కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
తెలుఁగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
తెలుఁగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.
వెలయాలి వోలె వలపులు
రిప్లయితొలగించండిచిలికెడు నాంగ్లంబు చెంత చేరి వచించెన్
దులువ యొకండీవిధముగ
తెలుగేలా? యాంధ్ర భాష తీయగనుండన్
మలినపు పలుకులు పలుకగ
రిప్లయితొలగించండిబిలిపింతురె వేడ్క గొనుచు విలపించంగా
ఇలలో కల్లయె యిటులన
'తెలుగేలా యాంగ్ల భాష తియ్యగ నుండన్ '
నేమాని వారు ! చక్కని పూరణ చేశారు.కాని ఆంగ్లము వ్రాయవలసి ఉన్నా మీ చేతులు ఆంధ్రము అనే వ్రాశాయి.
రిప్లయితొలగించండిగోలి హనుమఛ్ఛాస్త్రి గారు చక్కగా గుర్తు చేసేరు. అభినందనలు. సమస్యను చూచిన తరువాత నా బుర్ర సమముగా పని చేయలేదు. ఏదోలాగ టైపు చేసేను.
రిప్లయితొలగించండితలపుల నిండిన తల్లిని
రిప్లయితొలగించండివలపులతో "లవరు" రాగ వదలుట మేలా?
తెలుగ 'బ్బాయ్' యిటు దలచకు
తెలుగేలా? యాంగ్ల భాష తీయగనుండన్.
"లవరు" బదులు చెలియ అనవచ్చును. కాని కావాలనే ఇంగ్లీషు చెలియను వుంచాను.ఆంగ్లము పై మోహము పెంచు కుంటున్నాడు కనుక తెలుగు "బాయ్" అన్నాను.
శ్రీ పండిత నేమాని వారి స్ఫూర్తితో ;
రిప్లయితొలగించండివలపెఱుగని వెలయాలిని
అలుకవతో దిట్టె నొకడు నాంధ్రము లోనన్
విలపించె నామె పెలుచన్
'తెలుగేలా? యాంగ్ల భాష తీయగనుండన్ !'
తిట్టే టప్పుడు తెలియని భాషలో తిడితే కొంత నయము.
చిన్న తమ్ముడు నన్ను పెద్దన్న యనుచు
రిప్లయితొలగించండిగౌరవము చూపె చంద్రశేఖరుడు లెస్స
సంతసించుచు నేనాశిషములు కూర్తు
జ్ఞాన విభవమ్ము పెంపొందు గాక! యనుచు
హనుమఛ్ఛాస్త్రి గారూ మా అన్నయ్య గారి చేత యెవ్వరూ యెట్టి పరిస్థితులలోను అసత్యము పలికించ లేరు. అందులో తెలుగు విషయములో !
రిప్లయితొలగించండిఅన్నగారికి పాదాభివందనములు
రిప్లయితొలగించండిపలికె విదేశీయుడొకడు
రిప్లయితొలగించండి"తెలుగేలా? యాంగ్ల భాష తీయగనుండన్,"
పలికితి తేనెల చిలుకుచు
పలుతెఱగుల తెనుగు తీపి; పరవశుడయ్యెన్
తమ్ముడు చి.నరసింహమూర్తీ!
రిప్లయితొలగించండివినయము రాశిపోసిన వివేక నిధీ! నరసింహమూర్తి! నీ
వనుజుడవంచు గొల్చుచును వందనముల్ పొనరించుచుండ నా
మనము చెలంగుచుండు నభిమానము నిండి శుభాశిషమ్ములో
యనఘ! సమస్త సౌఖ్యముల నందుము పావన జీవితమ్మునన్
ధన్యోస్మి! మీ ఆశీస్సులను మన మిత్రు లందఱితో పంచుకొంటాను.
రిప్లయితొలగించండితెలుగెంత లెస్సయోనని
రిప్లయితొలగించండితెలుగేతరుడైన రాజె తెలిపెను సుమతీ
కలనైనా యనకిట్టుల
తెలుగేలా యాంగ్లభాష తీయగనుండన్
తలపించు బనస తొనలను
రిప్లయితొలగించండితెలు -గేలా యాంగ్ల భాష ? 'తియ్యగ నుండన్
తెలుగుల వాడుక భాషను
గల పలుకులు '- గ్రామ్య మంచు కట్టడి తగునా?
సుజన-సృజన
తెలుగును నేర్చిన యె డ లన
రిప్లయితొలగించండిఫలితము మఱి గానరాదు పర దేశము లన్
దులువల మాటలె యీ యవి
తెలుగేలా? యాంగ్ల భాష తియ్యగ నుండన్ .
శాస్త్రి గారు తెలుగు భాష గురించి చక్కగా చెప్పారు
రిప్లయితొలగించండిమిత్రులకు అభినందనలు. ఇప్పటి వరకు వచ్చిన పూరణలు వైవిధ్యముతో నున్నవి.
రిప్లయితొలగించండితమ్ముడు చి. డా. నరసింహమూర్తి 2 విధాలుగా మంచి భావములను వ్యక్తము చేసెను. మలినపు పలుకులు వద్దని మాతృ భాషా భక్తిని చూపెను మొదటి పద్యములో; 2వ పద్యములో వెలయాలి విలాపము అనే సరసోక్తిని చెప్పెను.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు లవరు, బాయ్ అనే పదాలు చెప్పుతూనే మాతృ భాషను విడువ వద్దని సలహా చెప్పేరు.
శ్రీమతి మందాకిని గారు పరదేశీయులకి తెలుగు వినిపించి వారిని తెలుగుతో పరవశింప జేసేరు.
శ్రీ ఆదిభట్ల వారు శ్రీ కృష్ణదేవరాయనికి నివాళి పట్టేరు. దేశ భాషలందు తెలుగు లెస్స.
శ్రీ రాజారావు గారు తెలుగు అనే పనస తొనల రుచిని చూపేరు.
శ్రీ సుబ్బా రావు గారు పరదేశపు తులువల మాటలుగా అభివర్ణించేరు.
అందరి పద్యరచనలు మంచి భావములతో, ధార శుద్ధితో బాగుగా నున్నవి.
స్వస్తి.
స్వామియె శరణం
రిప్లయితొలగించండిగురువు గారికి ధన్యవాదములు
-----------
ఫలితము లేదని ముదుసలి
బలుకును పరభాష నేడు బలువురితోడన్
తెలుగునకు దెగులు బట్టగ
"తెలుగేలా? యాంగ్ల భాష తీయగనుండన్,"
వెలుగేలా యిరులుండన్?
రిప్లయితొలగించండికలగని సుధలేలమనకు కల్లే యుండన్?
నెలవేలవీధులుండగ,
తెలుగేలా? యాంగ్ల భాష తియ్యగ నుండన్.
పలుకే పలుకని మూకకు,
రిప్లయితొలగించండిపలుదేశంబుల సహాయపడుభాషిదియే,
తెలుగేలపలుకవలయును,
తెలుగేలా? ఆంగ్లభాష, తీయగనుండన్.
ఏవిధంగా పూరించినా కూడా ఆంగ్లభాష తీపి అని చెప్పల్సి వస్తుంది కదా అని, క్రమాలంకారములో పూరించాను గురువుగారూ.
నా పూరణ .....
రిప్లయితొలగించండితలిదండ్రుల ’మమ్మీ డా
డి’లుగా గుర్తించి త్రాగి డిస్కో లనుచున్
మెలఁగెడు భ్రష్టాత్మకులకు
తెలుగేలా? యాంగ్లభాష తియ్యగ నుండన్.
ఉలుకేల యున్న మాటకు
రిప్లయితొలగించండికొలువులచదువులకు తెలుగు కూడనిదై హూ
ణులభాష గద్దెకెక్కెను
తెలుగేలా? ఆంగ్లభాష, తీయగనుండన్.
కొంచెం మార్పుతో:
రిప్లయితొలగించండిఉలుకేల యున్న మాటకు
కొలువులచదువులకు తెలుగు కూడనిదై హూ
ణుల భాష మెచ్చువారికి
తెలుగేలా? ఆంగ్లభాష, తీయగనుండన్.
తుల లేని భాష తెలుగని
రిప్లయితొలగించండిపలికెను మురిపెమున బ్రౌను పండితు- డైనన్
తల లేని వారి తలపున
తెలుగేలా ?యాంగ్ల భాష తియ్యగ నుండన్
సుజన-సృజన
కలదట పిలుపది దారకు
రిప్లయితొలగించండితలపకనిడనెవడొ 'పంచదార'ను పేరన్,
దెలియుట, స్వార్ధమనెఁ బిలువ
తెలుగేలా ?యాంగ్ల భాష తియ్యగ నుండన్.
వెలయాలి వలపు వెంబడి
రిప్లయితొలగించండికులుకుచు పరుగిడిన భంగి కూరిమి తోడన్ !
తెలుగున విభవము తెలియక
తెలుఁగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్ !
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅలుపెరుగక నాంగ్లేయులు
పలుదేశములన్ గెలచిరి వంచనతోడన్
బల గర్వమునన్ బలికిరి
తెలుఁగేలా? యాంగ్ల భాష తియ్యగ నుండన్
మిత్రులారా! అభినందనలు.
రిప్లయితొలగించండిమరి కొందరి పూరణలు కూడా చూచేను. మన వారి ఆవేదనలు, వ్యంగ్యోక్తులు, ఉదాసీనత అన్నీ వ్యక్తము అయ్యేయి. శ్రీ వరప్రసాద్ గారు తెలుగునకు బట్టిన తెగులు గురించి బాధను తెలిపేరు. ఊకదంపుడు గారు మరొక విధముగా ఉదాహరణలను చూపేరు. శ్రీ సంపత్ కుమార్ గారు వ్యంగ్యంగానే ఆంగ్లముపై మోజును వర్ణించేరు. శ్రీ శంకరయ్య గారు భ్రష్టుల పరిస్థితిని వేలెత్తి చూపేరు. శ్రీ శ్యామల రావుగారు కొలువులలో ఆంగ్లం ఆవశ్యకత వలన తెలుగుకి కలిగిన చిన్న చూపును చెప్పేరు. శ్రీ రాజారావుగారు తెలుగు సాహిత్యమునకు ఎనలేని సేవ చేసిన బ్రౌను దొరగారికి నివాళి అర్పించేరు.
ఇలా ఎన్నెన్నో విధముల పూరణలతో ఈనాటి సమస్యాపూరణ కార్యక్రమము అందరిని ఆకట్టుకున్నది. స్వస్తి.
శ్రీమతి రాజేశ్వరి గారి పూరణ మరియు శ్రీ శ్రీపతి శాస్త్రి గారి పూరణలు కూడా బాగుగనే ఉన్నవి. అభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండి@రాజేశ్వరి గారూ
రిప్లయితొలగించండి"వెలయాలి వలపు వెంబడి" పూరణ బాగుంది.
సులువుగ శాస్త్రముల జదువ
రిప్లయితొలగించండినలవి యగును గాదె ఆంగ్ల మందే యనుచున్
బలుకగ జక్కగ మరచిరి
తెలుగేలా యాంగ్ల భాష తీయగ నుండన్.
--------------
నమస్కారములు.
రిప్లయితొలగించండిపండితులు , అవధాన సరస్వతులు , గురువులు , నా పద్యం బాగుందని అంటే నా జన్మ ధన్య మైనది. శిరసాభి వందనములు. లక్క రాజు గారు ధన్య వాదములు . సోదరులకు అభినందనములు.
గురువుగారూ ధన్యవాదములు
రిప్లయితొలగించండినేమాని వారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిరాజశేఖర శర్మ గారూ ! ధన్యవాదములు.
మా బండి చాలా లేటు
రిప్లయితొలగించండిపలుకుట సహజమ్మాంగ్లే-
యులు తమదే మంచి భాష యుర్వి నటంచున్
కలిమాయ తెలుగు వారన
తెలుగేలా యాంగ్ల భాష తీయగ నుండన్.
మూర్తి మిత్రమా నేమాని పండితార్యుల ఆశీస్సుల నందుకొన్న మీకు అభినందనలు.
రిప్లయితొలగించండితలనొప్పి వచ్చినప్పుడు
రిప్లయితొలగించండివిలపింతును తలను బట్టి విలవిల మనుచున్
తెలుగున "అమ్మా" యనినే:
"తెలుఁగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్!"
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిలవలు పలవల యతులును
రిప్లయితొలగించండిబలుపౌ ప్రాసలను కూడి బాధాకరమై
గిలగిల తన్నుకు చచ్చెడు
తెలుఁగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్!
మిలమిల లాడెడు కైతలు
రిప్లయితొలగించండిచిలుకగ మన పోతనయ్య శ్రీనాథునితో
చెలియా! అనబోకిట్టుల:
"తెలుఁగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్"