20, నవంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 533 (బక సేవలు చేయ సకల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బక సేవలు చేయ సకల భద్రము లొదవున్.
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. రకరకముల దారుల విడి
    సకలంబగు లోక నాథ సర్వేశ్వరునే
    ఇక నీవే దిక్కని త్ర్యం
    బక సేవలు చేయ సకల భద్రము లొదవున్.

    రిప్లయితొలగించండి
  2. ఒకపరి శంభో శంకర
    ఒకపరి హరహర మహేశ ఒకపరి శివ నా-
    కిక గతి నీవే యని త్ర్యం
    బక సేవలు చేయ సకల భద్రము లొదవున్.

    రిప్లయితొలగించండి
  3. సుకృతీ! విను వనజాతాం
    బకులే విధి, విష్ణు, శివులు భక్తి చెలంగన్
    త్రికరణ శుద్ధిగ వనజాం
    బక సేవలు చేయ సకల భద్రములొదవున్

    (వసుచరిత్రలో వారిజాంబక శబ్దమునకు
    వారిజము అంబగా కలవాడు బ్రహ్మ అనియు,
    వారిజము నేత్రముగా కలవాడు విష్ణువు అనియు,
    వారిజము (అగ్ని) నేత్రముగా కలవాడు శివుడు అనియు ప్రయోగము కలదు - దాని ఆధారముగా ఈ పూరణ జరిగినది)

    రిప్లయితొలగించండి
  4. మిత్రులకు అభినందనలు.
    నిన్నటి నా వ్యాఖ్యలో శివానందలహరి గురించి ప్రస్తావించేను. అది కవిత్వాభిలాషులు చదువదగిన మంచి గ్రంథము. అనేక విధ వృత్తాలతో, భక్తి జ్ఞాన యోగ సమన్వితమైన వర్ణనలతో, శబ్ద అర్థ అలంకారాలతో శోభిల్లుతూ ఉంటుంది. అందులో మొదటి శ్లోకమే ఒక మచ్చు తునక. దానిని పారాయణ చేస్తే చాలును కళాత్మకులు, అక్షర స్వరూపులు, వాగర్థ వైభవులు, జగద్గురువులు అయిన పార్వతీ పరమేశ్వరుల కరుణను పొంది మంచి కవితా నైపుణ్యము లభించును.
    కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః
    ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే
    శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపునర్
    భవాభ్యా మానందస్ఫుర దనుభవాభ్యాం నతిరియం

    రిప్లయితొలగించండి
  5. మిత్రుల పూరణలు అలరారుతున్నాయి. శ్రీ పండిత నేమాని అన్నయ్య గారి పూరణ అందముగానే గాక విజ్ఞానదాయకముగా కూడా ఉంది.

    మకరాంకుని పగతుని భవు
    వికలమ్మును లేని యట్టి విశ్రుత చరితున్
    సుకరమె యట చేకొన త్ర్యం
    బక సేవలు చేయ సకల భద్రము లొదవున్

    రిప్లయితొలగించండి
  6. నా పూరణ ....

    శుక నారద తుంబుర శౌ
    నక మునిగణ వందితాంఘ్రి నాళీకయుగుం
    డకళంక సూర్యచంద్రాం
    బక సేవలు చేయ సకల భద్రము లొదవున్.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ నేమానిమహాశయా! మంచి శ్లోకము అందించారు. మానాన్నగారు నా చిన్నతనంలో నేర్పినది. అయితే "కలాభ్యా౦..." అని చదువుకొంటాను. కలాభ్యాం మరియు కళాభ్యాం అనేశబ్దాలకు అర్థభేదం లేదని విన్నాను. వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  8. సుకృతంబెప్పటిదో,పా
    యక,వెన్నంటి, పదవినిడనక్కొండలపై
    "నికనాదశతిరిగె"నను
    బ్బక సేవలు చేయ సకల భద్రము లొదవున్.

    [తిరిగెనని - ఉబ్బక]

    రిప్లయితొలగించండి
  9. అయ్యా చంద్రశేఖర్ గారూ!
    కల మరియు కళ అనే శబ్దాలకు అర్థ భేదము లేదనుకొంటాను. మనము కళ అనే పదమునే ఎక్కువగా వాడుచున్నాము. కల అంటే తెలుగులో స్వప్నము అనియును సంస్కృతములో మాధుర్యము అనే అర్థమునకు వాడుచున్నాము. శశికళ చిత్కళ మొదలగు ప్రయోగములలో కళ విరివిగా కనిపించుచున్నది. సంస్కృతములో ళ అనే అక్షరము లేదనుకొంటాను. ఏదైన మీ తండ్రిగారు ఎలాగ చెప్పారో అలాగే పలుకుట మంచిది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! చంద్రశేఖర్ గారూ!
    మీ పూరణ చూచేను- బాగున్నది. 2వ పాదములో రక అని మొదలిడి యతి స్థానములో హరిణము అని వాడేరు. అందుచేత యతిని సరిచేసుకోవలెను.

    రిప్లయితొలగించండి
  11. నా మరో పూరణ .....

    "మకరాంక గర్వభంజన!
    సకల భువన వంద్య! శూలి! శంకర!" యని న
    మ్మికతో భక్తులు నిటలాం
    బక సేవలు చేయ సకల భద్రము లొదవున్.

    రిప్లయితొలగించండి
  12. ఒకపరినా నారాచపు
    రకమెరిగిననా కనకపు రంకువు తలచెన్
    ఇక రాఘవ నిర్ముక్తాం
    బక సేవలు చేయ సకల భద్రము లొదవున్
    సూచన: నారాచము=బాణము; అంబకము=బాణము అనే అర్థములో (కన్నుఅనికాదు)

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారు, గన్నవరపు వారు ,పండిత నేమాని వారు ,చంద్ర శేఖర్ గారు,ఊకదంపుడు గారు, చక్కని పూరణలు చేశారు.
    శంకరార్యా ! రెండు పద్యాలలో మూడు కళ్లను స్మరించిన మీ పూరణలు అద్భుతముగా నున్నవి.

    రిప్లయితొలగించండి
  14. మన తెలుగు - చంద్రశేఖర్సోమవారం, నవంబర్ 21, 2011 7:10:00 AM

    శ్రీనేమాని మహాశయా! ధన్యవాదా:

    రిప్లయితొలగించండి
  15. **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    ‘వనజాతాంబక’ శబ్దార్థవైవిధ్యంతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    ఊకదంపుడు గారూ,
    వైవిధ్యంగా ‘ఉబ్బక’ శబ్దప్రయోగంతో మంచి పూరణ ఇచ్చారు. అభినందనలు.
    ‘అని + ఉబ్బక’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది కదా. ‘ఇక దశయె తిరిగె నని యు / బ్బక ...’ అంటే ఎలా ఉంటుంది?
    **********************************************************************
    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు. మీ రెండు పూరణలు చాలా బాగున్నాయి. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారూ, ధన్యవాదములు. మీరు చెప్పిన సవరణ చాలా బాగుంది

    రిప్లయితొలగించండి
  18. ఒక కాలి మీద యోగము
    నొక లక్ష్యము తోడ జేసి యొంటరి తనమున్
    కెకకెక యనకనె నోర్చెడి
    బక సేవలు చేయ సకల భద్రము లొదవున్


    యోగము = బకాసనము

    రిప్లయితొలగించండి
  19. అకటా! రాహులు భయ్యా!
    నికటంబుగ కాశి జేరి నిర్మల మతితో
    నొక జందెమ్మూనుచు త్ర్యం
    బక సేవలు చేయ సకల భద్రము లొదవున్

    రిప్లయితొలగించండి