20, నవంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 532 (భారతి భర్త శంభుఁ డని)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
భారతి భర్త శంభుఁ డని
పల్కుట లోకవిరుద్ధ మెట్లగున్?
(జాల పత్రిక "ఈమాట" సౌజన్యంతో)

15 కామెంట్‌లు:

 1. ఘోర తపమ్మొనర్చునదె కోమలి పార్వతి కోరి భర్గునిన్
  తీరునె యామె కోరిక పతీ! యన స్రష్ట వచించె శంకయా
  నేరవె మున్ను శర్వు సతి నేడుమ తథ్యమగు న్నపర్ణకున్
  భారతి! భర్త శంభుఁ డని పల్కుట లోకవిరుద్ధ మెట్లగున్?

  రిప్లయితొలగించండి
 2. సమస్య-531 -నా పూరణ

  'సకల శాస్త్రముల
  ను చదివిన నేమాయె
  సత్త్వగుణము లేక ,శాంతి లేక,
  వ్యసనపరత , యతిశయమ్మహంకృతి, వక్ర
  బుద్ధి గలుగు వారు బుధులు గారు.'
  --------
  గొలిశాస్త్రి గారి 19-11-2011 సమస్యకు నా పూరణ దిగువ ఇస్తున్నాను.
  'హింసామార్గమును విడచి
  సంసారము నందె ధర్మ కార్యనిరతి తో
  కంసారి గొల్వ చాలని
  సంసారిగ మారి యోగి సంతస మందెన్.'
  ---------

  రిప్లయితొలగించండి
 3. మిస్సన్న గారూ ! వాణీ పతి, భారతీ సంవాదంతో మీ పూరణ బహు పసందుగా నున్నది.
  అయ్యా ! కమనీయం గారూ ! అది నేను ఇచ్చిన సమస్య కాదు. శంకరాభరణము లో నేను గతము లో పూరించిన పూరణలను నా బ్లాగునందుంచు చున్నాను. మీరు కూడా నేను మొదట సూచించు తేది ప్రకారము శంకరాభరణము బ్లాగునందు చూచుకొని ఆయా తేది లోని పూరణలలో మీ పూరణను ఉంచవచ్చును. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 4. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మఆదివారం, నవంబర్ 20, 2011 1:01:00 PM

  పేరును వీడి వావిగొనిపిల్చెడి పర్వతవాసులైన శ్రీ
  గౌరి కుటుంబసభ్యులట గాంచుచు వెల్పుల నంబపెండ్లిలో
  శ్రీరమ,యౌనుతా నొదిన, శ్రీహరియన్నయె,తానె కూతురౌ
  భారతి, భర్త శంభుడని పల్కుట లోకవిరుద్ధమెట్లగున్?

  రిప్లయితొలగించండి
 5. ఆదిభట్ల వారూ ! పెళ్లి లో వరుసగా వరసలతో సరసముగా పూరించారు.

  మేరలు లేక భూతముల మేలుగ తానయి నిండె శంభుడే
  మీరక నొక్క లిప్తయును మిన్నుల మన్నుల ప్రాణి సృష్టి తో
  ఈ రచనమ్ము జేయుటకు నెవ్వరు కారణమన్న, భక్తితో
  భారతి భర్త, శంభుఁ డని పల్కుట లోకవిరుద్ధ మెట్లగున్?

  రిప్లయితొలగించండి
 6. తారలు, సూర్య చంద్రులును ,ధారుణి ,తక్కుగలట్టి విశ్వమున్
  మేరలు మీరకుండ బలిమిన్ స్ధితి, సృష్ఠి ,లయాధికారముల్
  కోరిక నిర్వహింతు రలఘుల్ వరుసన్ మధు సూదనుండు ,నా
  భారతి భర్త ,శంభుడని పల్కుట లోక విరుధ్ధ మెట్లగున్?

  రిప్లయితొలగించండి
 7. సారసనాభ ముఖ్యులు ప్రశంసలు చేయుదురే జగద్గురున్
  సారమతిన్ మునీశ్వరులు స్వాంతములన్ గనుచుందు రేవిభున్
  కూరిమి దెల్పవే యనుచు గోరగ లోకహితార్థ యుక్తిమై
  భారతి భర్త శంభుడని పల్కుట లోకవిరుద్ధ మెట్లగున్

  రిప్లయితొలగించండి
 8. శ్రీపతిశాస్త్రిఆదివారం, నవంబర్ 20, 2011 6:19:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  ఆరవిచంద్రవహ్నులటు యందముగానయనంబులేయనన్
  వైరము లేనివాడెవడు పావనపుణ్యపునీతుడెవ్వడో
  నీరజగర్భ జెప్పుమన నాముని వర్యుని గాంచి పల్కె
  భారతిభర్త, శంభుఁ డని, పల్కుట లోకవిరుద్ధ మెట్లగున్?

  రిప్లయితొలగించండి
 9. శ్రీపతిశాస్త్రిఆదివారం, నవంబర్ 20, 2011 6:23:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  ఆరవిచంద్రవహ్నులటు యందముగానయనంబులేయనన్
  వైరము లేనివాడెవడు పావనపుణ్యపునీతుడెవ్వడో
  నీరజగర్భ జెప్పుమన నాముని వర్యుని గాంచి పల్కె నా
  భారతిభర్త, శంభుఁ డని, పల్కుట లోకవిరుద్ధ మెట్లగున్?

  రిప్లయితొలగించండి
 10. అయ్యా శ్రీపతి శాస్త్రి గరూ!మీ పూరణ సవరించాలి:

  (1) లటు + యందము -- యడాగమము రాదు కదా.
  (2) పావన పుణ్య పునీతుడు = అన్వయము సరిపోవుట లేదు
  (3) నీరజ గర్భుతో మొదలైన పాదములో యతి సరిపోవుటలేదు.

  రిప్లయితొలగించండి
 11. guruvaryulaku namassulu. aaryaa,eenaati samasyapooraNalO tappulanu mannimci naa pooraNalanu delete cEyavalasinadigaa Sree Sakaraiah gaarini korucunnaanu. amma aSeessulu,net sahakaaramu koodaa nEdu naaku lOpincinadi.

  tappulanu savarimcE prayatnam cEstaanu.

  రిప్లయితొలగించండి
 12. కారణ మెల్ల లోకముల కామెయె సర్వ నిలింప దేవియౌ
  మారమణుండు ,ధాతయు నుమాపతి శక్తి యనుజ్ఞ వర్తులే
  వేరగు మూర్తులన్ బడసి వెల్గె త్రిదేవుల రూపు దాల్చి యా
  భారతి భర్త శంభుడని పల్కుట లోక విరుద్ధ మెట్లగున్

  రిప్లయితొలగించండి
 13. కోరివరించినాతనిని కూడిగృహమ్మునకాలుబెట్టబోన్
  ద్వారమువద్దనిల్పినను, దారినిగాచి లతాంగులెందరో
  పేరునిజెప్పిరమ్మనగ,బేలను,వేఱొకదారిఁగాంచకన్,
  భారతి! భర్త శంభుడని పల్కుట లోక విరుద్ధ మెట్లగున్?

  రిప్లయితొలగించండి
 14. పోరుచు రాజకీయమున పొందుగ చేరుచు మంత్రిమండలిన్
  కోరుచు గంగనీరమును గొప్పగు రీతిని శుద్ధిజేయుటన్
  చేరుచు కైలసమ్మునను చిందులు త్రొక్కెడి భాజపా ఉమా
  భారతి భర్త శంభుఁ డని
  పల్కుట లోకవిరుద్ధ మెట్లగున్?

  రిప్లయితొలగించండి