుతంగా పూరించిన చిరంజీవి రవికి, దానికి చక్కని అనువాదము చేసి పాఠకుల కర్థమయే విధంగా చూపిన శ్రీ శంకరయ్య గారికి అభినందనలు. అదే సమస్యకు పూర్వ కవి ఒకరు పూరించిన శ్లోకం కూడా క్రమాలంకారంలోనే సాగింది.
  చూడండి.
  కా శంభు కాన్తా ? కిము చంద్ర కాంతం ?
  కాన్తా ముఖం కిం కురతే భుజంగం
  క: శ్రీపతి: కా విషమ సమస్యా ?
  ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’

  చక్కగా ఉంది కదండీ!
  దీనికి నా అనువాదం కూడా చూడండి.

  శంభు రాణి యదెవ్వరు? శశి యదేది?
  ఏమి చేయుచు నుండె తా నామె ముఖము?
  పాము యెవరు? విషమ మేది ధీమతులకు?
  గౌరి ముఖమును చుంబించె ఘనుడు వాసు.

  రిప్లయితొలగించు
 42. రవీజీ ! అభినందనలు !
  సంస్కృతంలో కూడా చాలా పరిశ్రమ చేసినట్టున్నారు !

  రిప్లయితొలగించు
 43. వసంత్ కిషోర్ గారు, చేస్తూ ఉన్నానండి కానీ బుఱ్ఱకెక్కడం లేదు.

  రిప్లయితొలగించు
 44. "ప్రాణ సఖుడు యతులు" పద్యమ్ము వ్రాయుట
  నేర్పి నాడు నాకు నేర్పు గాను
  నేడు నొంటి వ్రాయ నింకేమి జూడగ
  "ప్రా.స. యతులు" లేక పద్యమలరె

  రిప్లయితొలగించు