కవి మిత్రులారా,
నేను ఎప్పుడో ముప్పై యేళ్ళ క్రితం వ్రాసిన కథానిక ‘దత్తత’ కోడీహళ్ళి మురళీ మోహన్ గారు నిర్వహించే ‘కథాజగత్’లో ప్రకటింపబడింది. క్రింది లింకు ద్వారా ఆ కథను చదివి మీ అభిప్రాయాలను తెల్పండి.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/dattata---kandi-sankarayya
ఒక సగటు భారతీయ పౌరుని ఆలొచనా సరళి, ప్రవర్తన ఖచ్చితంగా ఇలానె వుంటుంది. srinivas HYD
రిప్లయితొలగించండికధ చాలా బాగుంది. ఆ పరిస్తితిలో ఎవరైనా అలాగే చేస్తారు. మంచి ముగింపు.
రిప్లయితొలగించండికొసమెరుపుగా, "నా అంతర్మధనానికి పరిష్కారం, నాలో కలిగిన పరివర్తన, విమలని ఒప్పించాలి వివేక్ దత్తతకి ఏర్పాట్లు చేయాలి" అనుకొంటూ వరంగల్ తిరుగు ప్రయాణం అయ్యాను." అని ముగిస్తే సందేశాత్మకంగా ఉండేదేమో!
రిప్లయితొలగించండికథ పురుషుల మనస్తత్వానికి వాస్తవ పరిస్తితులకు అద్దం పట్టింది. మనిషి తనరక్త సంబంధానికి ఎంత ప్రాధాన్యతనిస్తాడో కళ్ళకు కట్టింది. కథలు కూడా వ్రాయాలనే తపన మళ్ళీ నాలో మొదలయ్యింది.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
శుభస్య శీఘ్రమ్... ఇక మొదలు పెట్టండి.