ఓం స్వామియే శరణమయ్యప్ప మేషరాశి వారు నన్ను క్షమించమని కోరుతూ, ---------------
హీనులకు శుభమ్ములిచ్చు శివుడు యన మేము హీనులమని మేషరాశి వారు ముందు నిల్చి, వదల బొమ్మాళి వ దల యనగ, జనులకు దైవమేది? ( మేషరాశివారు = రాక్షసులుగా బావించగలరు)
మందాకినిగారన్నారు, శుభములిచ్చు బదులు శుభములనిచ్చు అని ఉండాలేమో అని. అమ్మా సమస్యలో శుభమ్ము లిచ్చు అని ఉంది. . శుభములు, శుభంబులు, శుభమ్ములు అన్నీ సాధువులే సమానార్ధ ప్రతిపాదకములే. శుభమ్ములన్ + ఇచ్చు --> శుభమ్ములనిచ్చు మరియు శుభమ్ములు + ఇచ్చు --> శుభమ్ములిచ్చు కూడా సాధుప్రయోగాలే, కించిదర్ధఛాయాబేధంతో.
*మందాకినిగారి పద్యం బాగుంది. *నరసింహ మూర్తి గారు 'యప్రమేయుఁడు నైన' అన్నారు. 'యప్రమేయుండైన' అనటం సాధారణప్రయోగం. చిన్న విషయం. పద్యం బాగుంది. *గోలివారి పద్యంలో మొదటిపాదాన్ని ముందను కొన్నట్లు సరిచేయాలి. పద్యం చాలా హృద్యంగా ఉంది. *నేమానివారి పద్యం నడక ప్రకారం చివర మానమోహాదివిహీనులకును అనివస్తే మరింత పధ్ధతిగా ఉండేది. కాని వీలవటంలేదు. ఇది చాలా చిన్న విషయం. పద్యం పసందుగా ఉంది. *వరప్రసాదుగారి 'శివుడ యన' అసాధుప్రయోగం. యడాగమం రాదు. ఉత్తునకచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము కాన, 'శివుడన' అని అనకతప్పదు. గణం సరిపెట్టాలి కాబట్టి మీరు 'శివుడనంగ' అంటే సరి. *రాజారావుగారు 'క్రితము' అన్న పదం వాడారు. ఇది ఇలా వాడచ్చునా యన్నది నా అనుమానం. పైగా ఈ పదం సాధుత్వంపైనే నాకు అనుమానం. విజ్ఞులు పరిశీలించాలి. *ఊకదంపుడుగారి పద్యం వ్యర్ధసంశయం వద్దని ప్రబోధిస్తోంది. బాగుంది.
మిత్రులారా! శ్రీ శ్యామల రావు గారు చాల శ్రమ తీసుకొని సవరణలు, సలహాలు ఇస్తూ ఔత్సాహిక కవులందరికి మంచి ప్రోత్సాహము ఇస్తున్నారు. వారికి బహుధా శుభాకాంక్షలు. మన పూరణలలో మంచి పరిణామము వస్తుంది - వ్రేలెత్తి చూపడానికి వీలు లేని విధముగా అందరి పద్యాలు ఉండాలని నా ఆకాంక్ష. యడాగమము, నుగాగమము, సమాస నిర్దుష్టతల గురించి నిత్యము వ్యాఖ్యలు కనిపించుచునే యున్నవి. నేను సామాన్య విషయాలనే చెప్పుదా మనుకొను చున్నాను గాని ప్రత్యేకముగ ఎవరి పద్యమును ఉదహరిద్దాము అని అనుకొనుటలేదు. అందుచేత నా ఈ సూచన ఏమిటంటే పద్యమును ప్రచురించేముందు మీలో మీరే మరొక్క మారు చూచుకొనండి. అప్పుడు సవరణలకు తావు ఉండదు అని నా ఊహ. స్వస్తి.
శ్రీ నేమాని మహాశయులకు, కవి మిత్రులకు విన్నపము. ఇక్కడ మాకు సెలవుదినములు కావున శ్యామలీయం గారన్నట్లు కార్యాంతర లౌకిక కార్యక్రమములు చక్కదిద్దుకొనుటవల్ల వ్యవధి దొరకటంలేదు. నిన్నటి సమస్య గురించి - సమస్య కూర్చి మాస్టారికి ఇవ్వటం వరకే నా వంతు. ఎప్పుడు, యెలా మార్చి వేస్తారో వారి యిష్టం. నిజానికి నేను వారికి ఇచ్చిన సమస్య "చీమలు ప్రాకెడు రొదవిని సింహము లడరెన్ (లేక సింహము లదరెన్) అని. కొన్ని మార్పులతో అది నిన్ననే వస్తుందని నాకు తెలియదు. అలా తెలిజేయటం మాస్టారికి వీలుకాదని కూడా నాకు తెలుసు. ఏతావాతా, కాలవ్యవధి వల్ల నిన్నటి సమస్య పూరించలేదు. మరలా వేగం అందుకొనే ప్రయత్నం చేస్తాను. సాహితీ చర్చలు రసవత్తరంగా, జ్ఞానదాయకంగా వుంటున్నాయి. ధన్యవాదాలు.
శాస్త్రిగారూ యీ 'ఆది భిక్షుకు మ్రొక్క యన్నంబు సమకూర్చు' అన్న పాదం కూడా సుష్టువుగా లేదు. 'మ్రొక్క యన్నంబు' అని గాక 'మ్రొక్క నన్నంబు' అని ఉండాలి. అదీ గాక 'భిక్షుకు' అని గాక భిక్షుని అను యుంటే సమంజససమని నా భావన.
నేమాని వారికి నమస్కారం. నేను కూడా కేవలం ఔత్సాహిక కవినే గాని పెద్దగా చేయి తిరిగిన వాడను గాను. అందునా నిన్నమొన్నటి దాక బహుకాలం పద్యవ్యాసంగానికి దూరంగా ఉండటం వలన ధారాదులు కుంటుతున్నాయి కూడా. నిన్ననే నా పాత రచన (అసంపూర్ణం) ఒక దానిని పరికిస్తే ఒక పేజీ పద్యాల్లో పది పన్నెండు యతిభంగాదులు కనబడ్డాయి. ఈ బ్లాగు వలన నేను కూడా చాలా అభ్యాసలబ్ధి పొందుతున్నానని మనవి జేయడానికి చాలా సంతోషిస్తున్నాను . పైగా, బోనస్సులుగా మంచి మంచి పరిచయాలు పొందుతున్నాను, మంచి పాఠాలు కూడా అందుకుంటున్నాను.
అందరూ చక్కగా పూరించేరు. నాకు ఈరోజు వీలుపడలేదు. అమెరికా కవి మిత్రులూ, పై వారంలో నేను అమెరికా వస్తునాను. మీకు అభ్యంతరం లేకుంటే మీ మీ ఫోను నంబర్లు నాకు మెయిల్ చెయ్యండి. ఓమారు పలకరించి మాట్లాడతాను.
నా ఇష్టదైవము మీద చనువుతో పూరించిన మరో పూరణ. ఈ సారి ఆ.వె. లో:: కట్టుబట్ట చూడ గబ్బుముఱికితోలు వల్లకాడ తనికి మల్లె పాన్పు (పుఱ్ఱె కంచ మనగ పొత్తుద య్యాలతో బిచ్చమెత్తు మొదటి బిచ్చగాడు) జగములేలు జెట్టి జంగముడాతడె హీనులకు శుభమ్ములిచ్చు శివుడు! మనవి: ఆటవెలది కి ఆరు పాదాలు కూడదు అంటే మధ్యలోని రెండు పాదాలూ తీసేసి చదువుకోవచ్చు.
వయస్సు పెరిగి మతి కృశించినా మత్సరము తగ్గదే ! బంధువులు,హితజనమ్ముల పైన మరీ యెక్కువవుతుంది.అందఱిలో శివుని గాంచిన మత్సరమునకు స్థానము లేదు గదా ! ( దోషములున్న పెద్దలు దిద్దగలరు ! )
గురువుగారికి, విద్వత్సభకు నమస్కారములు.
రిప్లయితొలగించండిచాలా రోజుల తర్వాత మళ్ళీ రాగలిగినందుకు సంతోషంగాఉన్నది.
ఎల్లవారలతని కిష్టులు గాదొకొ
జీవులెల్ల తనదు సృష్టి గాదె,
జ్ఞానులకును మరియు జ్ఞానము లేనట్టి
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు
శుభములిచ్చు బదులు శుభములనిచ్చు అని ఉండాలేమో అని సందేహము.
ఆత్మ తత్వ మెఱిగి యప్రమేయుఁడు నైన
రిప్లయితొలగించండినిర్గుణుండు భవుఁడు నిఖిల మనుచు
భక్తి మీఱఁ గొలిచి రక్తి నొందెడి పాప
హీనులకు శుభమ్ము లిచ్చు శివుఁడు.
ఆది భిక్షువు వేడ నన్నంబు సమకూర్చు
రిప్లయితొలగించండిభస్మ దారి నడుగ భాగ్య మిడును
భూత నాధు గొలువ భువి లోన సౌభాగ్య
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు
మందాకిని గారూ చక్కని పూరణ. మీ పునర్దర్శనము మిత్రు లందఱికీ సంతోషదాయకము.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమందాకిని గారూ ! బహుకాల దర్శనం.... చక్కటి పూరణ చేశారు.
రిప్లయితొలగించండిమూర్తి గారూ ! ఆత్మతత్వమెరిగిన మీ పూరణ బాగుంది .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమూర్తిగారు, హనుమచ్ఛాస్త్రి గారు, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ పూరణలలో చక్కటిధార ఉన్నది. ఇరువురకు అభినందనలు.
మూర్తి గారూ! నిజమే .. టై పాటు లో దారి తప్పిన ధారి ని సరి చేశాను. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఆది భిక్షువు వేడ నన్నంబు సమకూర్చు
భస్మ ధారి నడుగ భాగ్య మిడును
భూత నాధు గొలువ భువి లోన సౌభాగ్య
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు
జ్ఞానవహ్ని దగ్ధ కర్మ సంచయులకు
రిప్లయితొలగించండిసంగహీనులకును శత్రుషట్క
హీనులకును నిరత మాన మోహాది వి
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు
శాస్త్రి గారూ మొదటి పాదములొ గణములు సరిపోలేదు, సవరించాలి. బహుశా పనిలో ఉండి ఉంటారిప్పుడు.
రిప్లయితొలగించండిఓం స్వామియే శరణమయ్యప్ప
రిప్లయితొలగించండిమేషరాశి వారు నన్ను క్షమించమని కోరుతూ,
---------------
హీనులకు శుభమ్ములిచ్చు శివుడు యన
మేము హీనులమని మేషరాశి
వారు ముందు నిల్చి, వదల బొమ్మాళి వ
దల యనగ, జనులకు దైవమేది?
( మేషరాశివారు = రాక్షసులుగా బావించగలరు)
బుధుడ !విడు మహంకార- మీ భువిని దీని
రిప్లయితొలగించండిగెల్చిన మనుజుడే జ్ఞాని - క్రితము జడము
లయ్యు శ్రీ కాళ హస్తు లహంకృతి విడిచె-
మెచ్చి హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు
----- సుజన-సృజన
మంత్రహీనులైన మహి ఋషిప్రోక్తవ్ర
రిప్లయితొలగించండితాచరణవిహీనులైన "గావ
నతడు రాక యున్న?"నను వ్యర్ధ సంశయ
హీనులకు శుభమ్ములిచ్చు శివుడు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగోలివారిపద్యంలో 'ఆది భిక్షువు వేడ నన్నంబు సమకూర్చు' ను 'ఆది భిక్షు వడుగ నన్నంబు సమకూర్చు' అని మారిస్తే సరిపోతుంది.
రిప్లయితొలగించండిమందాకినిగారన్నారు, శుభములిచ్చు బదులు శుభములనిచ్చు అని ఉండాలేమో అని. అమ్మా సమస్యలో శుభమ్ము లిచ్చు అని ఉంది. . శుభములు, శుభంబులు, శుభమ్ములు అన్నీ సాధువులే సమానార్ధ ప్రతిపాదకములే. శుభమ్ములన్ + ఇచ్చు --> శుభమ్ములనిచ్చు మరియు శుభమ్ములు + ఇచ్చు --> శుభమ్ములిచ్చు కూడా సాధుప్రయోగాలే, కించిదర్ధఛాయాబేధంతో.
రిప్లయితొలగించండిఅయ్యా, ధన్యవాదాలు. నా సందేహం శుభమ్ముల విషయంలో కాదు. న్ విషయంలోనే. సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీ పూరణలో స్వ కు బదులు వ్వ టైప్ చేసినట్టున్నారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి*మందాకినిగారి పద్యం బాగుంది.
రిప్లయితొలగించండి*నరసింహ మూర్తి గారు 'యప్రమేయుఁడు నైన' అన్నారు. 'యప్రమేయుండైన' అనటం సాధారణప్రయోగం. చిన్న విషయం. పద్యం బాగుంది.
*గోలివారి పద్యంలో మొదటిపాదాన్ని ముందను కొన్నట్లు సరిచేయాలి. పద్యం చాలా హృద్యంగా ఉంది.
*నేమానివారి పద్యం నడక ప్రకారం చివర మానమోహాదివిహీనులకును అనివస్తే మరింత పధ్ధతిగా ఉండేది. కాని వీలవటంలేదు. ఇది చాలా చిన్న విషయం. పద్యం పసందుగా ఉంది.
*వరప్రసాదుగారి 'శివుడ యన' అసాధుప్రయోగం. యడాగమం రాదు. ఉత్తునకచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము కాన, 'శివుడన' అని అనకతప్పదు. గణం సరిపెట్టాలి కాబట్టి మీరు 'శివుడనంగ' అంటే సరి.
*రాజారావుగారు 'క్రితము' అన్న పదం వాడారు. ఇది ఇలా వాడచ్చునా యన్నది నా అనుమానం. పైగా ఈ పదం సాధుత్వంపైనే నాకు అనుమానం. విజ్ఞులు పరిశీలించాలి.
*ఊకదంపుడుగారి పద్యం వ్యర్ధసంశయం వద్దని ప్రబోధిస్తోంది. బాగుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమందాకినిగారు ముద్రారాక్షసం గమనించారు. ధన్యవాదాలు. కాని నాపూరణలో యతిదోషంకూడా దొర్లింది. సరిచేసిన పూరణ:
రిప్లయితొలగించండిఒరుల కెగ్గు చేయు నూహల నడగించి
ఎల్లవారిమంచినెంచునట్టి
సర్వవిషయ ములను స్వపరబేధ వి
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు
మిత్రులారా!
రిప్లయితొలగించండిశ్రీ శ్యామల రావు గారు చాల శ్రమ తీసుకొని సవరణలు, సలహాలు ఇస్తూ ఔత్సాహిక కవులందరికి మంచి ప్రోత్సాహము ఇస్తున్నారు. వారికి బహుధా శుభాకాంక్షలు. మన పూరణలలో మంచి పరిణామము వస్తుంది - వ్రేలెత్తి చూపడానికి వీలు లేని విధముగా అందరి పద్యాలు ఉండాలని నా ఆకాంక్ష. యడాగమము, నుగాగమము, సమాస నిర్దుష్టతల గురించి నిత్యము వ్యాఖ్యలు కనిపించుచునే యున్నవి. నేను సామాన్య విషయాలనే చెప్పుదా మనుకొను చున్నాను గాని ప్రత్యేకముగ ఎవరి పద్యమును ఉదహరిద్దాము అని అనుకొనుటలేదు. అందుచేత నా ఈ సూచన ఏమిటంటే పద్యమును ప్రచురించేముందు మీలో మీరే మరొక్క మారు చూచుకొనండి. అప్పుడు సవరణలకు తావు ఉండదు అని నా ఊహ. స్వస్తి.
శ్యామల రావు గారూ ! ధన్యవాదములు.... ఆది భిక్షువు (ను ) వేడ.. అనే అర్థం స్ఫురించుట లేదని తలచి చిన్న సవరణ తో ...
రిప్లయితొలగించండిఆది భిక్షుకు మ్రొక్క యన్నంబు సమకూర్చు
భస్మ దారి నడుగ భాగ్య మిడును
భూత నాధు గొలువ భువి లోన సౌభాగ్య
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు
బ్రహ్మహత్య నొనర్చిన పాపియైనఁ
రిప్లయితొలగించండిబుధుల నిందించి పీడించు యధముడైన
ఆర్తిఁ హరహర శంకర యనిన చాలు
ఇట్టె హీనులకు శుభమ్ములిచ్చు శివుడు!
శ్రీ నేమాని మహాశయులకు, కవి మిత్రులకు విన్నపము. ఇక్కడ మాకు సెలవుదినములు కావున శ్యామలీయం గారన్నట్లు కార్యాంతర లౌకిక కార్యక్రమములు చక్కదిద్దుకొనుటవల్ల వ్యవధి దొరకటంలేదు. నిన్నటి సమస్య గురించి - సమస్య కూర్చి మాస్టారికి ఇవ్వటం వరకే నా వంతు. ఎప్పుడు, యెలా మార్చి వేస్తారో వారి యిష్టం. నిజానికి నేను వారికి ఇచ్చిన సమస్య "చీమలు ప్రాకెడు రొదవిని సింహము లడరెన్ (లేక సింహము లదరెన్) అని. కొన్ని మార్పులతో అది నిన్ననే వస్తుందని నాకు తెలియదు. అలా తెలిజేయటం మాస్టారికి వీలుకాదని కూడా నాకు తెలుసు. ఏతావాతా, కాలవ్యవధి వల్ల నిన్నటి సమస్య పూరించలేదు. మరలా వేగం అందుకొనే ప్రయత్నం చేస్తాను. సాహితీ చర్చలు రసవత్తరంగా, జ్ఞానదాయకంగా వుంటున్నాయి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశాస్త్రిగారూ యీ 'ఆది భిక్షుకు మ్రొక్క యన్నంబు సమకూర్చు' అన్న పాదం కూడా సుష్టువుగా లేదు. 'మ్రొక్క యన్నంబు' అని గాక 'మ్రొక్క నన్నంబు' అని ఉండాలి. అదీ గాక 'భిక్షుకు' అని గాక భిక్షుని అను యుంటే సమంజససమని నా భావన.
రిప్లయితొలగించండిఛంద్రశేఖరులవారి పద్యం బాగుంది.
రిప్లయితొలగించండినేమాని వారికి నమస్కారం. నేను కూడా కేవలం ఔత్సాహిక కవినే గాని పెద్దగా చేయి తిరిగిన వాడను గాను. అందునా నిన్నమొన్నటి దాక బహుకాలం పద్యవ్యాసంగానికి దూరంగా ఉండటం వలన ధారాదులు కుంటుతున్నాయి కూడా. నిన్ననే నా పాత రచన (అసంపూర్ణం) ఒక దానిని పరికిస్తే ఒక పేజీ పద్యాల్లో పది పన్నెండు యతిభంగాదులు కనబడ్డాయి. ఈ బ్లాగు వలన నేను కూడా చాలా అభ్యాసలబ్ధి పొందుతున్నానని మనవి జేయడానికి చాలా సంతోషిస్తున్నాను . పైగా, బోనస్సులుగా మంచి మంచి పరిచయాలు పొందుతున్నాను, మంచి పాఠాలు కూడా అందుకుంటున్నాను.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశామలరావు గారూ! ధన్యవాదములు. శివుని దోష రహితంగా వేడాలని నా ప్రయత్నము. మీ సూచనతో.. చిన్న సవరణ..
రిప్లయితొలగించండిఆది భిక్షు వేడ నన్నంబు సమకూర్చు
భస్మ ధారి నడుగ భాగ్య మిడును
భూత నాధు గొలువ భువి లోన సౌభాగ్య
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు
అందరూ చక్కగా పూరించేరు.
రిప్లయితొలగించండినాకు ఈరోజు వీలుపడలేదు.
అమెరికా కవి మిత్రులూ, పై వారంలో నేను అమెరికా వస్తునాను. మీకు అభ్యంతరం లేకుంటే మీ మీ ఫోను నంబర్లు నాకు మెయిల్ చెయ్యండి. ఓమారు పలకరించి మాట్లాడతాను.
my mail ids are
ssap@eim.ae
or
sk.sarma@adssc.ae
శ్యామలరావు గారూ,
రిప్లయితొలగించండిమన్నించాలి - స్వపరభేదవి /హీనులన్నపుడు - ఓ మాత్ర తగ్గినదేమోనని సందేహం
భవదీయుడు
నా ఇష్టదైవము మీద చనువుతో పూరించిన మరో పూరణ. ఈ సారి ఆ.వె. లో::
రిప్లయితొలగించండికట్టుబట్ట చూడ గబ్బుముఱికితోలు
వల్లకాడ తనికి మల్లె పాన్పు
(పుఱ్ఱె కంచ మనగ పొత్తుద య్యాలతో
బిచ్చమెత్తు మొదటి బిచ్చగాడు)
జగములేలు జెట్టి జంగముడాతడె
హీనులకు శుభమ్ములిచ్చు శివుడు!
మనవి: ఆటవెలది కి ఆరు పాదాలు కూడదు అంటే మధ్యలోని రెండు పాదాలూ తీసేసి చదువుకోవచ్చు.
"కట్టుబట్టచూడ..." పూరణ నాదే. ఎందుకో "The Other చెప్పారు..." అనే పేరుమీద పోస్ట్ అయింది.
రిప్లయితొలగించండిఆదిభిక్షువందురు గాని అన్నపూర్ణ
రిప్లయితొలగించండియాలి గాదెనీకు? బడిది గంబరుడని
యందురే మరి నీ వస్త్ర మంబరమది
మారుని హతమార్చిన సుకుమారుడవని
లోకులు పలు రీతుల నిను కాకుల వలె
తప్పుగాబల్కి నీ కీర్తిఁ చెప్పు కొనెడి
వారెరుగరె హీనులకు శుభమ్ములిచ్చు
శివుడవని చిత్రములిక చేయక నను
గావుమా చంద్రశేఖర గరళకంఠ!
వయస్సు పెరిగి మతి కృశించినా మత్సరము తగ్గదే ! బంధువులు,హితజనమ్ముల పైన మరీ యెక్కువవుతుంది.అందఱిలో శివుని గాంచిన మత్సరమునకు స్థానము లేదు గదా ! ( దోషములున్న పెద్దలు దిద్దగలరు ! )
రిప్లయితొలగించండిమతియు చెడును గాని మత్సరం బుడుగదే
హితుల నెడల మిగుల నతిశయించుఁ
గలయ శివునిఁ గనగఁ గలుగదు మత్సర
హీనులకు శుభమ్ము లిచ్చు శివుఁడు
పాహి యనిన చాలు వరము లిడెడు వేల్పు
రిప్లయితొలగించండిభక్తి తోడ వేడ ముక్తినిచ్చు
దీన జనులగాచు దేవదేవుడు,బల
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు!!!.
ఊకదంపుడుగారీ గురివిందకు వాతబెట్టారు. అవునండీ మరొక మాత్ర తగిలించాలి. 'స్వపరబేధ విహీనులకు' బదులుగా ప్రస్తుతానికి 'స్వపరాది బేధ విహీనులకు' అందాము. అనేక ధన్యవాదాలు
రిప్లయితొలగించండినేను మరొక వాత పెట్టచ్చా?:) అది "భేదము" కానీ బేధము కాదు కద?
రిప్లయితొలగించండికన్ను మిన్ను మన్ను గానక పాపముల్
రిప్లయితొలగించండిచిన్న నాటి నుండి చేసి నాడ
వింటి నార్తి తోడ వేడగ నాబోటి
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు.