27, నవంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 540 (పంచమవేదమై పరగు)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
పంచమవేదమై పరగు
భారతమున్ బఠియింప  దోషమౌ.

ఈ సమస్యను సూచించిన ‘కవిమిత్రునకు’ ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

 1. పంచమవేదమౌ పరగు భారతమున్ పఠియింప దోషమౌ
  నంచు చెలంగి పోయిరిట నాస్తిక వర్గము లేమిచెప్పెదన్,
  సంచిత పాప శాపములశాంతులుబాసి విశుద్ధ నిర్మలో
  దంచిత భావముల్ కలిగి, తాత్విక భావము వృద్ధి పొందునే.

  రిప్లయితొలగించండి
 2. ఆరోగ్యం కోసం పానకమిస్తే త్రాగటానికి ప్రయత్నించక పానకంలో పుడకలను యెంచుచు పానకాన్ని వదులుకొనే రంద్రాన్వేషుల గురించి....

  దంచిన బెల్లమున్ మరియు దానిలొ మిర్యము లిన్ని యాలకుల్
  మంచిగ నీటిలో గలిపి మాదురి యొప్పగ పానకమ్మిడన్
  యించుక బుద్ధిలేక మరి యెంచుచు పుల్లల జూపు రీతిగా
  పంచమవేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ.

  రిప్లయితొలగించండి
 3. శాస్త్రిగారూ, మొత్తానికి పానకం ఫార్ములా దంచి పడేశారు. మొదటి పాదంలో “దానిలొ” లొ కి దీర్ఘం వుండాలి కాబట్టి “దానికి” అందాం. . టైపాటులో ధ కారం దకారం అయింది రెండో పాదంలో. కొంచెం కీబోర్డును ఘట్టిగా ధట్టించండి:-)

  రిప్లయితొలగించండి
 4. శ్రీపతిశాస్త్రిఆదివారం, నవంబర్ 27, 2011 9:40:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  వంచకులైన కౌరవుల వారసులైరట నేడు నాయకుల్
  మంచిని విస్మరించుచును మానవ ధర్మము మంటగల్పుచున్
  కుంచుచు వక్రభాష్యములు గూర్చుచు చెప్పెడి వారలెందుకో
  పంచమవేదమై పరగు భారతమున్ బఠియింప? దోషమౌ

  కుంచుచు = క్రుంగజేయుచూ

  రిప్లయితొలగించండి
 5. అంచిత సత్కధా కలితమై ,జన జీవన మార్గ దర్శి యై
  మించిన కావ్య రాజమును మెచ్చు వివేకము లేక వీక వా
  దించెడు వక్ర బుధ్ధి గల దేని - మహాత్ములు ! మీరు వద్దు !మా
  పంచమ వేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ

  సుజన-సృజన

  రిప్లయితొలగించండి
 6. ఈ సమస్యను ఇంతకు మునుపే ఇచ్చారేమో ననిపిస్తోంది.

  రిప్లయితొలగించండి
 7. వంచన, దుష్టచింతనలు, వంశము నాశము చేయుబుద్ధులున్
  మంచివి కావటంచుఁ దగ మాలిమి తోడను జెప్పు నేర్పుగాన్.
  చంచలమైన భాష్యములఁ సత్యమసత్యముఁ జేసి వ్రాసినన్
  పంచమ వేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ !

  రిప్లయితొలగించండి
 8. 'మన' చంద్ర శేఖర్ గారూ! పానకం రుచి ' లో' (low) కాకుండా 'కీ ' ఇచ్చి మాధుర్యం పెరిగేట్లు చేసిన మీకు ధన్యవాదములు. ఇప్పుడు రుచి చూడండి

  .
  దంచిన బెల్లమున్ మరియు దానికి మిర్యము లిన్ని యాలకుల్
  మంచిగ నీటిలో గలిపి మాధురి యొప్పగ పానకమ్మిడన్
  యించుక బుద్ధిలేక మరి యెంచుచు పుల్లల జూపు రీతిగా
  పంచమవేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ.

  రిప్లయితొలగించండి
 9. అంచిత భక్తి భావమున నాది కవీంద్రుఁడు నన్నపార్యుడే
  యంచలఁ దెచ్చె శారదను నా యమ పల్కగ నాంధ్రభాషలో
  సంచిత మయ్యె సత్కృతియు సమ్మద మమ్మను సన్నుతింపచో
  పంచమ వేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ !

  రిప్లయితొలగించండి
 10. మిత్రులందరి పంచమవేద నుతులు శ్లాఘనీయముగా నున్నవి.

  నాదొక ప్రయోగము:

  వంచన చేయు వారలకు వంతుల తమ్ముల కీని వారకున్
  పంచమ వేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ
  వంచన రోయు వారలకు వాక్కుల సత్యము నిండు వారికా
  పంచమ వేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ ?

  రిప్లయితొలగించండి
 11. కంచికి చేరు కాకికథ కాదది సత్య జయోపదేశమే
  కొంచెమసూయ లేక జతగూడిననిర్మలమానసంబుతో
  వంచిన మస్తకంబునటు వ్యాసుని భక్తిగ నెంచలేకనా
  పంచమవేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ.

  రిప్లయితొలగించండి
 12. దోషము అంటే రాత్రి అనే అర్ధాన్ని చెప్పుకున్నాను, పూరణలోని ఉచితానుచితాలు పెద్దలు తెలియజెప్పాలి.

  ఎంచగ వ్యాపకాన్యములవేలయ?కాలము ప్రొద్దుబుచ్చగా
  నించుకలేనివాడ,దినమేవిధివర్తిలునందువేని,ధ్యా
  నించెదకృష్ణునిన్, బవలునేనుభుజించియె ఉద్యమింపగాన్
  పంచమ వేదమై పరగు భారతమున్ బఠియింప "దోషమౌ".

  రిప్లయితొలగించండి
 13. ముంచిరి తీయఁ దేనియలఁ బూజ్య కవిత్రయ మాంధ్ర సంతతిన్
  సంచిత భారతాఖ్యమను సత్కృతి యొప్పగ దివ్య సూనమై
  వంచనఁ ద్రుంచ దత్సుమము వారక దూరగ నన్నయాదులన్
  బంచమ వేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ !

  రిప్లయితొలగించండి
 14. అంచిత వీరగాథల ననంతుని దివ్య విచార బోధనల్
  కాంచగ ధర్మ సూక్ష్మముల గావ్యగుణ ప్రశస్తి నొందుచున్
  మంచిని బెంచు గ్రంథమును మాటికి దప్పులు బట్టు చుందురే
  కొంచెపు బుద్ధితో మెలగు కొందరు నవ్య విమర్శ కేంద్రులున్
  పంచమ వేదమై పరగు భారతమున్ బఠియింప దోషమా?
  -----------------

  రిప్లయితొలగించండి
 15. నాస్తిక వాదము:

  వంచన లెన్నియో పొసగి వందల వీరుల కూల్చినట్టివౌ
  సంచుల నిండు గాథలను సాగుచు పీకుచు కూర్చి చెప్పుచున్
  కొంచెము గూడ శాంతియును కొండొక రీతిని నీతిలేనిదౌ
  పంచమవేదమై పరగు
  భారతమున్ బఠియింప దోషమౌ

  రిప్లయితొలగించండి