5, నవంబర్ 2011, శనివారం

దత్తపది - 16 (మూడు, ఆరు, ఏడు, పది)

కవిమిత్రులారా,
"మూడు, ఆరు, ఏడు, పది"
పై పదాలను సంఖ్యావాచకాలుగా కాకుండా ఉపయోగించి
మహాభారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.

29 కామెంట్‌లు:

  1. శ్రీ కృష్ణుడు రాయబారం లో ద్రుత రాష్ట్రుని తో...

    ఏడుపదియె మిగులు యేనాడు గెలువరు
    మూడు మీకు యెంత మొత్తుకొనిన
    పదిల మైన రాజ్య మది నాశ నమ్మగు
    నారు మీదు వంశ మంత మగును

    రిప్లయితొలగించండి
  2. చిన్న సవరణ తో..

    ఏడుపదియె మిగులు నేనాడు గెలువరు
    మూడు మీకు యుద్ధ మొదవి నపుడు
    పదిల మైన రాజ్య మది నాశ నమ్మగు
    నారు మీదు వంశ మంత రించు.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    శాస్త్రీజీ బావుంది రాయబారం !

    రాయబారానికి వెళ్తున్న శ్రీ కృష్ణునితో భీముడు :

    01)
    _____________________________________

    ద్రౌపది నవమాన పరచి - తప్పు జేసె !
    దార్తరాష్ట్రుల కాయువు - ధరణి మూడు !
    ఆరుడే వారి నికమీద - నావహించు !
    ఏడుగడ లేదు వారల - కిదియె నిజము !
    _____________________________________
    ఆరుడు = శని
    ఏడుగడ = దిక్కు = రక్ష

    రిప్లయితొలగించండి
  4. పాశమూడు వేళ పావనభీష్ముఁడు
    ఆరుబయట చేరె నంప శయ్య
    నేడుమ్రొక్కుల మది నేకాంగునిఁ దలచె
    నోప దిక్కు నీవె చూప మనుచు!

    రిప్లయితొలగించండి
  5. నా పూరణ ....
    రాయబారఘట్టంలో శ్రీకృష్ణుడు దుర్యోధనినితో ....

    పాడి దప్పినచో కీడు ‘మూడు’ మీకు
    నా వృకోదరుని పగ చ‘ల్లారు’నట్టు
    లెసఁగి మిముఁ జంప మిగిలెడి ‘దేడు’పె గద
    బంధుజనులకు; యోచింపు ‘పదిల’ మేదొ!

    రిప్లయితొలగించండి
  6. కంది శంకరయ్యగారు, మాలిక వ్యాఖ్యల సెక్షన్ లో అంతా మీ బ్లాగు వ్యఖ్యలే. కొన్నిసార్లు ఈ పద్యాలను చూస్తుంటే చికాకు కలిగిస్తున్నాది. నాలుగు సంబంధం లేని పదాలు రాసుకొవటం, దాని మీద ఒక పద్యం చేప్పటం. సొల్లు, జొల్లు,జల్లు, వంటిల్లు వీటిని ఉపయోగించి త్రిష అందం మీద ఒక పద్యం రాయమన్నా రాసేయగ ల సామర్ధ్యం మీకు ఉందని తెలుసు. మీరు కొన్ని రోజులు దయచేసి ఈ రాయటానికి బ్రేక్ ఇవ్వండి.పద్యాలు చెప్పటం పేకాటను మించిన పెద్ద వ్యసనంగా ఉందని పిస్తున్నది. కనీసం వారానికి ఒక్కరోజన్నా మీబ్లాగుకు సెలవు ఇవ్వండి.

    రిప్లయితొలగించండి
  7. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, నవంబర్ 05, 2011 2:54:00 PM

    కృష్ణుడు ద్రౌపది తో .....

    ఏడు పేల నమ్మ! మూడు నవ్వారికి
    పడతి! పదిల పడుము భయము విడుము
    పతులు ధర్మ బధ్ధ భావన నున్నారు
    నేను గాచు కొందు నిన్ను నమ్ము

    రిప్లయితొలగించండి
  8. కాలము మూడునంచు మది కౌరవనేతకు భీతియయ్యు, శ
    స్త్రాలకు విందుజేయు సమరంబున నా రుధిర ప్రవాహమే
    మేలిడు నంచు నెంచెనొ సుమీ చను నేడును నేడుగాని పో
    జాలదు చెడ్డ బుద్ధి వినజాల డహో పదిలంపు బల్కులన్

    రిప్లయితొలగించండి
  9. అయ్యా, అజ్ఞాత గారూ,
    మీకు అంతగా ఇబ్బంది కలిగితే చూడడం మానుకోండి. మీ కిష్టం కానిది మరొకరికి ఇష్టం కావచ్చు. మీరు చెప్పినప్పుడు ‘మాలిక’ వ్యాఖ్యల విభాగం లెక్కపెట్టి చూసాను. మొత్తం 94 వ్యాఖ్యలు ఆ పేజీలో ప్రకటింపబడితే శంకరాభరణం బ్లాగుకు చెందినవి 5 మాత్రమే. అవే మీకు ఎక్కువా?
    ఒకపని చేయండి. మాలిక, కూడలి, హారం, జల్లెడ తదితర అగ్రిగేటర్లకు ‘శంకరాభరణం’ బ్లాగును, ఆ బ్లాగులో వచ్చే వ్యాఖ్యలను నిషేధించమని కోరుతూ మెయిల్ పెట్టండి.
    నేనైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా రోజుకొక సమస్య ఇవ్వాలనుకున్నాను. ఉత్సాహం ఉన్న కవులు పూరణలు చేసి వ్యాఖ్యలుగా పంపిస్తారు. అవి తప్పనిసరిగా అగ్రిగేటర్లలో దర్శనం ఇస్తాయి. ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి. అంతేకాని ఎవరికో చిరాకు వేస్తున్నదని మానుకొనవలసిన అవసరం నాకు లేదు. ఇది వ్యసనమే... కాని మంచి వ్యసనమని గుర్తించే సంస్కారం మీకుండాలి.
    నా బ్లాగును, వ్యాఖ్యలను నిషేధించమని అగ్రిగేటర్లకు అప్లికేషన్ పెట్టుకోండి.
    విచక్షణాజ్ఞానం కల అగ్రిగేటర్ నిర్వాహకులు ఏం చేయాలో నిర్ణయిస్తారు.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శంకరయ్య గారూ!

    దిన దినమొక్కొక్క సమ
    స్యనిడుచు నితర ప్రక్రియలను విడువకే
    మనముల నలరించ గలరు
    మన సభ్యుల కెల్ల మీరు మహనీయ గుణా!

    రిప్లయితొలగించండి
  11. ఆడిన మాట తప్ప కులమారును యుద్ధము నందు భూవరా!
    మూడును ధార్తరాష్ట్రులకు మూర్ఖపు బుద్ధిన పోరు కోరినన్
    చూడగ సంధి మేలగును, సోదర భావము తప్పు వేళలో
    నేడుపె యంత్యమందునగు నింపది కాదు తలంప పోరుకై!!

    రిప్లయితొలగించండి
  12. ఆయువు మూడునీ దినము హద్దులు మీఱుచు నుంటివేమిరా?
    కాయము చీల్చి యారుచిని కత్తికి చూపెద నిప్పుడిక్కడే!
    సాయము చేయరారెవరు చచ్చెద వీవిక, నేడుపే మరే
    మీయగ లేవు నీ సతికి; మెచ్చెద నింపది నాకు పోరులన్.

    భీముడు దుర్యోధనునితో.....

    రిప్లయితొలగించండి
  13. మన తెలుగు - చంద్రశేఖర్శనివారం, నవంబర్ 05, 2011 6:31:00 PM

    నేమాని మహాశయా!
    దత్తపదిలో ఇచ్చిన పదాలను అదే వరుస క్రమంలో వాడాలని విన్నాను, చూచాను అలాగే పూరించాను. ఈ బ్లాగ్లో కొందరు అలా చేయటంలేదు. వారు కూడా కరెక్టు కావచ్చు. ఇది నియమమా లేక స్వేచ్చాయుత సంప్రదాయమేనా? అవధానులు నేమాని వారు వివరించగలరు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అనే సామేత నేనెరుగుదును. కనిసం ఒక్కసారి మీదృష్ట్టికి తీసుకొస్తే ఎమైనా మారుతారని ఆ వ్యాఖ్య రాశాను. నా అనుమానం నిజమైంది. అగ్రిగేటర్లకు అప్లికేషన్ పెట్టుకోవటానికి మాలిక బ్లాగు ఏమైనా గవర్నమేంట్ ఆఫీసా. విచక్షణాజ్ఞానం కల అగ్రిగేటర్ నిర్వాహకులు అమేరికాలో ఉన్నరు. వారు తెలుగును భాషకు చేయుత నివ్వాలి అని మీ వ్యఖ్యలను తప్పక ప్రచూరిస్తారు. కనుక వారికి అర్జీ పేట్టుకోవటం లేదు . మీ విజ్ణతకే వదలి వేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  15. కృష్ణుడు రాయబారానికి వెళ్ళే సందర్భంలో ద్రౌపదితో చెప్పిన మాటలు:

    మూడును ధార్తరాష్ట్రులకు మోదము కల్గును నీకు తప్పదీ
    యేడు రణంబు కల్లయగు నిత్తరి సంధి పరాభవాగ్ని ని-
    న్వీడును కౌరవాధముల వీటను దీపము లారు ధర్మజుం-
    గూడి ధరిత్రి నేలెదవు కూడదు శోకము మాను ద్రౌపదీ!

    రిప్లయితొలగించండి
  16. తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్
    తమ కార్యంబు ఘటించుచో పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్
    తమకై యన్య హితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్ వృథాన్యర్థ భం-
    గము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్ !

    - భర్తృహరి సుభాషితం.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా చంద్రశేఖర్ గారూ!
    అవధానములో అయితే దత్తపదిని ఇచ్చే పృఛ్ఛకుడు నిర్దేశించ వచ్చు పదముల యొక్క క్రమమును, సందర్భమును మరియు వాడవలసిన ఛందస్సును. అవే నియమములను మనము కూడా పాటించాలి. కాని ఈరోజు దత్తపదిలో కేవలము సందర్భమును మాత్రమే ఇచ్చారు. ఛందస్సును, పద క్రమమును నిర్దేశించ లేదు.

    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  18. అయ్యా మిస్సన్న గారూ!
    మీరు మంచి పద్యమునే చూపించేరు. అందులో 2వ పాదములో "ఘటించుచో" కి బదులుగా 'ఘటించుచున్" అని ఉండాలని నాకు జ్ఞాపకము.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ మిస్సన్న గారూ!
    అలాగే 3వ పాదములో "వృధాన్యార్థ" (వృధా + అన్య + అర్థ) అని ఉండాలి.

    రిప్లయితొలగించండి
  20. నేమాని పండితులవారూ మీరు చెప్పినదే సక్రమము కావచ్చును.
    నేను హైస్కూలు రోజుల్లో చదువుకొన్న పద్యం ఇది. అలాగే చదివినట్లు గుర్తు.
    మీరన్నట్లు వృధా సరియైనది. వృథా తప్పు. ధన్యవాదములండీ.

    రిప్లయితొలగించండి
  21. అయ్యా ! ఈ అఙ్ఞాత ఎవరోగాని వ్యాఖ్య చాలా సంస్కారహీనంగా ఉంది !
    తనకిష్టం లేకపోతే చూడ్డం మానుకోవచ్చునే !

    మన బ్లాగు మిత్రులందరూ ముక్త కంఠంతో దీన్ని
    ఖండించవలసిన అవసరం ఉంది !

    మిత్రులారా ! మీ మీ స్పందనలు తప్పక తెలియజెయ్యండి !

    ఇటువంటి వాటికి అలసత్వం కూడదు !

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న మహాశయా ! మీరు ముందే స్పందించారా !
    చక్కగా చెప్పారు !

    రిప్లయితొలగించండి
  23. **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    వంశం ‘ఆరు, అంతరించు’ అన్నచోట పునరుక్తి.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    అది ‘ఏడు’మ్రొక్కులా? ‘నేడు’ మ్రొక్కులా?
    **********************************************************************
    లక్కాకుల రాజారావు గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    కాని ‘ఉన్నారు’లో ‘ఆరు’ లేదనుకుంటాను.
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    జిగురు సత్యనారాయణ గారూ,
    మందాకిని గారూ,
    మిస్సన్న గారూ,
    అద్భుతంగా ఉన్నాయి మీ పూరణలు. అభినందనలు.
    **********************************************************************
    Last but not least ...
    దయచేసి ‘అజ్ఞాత’ గారి వ్యాఖ్యను పట్టించుకోకండి. నేను సమాధానం చెప్పాను కదా! మన బ్లాగును వివాదాలకు అతీతంగా కొనసాగిద్దాం.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  24. అయ్యా అజ్ఞాత గారూ లోకములో సహించ రాని విషయాలు కోకొల్లలు ఉంటుంటే మీ అసహనమునకు శంకరాభరణ బ్లాగే దొరికిందా ?
    ఈ బ్లాగులో పద్యాలు వ్రాస్తూ మీ అయిన వాళ్ళు మిమ్ములను నిర్లక్ష్యము చేస్తూంటే గురువుగారికి చెప్పండి. మందలిస్తారు.

    రిప్లయితొలగించండి
  25. అయ్యా అజ్ఞాత గారూ ! మీకు నచ్చనప్పుడు మిమ్ములను ఎవరు చదవమని బలవంత పెట్టరు కదా. ఇన్ని రోజులు చదివినందులకు ధన్యవాదములు.ఇకనుండి మీకు నచ్చిన విషయాలను చదువు కోండి. కొన్ని రుచులు కొందరి ఒంటికి సరిపడవు.తప్పు లేదు. మొండి వారమయిన మమ్ములను వదలి వేయండి.

    రిప్లయితొలగించండి
  26. మాస్టారూ,
    ధన్యవాదాలు. "ఏడుమ్రొక్కులు=అనేక నమస్కారములు" అనే అర్థంలో ప్రయోగించాను. ఏడు సంఖ్య గా కాకుండా అనేక అని సూచిస్తోందని. అయితే దీనికి వ్యుత్పత్తి అర్థం తెలిసిన వారు వివరించగలరు. అది సంఖ్య ఏడు నుండి వస్తే నేను మారుస్తాను. .

    రిప్లయితొలగించండి
  27. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంఆదివారం, నవంబర్ 06, 2011 12:38:00 PM

    శంకరాభరణం కవులూ, అభిమానులూ ఒక అజ్ఞాని (అజ్ఞాత) ని పట్టించుకోనవసరం లేదనుకుంటున్నాను.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  28. అజ్ఞాత గారి సమస్య కి నాకు తోచిన పరిష్కారం .

    శంకరాభరణం వెల్లువ ఒక ఆరు (తమిళం లో ఆరు అంటే ఏరు )
    దాని వెల్లువ మీ మూడు పోగిట్టిన
    హారం వ్యాఖ్యలు చదువక ఏడుపు మాని
    పదిలం గా బ్లాగులు చదువు కొండు

    చదువరీ - హారమే ఒక వ్యసనం అందులో పడనేల ?
    కాళ్ళు కడగనేల ?

    రిప్లయితొలగించండి