ఎందరో మహానుభావులు. స్వాతంత్ర్యసమరములో గాంధి, భగత్సింగ్ వంటి ప్రముఖులు ఎంతో మంది వారి జీవితాల్ని ఫణంగా పెట్టినారు. ఈనాటికీ, అన్నా హజారే లాంటి వారు ఎందరో వున్నారు.
మిత్రులారా! అన్య భాషా పదములను వాడుకొనుట ఎంతవరకు సమంజసము. కొంతవరకు తప్పదు. ఉదా: కారు,కంప్యూటరు, బేంకు. అటులనే మనము వాడుచున్న అనేక వస్తువులకు సరియైన తెలుగు పదములు మనకు రావు. జైలు అనుటకంటె చెర, చెరసాల, కారాగారము, మొదలగు పదములున్నవి కావున వాటిని వాడుటె సమంజసము. సరైన పదములు లేని యెడల వేరొక మార్గము లేదు కనుక దొరకిన పదము ఏ భాషది ఐననూ వాడక తప్పదు. ఇప్పటికే మన భాషలో ఉర్దూ, ఇంగ్లీషు మొదలైన ఇతర భాషల పదములు వాడుకలోనికి వచ్చినవి.
శ్రీ పండిత నేమాని అన్నయ్యగారికి,శ్రీ శ్యామలీయము గారికి నమస్సులు.తెలుగు భాష సంస్కృత భాష పదజాలము కలుపుకొని విస్తార పద జాలముతో వర్ధిల్లు తున్నది. ఆంగ్ల పదాలు వాడకుండా ఉండాలనుకొంటే కష్టము కాదు. నన్నో మిత్రుడు రోడ్డు కి తెలుగు మాట ఏమిటి అంటే ఒకటేమిటి,దారి,బాట,త్రోవ,పథము,మార్గము నీకు కావలసినది ఎన్నుకో అని చెప్పాను. కుబేరుడు ఉన్న దేశములో ధనా గారాలే లేవా ?, పరాయి దేశ బ్యాంకులలో డబ్బు దాచుకొందుకు. కారుని, వాహనము ( ఆంగ్లములో వెహికిల్ ),బండి,శకటము,రథము, అని ఏమైనా వాడుకోవచ్చును మనము అలవాటు చేసుకొంటే. కంప్యూటర్ కి గణన యంత్రమని అనవచ్చు. నవీన సాధనాలు ఆంగ్లేయులకు క్రొత్తే. వారు కూడా క్రొత్త పదాలు సృష్టి చేసుకోక తప్పదు. ఏ మార్పైనా తీసుకు రావడానికి ఒక్క తరము చాలును. ఇప్పటికే ఈ తరము పిల్లలకు మమ్మీ, డాడీలకు అమ్మ,నాన్న అనే తెలుగు పదాలు ఉన్నాయని తెలీదు. బ్రతుకు తెఱువుకి మనము ఆంగ్లము నేర్చుకోక తప్పక పోయినా పండితుల సహకారముతో తెలుగు పదములు గాలించి బయటకు తీసుకు రావచ్చును, కాకపోతే సృష్టి చేసుకోవచ్చును.ఎప్పుడైనా అన్యదేశములు దొర్లినా భరించ వచ్చును. చక్కని సౌరభాలు వెదజల్లే మల్లెలు,గులాబీలతో బాటు నవీన కృత్రిమ పుష్పాలను శారదమ్మ కాదంటుందా ? ఒకటే యిబ్బంది. ఎప్పుడైనా భరించ వచ్చు ననుకొంటే ప్రతి దినము ఆకాశవాణిలోను దూరదర్శినిలోను,చలనచిత్రాలలోను పదే పదే ఆంగ్లపదాలను వాడి తెలుగు భాషని చంపేస్తున్నారే ! అందువలన వీలయినంత వరకు ఆంగ్ల పదాలను వర్జించడమే మేలు.
మిత్రులకు శుభాశీస్సులు. అందరి పూరణలు అసలు నేతల దుస్థితిని తరువాతి నేతల ధనప్రీతిని వర్ణించినవి. జైలు పదమును వాడి వరప్రసాద్ గారు ఆంగ్ల భాషాసాంకర్యము గురించి చర్చకు తావిచ్చేరు. శ్యామలీయం గారు ఒక్కమాటుగా దూకుతూ స్పందించేరు - అది వారి భాషాభిమానమునకు మచ్చుతునక. తమ్ముడు నరసింహమూర్తి ఇంకా లోతుగా వెళ్ళి చక్కని సూచనలను చేసేడు. ఇవి ఎంతవరకు ఆచరణలోకి వస్తాయో - రావాలనే అందరము ఆశించుదాము. మిత్రులు వరప్రసాద్ గారు, తమ్ముడు నరసింహమూర్తి, సంపత్కుమార్ శాస్త్రి, గోలి హనుమఛ్ఛాస్త్రి, శ్రీ ఆదిభట్ల, మిస్సన్న గారి పూరణలు అభినందనీయముగా అలరారుచున్నవి.ఇందులో ఎవ్వరినీ విడిచిపెట్ట లేదనుకొనుచున్నాను.అందరికీ మరొక్క మారు ఆశీస్సులు శుభయం భూయాత్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజగతి మెచ్చు జనులు జైలు పాలగుటను
రిప్లయితొలగించండిగాంచమొక్కొ కృష్ణు కన్నవారు
జాతి పితయు జాతి నేతలు నెందరో
కటకటాల పాలు కారె మున్ను?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుణ్యఫలము వీరు పుత్రుని బడయంగ
రిప్లయితొలగించండికలుగుఁ జేటు నీకుఁ గంస యనుచు
వాణి పలుక నతడు పగబట్టె నట్లైరి
జగతి మెచ్చు జనులు జైలు పాలు
అన్నయ్య గారూ పలుక నతడు ,యిక్కడ ద్రుతము వస్తుందా ? మీరు చెప్పాలి
తమ్ముడూ!
రిప్లయితొలగించండిదృతము వస్తుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎందరో మహానుభావులు. స్వాతంత్ర్యసమరములో గాంధి, భగత్సింగ్ వంటి ప్రముఖులు ఎంతో మంది వారి జీవితాల్ని ఫణంగా పెట్టినారు. ఈనాటికీ, అన్నా హజారే లాంటి వారు ఎందరో వున్నారు.
రిప్లయితొలగించండిజాతినుద్ధరింప భీతినొందక దీక్ష
చేసినట్టి ఘనులు శిక్షలంది,
జీవితమును ఫణము గావించినట్టి యా
జగతిమెచ్చుజనులు, జైలు పాలు.
పండిత నేమాని అన్నయ్య గారికి నమస్సులు, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమరో పూరణ ;
జగతి నుతుల నొందు శంకరార్యున కైన
దప్ప లేదుగ సడి ధరణి యందు
హీన జనులు సేయు హానిచే నగుదురు
జగతి మెచ్చు జనులు జైలు పాలు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూరణావిషయకమైన వ్యవహార మటులుండగా తెలగు పద్యముల యందు ఆంగ్ల పదములను ప్రస్తావించుట సమంజసమా యనునొక ప్రశ్న వచ్చుచున్నది.
రిప్లయితొలగించండిఒకవేళ కృతినిర్మాణములయందు నిషిధ్ధమై చాటువులయందును సభాముఖమైన పద్యములందును ఆంగ్ల పదములను ప్రయోగించుట యందాక్షేపణము లేదేమో. నిర్ణయించుటకు నాకు శక్తి చాలదు.
విజ్ఞులు పరిశీలించవలసినది.
శామలీయం గారు ! తెలుగు "లడ్డు"రుచి ని తగ్గించనంతవరకు వరకు రుచి పెరుగుటకు ఆంగ్ల " కిస్మిస్" ను వాడటం తప్పు లేదని నా అభిప్రాయం.
రిప్లయితొలగించండిజగతి జనుల మేలు జరుప నెంచెడి వారి
మెచ్చ దెపుడు ప్రభుత మెచ్చు ప్రజలు
నాడు నేడు నరుడ చూడగా నిజమిద్ది
జగతిమెచ్చుజనులు జైలు పాలు.
దప్పిదీర్చు నదులు ఉప్పుసంద్రముపాలు
రిప్లయితొలగించండిరాజుగారిసొమ్ము రాళ్ళపాలు
జనహితమ్ముగోరి సంగరమ్మొనరించు
జగతిమెచ్చు జనులు జైలుపాలు
మిత్రులారా! అన్య భాషా పదములను వాడుకొనుట ఎంతవరకు సమంజసము. కొంతవరకు తప్పదు. ఉదా: కారు,కంప్యూటరు, బేంకు. అటులనే మనము వాడుచున్న అనేక వస్తువులకు సరియైన తెలుగు పదములు మనకు రావు. జైలు అనుటకంటె చెర, చెరసాల, కారాగారము, మొదలగు పదములున్నవి కావున వాటిని వాడుటె సమంజసము. సరైన పదములు లేని యెడల వేరొక మార్గము లేదు కనుక దొరకిన పదము ఏ భాషది ఐననూ వాడక తప్పదు. ఇప్పటికే మన భాషలో ఉర్దూ, ఇంగ్లీషు మొదలైన ఇతర భాషల పదములు వాడుకలోనికి వచ్చినవి.
రిప్లయితొలగించండిదొడ్డి దారి బట్టి దొడ్డగ నిధులిచ్చె
రిప్లయితొలగించండిరాజు ప్రాపు కొఱకు మోజు పుట్టి
బయట పడెను కుట్ర పండగ పాపమ్ము
'జగతి'మెచ్చు జనులు జైలుపాలు
జగతి = జగతి పబ్లికేషన్స్
రిప్లయితొలగించండిపైరవీలుజేసి ప్రజలసొమ్మునుదోచి
పెట్టుబడులటంచు పేరుబెట్టి,
సొంత ప్రాభవముల చూపించుకొన్నట్టి
"జగతి మెచ్చు జనులు" జైలు పాలు. ( ఎవరిభావాన్నైన నొప్పించి ఉంటే క్షమించాలి )
గురువుగారూ,
సమస్యలో జగతి మెచ్చు జనులు అంటే జగతి ( కర్త ) మెచ్చుకొనే జనులు అనే అర్థము వస్తుంధి. నా మొదటి ప్రయత్నములో ఈ రకమైన అర్థముతోనే వ్రాసినాను.
ఈ ప్రయత్నములో, జగతి మెచ్చు జనులు = జగతిని మెచ్చే జనులు అనే అర్థములో వాడినాను. ఈ రకమైన ప్రయోగమును సమస్యాపూరణములో చేయవచ్చా??
గురువులు సందేహ నివృత్తి చేయవలసినదిగా ప్రార్థన.
అయ్యా సంపత్ కుమార్ శాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిఏ అర్థములో నయినా వాడుకోవచ్చును.
కందుల వరప్రసాద్ గారి పూరణ ....
రిప్లయితొలగించండిపరువు వలువ లేని పందివలె ఘనులు
జాతి సంపద దిని ఖ్యాతినొంది
ప్రీతితోడ ధనపు బెట్టుబడికి పుత్ర
జగతి మెచ్చు, జనులు జైలు పాలు.
అయ్యా వరప్రసాద్ గారి పూరణలో 1వ పాదములో విలువకు బదులుగా వలువ అని టైపు పొరపాటు వచ్చిందా?
రిప్లయితొలగించండిశ్రీ పండిత నేమాని అన్నయ్యగారికి,శ్రీ శ్యామలీయము గారికి నమస్సులు.తెలుగు భాష సంస్కృత భాష పదజాలము కలుపుకొని విస్తార పద జాలముతో వర్ధిల్లు తున్నది. ఆంగ్ల పదాలు వాడకుండా ఉండాలనుకొంటే కష్టము కాదు. నన్నో మిత్రుడు రోడ్డు కి తెలుగు మాట ఏమిటి అంటే ఒకటేమిటి,దారి,బాట,త్రోవ,పథము,మార్గము నీకు కావలసినది ఎన్నుకో అని చెప్పాను. కుబేరుడు ఉన్న దేశములో ధనా గారాలే లేవా ?, పరాయి దేశ బ్యాంకులలో డబ్బు దాచుకొందుకు. కారుని, వాహనము ( ఆంగ్లములో వెహికిల్ ),బండి,శకటము,రథము, అని ఏమైనా వాడుకోవచ్చును మనము అలవాటు చేసుకొంటే. కంప్యూటర్ కి గణన యంత్రమని అనవచ్చు. నవీన సాధనాలు ఆంగ్లేయులకు క్రొత్తే. వారు కూడా క్రొత్త పదాలు సృష్టి చేసుకోక తప్పదు. ఏ మార్పైనా తీసుకు రావడానికి ఒక్క తరము చాలును. ఇప్పటికే ఈ తరము పిల్లలకు మమ్మీ, డాడీలకు అమ్మ,నాన్న అనే తెలుగు పదాలు ఉన్నాయని తెలీదు. బ్రతుకు తెఱువుకి మనము ఆంగ్లము నేర్చుకోక తప్పక పోయినా పండితుల సహకారముతో తెలుగు పదములు గాలించి బయటకు తీసుకు రావచ్చును, కాకపోతే సృష్టి చేసుకోవచ్చును.ఎప్పుడైనా అన్యదేశములు దొర్లినా భరించ వచ్చును. చక్కని సౌరభాలు వెదజల్లే మల్లెలు,గులాబీలతో బాటు నవీన కృత్రిమ పుష్పాలను శారదమ్మ కాదంటుందా ? ఒకటే యిబ్బంది. ఎప్పుడైనా భరించ వచ్చు ననుకొంటే ప్రతి దినము ఆకాశవాణిలోను దూరదర్శినిలోను,చలనచిత్రాలలోను పదే పదే ఆంగ్లపదాలను వాడి తెలుగు భాషని చంపేస్తున్నారే ! అందువలన వీలయినంత వరకు ఆంగ్ల పదాలను వర్జించడమే మేలు.
రిప్లయితొలగించండిమిత్రులకు శుభాశీస్సులు. అందరి పూరణలు అసలు నేతల దుస్థితిని తరువాతి నేతల ధనప్రీతిని వర్ణించినవి. జైలు పదమును వాడి వరప్రసాద్ గారు ఆంగ్ల భాషాసాంకర్యము గురించి చర్చకు తావిచ్చేరు. శ్యామలీయం గారు ఒక్కమాటుగా దూకుతూ స్పందించేరు - అది వారి భాషాభిమానమునకు మచ్చుతునక. తమ్ముడు నరసింహమూర్తి ఇంకా లోతుగా వెళ్ళి చక్కని సూచనలను చేసేడు. ఇవి ఎంతవరకు ఆచరణలోకి వస్తాయో - రావాలనే అందరము ఆశించుదాము.
రిప్లయితొలగించండిమిత్రులు వరప్రసాద్ గారు, తమ్ముడు నరసింహమూర్తి, సంపత్కుమార్ శాస్త్రి, గోలి హనుమఛ్ఛాస్త్రి, శ్రీ ఆదిభట్ల, మిస్సన్న గారి పూరణలు అభినందనీయముగా అలరారుచున్నవి.ఇందులో ఎవ్వరినీ విడిచిపెట్ట లేదనుకొనుచున్నాను.అందరికీ మరొక్క మారు ఆశీస్సులు శుభయం భూయాత్.