16, నవంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 528 (ఇడుమలను పొంది నరుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
        ఇడుమలను పొంది నరుఁడు సుఖించు నెపుడు.
ఈ సమస్యను సూచించిన నేదునూరి రాజేశ్వరి అక్కయ్యకు ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. శాస్త్రి గారూ,
    చక్కగా సరిపోతుంది. దానిని ‘భిన్నయతి’ అంటారు. అక్కడ ‘ఇంచు’ను గ్రహించాలి.

    రిప్లయితొలగించండి
  2. మాస్టారూ,
    అక్కడ "ఇడుమలను" అని ఉండాలేమో "ఇడుములను" కు బదులు. "ఇడుమ" ఏకవచనము, ఇడుమలు బహువచనము. ఆ పదప్రయోగాలు:
    "గీ. మగువఁ గోల్పోయి కడునిడుమలఁగలంగు."
    "గీ. విప్రవరులు భోగములకు వేడ్కసేయ, రిడుమ లిహమునఁ బడి కాంతురెలమిఁ బరము,..."

    రిప్లయితొలగించండి
  3. చంద్ర శేఖర్ గారూ,
    నిజమే. అది ‘ఇడుమ’. సవరిస్తున్నాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !

    01)
    _____________________________________

    నిష్టతోడ నియమముల - నిలుపు నపుడు
    కష్టమైన పనుల సాధ - కముల యందు
    ఇష్టమైన పనుల చేయ - నెంచినపుడు
    ఇడుమలను పొంది నరుఁడు సుఖించు నెపుడు.
    _____________________________________
    సాధకము = అభ్యాసము

    రిప్లయితొలగించండి
  5. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మబుధవారం, నవంబర్ 16, 2011 9:07:00 AM

    చంద్రశేఖర్ గారూ
    శంకరయ్యగారూ
    ఇడుములు అనే మాట తప్పుకాదేమో
    నేను నా దత్తోదాహరణములో షష్టీ విభక్తిలో కళికలో అనుకుంటా ఇడుములన్నిటి నడగరాయుచు అని వ్రాసేను. అద్దానిని ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు అంగీకరించేరు.

    రిప్లయితొలగించండి
  6. కష్ట నష్టము గలిగించు కావలెనని
    కదలి పోవక దేవుని కావలెనని
    గట్టి పరిక్షకు నిలచిన కడకు చూడ
    నిడుమలను పొంది నరుఁడు సుఖించు నెపుడు.
    _________________________________

    రిప్లయితొలగించండి
  7. సవరణ తో... ..

    కష్ట నష్టము గలిగించు కావలెనని
    కదలి పోవక దేవుని కావలెనని
    గట్టి పట్టును బట్టిన కడకు చూడ
    నిడుమలను పొంది నరుఁడు సుఖించు నెపుడు.

    రిప్లయితొలగించండి
  8. ఇంద్రుడు:

    దైవపధమునుకోరియె తపముఁబూని
    దేవవేశ్యనుగనినంత తృప్తిగొనడె?
    చనుము మేనకా!ప్రేముడి చాటుగనిడ
    ఇడుమలను, పొంది నరుఁడు సుఖించు నెపుడు.

    రిప్లయితొలగించండి
  9. శిలయునులిదెబ్బతో గదా శిల్పమగును,
    అగ్నినన్ కాలి కనకము హారమగును,
    అరసి చూడంగనిదికదాయసలు నిజము
    ఇడుమలను పొంది నరుడు సుఖించు నెపుడు.

    రిప్లయితొలగించండి
  10. శబ్దరత్నాకరము (బహుజనపల్లి) ఇడుమ పదానికి ఆపద, అలసట, క్లేశము. అనే అర్ధాలు సోదాహరణంగా ఇచ్చింది.
    శ్రీహరి నిఘంటువు (రవ్వా శ్రీహరి) లో ఇడుమలుగుడుచు అనే పదానికి కష్టములు పడు అని అర్ధం సోదాహరణంగా ఇచ్చారు.
    కాబట్టి ఇడుమలుపడు అనిగూడా సాదువేనని నా భావన.
    బ్రౌణ్యం అయితే స్పష్టంగా డుమపాటు to suffer trouble. ఇడుమలుపడుట అని పేర్కొంది. కాబట్టి యే పేచీ లేదు.

    రిప్లయితొలగించండి
  11. సంపత్కుమార శాస్త్రిగారూ
    'అగ్నినన్' అనేది సాదువు కాదనిపిస్తోంది. నాది పొరబాటు కావచ్చును.
    'అగ్నినన్ కాలి కనకము హారమగును' అనే పాధాన్ని
    'అగ్నిలో కాలి కనకము హారమగును' అని మార్చితే బాగుంటుందని మనవి.

    రిప్లయితొలగించండి
  12. అయ్యా శ్యామలీయం గారూ! మీ నిన్నటి వ్యాఖ్యకు నా వివరణ:
    శ్రీ శ్రీ గారు చెప్పేరు - దీర్ఘ అక్షరముతో ప్రారంభమయిన కంద పద్యమునకు 4ఇంట జగణము రాదు అని. ఇందులో వింత ఏమిటి? దీర్ఘ అక్షరముతో ప్రారంభమయిన కంద పద్యమునకు 4వ గణము గురువుతోనే మొదలిడుదుంది కదా. అందుచేత 4వ గణము భగణము గాని గగ గాని మాత్రమే ఉండే అవకాశము కద. జగణము ప్రసక్తే రాదు. కందపద్యములో 1, 2 పాదములు కలిపి లెక్కించినపుడు 4వ గణము అంటే 2వపాదములో మొదటి గణము అని అర్థము. ఆలాగున లెక్కించుతేనే 6వ గణము జగణము గాని నల గాని ఉండాలి అనుట సరిపోతుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. మంచి పుత్రుడనగ నొక్క మణుల కొండ
    కరుణ గను వేలుపొక్క బంగారు కొండ
    అటులనే భక్తులకు పరమార్థ వితతి
    నిడు మలను పొంది నరుడు సుఖించు నెపుడు

    రిప్లయితొలగించండి
  14. బాల్యమాది ముదిమిఁజేరు పయనమందు
    నొకటి తీరక మున్నె మరొకటి యనుచు
    వాంఛ లెన్నియొ తరుముచు వచ్చు నకట!
    ఇడుమలను పొంది నరుఁడు సుఖించు నెపుడు?

    గురువు గారు, తొందరలో చేసిన పూరణ. పొరపాట్లున్న మన్నించండి. చెప్పండి.

    రిప్లయితొలగించండి
  15. అయ్యా శ్రీ ఆదిభట్ల వారూ! పెద్ద వాళ్ళు మీ కావ్యానికి అభిప్రాయము వ్రాసేరు. అందులో తప్పులు ఏమీ ఉన్నట్లు కాని, సవరణలు కాని సూచించలేదు. సంతోషము. అంత మాత్రమున కావ్యములోని పూర్తి పాఠమును వారు నిర్దుష్టమని చెప్పినట్లు కాదు. కొన్నిటిని వాళ్ళు చూచీ చూడనట్లు విడిచి పెట్టేస్తారు. ఇది స్వానుభవము. అందుచేత సరి అయిన ప్రమాణములనే మనము తీసుకోవాలి. అలాగ అని మీ కావ్యములో కొన్ని తప్పులు/సవరణలు ఉంటాయని నా భావన కాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. విజయలక్ష్మి కపజయలక్ష్మి జత గూడె
    జగను దశలిక గురుశూన్య నగణములను
    మకట! ఇడుపుల పాలెము నందు జేరి
    ఇడుమలను పొంది నరుఁడు సుఖించు నెపుడు?

    రిప్లయితొలగించండి
  17. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మబుధవారం, నవంబర్ 16, 2011 9:11:00 PM

    పండిత నేమాని వారూ
    ఐతే అవును గామోసు.
    :)

    రిప్లయితొలగించండి
  18. చివర్లో ప్రశ్నార్థకం పెట్టితే మందాకిని గారిలాగ పూరించవచ్చును. కాని అలా ఇవ్వలేదు కాబట్టి ఈ కింది విధంగా పూరిస్తున్నాను.
    ''ఎన్నియో పరీక్షల దొల్లి యెదురు కొనుచు
    ధర్మ మార్గమ్ము విడువక తనరినారు
    కడకు ధర్మ రాజాదులు ,కార్య శూరు
    లిడుమలను పొంది నరుడు సుఖించు నెపుడు.' '

    రిప్లయితొలగించండి
  19. తానహంకార పతితుడై ధరణి బడుచు
    బుధ్ది గల్గియు ఘను డైన పురుషు డకట !
    కోరి కష్టాల యూబి లో గూరు కొనును
    ఇడుమలను బొంది నరుడు సుఖించు నెపుడు?

    రిప్లయితొలగించండి
  20. అవి యివి కావలె ననుచు నదుపు లేని
    ......ఆలి కోర్కెలు తీర్చి అలసి పోవు
    పిల్లలు కోరిన పెళ్లిల్లు చదువులు
    ......చక్క బరచి తాను చప్ప బడును
    విరమణ లాభాల విత్తము మిగలదు
    ......జీతమంత మొదటె జీర్ణమగును
    ముసలి వారిని సంతు కసురు కొనిన వేళ
    ......మందుల కోసము కుంద వలయు

    పరిణయంబైన కష్టాల పాలగుదురు
    వంద సంవత్సరమ్ముల పంట కాదు
    సుఖమది వెదికి జూచిన సున్న, యిట్టి
    యిడుమలను పొంది నరుఁడు సుఖించు నెపుడు?

    రిప్లయితొలగించండి
  21. శ్యామలీయం గారు,

    అగ్నిలో అని వ్రాస్తే గురువు గారు వ్యావహారిక పదమని అంటారేమో అనుకొని "అగ్నినిన్" అని వ్రాసినాను. కానీ మీరన్నట్టు అగ్నిలో అంటేనే పదము పొందికగా వున్నది. సవరించినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి