మాస్టారూ, క్రింది పద్యానికీ, నాకూ, మా ఇంటావిడకి యే సంబంధమూ లేదనీ, హాయిగా నవ్వుకోమననీ మనవి చేస్తూ:-) చిన్న పంచెను గట్టుక చింత లేక పద్య రచనలు గావించు పతిని, ప్రీతిఁ పీట వేసి కూడుమనుచు పిలిచి కెలికి రాచి ఱంపాన బెట్టిన రమణి మెచ్చు!
వసంత కిశోర్ గారూ, ముచ్చటైన మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. మొదటి పూరణలో కొడుకును, కోడల్ని రాచి ఱంపాన పెడితే మెచ్చిన ‘రమణి’ ఎవరు? * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, అన్ని సీరియళ్లలో అత్తను కోడలో, కోడల్ని అత్తో వేధించడమే కదా! మంచి పూరణ. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, నిజంగానే నవ్వు వచ్చింది. అదీ రెండు సార్లు! ‘పద్యానికీ, నాకూ, మా ఇంటావిడకి యే సంబంధమూ లేదనీ’ అన్నారు. పద్యంతో మీకు సంబంధం లేదు, ఓకే! మీ ఆవిడకీ సంబంధం లేదు. డబుల్ ఓకే! కాని ‘మీకూ, మీ ఇంటావిడకూ ఏ సంబంధం లేదు’ అనే అర్థం కూడా వస్తుందే! తర్కశాస్త్రంలో దీనిని ఏ దోషం అంటారో? ‘ఈ పద్యం‘తో’ నాకూ, మా ఇంటావిడకి ఏ సంబంధం లేదు’ అంటే బాగుండేది. అందుకే మొదటిసారి నవ్వుకున్నాను. ‘పీట వేసి కూడుమనుచు’ ... కుడువుమన్నదా? కూడుమన్నదా? పీట వేసి తిను అంటుందే కాని సంభోగించుమనదు కదా! అందుకే రెండవ సారి నవ్వుకున్నాను.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ చక్కని చమత్కారంతో అలరించింది. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ స్వభావోక్తి పూరణ చాలా బాగుంది. అభినందనలు. * మందాకిని గారూ, మే రెప్పుడూ వైవిధ్యంగానే ఆలోచిస్తారు. అద్భుతమైన పూరణ. అభినందనలు.
మాస్టారూ, ధన్యవాదాలు. నా ప్రయత్నం ఫలించింది. మిమ్మల్నీ, కవిమిత్రులను నవ్వించటమే ఉద్దేశ్యం, అయినా నాకంటే పెద్దవారు, మీకు తెలియనిదేముంది, "రసపట్టులో తర్కం కూడదు" అని మాయాబజార్లో కృష్ణుడు చెప్పాడు కాబట్టి నేను విశదీకరించటం లేదు :-)
మిస్సన్న గారూ, లేటైనా నీటైన చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు. పాపం ఆ మగడు .. "పొరుగింటి పుల్లయ గొడవ ఎందుకు లేవె వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవె" అనకుండా అప్పుచేసి నగలు చీరలు తెచ్చాడు. బాగుంది.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండితానూ ఒకప్పుడు కోడలినే అన్న సంగతి అత్తలెపుడూ
మరచిపోతూ ఉంటారెందువల్లనో ?!
01)
_________________________________
అత్త హోదాను బొందిన - అతివ లెపుడు
పాత హోదాను మరచియే - వరలు చుంద్రు
కొత్త కోడళ్ళ, కొడుకును - కొమరి గలసి
రాచి ఱంపాన బెట్టిన - రమణి మెచ్చు!
_________________________________
చిన్న సవరణ తో..
రిప్లయితొలగించండిఇంటి కోడలి తోడ తా నేగ లేక
'క్రొత్త కోడలు సీర్యలు' కోరి చూచి
అందు కోడలి నెప్పుడు నత్త మిగుల
రాచి ఱంపాన బెట్టిన, రమణి మెచ్చు
కిషోర్ జీ చక్కటి పూరణ ..
కట్నం లేకుండా వచ్చిన కోడల్ని అత్తలు రాచి రంపాన పెట్టుట
రిప్లయితొలగించండిసహజమే గద !
02)
__________________________________
కొడుకు ప్రేమించి పెళ్ళాడ - కోడ లొచ్చు !
కోడలిని జూడ నత్తకు - కోపమొచ్చు !
కోరు కున్నంత కట్నంబు - కోలు పోయి
రాచి ఱంపాన బెట్టిన, - రమణి మెచ్చు!
__________________________________
శాస్త్రీజీ ! బావుంది ! కాని-"సీర్యలు"--అంటే?
రిప్లయితొలగించండిమాస్టారూ, క్రింది పద్యానికీ, నాకూ, మా ఇంటావిడకి యే సంబంధమూ లేదనీ, హాయిగా నవ్వుకోమననీ మనవి చేస్తూ:-)
రిప్లయితొలగించండిచిన్న పంచెను గట్టుక చింత లేక
పద్య రచనలు గావించు పతిని, ప్రీతిఁ
పీట వేసి కూడుమనుచు పిలిచి కెలికి
రాచి ఱంపాన బెట్టిన రమణి మెచ్చు!
కిషోర్ జీ ధన్యవాదములు. అది సీరియల్ కి వచ్చిన టైపాటు తిప్పలు ..
రిప్లయితొలగించండిచిన్న సవరణ తో..
తనదు కోడలి బాధలు తాళ లేక
'క్రొత్త కోడలు సీరియల్' కోరి చూచి
అందు కోడలి నెప్పుడు నత్త మిగుల
రాచి ఱంపాన బెట్టిన, రమణి మెచ్చు
03)
రిప్లయితొలగించండి__________________________________
పూర్వ సినిమాల యందున - పొసగ దయ్యొ
సూర్య కాంతమ్ము రేలంగి - భార్య యైన !
తనివి దీరంగ కసురుచు - తనదు పతిని
రాచి ఱంపాన బెట్టిన, - రమణి మెచ్చు!
__________________________________
అధికమగు లాంఛనములకు నాశపడుచు
రిప్లయితొలగించండికట్నకానుక విషయమై కసరుచున్న,
భర్తనాఫీసునందున బాసులెపుడు
రాచి ఱంపాన పెట్టిన, రమణి మెచ్చు.
ఆంగ్ల పాదాలతో పూరణ చేసినందులకు గురువు గారు మన్నించాలి.
SreegurubHyOnama:
రిప్లయితొలగించండిtalupu vaakiLLu vaanaku taDasipOga
sariga jEyimcagOrenu sarasa dharaku
koyyapanivaaDu sarijEya komtavaraku
raaci ~rampaana peTTina, ramaNi meccu
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండితలుపు వాకిళ్ళు వానకు తడసిపోగ
సరిగ జేయించగోరెను సరస ధరకు
కొయ్యపనివాడు సరిజేయ కొంతవరకు
రాచి ఱంపాన పెట్టిన, రమణి మెచ్చు
క్రొత్త యల్లుడు ధనమును కోరి యలిగి
రిప్లయితొలగించండిమామ గారిని, పత్నిని మరల మరల
రాచి ఱంపాన పెట్టిన రమణి మెచ్చు
కొనదు; మర్యాద తొలగును, కూర్మి చెడును.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిముచ్చటైన మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
మొదటి పూరణలో కొడుకును, కోడల్ని రాచి ఱంపాన పెడితే మెచ్చిన ‘రమణి’ ఎవరు?
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
అన్ని సీరియళ్లలో అత్తను కోడలో, కోడల్ని అత్తో వేధించడమే కదా! మంచి పూరణ. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
నిజంగానే నవ్వు వచ్చింది. అదీ రెండు సార్లు!
‘పద్యానికీ, నాకూ, మా ఇంటావిడకి యే సంబంధమూ లేదనీ’ అన్నారు. పద్యంతో మీకు సంబంధం లేదు, ఓకే! మీ ఆవిడకీ సంబంధం లేదు. డబుల్ ఓకే! కాని ‘మీకూ, మీ ఇంటావిడకూ ఏ సంబంధం లేదు’ అనే అర్థం కూడా వస్తుందే! తర్కశాస్త్రంలో దీనిని ఏ దోషం అంటారో? ‘ఈ పద్యం‘తో’ నాకూ, మా ఇంటావిడకి ఏ సంబంధం లేదు’ అంటే బాగుండేది. అందుకే మొదటిసారి నవ్వుకున్నాను.
‘పీట వేసి కూడుమనుచు’ ... కుడువుమన్నదా? కూడుమన్నదా? పీట వేసి తిను అంటుందే కాని సంభోగించుమనదు కదా! అందుకే రెండవ సారి నవ్వుకున్నాను.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చక్కని చమత్కారంతో అలరించింది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ స్వభావోక్తి పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
మే రెప్పుడూ వైవిధ్యంగానే ఆలోచిస్తారు. అద్భుతమైన పూరణ. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండికొత్త కోడలిని , కొడుకూ కూతురూ కలిసి వేధిస్తే మెచ్చిన రమణి - అత్తగారు !
గురువుగారూ, ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిరాత్రి బారుల వెంబడి రోయ కుండ
రిప్లయితొలగించండికోరి వలచిన సతికెంతొ దూరమవగ
మామ పిలిచి యొకింత మందలించి
రాచి ఱంపాన బెట్టిన రమణి మెచ్చు !
నేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. ‘రాత్రి బారుల వెంబడి రక్తిఁ దిరిగి’ అందాం!
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాస్టారూ, ధన్యవాదాలు. నా ప్రయత్నం ఫలించింది. మిమ్మల్నీ, కవిమిత్రులను నవ్వించటమే ఉద్దేశ్యం, అయినా నాకంటే పెద్దవారు, మీకు తెలియనిదేముంది, "రసపట్టులో తర్కం కూడదు" అని మాయాబజార్లో కృష్ణుడు చెప్పాడు కాబట్టి నేను విశదీకరించటం లేదు :-)
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమా బండి చాలా చాలా లేటు.
రిప్లయితొలగించండి' పొరుగు పుల్లయ్య భార్యకు బోలె డన్ని
నగలు చీరలు ! తేవోయి నాకు ' ననుచు
రాచి ఱంపాన బెట్టిన, రమణి మెచ్చు
నప్పు జేసి యైనను నీయ నామె మగడు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిలేటైనా నీటైన చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
పాపం ఆ మగడు ..
"పొరుగింటి పుల్లయ గొడవ ఎందుకు లేవె
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవె" అనకుండా అప్పుచేసి నగలు చీరలు తెచ్చాడు. బాగుంది.
ధన్యవాదాలు గురువుగారూ!
రిప్లయితొలగించండిఆపాట మదిలో మెదిలే ఆ పూరణ చేశాను.