ఇతని పేరేమిటి?
ఖాండవమ్మను పేరు గలిగినట్టిది (విపినము)వెలుఁగు నిచ్చెడునట్టి వేల్పు (సవితృడు)
జలమందు ముదమున జన్మించు పువ్వు (వనజము)
ఉచ్చైశ్శ్రవాఖ్యమై యొప్పునది (తురగము)
స్తంభమున జనించి దనుజుని చంపినది (నృసింహుడు)
దట్టమౌ వనికి ఉన్న పదం (గహనము)
వనిలోన సీతఁ బట్టిన రాక్షసుఁడు (విరాధుడు)
శిబి దేనికొఱకు నిచ్చెఁ దన తనువును? (పావురము)
విపినము - సవితృడు - వనజము - తురగము - నృసింహుడు - గహనము - విరాధుడు - పావురము.
పై పదాల రెండవ అక్షరాలను వరుసగా చదివితే తెలిసే ఆ వ్యక్తి పేరు ...
పి. వి. నరసింహ రావు.
సమాధానాలు పంపిన మిత్రులు ...
గన్నవరపు నరసింహ మూర్తి
మందాకిని
కోడీహళ్ళి మురళీ మోహన్
మిస్సన్న
లక్కాకుల వెంకట రాజారావు.
అందరికీ అభినందనలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి