గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యము మొదటి పాదములో గణములు సరిపోలేదు. కాస్త సవరించాలి. మిగిలిన విషయములలో పద్యము బాగుగనే యున్నది.
నిన్నటి వ్యాఖ్యలు గురించి: శ్రీ ఆదిభట్ల వారు: - నెమలి అని మనము వాడుకలో అంటాము గాని శబ్ద రత్నాకరములో నెమిలి అని ఇచ్చేడు. - నెమిలికి లింగ సంపర్కము లేదు. మీరు చెప్పినట్లు కన్నులలోనుండి వీర్యము పడుతుంది అని పెద్దలు చెప్పగా విన్నాను. అందులకే కృష్ణుడికి అంత గౌరవము నెమిలి మీద అంటారు. అలాగే మురళిమీద కూడా ఎక్కువ గౌరవము - ఎందుకంటే మరళికి కడుపులో ఏమీ యుండదు అంతా గుల్లే. ఎట్టి దుర్గుణములు లేవని భావము.
శ్యామలీయం గారి కథకు కొస మెరుపు. కృష్ణుడి గురించి అప్పుడు "అస్ఖలితపు బ్రహ్మచారి" అన్నారుట -- పరమ బ్రహ్మచారి అని కాదు. అలాగే దుర్వాస మహర్షి సదోపవాసి-- అన బడే వాడు ఎందుకంటే -- అతడు తినిన తరువాత శ్రీ కృష్ణార్పమస్తు అనే వాడుట. అది శ్రీ కృష్ణార్పితము అయ్యేదిట. స్వస్తి.
మన బ్లాగ్ సభ్యులు సాహితీ జగతి సంపద్వైభవోపేతులున్ ఘన భావాఢ్య కవిత్వ తత్త్వ నిధులున్ జ్ఞానప్రభాభాసురుల్ వనజాతాసన భామినీ చరణ సేవా తత్పరుల్ వారికిన్ మనమారన్ బొనగూర్చి దీవెనలు సంభావింతు నత్యాదృతిన్
జిలేబీ గారికి అభినందనలు. మీరు బ్లాగులో మీ భావములు తెలియజేస్తున్నందుకు సంతోషము. మీరు కూడా పద్యరచనకు బూనుకొనవలెనని మా ఆకాంక్ష. ఇది బ్రహ్మ విద్య కాదు. నిత్యము అభ్యాసము చేస్తూ ఉంటే చాలు. ముందుగా ఆటవెలదులు మరియు కంద పద్యములు మొదలు పెట్టండి. వేమన శతకము, సుమతీ శతకము, కృష్ణ శతకము చదవండి. బాగుగా చదవండి. మీకు ఆ పద్యముల నడక తెలిసిపోతుంది. ముందు అనుకరణకు పూనుకొనండి. అంటే పేరడీ అంటాము. మీరు హాయిగా పద్యములు వ్రాయగలుగుతారు. శుభం భూయాత్.
నేను విన్నదేమిటంటే మగనెమలి నల్ల మబ్బులు చూచి మురిసి పురి విప్పి నాట్యం చేస్తుందనీ, అప్పుడు ఇంద్రియాన్ని జారవిడుస్తుందనీ దాన్ని ఆడు నెమలి స్వీకరించి సంతానోత్పత్తి చేస్తుందనీ. బాహ్య సంపర్కానికి అతీతమైన దాంపత్యం నెరపడం వలన నెమలి అంటే కృష్ణునికి ప్రేమ అనీ ఆ ప్రేమకు చిహ్నంగా నెమలి కన్నును తన తలలో ఉంచుకుంటాడనీ.
జీవశాస్త్రం తెలిసిన మిత్రులెవరైనా ఉంటే ఈ విషయాన్ని(నెమళ్ళలో సంతానోత్పత్తి) ధృవీకరిస్తే బాగుంటుంది.
మిస్సన్న గారూ! నెమిలి అని నేను ఉదహరిస్తే మీరు నెమలి అనే వాడేరు. నెమిలి అనే శబ్దరత్నాకరములో ఇచ్చేడు. జీవ శాస్త్రము తెలిసిన వాళ్ళు మరికొన్ని వివరణలు ఇవ్వాలి: (1) భ్రమరము (తుమ్మెద) నకు సంతానోత్పత్తి లేదట. వేరే ఏదో కీటకము యొక్క లార్వాను తెచ్చి తన గూటిలో వేసి అక్కడే తిరుగుతూ ఉంటుందిట. అ లార్వా చూచేది తుమ్మెదనే, వినేది తుమ్మెద నాదాన్నే, స్పృశించేది తుమ్మెద యొక్క రెక్కల గాలినే. ఆ లార్వా తుమ్మెదగా మారిపోతుందిట. ఇది ధ్యానయోగానికి ఉదాహరణ. (2) అంకోలం (ఊడిగ) చెట్టు యొక్క బీజము క్రింద పడిన తరువాత కొన్నాళ్ళకు వాన పడితే ఆ బీజము ఆ నీరు తగలగానే ప్రేలి అదే చెట్టు కొమ్మపై పడి అక్కడే మొక్కగా పెరుగుతుందిట. ఇది భక్తికి సంకేతము. స్వస్తి.
ఈనాడు స్పందించిన వారందరికి అభినందనలు. వివిధ కోణాలలో పూరణలు చేసేరు.శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, శ్రీ రాజా రావు గారికి, శ్రీ సంపత్ కుమర్ శాస్త్రి గారికి, శ్రీ కమనీయం గారికి, శ్రీ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకముగా ప్రశంసలు. అందరనూ గూర్చి చెప్పేననుకొంటున్నాను. మరొక్కమారు అందరికీ ప్రశంసలు.జిలేబి గారికి ప్రత్యేకముగా వ్రాసేను.
నేమాని పండితార్యా! ధన్యవాదాలు. వ్యావహారికంలో నెమలి అని అలవాటైపోయింది. క్షమించాలి. భ్రమర కీటక న్యాయాన్ని చక్కగా వివరించేరు. అంకోలాన్ని గూర్చి చెప్పి శివానందలహరిని గుర్తు చేశారు. ' అమ్కోలం నిజబీజ సంతతి...........'
నేమాని వారికి నమస్కారం. మీరు సెలవిచ్చినది యదార్ధం. సరదాగా నేను పద్యరచనకు ప్రయత్నించినపుడు మానాన్నగారు కూడా 'బాగా అభ్యాసం చేయాలి. ఇదేమి బ్రహ్మవిద్య కాదు' అన్నారు. మరలా అవే మాటలు మీరు గుర్తు చేసారు. చాలా సంతోషం. మీరన్నట్లు వృత్తాల నటుంచి ఉపజాతి పద్యాలు తేటగీతులు ఆటవెలదులతోటి, ద్విపదలతోటి కృషి చేయటం మంచిది. అలగే సంప్రదాయసాహిత్యాన్ని బాగా చదివినకొద్దీ పట్టుచిక్కతుంది ధార కుదురుతుంది. నా కృషిని బాగా ప్రోత్సహించిన మా గురుదేవులు తెలుగుపండితులు స్వర్గీయ వేదుల వేంకటరావు గారు నిత్యం నాకు 'ఒరేయ్ యీ విషయం మీద పద్యాలు వ్రాసి తే. ఆవిషయం శార్దూలంలో చెప్పు అంటూ మిక్కిలిగా ప్రోత్సహించారు. 1971లో నా ఉపనయనానికి వచ్చి ఆశువుగా చాలా పద్యాలు చెప్పి ఆశీర్వదించారు. ఆరోజుల్లో సాధనాలేవీ లేవు గాబట్టి అవేవీ రికార్డు చేయలేదెవరూ. మా పాఠశాల వార్షికోత్సవానికి విద్వత్కవులు శ్రీ దిభాష్యం వేంకటరావుగారు వచ్చి నా పద్యవిద్యను గూడా పరీక్షించి మెచ్చుకున్నారు. ఇదంతా యెందుకు చెప్పటం అంటే, నిత్య పఠనాభ్యాసాలతో అచిరకాలంలోనే పద్యవిద్యమీద తగినంత పట్టు సాధించ వచ్చునని నా స్వానుభవం అని మనవిచేయటానికే. జిలేబీగారిది మంచి కల్పనాశక్తి. మీరన్నట్లు ప్రయత్నస్తే తప్పక చక్కని సాంప్రదాయిక కవిత్వం కూడా వారు చెప్పగలరని నా గాఢ నమ్మకం.
నేమానివారూ, నెమలి అనేది ఒక పక్షి. ఇతర పక్షుల వెలనే నెమళుల మధ్యకూడా సంతానోత్పత్తిక్రియా కలాపం. ఆడునెమలి మగనెమలి ఆనందభాష్పాలు త్రావి గర్భందాల్చటం కేవల కవిసమయం. భ్రమరకీటకన్యాయం కూడా అలాంటి కవిసమయమే.
మిత్రులారా! శ్రీ రామరాజ్యం సినిమా యెలా వుంది? రేటింగ్స్ బాగా ఇచ్చారు. కానీ మీలో చూసిన వాళ్ళు ఎవరైనా వుంటే మీ నుంచి వినాలని వుంది. శ్రీ వాల్మీకి రామాయణానికి యెంత దగ్గరగా వుంది?
మిత్రులు శివానందలహరి గురించి ప్రస్తావన చేసేరు. ఆ సందర్భములో నా అనుభవము వివరిస్తున్నాను. నేను శివానందలహరి ఆధారముగా చాలా ఆధ్యాత్మికోపన్యాసముల నిచ్చేను. ఒకప్పుడు నాకు శివానందలహరి పూర్తిగా కంఠపాఠము. (ఇప్పుడు అంతలాగ లేదు). అందులో చాలా ఆధ్యాత్మిక విషయాలే కావు, కవిత్వపరముగా కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ చిన్న శ్లోకము ఆనాటి సామాజిక పరిస్థితులను చెప్తుంది: జడతా, పశుతా, కళంకితా కుటిల చరత్వంచ నాస్తి మయి దేవ! అస్తియది రాజమౌళే! భవదాభరణస్య నాస్తి కిం పాత్రం? (తాత్పర్యము: ఓ శివా! నీ ఆభరణాలుగా జడమైన గంగ ఉన్నది, వాహనముగా పశువు ఉన్నది, శిరస్సుపై చంద్రుడు ఉన్నాడు, కంఠములో పాము ఉన్నది - వాటిలాగ నాకు జడత్వము, పశుత్వము, కళంకము, వక్రగమనము లేవు; ఇందులో ఏ గుణము ఉన్నా నీకు ఆభరణముగా పాత్రత నాకు ఉండేది కదా!) అప్పటిలో కూడా రాజుల అభిమానమునకు పాత్రత కావాలంటే ఎన్ని అవగుణములు ఉండాలో ఈ శ్లోకము చెప్పుచున్నది.
తెలిసి నట్టి విద్య తెలుపనట్టి బుద్ది
రిప్లయితొలగించండివినయ మింత లేని విషపు బుద్ది
కుళ్ళు బుద్ది మరియు కుత్సిత చేష్టల
బుద్ధి గలుగువారు బుధులు గారు.
మొదటి పాదం సరిచేయాలనిపిస్తోంది.
తొలగించండిఉదాహరణకు ఈ విధంగా:
తెలిసి నట్టి విద్య తెలుపని దుర్బుద్ధి
పద్యపూరణం బాగుంది. అభినందనలు
చదివినది పీ ఎచ్ డీ,
రిప్లయితొలగించండిచేయు ఉద్యోగము సాఫ్టువేరు,
చదువు వేరు, కూటి కై కై చేయు పని వేరు,
బుద్ధి గలుగు వారు బుధులు గారు
అతిశయమ్ము, క్రోధ ,మవకాశ వాదమ్ము,
రిప్లయితొలగించండితనను తాను బొగడు తగని గుణము ,
మాట యందు మంచి మర్యాద లెరుగని
బుధ్ది గలుగు వారు బుధులు గారు
చదువులేదు గాని చదివిరి లోకమ్ము
రిప్లయితొలగించండిమాయ దెలియ నట్టి మాన్యులైరి
కొందర గని నంత గొప్పవారని మ్రొక్క
బుధ్ది గలుగు వారు బుధులు గారు
సొంత తెలివిలేక, సూక్ష్మంబు గనలేక,
రిప్లయితొలగించండినేర్పటన్నదెపుడు నేర్వలేక,
జీవితాశయముల చేధింపరీ మంద
బుద్ధి గలుగువారు, బుధులు గారు.
ఆత్మ బోధ గలుఇగునట్టి వారలు బుధు
రిప్లయితొలగించండిలనగ నొప్పుచుందు రటుల గాక
దుర్గుణముల తోడ దూషితమగు నీచ
బుద్ధి గలుగు వారు బుధులు గారు
గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యము మొదటి పాదములో గణములు సరిపోలేదు.
రిప్లయితొలగించండికాస్త సవరించాలి. మిగిలిన విషయములలో పద్యము బాగుగనే యున్నది.
నిన్నటి వ్యాఖ్యలు గురించి:
శ్రీ ఆదిభట్ల వారు:
- నెమలి అని మనము వాడుకలో అంటాము గాని శబ్ద రత్నాకరములో నెమిలి అని ఇచ్చేడు.
- నెమిలికి లింగ సంపర్కము లేదు. మీరు చెప్పినట్లు కన్నులలోనుండి వీర్యము పడుతుంది అని పెద్దలు చెప్పగా విన్నాను. అందులకే కృష్ణుడికి అంత గౌరవము నెమిలి మీద అంటారు. అలాగే మురళిమీద కూడా ఎక్కువ గౌరవము - ఎందుకంటే మరళికి కడుపులో ఏమీ యుండదు అంతా గుల్లే. ఎట్టి దుర్గుణములు లేవని భావము.
శ్యామలీయం గారి కథకు కొస మెరుపు. కృష్ణుడి గురించి అప్పుడు "అస్ఖలితపు బ్రహ్మచారి" అన్నారుట -- పరమ బ్రహ్మచారి అని కాదు. అలాగే దుర్వాస మహర్షి సదోపవాసి-- అన బడే వాడు ఎందుకంటే -- అతడు తినిన తరువాత శ్రీ కృష్ణార్పమస్తు అనే వాడుట. అది శ్రీ కృష్ణార్పితము అయ్యేదిట. స్వస్తి.
నా పద్యము 1వ పాదములో ఒక తప్పు దొరలినది. ఇ ని తొలగించాలి.
రిప్లయితొలగించండిమన బ్లాగ్ సభ్యులు సాహితీ జగతి సంపద్వైభవోపేతులున్
రిప్లయితొలగించండిఘన భావాఢ్య కవిత్వ తత్త్వ నిధులున్ జ్ఞానప్రభాభాసురుల్
వనజాతాసన భామినీ చరణ సేవా తత్పరుల్ వారికిన్
మనమారన్ బొనగూర్చి దీవెనలు సంభావింతు నత్యాదృతిన్
జిలేబీ గారికి అభినందనలు. మీరు బ్లాగులో మీ భావములు తెలియజేస్తున్నందుకు సంతోషము. మీరు కూడా పద్యరచనకు బూనుకొనవలెనని మా ఆకాంక్ష. ఇది బ్రహ్మ విద్య కాదు. నిత్యము అభ్యాసము చేస్తూ ఉంటే చాలు. ముందుగా ఆటవెలదులు మరియు కంద పద్యములు మొదలు పెట్టండి. వేమన శతకము, సుమతీ శతకము, కృష్ణ శతకము చదవండి. బాగుగా చదవండి. మీకు ఆ పద్యముల నడక తెలిసిపోతుంది. ముందు అనుకరణకు పూనుకొనండి. అంటే పేరడీ అంటాము. మీరు హాయిగా పద్యములు వ్రాయగలుగుతారు. శుభం భూయాత్.
రిప్లయితొలగించండిసకల శాస్త్రములను చదివిన నేమాయె
రిప్లయితొలగించండిసత్త్వ గుణము లేక శాంతి లేక
వ్యసనపరత ,యతిశయ మ్మహంకృతి ,వక్ర
బుద్ధి గలుగు వారు బుధులు గారు.
జ్ఞానధనులటు సద్బుద్ధి గలుగువారు
రిప్లయితొలగించండిబుధులు గారందరకు మసిబూసి మాయ
జేయువారె తెలివిగల జీవులెన్న
గ కలియగమున గర్వమె ఘనతదెచ్చు!
నెమలి - సంతానోత్పత్తి
రిప్లయితొలగించండినేను విన్నదేమిటంటే మగనెమలి నల్ల మబ్బులు చూచి మురిసి పురి విప్పి నాట్యం చేస్తుందనీ, అప్పుడు ఇంద్రియాన్ని జారవిడుస్తుందనీ దాన్ని ఆడు నెమలి స్వీకరించి సంతానోత్పత్తి చేస్తుందనీ. బాహ్య సంపర్కానికి అతీతమైన దాంపత్యం నెరపడం వలన నెమలి అంటే కృష్ణునికి ప్రేమ అనీ ఆ ప్రేమకు చిహ్నంగా నెమలి కన్నును తన తలలో ఉంచుకుంటాడనీ.
జీవశాస్త్రం తెలిసిన మిత్రులెవరైనా ఉంటే ఈ విషయాన్ని(నెమళ్ళలో సంతానోత్పత్తి) ధృవీకరిస్తే బాగుంటుంది.
ఆర్యా ! నేమాని గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరణ తో నా పూరణ ...
తెలిసి నట్టి విద్య తెలుపని పెడ బుద్ది
వినయ మింత లేని విషపు బుద్ది
కుళ్ళు బుద్ది మరియు కుత్సిత చేష్టల
బుద్ధి గలుగువారు బుధులు గారు.
మిస్సన్న గారూ! నెమిలి అని నేను ఉదహరిస్తే మీరు నెమలి అనే వాడేరు. నెమిలి అనే శబ్దరత్నాకరములో ఇచ్చేడు.
రిప్లయితొలగించండిజీవ శాస్త్రము తెలిసిన వాళ్ళు మరికొన్ని వివరణలు ఇవ్వాలి:
(1) భ్రమరము (తుమ్మెద) నకు సంతానోత్పత్తి లేదట. వేరే ఏదో కీటకము యొక్క లార్వాను తెచ్చి తన గూటిలో వేసి అక్కడే తిరుగుతూ ఉంటుందిట. అ లార్వా చూచేది తుమ్మెదనే, వినేది తుమ్మెద నాదాన్నే, స్పృశించేది తుమ్మెద యొక్క రెక్కల గాలినే. ఆ లార్వా తుమ్మెదగా మారిపోతుందిట. ఇది ధ్యానయోగానికి ఉదాహరణ.
(2) అంకోలం (ఊడిగ) చెట్టు యొక్క బీజము క్రింద పడిన తరువాత కొన్నాళ్ళకు వాన పడితే ఆ బీజము ఆ నీరు తగలగానే ప్రేలి అదే చెట్టు కొమ్మపై పడి అక్కడే మొక్కగా పెరుగుతుందిట. ఇది భక్తికి సంకేతము.
స్వస్తి.
చెడ్డవారి తోడ స్నేహమ్ము కూడదు
రిప్లయితొలగించండిబురద లోన పంది పొరలు రీతి
చేటు గలుగు చుండు చెడును పరువు చెడ్డ
బుద్ధి గలుగువారు బుధులు గారు.
ఈనాడు స్పందించిన వారందరికి అభినందనలు. వివిధ కోణాలలో పూరణలు చేసేరు.శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, శ్రీ రాజా రావు గారికి, శ్రీ సంపత్ కుమర్ శాస్త్రి గారికి, శ్రీ కమనీయం గారికి, శ్రీ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకముగా ప్రశంసలు. అందరనూ గూర్చి చెప్పేననుకొంటున్నాను. మరొక్కమారు అందరికీ ప్రశంసలు.జిలేబి గారికి ప్రత్యేకముగా వ్రాసేను.
రిప్లయితొలగించండిఅయ్యా! మిస్సన్న గారూ మీకు కూడా అభినందనలు.
రిప్లయితొలగించండినేమాని పండితార్యా! ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివ్యావహారికంలో నెమలి అని అలవాటైపోయింది. క్షమించాలి.
భ్రమర కీటక న్యాయాన్ని చక్కగా వివరించేరు.
అంకోలాన్ని గూర్చి చెప్పి శివానందలహరిని గుర్తు చేశారు.
' అమ్కోలం నిజబీజ సంతతి...........'
నేమాని వారికి నమస్కారం. మీరు సెలవిచ్చినది యదార్ధం. సరదాగా నేను పద్యరచనకు ప్రయత్నించినపుడు మానాన్నగారు కూడా 'బాగా అభ్యాసం చేయాలి. ఇదేమి బ్రహ్మవిద్య కాదు' అన్నారు. మరలా అవే మాటలు మీరు గుర్తు చేసారు. చాలా సంతోషం. మీరన్నట్లు వృత్తాల నటుంచి ఉపజాతి పద్యాలు తేటగీతులు ఆటవెలదులతోటి, ద్విపదలతోటి కృషి చేయటం మంచిది. అలగే సంప్రదాయసాహిత్యాన్ని బాగా చదివినకొద్దీ పట్టుచిక్కతుంది ధార కుదురుతుంది. నా కృషిని బాగా ప్రోత్సహించిన మా గురుదేవులు తెలుగుపండితులు స్వర్గీయ వేదుల వేంకటరావు గారు నిత్యం నాకు 'ఒరేయ్ యీ విషయం మీద పద్యాలు వ్రాసి తే. ఆవిషయం శార్దూలంలో చెప్పు అంటూ మిక్కిలిగా ప్రోత్సహించారు. 1971లో నా ఉపనయనానికి వచ్చి ఆశువుగా చాలా పద్యాలు చెప్పి ఆశీర్వదించారు. ఆరోజుల్లో సాధనాలేవీ లేవు గాబట్టి అవేవీ రికార్డు చేయలేదెవరూ. మా పాఠశాల వార్షికోత్సవానికి విద్వత్కవులు శ్రీ దిభాష్యం వేంకటరావుగారు వచ్చి నా పద్యవిద్యను గూడా పరీక్షించి మెచ్చుకున్నారు. ఇదంతా యెందుకు చెప్పటం అంటే, నిత్య పఠనాభ్యాసాలతో అచిరకాలంలోనే పద్యవిద్యమీద తగినంత పట్టు సాధించ వచ్చునని నా స్వానుభవం అని మనవిచేయటానికే. జిలేబీగారిది మంచి కల్పనాశక్తి. మీరన్నట్లు ప్రయత్నస్తే తప్పక చక్కని సాంప్రదాయిక కవిత్వం కూడా వారు చెప్పగలరని నా గాఢ నమ్మకం.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేమానివారూ, నెమలి అనేది ఒక పక్షి. ఇతర పక్షుల వెలనే నెమళుల మధ్యకూడా సంతానోత్పత్తిక్రియా కలాపం. ఆడునెమలి మగనెమలి ఆనందభాష్పాలు త్రావి గర్భందాల్చటం కేవల కవిసమయం. భ్రమరకీటకన్యాయం కూడా అలాంటి కవిసమయమే.
రిప్లయితొలగించండినమలి, నమిలి, నమ్మి, నెమలి, నెమిలి, నెమ్మి, నెమ్మిలి ... ఇవన్నీ రూపాంతరాలు. ఏది ప్రయోగించినా దోషం లేదు.
రిప్లయితొలగించండిమిత్రులారా! శ్రీ రామరాజ్యం సినిమా యెలా వుంది? రేటింగ్స్ బాగా ఇచ్చారు. కానీ మీలో చూసిన వాళ్ళు ఎవరైనా వుంటే మీ నుంచి వినాలని వుంది. శ్రీ వాల్మీకి రామాయణానికి యెంత దగ్గరగా వుంది?
రిప్లయితొలగించండిచదువు లెన్నొ గలిగి సంస్కారహీనులు
రిప్లయితొలగించండిపొత్తు నణచి వగచ బుడమి గనమె
ఓర్వలేనితనము నుప్పతిల్లు కపట
బుధ్ధి గలుగు వారు బుధులు గారు
శ్రీ శంకరయ్య గారు నెమిలికి అనేక పర్యాయపదములు సూచించినందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండితమ్ముడు చి. డా. నరసింహమూర్తి పూరణ బాగుంది. 2వ పదములో "వగచుట" కు బదులుగా వగచ అని ఉంది. పాదములో అన్వయము కోసము చిన్న సవరణ చేస్తే బాగుంటుంది. స్వస్తి.
పీచు లాట చదువుఁ బీ హెచ్ డి మెడచుట్టె
రిప్లయితొలగించండిసాఫ్టు వేరు లోన జతికిలంగ
శాంతి గలిగెఁ గడుపు సాపాటు పడెనురా
బుద్ధి గలుగు వారు బుధులు గారు
జిలేబీ గారూ, మీ ఆలోచనలను కవిత్వము అనే పాకములో ముంచుతే మధురమైన జిలేబీలు పుడుతాయి.
శ్రీ పండిత నేమాని అన్నయ్య గారికి,నమస్సులు,ధన్యవాదములు.
రిప్లయితొలగించండిచదువు లెన్నొ గలిగి సంస్కారహీనులు
పొత్తు నణతు రయ్య పుడమి నందు
ఓర్వలేనితనము నుప్పతిల్లు కపట
బుధ్ధి గలుగు వారు బుధులు గారు .
మిత్రులు శివానందలహరి గురించి ప్రస్తావన చేసేరు. ఆ సందర్భములో నా అనుభవము వివరిస్తున్నాను. నేను శివానందలహరి ఆధారముగా చాలా ఆధ్యాత్మికోపన్యాసముల నిచ్చేను. ఒకప్పుడు నాకు శివానందలహరి పూర్తిగా కంఠపాఠము. (ఇప్పుడు అంతలాగ లేదు). అందులో చాలా ఆధ్యాత్మిక విషయాలే కావు, కవిత్వపరముగా కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ చిన్న శ్లోకము ఆనాటి సామాజిక పరిస్థితులను చెప్తుంది:
రిప్లయితొలగించండిజడతా, పశుతా, కళంకితా
కుటిల చరత్వంచ నాస్తి మయి దేవ!
అస్తియది రాజమౌళే!
భవదాభరణస్య నాస్తి కిం పాత్రం?
(తాత్పర్యము: ఓ శివా! నీ ఆభరణాలుగా జడమైన గంగ ఉన్నది, వాహనముగా పశువు ఉన్నది, శిరస్సుపై చంద్రుడు ఉన్నాడు, కంఠములో పాము ఉన్నది - వాటిలాగ నాకు జడత్వము, పశుత్వము, కళంకము, వక్రగమనము లేవు; ఇందులో ఏ గుణము ఉన్నా నీకు ఆభరణముగా పాత్రత నాకు ఉండేది కదా!)
అప్పటిలో కూడా రాజుల అభిమానమునకు పాత్రత కావాలంటే ఎన్ని అవగుణములు ఉండాలో ఈ శ్లోకము చెప్పుచున్నది.