20, ఆగస్టు 2011, శనివారం

సమస్యా పూరణం -431 (నీతికి చెరసాలె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
నీతికి చెరసాలె నేఁడు నేస్తం బయ్యెన్.
ఈ సమస్యను పంపిన
పింగళి శ్రీనివాస రావు గారికి
ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    దొంగలనూ దోపిడీ దారులనూ , అన్నానూ ఒకేచోట పెట్టడమంటే :
    01)
    ________________________________

    పాతకముల జేసిన యా
    సాతానుల బెట్టు చోటె - సౌమ్యుని బెట్టన్
    ఏతావాతా దేలెను
    నీతికి చెరసాలె నేఁడు - నేస్తం బయ్యెన్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  2. ప్రీతిగ మోసము జేయుచు
    మేతను మేయుచు ధనమును మేటలు వేసే
    నేతల హైటెక్కుల యవి
    నీతికి చెరసాలె నేఁడు నేస్తం బయ్యెన్ !

    రిప్లయితొలగించండి
  3. 02)
    ________________________________

    మేతలు మేసిన వారిని
    నీతికి నిలబడిన యట్టి - నేతను గూడా
    ఆ తీహారున గట్టిన
    నీతికి చెరసాలె నేఁడు - నేస్తం బయ్యెన్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  4. జాతికి మంచిని కోరుచు
    ఖ్యాతిగ అన్నా హజారె ఘన లోక్పాల్ బిల్
    నేతల నడుగగ మూసిరి.
    నీతికి చెరసాలె నేఁడు నేస్తం బయ్యెన్.

    రిప్లయితొలగించండి
  5. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, ఆగస్టు 20, 2011 9:12:00 AM

    నీతికి పాతర వేయుచు,
    పాతక భయమించుకైన భ్రమియించరు, యీ
    నేతల యక్రమముల దు
    ర్నీతికి చెఱసాలె నేడు నేస్తంబయ్యెన్.

    రిప్లయితొలగించండి
  6. నేతలు గట్టిరి గద,యవి
    నీతికి పట్టము ఘనముగ,నీతిని వారే
    పాతర బెట్టిరి లోతున
    నీతికి చెరసాలె నేడు నేస్తంబయ్యెన్!!!

    ప్రేతమువలె భూతమువలె
    భీతిని గొల్పె,యవినీతి బీగము వేసె
    న్నీతికి;పలునేతలదు
    ర్నీతికి చెరసాలె నేడు నేస్తంబయ్యెన్!!!

    రిప్లయితొలగించండి
  7. గురువు గారికి ధన్యవాదములు, నమస్కారములతో
    క: జాతిని మేల్కొల్పుటకై
    నేత నడుము గట్ట, తోడు నీడగ నడచే
    ప్రీతిగ జనులెల్లరు, అవి
    నీతికి చెఱసాలె నేడు, నేస్తంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  8. వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మీరు వ్రాసినది తప్పని కాదు కాని ‘పాతక మన నించుకైన భయ మందక యీ’ అంటే ఎలా ఉంటుది?
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    వర ప్రసాద్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘నడచే’ అనే వ్యావహారిక పదం స్థానంలో ‘నడువన్’ అందాం.

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, ఆగస్టు 20, 2011 6:37:00 PM

    ధన్యవాదములు గురువు గారూ,

    మీ సవరణ సర్వదా ఆమోదయోగ్యమే కదా.

    రిప్లయితొలగించండి
  10. వసుదేవుడు దేవకితో :

    చూతము సుదినము కొఱకై,
    చేతము మదిలోన దైవ చింతన తరుణీ !
    పాతకుడగు కంసుని దు-
    ర్నీతికి చెఱసాలె నేడు, నేస్తంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  11. నీతులు బహువచనమ్మౌ-
    పాతకుఁ పరిహారమేమి? పద్యపు రచనా
    రీతులు నాకెటుఁ దోచున్?
    నీతికి; చెరసాలె ; నేఁడు నేస్తంబయ్యెన్.

    తోచున్ - కనిపించును అనే అర్థంలో.

    రిప్లయితొలగించండి
  12. తాతలు తండ్రులు మనకై
    ఖ్యాతిని స్వాతంత్ర్యమిడిరి కానీ మనమా
    రీతిని తప్పుచు దిరుగగ
    నీతికి చెరసాలె నేడు నేస్తంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  13. విద్యాసాగర్ అందవోలుశనివారం, ఆగస్టు 20, 2011 10:47:00 PM

    మన దేశం లో అవినీతి కి వ్యతిరేకంగా ఈ మధ్య అన్నా హజారే చేస్తున్న పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన పూరణ:

    నేతలు చేసెడి యీయవి
    నీతికి నెంతయు వెరవక నెదిరించంగ
    న్నాతని పంపిరి జైలుకు
    నీతికి చెరసాలె నేడు నేస్తంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  14. శ్రీకృష్ణ జన్మస్థానమని వాడుకలో ఉంది కదా !

    భ్రాతయె చెల్లిని బావని
    చేతుల సంకెళ్ళు దొడిగి చేర్చిన ఫలమున్
    జాతము నొందిన గృష్ణుని
    నీతికి చెరసాల నేఁడు నేస్తంబయ్యెన్ !

    రిప్లయితొలగించండి
  15. అరే! మిస్సన్న గారి పూరణకు విపరీతార్ధమయింది,నాపూరణ !

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ,
    కృష్ణజన్మస్థానం విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    క్రమాలంకరంలో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    పింగళి శశిధర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    అందవోలు విద్యాసాగర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘జాతము నొందిన’ బాగానే ఉంది. కాని ‘చేర్చిన ఫలమై/ ఖ్యాతిగఁ బుట్టిన కృష్ణుని ...’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  17. గోతులు తీసెడి నేతలు
    భూతములై ప్రజల సొమ్ము బక్షిం చుటకై !
    పాతర వేయగ మంచిని
    నీతికి చెరసాలె నేడు నేస్తంబయ్యేన్ !

    రిప్లయితొలగించండి
  18. గురువు గారూ మీ సూచన చక్కగా ఉంది. ధన్యవాదములు,

    రిప్లయితొలగించండి
  19. నేదునూరి రాజేశ్వరక్కా,
    చక్కని పూరణ. అభినందనలు.
    కాకుంటే .. రెండవపాదంలో యతితప్పింది.
    ‘భూతములై ప్రజల సొమ్ము భుజియించుటకై’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  20. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఆగస్టు 21, 2011 8:03:00 AM

    శ్రీగురుభ్యోనమ:
    జాతికి ఖ్యాతినిదెచ్చిన
    నేతలకున్ దప్పలేదు,నేటికినైనన్
    మాతలరాతలు మారునె?
    నీతికి చెరసాల నేడు నేస్తంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  21. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. జాతిపిత అడుగుజాడల
    నేతల యవినీతి జాడ్య నిర్మూలనకై
    జాతికి హితమును గూర్చెడి
    నీతికి, చెరసాలె నేడు నేస్తంబయ్యెన్.

    జాతిపిత అడుగుజాడల
    జాతికి జన లోకపాలు చట్టము కొరకై
    చేతన సాధించిన ఘన
    నీతికి, చెరసాలె నేడు నేస్తంబయ్యెన్.

    రిప్లయితొలగించండి
  23. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఆగస్టు 21, 2011 9:46:00 PM

    గురువుగారూ ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  24. మూర్తి మిత్రమా! మా బండి చాలా చాలా లేటు.

    మరి గురువుగారిచ్చిన సమస్య రెండువైపులా పదునున్న క త్తి లా గుంది.

    రిప్లయితొలగించండి
  25. గోతులు త్రవ్వుచు ప్రజలకు
    పాతక మౌనని మకుటము బాలాజీకిన్
    ప్రీతిగ నిచ్చెడి బళ్ళరి
    నీతికి చెరసాలె నేఁడు నేస్తం బయ్యెన్

    రిప్లయితొలగించండి
  26. నీరవ మోడి:

    ప్రీతిని బ్యాంకుల ధనమును
    చేతులతో దోచి పారి చేరగ లండన్
    గీతాంజలి వ్యాపారపు
    నీతికి చెరసాలె నేఁడు నేస్తం బయ్యెన్

    రిప్లయితొలగించండి