25, నవంబర్ 2011, శుక్రవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/1

                   అయ్యప్ప కథాగానం - 1/1
           నేను వ్రాసిన ‘అయ్యప్ప కథాగానం’ రెండు భాగాల ఆడియో లింకులను ఇంతకు ముందే ఇచ్చాను. ఈ పాట సాహిత్యాన్ని కూడా బ్లాగులో ప్రకటించమని కొందరు మిత్రులు కోరారు. పాట పెద్దది కనుక భాగాలుగా బ్లాగులో ప్రకటిస్తున్నాను. దయచేసి ఇందులో ఛందోవ్యాకరణాల దోషాలను పట్టించుకోవద్దని మనవి.

శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం
|| శ్రీకరం ||

ధర్మశాస్తా భూతనాథుండు హరిహరుల
        పుత్రుడై జన్మించి మణికంఠుడను పేర
        పందళరాజుకు వనమందు దొరికాడు
|| పందళ ||
పన్నెండవ యేటనే - మహిషిని
        మర్దించి కాపాడెను - లోకాల,
శబరికొండను వెలసిన - అయ్యప్ప
        కథ వింటె లభియించును - పుణ్యాలు
|| శ్రీకరం ||

అత్రి అనసూయలు అన్యోన్యదంపతులు
        బ్రహ్మశివకేశవులు కొడుకులై పుట్టగా
        వరము పొందాలని పూజలే చేసారు
|| వరము ||
వారి పూజలు మెచ్చిరి - దేవుళ్ళు
        కనిపించి వరమిచ్చిరి - అత్రికి,
ఆ త్రిమూర్తుల అంశలే - ఒక్కటై
        పొందె దత్తాత్రేయుడు - జన్మను.


ముగ్గురు మూర్తుల అంశలే దత్తుడై
        జన్మించెనని వారి భార్యలకు తెలిసింది
        తమవంతు కర్తవ్యమును చేయదలచారు
|| తమ ||
ముగ్గురమ్మల అంశలే - ఒక్కటై
        వెలిసింది యోగమాయ - లోకాన
లీలావతి పేరుతో - గాలవుని
        కూతురై జన్మించియు - వర్ధిల్లె
|| శ్రీకరం ||

దత్తలీలావతులు తగిన జంటగ ఎంచి
        ఆ అత్ర్రి గాలవులు అతివైభవముతోడ
        కళ్యాణమే చేసి సంతోషపడ్డారు
|| కళ్యాణ ||
అన్యోన్యదాంపత్యమే - వారిది
        ఆదర్శసంసారమై - కొనసాగె,
ఎల్లలే లేకుండగా - ఇద్దరు
        సంసారసుఖ మందిరి - తృప్తిగా


ఒకనాడు దత్తుండు లీలావతిని పిలిచి
        సంసారసుఖమంత అనుభవించితి మింక
        వానప్రస్థం పోవు కోరికే మిగిలింది
|| వాన ||
సంసారులకు తప్పక - కావాలి
        భార్య అంగీకారము - నయముగ,
అనుమతించి పంపవే - అర్ధాంగి
        తపము చేయగ పోదునే - అన్నాడు
|| శ్రీకరం ||

ఆ మాట మన్నించలేని లీలావతి
        నా కామవాంఛలు తీరనేలేదయ్య
        నిను వీడి క్షణమైన నేనుండలేను
|| నిను ||
పట్టమహిషిని విడుచుట - నీకెట్లు
        భావ్యమని తోచెనయ్యా - నా నాథ!
నీ పట్టమహిషి నేనై - నిన్నెట్లు
        విడుతునని అనుకొంటివి - అని పల్కె 


ఎంత చెప్పిన గాని వినని భార్యను చూసి
        "పట్టమహిషిని నీకు మహిషినని అంటావు
        మహిషి రూపముతోడ జన్మించవే నీవు"
|| మహిషి ||
అని శాపమే ఇవ్వగా - కోపించి
        ప్రతిశాపమే ఇచ్చెను - ఆ దేవి
"మహిషరూపము దాల్చియు - నీ వపుడు
        నా కోరెలే తీర్తువు" అని పలికె
|| శ్రీకరం ||

క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

2 కామెంట్‌లు:

 1. గురువు గారికి ధన్యవాదములు, నా కొరకు "శ్రీకరం శుభకరం అయ్యప్ప చరితం,
  మధురం మనోహరం ఆనందభరితం" పాటను అందించునందులకు. స్వామి వారి చరిత్రను చాలా విపులముగా వర్ణించితిరి. నాకు తెలియని చాలా విషయములు తెలియజేసితిరి. మీరు కష్టములోనుండి కూడా ఇంత సాహిత్యసేవ జేయుట మీకు మాత్రమే సాధ్యము. ఆ స్వామి కృపతో మీ కష్టములు అతి తొందరలో కడతేరగలవు.
  వరప్రసాదు

  రిప్లయితొలగించండి
 2. గురు స్వాములకు నమస్కారములు
  స్వామి కదా సారాన్ని చక్కగా విని పించి నందుకు ధన్య వాదములు.

  రిప్లయితొలగించండి