ఈ తీరం
ఈ రాతిరి తీరానికి
ఈదలేని ఏకాకిని
వికటంగా నవ్వే నా
విక! నను దరి జేర్చవోయి.
ఈ తీరము నిస్సారము
హితదూరము విషపూరము
ఇది శాంతికి సంహారము
కదనకాంక్ష విస్తారము.
హితము హత మహింస జితము
నుత సహకారమ్ము క్షతము
మమత లేదు సమత రాదు
మానవతకు తావు కాదు.
వెతలతోడ పతితుడనై
చితికి సతము నిహితుడనై
యున్న నన్ను కన్నారగ
కన్నవాడ నవ్వకు మరి.
ఎటు చూచిన చిక్కని చీ
కటి రక్కసి వెక్కిరించు
చున్న వేళరా నావిక!
నన్ను పరిహసింపకు మిక! (36 సంవత్సరాల క్రితం 4-9-1975 నాడు వ్రాసిన గేయం ఇది.
ఈ రాతిరి తీరానికి
ఈదలేని ఏకాకిని
వికటంగా నవ్వే నా
విక! నను దరి జేర్చవోయి.
ఈ తీరము నిస్సారము
హితదూరము విషపూరము
ఇది శాంతికి సంహారము
కదనకాంక్ష విస్తారము.
హితము హత మహింస జితము
నుత సహకారమ్ము క్షతము
మమత లేదు సమత రాదు
మానవతకు తావు కాదు.
వెతలతోడ పతితుడనై
చితికి సతము నిహితుడనై
యున్న నన్ను కన్నారగ
కన్నవాడ నవ్వకు మరి.
ఎటు చూచిన చిక్కని చీ
కటి రక్కసి వెక్కిరించు
చున్న వేళరా నావిక!
నన్ను పరిహసింపకు మిక! (36 సంవత్సరాల క్రితం 4-9-1975 నాడు వ్రాసిన గేయం ఇది.
పాత కాగితాలు వెదుకుతుంటే దొరికింది.
చిత్రం!
ఇది వ్రాసినప్పటి నా మనఃస్థితి ఇప్పుడు పునరావృతమైంది)
ఆర్యా ! మీ కవిత చదువు తుంటే ఘంటసాల గారి బహుదూరపు బాటసారీ ..పాట మదిలో మారు మ్రోగింది.
రిప్లయితొలగించండిచక్కని కవిత ! మీరు మనోధైర్యముతో ఉండండి. భగవంతుడు మీకు మీ కుటుంబానికి మేలు చేకూరుస్తాడు.సర్వే జనాః సుఖినో భవంతు !
రిప్లయితొలగించండికవిత చాలా బాగుంది. ఎక్కడో కొందరు అదృష్ట వంతులకు మాత్రమె " జీవితం వడ్డించిన విస్తరి " చాలా మందికి పునరావృత మౌతునే ఉంటుంది. ధైర్యం గా ఎదురీది గెలవడమే మనం చేయ వలసిన పని. ఆశీర్వ దించి అక్క .
రిప్లయితొలగించండిగురువుగారూ మీ కవితను ఈమధ్యనె వ్రాశారనుకొన్నాను.
రిప్లయితొలగించండిచాలా బాగున్నవి. హార్థికాభినందనలు !మంచి పద సంపద మీకున్నది.
రిప్లయితొలగించండి--గుఱ్ఱం జనార్దన రావు.