ప్రాసమైత్రి - 2
5) సంయుతాసంయుత ప్రాస -
రేఫంతో కాని లకారంతో కాని సంయుతమై ఉన్న హల్లుతో, రేఫ లకారాలు లేని అదే హల్లుతో ప్రాస కూర్చుట. (అనగా ప్రాసాక్షరాలుగా క్ర-క, క్లే-క మొదలైనవి ప్రయోగించుట). దీనిని చాలామంది లాక్షణికులు ఒప్పుకొనలేదు.
ఉదా.
పాఁడి ద్రచ్చఁగ నిమ్ము నా*తండ్రి కృష్ణ (పాఁడి-తండ్రి)
వేఁడుకొనియెద నందాఁకఁ* బండ్లు దినుము (వేఁడు-బండ్లు)
దుండగపు చేష్టలును నోటి*గాండ్రతనము (దుండ-గాండ్ర)
మెండుగాఁ జొచ్చె నీకు నై*దేండ్లు కనఁగ. (మెండు-దేండ్లు) (అప్పకవీయము. 3-315)
6) రేఫయుత ప్రాస -
వట్రసుడి (ఋత్వం) ఉన్న హల్లు(కృ)కు, ఉకార రేఫ ఉన్న హల్లు(క్రు) ప్రాసలో దేనికి దానితోనే మైత్రి చెల్లుతుంది. అనగా కృ-క్రు లకు ప్రాస వేయరాదు. నిజానికి ఇక్కడ నిషేధం చెప్పినందున దీనిని ప్రాసభేదంగా చెప్పవలసిన అవసరం లేదు.
7) లఘు ద్విత్వ ప్రాస -
సాధారణంగా ఏకపదంలోని సంయుక్తాక్షరానికి ముందున్న హ్రస్వం గురు వవుతుంది. కాని కొన్ని (విద్రుచు మొదలైన) పదాలలోని రేఫ సంయుక్తాక్షరం దాని ముందున్న లఘువును గురువు చేయదు. అటువంటి పదాన్ని ప్రయోగించినప్పుడు అన్ని పాదాలలోను అటువంటి పదాలనే ప్రయోగించాలి. ఒకపాదాన్ని ‘విద్రుచు’తో మొదలుపెట్టి మరోపాదాన్ని ముద్ర, కద్రువ, భద్రము, నిద్ర మొదలైన పదాలు వేయరాదని భావం.
ఉదా.
అ) విద్రుచు వినతాత్మజుఁడు దిక్కు*లద్రువ ననఁగ. (విద్రుచు-అద్రువ) (అప్ప. 3-326)
ఆ) ఎద్రిచిన ...
పద్రిచిన .....
విద్రుపఁగ ....
చిద్రుపలు ..... (ఉత్తర హరివంశము)
8) వికల్ప ప్రాస -
కకారం మొదలైన పొల్లు హల్లులకు (క, చ, ట, త, ప లకు) అనునాసికాలు పరమైనప్పుడు అవి ఆయా వర్గపంచమాక్షరాలు (ఙ, ఞ, ణ, న, మ) గానో, వర్గ తృతీయాక్షరాలు (గ, జ, డ, ద, బ) గానో మారుతాయి. ఈ ఆదేశం వైకల్పికం. ప్రాక్+నగ=ప్రాఙ్నగ, ప్రాగ్నగ అని రెండు రూపా లేర్పడుతాయి. ఈ కారణం చేత వర్గ పంచమాక్షరాలు అయా వర్గ తృతీయాక్షరాలతో ప్రాసమైత్రి పొందుతాయి.
ఉదా.
ప్రాఙ్నగ సమానధృతి సుధా*రుఙ్నిభాస్య
స్రఙ్నిచయ సక్తకంఠ దా*వాగ్ని పాయి (స్రఙ్ని- వాగ్ని)
వాఙ్మనోహరనుత యస*దృఙ్మహాత్మ
దిఙ్మహితకీర్తి యర్జున*యుగ్మభేది (దిఙ్మ- యుగ్మ) - (అప్ప. 3-328)
మరికొన్ని రేపటి పోస్టులో. దీనిపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి.

మాస్టారూ, ఈ రోజు పాఠంనుంచి కొన్ని క్రొత్త సంగతులు తెలుసుకొన్నాను. సంయుతాసంయుత ప్రాస చెల్లదనే అనుకొన్నాను ఇన్నాళ్ళూ. ఈ సారి అది వేసి చేయి కాల్చుకోవచ్చన్నమాట :-) ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిగురువులు , పూజ్యులు , [ సోదరులు ] అందరికీ అభినందనలు + నమస్కారములు. మూడు రోజులుగా బ్లాగు చూడలేక పోవడంతో అన్నీ మిస్సయ్యాను. ఆహా ! ఎన్ని చందస్సులు ? ఎన్ని పూరణలు ? ఎన్ని చర్చలు ? చాలా ఆనందంగా ఉంది.
రిప్లయితొలగించండి" యతి ప్రాస " అనే గుర్తు గానీ " ఇన్ని రకాల ప్రాసలు " ఇప్పుడే తెలిసింది.
అరవై లొ ఇరవై కి వెళ్ళి పాఠాలు నేర్చు కొ గలుగుతున్నందుకు వింత అనుభూతి. " ఒక్క క్షణం " విద్యార్ది దశ .
---------------------------------
నేర్పుతున్న గురువుకు ధన్య వాదములు + కృతజ్ఞతలు
శంకరార్యా ! చక్కని పాఠానికి ధన్యవాదములు !
రిప్లయితొలగించండి"విద్రుచు" లో "వి" యెందుకు లఘువవుతుంది ?
ఇటువంటి పదాలు ఇంకా ఉన్నాయా ?
ఉంటే వాటిని తెలుసుకొనుటెట్లు ?
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండి‘దీనిని చాలామంది లాక్షణికులు ఒప్పుకొనలేదు’ అన్న మాటను గమనించినట్టు లేదు. ఎక్కడో క్వాచిత్కంగా ప్రయోగింపబడిన లక్ష్యానికి ఇది లక్షణం. అంతే కాని దీనిని ప్రయోగించవచ్చు అని కాదు. ఎవ్వరూ హర్షించరు. కనుక దీనికి జోలికి వెళ్లకండి.
*
రాజేశ్వరి అక్కయ్యా,
సంతోషం. ధన్యవాదాలు.
*
వసంత కిశోర్ గారూ,
"చుక్పరక రువర్ణంబునకు ముందఱి దువర్ణంబు నుత్వంబునకు లోపంబు విభాష నగు. అగుచో తత్పూర్వంబు గురువు కాదు" అని బాలవ్యాకరణం చెప్తున్నది (బాల. వ్యా. ప్రకీర్ణ. 20)
ప్రేరణార్థంలో వచ్చే ‘చుక్’ ప్రత్యయం పరమైనపుడు ‘రు’అనే అక్షరానికి ముందున్న ‘దు’ అనే అక్షరంలోని ఉకారం వికల్పంగా లోపిస్తుంది. ఉత్వలోపం కలిగిన సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు కాదు అని ఈ సూత్రం భావం.
అద్రుచు, ఎద్రుచు, పద్రుచు, విద్రుచు మొ.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిసంయుతాసంయుతప్రాస కొందరు ప్రయోగించియుండవచ్చు.అంతమాత్రంచేత అది ప్రమాణ మని నేను భావించను.వాడకుంటేనే మంచిదని నా అభిప్రాయం. వాడిన తరువాత అది చదువుతుంటే యెలాంటి ధ్వని వస్తుందో అదే ప్రధాన మని నా అభిప్రాయం.అంటే మధురమైన ధ్వని మాత్రమే రావాలని
రిప్లయితొలగించండినా ఉద్దేశ్యం.ఇది ఎవరికి వారే తేల్చుకోవచ్చు.