శ్రీలత, మీ అన్నయ్య కన్నా నువ్వే బాగా వ్రాశావు. ఐదవ తరగతి చదువుతూ కంద పద్యం వ్రాశావంటే బ్రహ్మాండం. "...నగధర కృష్ణా!" బాగుంది. నాకు ఐదవతరగతిలో కంద పద్యం అంటే ఏమిటో తెలియదు. నువ్వు చూడు యెంత బాగా వ్రాశావు. ఈ సారి తేట గీతిలో పద్యం వ్రాసి చూపించు. శుభాశీస్సులు.
గురువుగారికి ధన్యవాదములు తెలుపుతూ గడాఫీ చరిత్రను ఈ విధముగా ----------- దేశ సంపదలను దోచిన దొరవారు పంచె గష్టములను ప్రజలకెల్ల, తాళలేకవారు తిరుగుబాటులు జేయ జనము గాంచి నేత జాఱుకొనెను.
పూర్వం రష్యా ,అఫ్ఘనిస్తాన్ ,మొన్న ఇరాక్ , నిన్న లిబియా , అన్నిటికీ ఒక విషయం లో మాత్రం సారూప్యముంది , చమురు నిల్వలు లేదా ఆధిపత్యం .. అలాంటి ఇంకో దేశమే ఉంటే , ఆ దేశాధిపతి ఇవన్నీ చూసి పారిపోయాడంటూ ... నా పూరణ
అగ్ర రాజ్య కుటిల యవినీతి పోకడల్ ఇంక చెల్లవంటు యెదురు నిలిచి ధిక్కరించెడన్యదేశాధిపతుల భం జనముఁ గాంచి నేత జాఱుకొనెను !
నారాయణ లక్ష్మీపతి, నారాయణ వాసుదేవ నందకుమారా నారాయణ నిను నమ్మితి, నారాయణ నన్ను బ్రోవు నగధర క్రిష్ణా.
5వ తరగతి విద్యార్ధిని యిలా వ్రాయగలగటం చాలా ఆనందించ దగిన గొప్ప విశేషం. నా మొదటి పద్యం నేను 8వ తరగతిలోనుండగా వ్రాసినట్లు గుర్తు - అదీ వెఱ్ఱి మొఱ్ఱిగా. ఈ 5వ తరగతి చిన్నారి యిలా నిర్దుష్టంగా వ్రాయటం నిజంగా ఆశ్చర్యం. అద్భుతం.
శ్రీ వరప్రసాద్ గారి పద్యము చదివితే వారికి యతి నియమము పూర్తిగా తెలిసినటుల లేదు. దేశ కు దొర కు యతి చెల్లదు. తాళ కు తిరుగు కు యతి చెల్లదు. యతి మైత్రి హల్లులకు మాత్రమే కాదు, ఆ హల్లులతో ఉన్న అచ్చులకు కూడా సరిపోవలెను. ఇ ఈ ఎ ఏ ఋ ౠ లకు యతి చెల్లుతుంది. అ ఆ ఐ ఔ లకు యతి చెల్లుతుంది. ఉ ఊ ఒ ఓ లకు యతి చెల్లుతుంది. హల్లులతో బాటు ఆయా అచ్చులు కూడా చూచుకొంటూ యతి వేయవలెను.
శ్రీ కళ్యాణ్ గారి పూరణలో కుటిల + అవినీతి సవర్ణదీర్ఘ సంధి చేయవలెను. భంజనము అంటే శబ్ద రత్నాకరములో విరుచుట అని ఉంది. ప్రభంజనుడు అంటే వాయుదేవుడు. వారు ఏ అర్థములో వాడేరో?
********************************************************************** గన్నవరపు నరసింహ మూర్తి గారూ, చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. ‘శోభగ’ శబ్దప్రయోజనం? ‘సొమ్ముఁ దిరిగి యిటకె తెమ్మటంచును క్రమ్ము’ అంటే ఎలా ఉంటుంది? ********************************************************************** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, శ్రీలతను ప్రశంసిస్తూ పద్యం వ్రాసినందుకు ధన్యవాదాలు. ********************************************************************** శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, మీరు ఈతిహాసవృత్తాంతాన్ని తీసికొని చక్కగా పూరించారు. బాగుంది. అభినందనలు. ********************************************************************** వరప్రసాద్ గారూ, మంచి విషయాన్ని ఎన్నుకొని మీరు చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. పండిత నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా! నా సవరణ .... ‘దోచి సంపదలను దాచిన దొరవారు .... ... .... తాళలేక పట్టి తన్నఁజూచినయట్టి ...’ ********************************************************************** లక్కాకుల వెంకట రాజారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ********************************************************************** కళ్యాణ్ గారూ, చక్కని విషయాన్ని ఎన్నుకొన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. నామాని వ్యాఖ్యను గమనించారు కదా! ‘అగ్రరాజ్యసమితి యవినీతి ....’ ‘ధిక్కరించు శత్రు దేశాధిపతుల ...’ అందాం. ********************************************************************** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ********************************************************************** శ్యామల రావు గారూ, చి. శ్రీలతను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. **********************************************************************
చి. శ్రీలతా ! కృష్ణ శతకంలోని మొత్తం పద్యాలన్నీ కంఠస్తం చేసి రోజుకో పద్యం చొప్పున నాన్నగారి బ్లాగులో పెట్టు. ఆ కృష్ణుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చదువు బాగా వస్తుంది. సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు.
మిస్సన్న గారూ, ఇది కృష్ణశతకంలోని పద్యమా అని మొదట నాకూ అనుమానం వచ్చింది. అయితే ఆ శతకంలోని ఏవో కొన్ని పద్యాలే నాకు తెలుసు. నిజంగానే చి. శ్రీలత వ్రాసిన పద్యం అనుకున్నాను. మీరు చెప్పిన తర్వాత వెదికితే అది కృష్ణశతకంలోని 92వ పద్యం అని ‘గూగులమ్మ’ చెప్పింది. ధన్యవాదాలు.
భోజన ప్రియుడైన ఒక కపట నేత కష్టాలు (హాస్యోక్తి): పేద వారి ముద్ద పెద్ద విందనె నేత హంగు గాను కలిసి మ్రింగ నెంచి నంత చిన్నపళ్లె మందరగొత్తు భో జనముఁ గాంచి నేత జాఱుకొనెను
ఎన్నికలకు పూర్వ మెన్నెన్నొ బాసలు
రిప్లయితొలగించండిచేసి పిదప చాటుచేసి మోము
తనను నిలువరించు జనులేగుదేర నా
జనము గాంచి నేత జారుకొనెను
నీట చేప వోలె, నిండార తైలమ్ము
రిప్లయితొలగించండిపూసుకొన్న దొంగ వోలె యిడిన
మాట నిలుపు కొనుట మరచి వెరపు గల్గి
జనముఁ గాంచి నేత జాఱుకొనెను
కోత లెన్నొ కోసి కోతల మిగిల్చి
రిప్లయితొలగించండిరాగ సభకు నేడు రభస జరిగి
' రచ్చ బండ' లోన 'రచ్చరచ్చను' జేయు
జనముఁ గాంచి నేత జాఱుకొనెను
నేమాని పండితవర్యా ! మీ పూరణ ప్రశస్తంగా ఉంది.
రిప్లయితొలగించండినా పూరణ ......
రిప్లయితొలగించండిజనహితమ్ముఁ గోరి సాగింతు నుద్యమ
మనుచు రెచ్చగొట్టి జనుల జీవ
నమును చెఱచి తుదకు సమకూరు స్వప్రయో
జనముఁ గాంచి నేత జాఱుకొనెను.
హనుమచ్చాస్త్రి గారూ కోతలను మిగిల్చి అంటే గణం సరిపోతుంది.
రిప్లయితొలగించండిగురువు గారూ అద్భుతమైన పూరణ. నీతిలేని నాయకులకు కొర్రువాత.
రిప్లయితొలగించండినా పూరణ ఇలా ఉంటే ఇంకా బాగుంటుందేమో ....
రిప్లయితొలగించండిజనహితమ్ముఁ గోరి సాగింతు నుద్యమ
మనుచు రెచ్చగొట్టి జనుల జీవ
నమును చెఱచి ప్రభుత సమకూర్చు స్వప్రయో
జనముఁ గాంచి నేత జాఱుకొనెను.
అయ్యా మిస్సన్న గారూ! మీ ప్రశంసలకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ పూరణలో ఉపమానములు బాగున్నవి.
నేమాని
అయ్యా! శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండిమీ మొదటి పూరణలో ప్రయోజనము ఎక్కడినుండి వచ్చునో ఆ కారణము నిగూఢముగా నున్నది - అందుచేత దాని పరిధి విశాలముగా ఉన్నది.
నేమాని
గురువుగారికి నమస్కారములు
రిప్లయితొలగించండిమా అన్న శంకరనారాయణ లాగా నేనూ రాయగలను నాకూ మీ ఆశీస్సులు కావాలి.
నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర క్రిష్ణ
శ్రీలత 5వ తరగతి
మిస్సన్న గారూ ! సవరణకు ధన్యవాదములు
రిప్లయితొలగించండినేత జారు కుంటాడనే తొందరలో గణమును గమనించ లేదు.
శ్రీ నేమని గారి, మాస్టారు గారి, మీ పూరణలు మూడు ముచ్చటగా నున్నవి.
నా పూరణ సవరణతో..
కోత లెన్నొ కోసి కోతలను మిగిల్చి
రాగ సభకు నేడు రభస జరిగి
' రచ్చ బండ' లోన 'రచ్చరచ్చను' జేయు
జనముఁ గాంచి నేత జాఱుకొనెను
శ్రీలత,
రిప్లయితొలగించండిమీ అన్నయ్య కన్నా నువ్వే బాగా వ్రాశావు. ఐదవ తరగతి చదువుతూ కంద పద్యం వ్రాశావంటే బ్రహ్మాండం. "...నగధర కృష్ణా!" బాగుంది. నాకు ఐదవతరగతిలో కంద పద్యం అంటే ఏమిటో తెలియదు. నువ్వు చూడు యెంత బాగా వ్రాశావు. ఈ సారి తేట గీతిలో పద్యం వ్రాసి చూపించు. శుభాశీస్సులు.
నీతి పథముఁ దప్పి జాతిసంపద దోచి
రిప్లయితొలగించండిదానవుండ యెచట దాచితీవు
సొమ్ముఁ దిరిగి తెమ్ము శోభగ నని గ్రమ్ము
జనముఁ గాంచి నేత జాఱుకొనెను
శంకర నారాయణ, శ్రీలత లకు అభినందనలు. మిమ్ములను ముగ్గురమ్మలు చల్లగా చూస్తారు !
రిప్లయితొలగించండిఅయ్యా! నరసింహ మూర్తి గారూ:
రిప్లయితొలగించండిమీ పద్యము 3వ పాదములో "గ్రమ్ము" ను 'క్రమ్ము"గా చదువుకుందాము. నుగాగమము రాదు.
శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు
రిప్లయితొలగించండినీతి పథముఁ దప్పి జాతిసంపద దోచి
దానవుండ యెచట దాచితీవు
సొమ్ముఁ దిరిగి తెమ్ము శోభగ నని క్రమ్ము
జనముఁ గాంచి నేత జాఱుకొనెను
అందెను నీకే శ్రీలత
రిప్లయితొలగించండికందము మరి వ్రాయు నట్టి కవన విధమ్మే
మందును నీయాసక్తిని?
కందిన మరిచేయి మాన కమ్మా రచనల్!
విరటసుతుడు నేత విజయుండు సారధి
రిప్లయితొలగించండిగాను పోరుసేయ కదలిపోగ
నురకలేయునట్టి కురురాజ సైనిక
జనము గాంచి నేత జారుకొనెను
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
గురువుగారికి ధన్యవాదములు తెలుపుతూ
రిప్లయితొలగించండిగడాఫీ చరిత్రను ఈ విధముగా
-----------
దేశ సంపదలను దోచిన దొరవారు
పంచె గష్టములను ప్రజలకెల్ల,
తాళలేకవారు తిరుగుబాటులు జేయ
జనము గాంచి నేత జాఱుకొనెను.
వూర్వ యుగము లందు బొంకి శిక్షలు పడి
రిప్లయితొలగించండినేడు కలి యుగాన నేత లైరి
బొంకు నేర్చు బుధ్ధి పోదెన్ని యుగముల
జనము గాంచి నేత జారు కొనెను
అందరికీ నమస్కారం !
రిప్లయితొలగించండిపూర్వం రష్యా ,అఫ్ఘనిస్తాన్ ,మొన్న ఇరాక్ , నిన్న లిబియా , అన్నిటికీ ఒక విషయం లో మాత్రం సారూప్యముంది , చమురు నిల్వలు లేదా ఆధిపత్యం .. అలాంటి ఇంకో దేశమే ఉంటే , ఆ దేశాధిపతి ఇవన్నీ చూసి పారిపోయాడంటూ ... నా పూరణ
అగ్ర రాజ్య కుటిల యవినీతి పోకడల్
ఇంక చెల్లవంటు యెదురు నిలిచి
ధిక్కరించెడన్యదేశాధిపతుల భం
జనముఁ గాంచి నేత జాఱుకొనెను !
మంత్రి పదవి కొఱకు మాటదప్పినవాడు
రిప్లయితొలగించండిమనకు వలదటంచు జనసమూహ
మాగ్రహమ్ము దెల్పి, రావేశమౌప్రభం
జనము గాంచి నేత జాఱుకొనెను.
శ్రీలత చెప్పిన పద్యం యెంత సరళంగా హృద్యంగా ఉందో!
రిప్లయితొలగించండినారాయణ లక్ష్మీపతి, నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి, నారాయణ నన్ను బ్రోవు నగధర క్రిష్ణా.
5వ తరగతి విద్యార్ధిని యిలా వ్రాయగలగటం చాలా ఆనందించ దగిన గొప్ప విశేషం. నా మొదటి పద్యం నేను 8వ తరగతిలోనుండగా వ్రాసినట్లు గుర్తు - అదీ వెఱ్ఱి మొఱ్ఱిగా. ఈ 5వ తరగతి చిన్నారి యిలా నిర్దుష్టంగా వ్రాయటం నిజంగా ఆశ్చర్యం. అద్భుతం.
చి.ల.సౌ. శ్రీలతకు శతకోటి ఆశీర్వచనాలు
తాడిగడప శ్యామలరావు
**********************************************************************
రిప్లయితొలగించండిపండిత నేమాని గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారి, నా పూరణలను పరామర్శించినందుకు ధన్యవాదాలు.
**********************************************************************
మిస్సన్న గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
**********************************************************************
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
గణదోషం సవరించారు కదా!
**********************************************************************
అమ్మాయి శ్రీలతా,
చాలా సంతోషం. చక్కని పద్యాన్ని అదీ సలక్షణంగా చెప్పావమ్మా! ‘క్రిష్ణ’ను ‘కృష్ణా’ అంటే శబ్ద గణ దోషాలు రెండూ పోతాయి.
సత్కవిత్వ లేఖనకళా చతురుఁడైన
ఘనుఁడు శ్రీపతి శాస్త్రికి తనయ వమ్మ!
వరదుఁడైన నారాయణు కరుణచేత
శ్రీలతా! సకల శుభ సంసిద్ధిఁ గనుము.
**********************************************************************
శ్రీ వరప్రసాద్ గారి పద్యము చదివితే వారికి యతి నియమము పూర్తిగా తెలిసినటుల లేదు. దేశ కు దొర కు యతి చెల్లదు. తాళ కు తిరుగు కు యతి చెల్లదు. యతి మైత్రి హల్లులకు మాత్రమే కాదు, ఆ హల్లులతో ఉన్న అచ్చులకు కూడా సరిపోవలెను. ఇ ఈ ఎ ఏ ఋ ౠ లకు యతి చెల్లుతుంది. అ ఆ ఐ ఔ లకు యతి చెల్లుతుంది. ఉ ఊ ఒ ఓ లకు యతి చెల్లుతుంది. హల్లులతో బాటు ఆయా అచ్చులు కూడా చూచుకొంటూ యతి వేయవలెను.
రిప్లయితొలగించండిశ్రీ కళ్యాణ్ గారి పూరణలో కుటిల + అవినీతి సవర్ణదీర్ఘ సంధి చేయవలెను. భంజనము అంటే శబ్ద రత్నాకరములో విరుచుట అని ఉంది. ప్రభంజనుడు అంటే వాయుదేవుడు. వారు ఏ అర్థములో వాడేరో?
అందరి ప్రయత్నములు మాత్రము ప్రశంసనీయములే.
చి. సౌ. శ్రీలతా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండినారాయణు సత్కృపతో
ధారచెలగు పద్యరచన తప్పక కల్గున్
శ్రీరస్తని దీవింతును
కూరిమి నిను శ్రీలతా! సుగుణ గణ భూషా!
**********************************************************************
రిప్లయితొలగించండిగన్నవరపు నరసింహ మూర్తి గారూ,
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
‘శోభగ’ శబ్దప్రయోజనం? ‘సొమ్ముఁ దిరిగి యిటకె తెమ్మటంచును క్రమ్ము’ అంటే ఎలా ఉంటుంది?
**********************************************************************
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
శ్రీలతను ప్రశంసిస్తూ పద్యం వ్రాసినందుకు ధన్యవాదాలు.
**********************************************************************
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీరు ఈతిహాసవృత్తాంతాన్ని తీసికొని చక్కగా పూరించారు. బాగుంది. అభినందనలు.
**********************************************************************
వరప్రసాద్ గారూ,
మంచి విషయాన్ని ఎన్నుకొని మీరు చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.
పండిత నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా! నా సవరణ ....
‘దోచి సంపదలను దాచిన దొరవారు
.... ... ....
తాళలేక పట్టి తన్నఁజూచినయట్టి ...’
**********************************************************************
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
**********************************************************************
కళ్యాణ్ గారూ,
చక్కని విషయాన్ని ఎన్నుకొన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
నామాని వ్యాఖ్యను గమనించారు కదా!
‘అగ్రరాజ్యసమితి యవినీతి ....’
‘ధిక్కరించు శత్రు దేశాధిపతుల ...’ అందాం.
**********************************************************************
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
**********************************************************************
శ్యామల రావు గారూ,
చి. శ్రీలతను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు.
**********************************************************************
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిచి. శ్రీలతకు పద్యాశీస్సు నందించినందుకు ధన్యవాదాలు.
కవి మిత్రుల పూరణపై మీ విశ్లేషణకు కూడ ధన్యవాదాలు.
చి. శ్రీలతా ! కృష్ణ శతకంలోని మొత్తం పద్యాలన్నీ కంఠస్తం చేసి రోజుకో పద్యం చొప్పున నాన్నగారి బ్లాగులో పెట్టు. ఆ కృష్ణుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చదువు బాగా వస్తుంది. సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఇది కృష్ణశతకంలోని పద్యమా అని మొదట నాకూ అనుమానం వచ్చింది. అయితే ఆ శతకంలోని ఏవో కొన్ని పద్యాలే నాకు తెలుసు. నిజంగానే చి. శ్రీలత వ్రాసిన పద్యం అనుకున్నాను.
మీరు చెప్పిన తర్వాత వెదికితే అది కృష్ణశతకంలోని 92వ పద్యం అని ‘గూగులమ్మ’ చెప్పింది. ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభోజన ప్రియుడైన ఒక కపట నేత కష్టాలు (హాస్యోక్తి):
రిప్లయితొలగించండిపేద వారి ముద్ద పెద్ద విందనె నేత
హంగు గాను కలిసి మ్రింగ నెంచి
నంత చిన్నపళ్లె మందరగొత్తు భో
జనముఁ గాంచి నేత జాఱుకొనెను
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండి‘భోజనము’ చూపించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
వేల సభలవలెనె విద్యార్ధులసభయు
రిప్లయితొలగించండిననుచు వేగమేగి నమ్మతోడు
లేక, యటతననునిలిపియెప్రశ్నించెడు
జనముఁ గాంచి నేత జాఱుకొనెను
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిసరస్వతీస్వరూపులైన కవిమిత్రులందరికి నమస్కారములు. నా పిల్లలకు శుభాశీస్సుల నందించినందులకు కృతజ్ఞతలు.
శారీరక అస్వస్థత కారణంగా ఆలస్యముగా స్పందించినందులకు మన్నించ ప్రార్థన.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ప్రాంతీయ భేదాలు కల్పించే నేతలకు జనం గుణపాఠం చెప్పేరోజు :
01)
_____________________________________
జనము జనము మధ్య - జగడాలు కల్పించి
జనహితము మరి మరి - జార్చునాడు
జనులు కనులు దెరచి - జాగృతి జెందిన
జనముఁ గాంచి నేత - జాఱుకొనెను !
_____________________________________