కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సంపదలచేత నరుఁడు మోక్షమ్ముఁ గనును.
ఈ సమస్యను పంపిన తాడిగడప శ్యామల రావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సంపదలచేత నరుఁడు మోక్షమ్ముఁ గనును.
ఈ సమస్యను పంపిన తాడిగడప శ్యామల రావు గారికి ధన్యవాదాలు.
దానములనేకముల జేసి ధర్మ గతిని
రిప్లయితొలగించండినీతి దప్పక జరియించి, నీమమొప్ప
దైవ చింతన పరతను తనరు పుణ్య
సంపదలచేత నరుఁడు మోక్షమ్ముఁ గనును.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండి01)
_____________________________________
సంపదెంత యున్నను వెంట - చనదు నిజము !
సర్వ బంధము లన్నియు - సమసిపోవు !
సద్వివేక వర్తనమును - సత్య, ధర్మ
సంపదలచేత నరుఁడు మో - క్షమ్ముఁ గనును !
_____________________________________
శ్రద్ధయును త్రికరణముల శుద్ధి మరియు
రిప్లయితొలగించండినాత్మవిశ్వాసమును గురులందు భక్తి
సాధన చతుష్టయమును ప్రజ్ఞానమనెడు
సంపదలచేత నరుడు మోక్షమ్ము గనును
మనుమడు చి. పార్వతీశం:
రిప్లయితొలగించండిపుణ్యసంపదలచేత స్వర్గము వస్తుంది. స్వర్గ సుఖాలు అయిపోయిన తరువాత మళ్ళీ జన్మ వస్తుంది. అందుచేత మోక్షోపాయములైన భక్తి, జ్ఞాన, ధ్యాన, వైరాగ్యాదులచేతనే మోక్షము వస్తుంది.
వసంత కిశోర్ గారూ:
సర్వ బంధము లన్నియు (సర్వ అనినా అన్ని అనినా ఒకటే కదా) కాస్త సవరించాలేమో చూడండి.
పరగ తలిదండ్రి గురువుల భక్తి తోడ
రిప్లయితొలగించండిపరమ పురుషుని సేవించి వసుధ యందు
మనిన దాన ధర్మము హితమైన సుగుణ
సంపదలచేత నరుఁడు మోక్షమ్ముఁ గనును.
కనగ లోకము నందున గలిమి లేమి
రిప్లయితొలగించండితిరము గాదు నట్లెఱుగరె ధీరమతులు
దయయు సత్యము ధర్మము దమము శమము
సంపదలచేత నరుడు మోక్షమ్ము గనును
మోక్ష మార్గమునకు సులువు మార్గములు మా అన్నయ్య గారు చెప్పారు. నిజమే, సద్గుణములు దోహదకారులే గాని మోక్షము భక్తి,జ్ఞాన,ధ్యాన,వైరాగ్యముల వలనే కలుగుతుంది.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమూర్తీజీ ! రెండవ పాదం ప్రాస ?
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమూర్తి గారి పద్యంలో రెండవ పాదంలో యతి సరిపోయింది కదా (తి-ధీ). మీరు ప్రాసయతి కోసం చూసారా?
శంకరార్యా ! నాదే పొరపాటు ! మూర్తిగారే సరి !
రిప్లయితొలగించండిఔను ! ప్రాసయతి మీద తప్పులు చేసి చేసీ
మూర్తిగారు కూడా నాలాగే చేశారేమో ననుకున్నా !
కిశోర్ జీ శ్రీ పండిత నేమాని అన్నయ్య గారు చెప్పిన మోక్ష మార్గము లేమీ నా పద్యములో లేవు. యతి గురువు గారు సెలవిచ్చి నట్లు సరిపోయింది. ఆత్మా రాముఁడు ఆకలిని గుర్తు చేస్తున్నాడు. తర్వాత నిద్ర, రేపుదయము త్వరగా నిద్ర లేచి బయలు దేరి వెళ్ళాలి. అందరి పూరణలు కణ సంభాషిణిలో చూసి ఆనందించ గలను.
రిప్లయితొలగించండికిశోర్ జీ మీది కవితా ధార.గురువు గారి సంధుల పాఠాలే మనము చదువుకోవాలి, యతి ప్రాసలలో పొరబాట్లు మనకు తక్కువే.
రిప్లయితొలగించండికణ సంభాషిణి ...?
రిప్లయితొలగించండిమిత్రుల పూరణలు ముచ్చటగా నున్నవి !
రిప్లయితొలగించండినేమాని వారికి ధన్యవాదములతో :
01అ)
_____________________________________
సంపదెంత యున్నను వెంట - చనదు నిజము !
సతులు, సుతులును విడతురు - సమసి పోవ !
సద్వివేక వర్తనమును - సత్య, ధర్మ
సంపదలచేత నరుఁడు మో - క్షమ్ముఁ గనును !
_____________________________________
కణ సంభాషిణి = cell phone
రిప్లయితొలగించండిఎల్ల ప్రాణులయందు భూతేశుడుండు
రిప్లయితొలగించండిననెడు శంకరాద్వైతంబునాశ్రయించి
సర్వ లోకేస్వరునియందు జ్ఞాన, భక్తి
సంపదలచేత నరుడు మోక్షమ్మునొందు.
మిత్రులారా!
రిప్లయితొలగించండిమా మనుమడు చి. రాంభట్ల పార్వతీశ్వర శర్మ అవధాని ఈ మధ్యనే మన బ్లాగు సభ్యుడయ్యేడు. 2 వారముల క్రితము అతడు పితృ వియోగము పొందెను. మళ్ళీ అతడు కొంత ఉత్సాహముతో మన మధ్యకు రావడము అభినందనీయము.
అయ్యయ్యో ! అందుకా యీ మధ్య కనబళ్ళేదు !
రిప్లయితొలగించండివారి తండ్రిగారి ఆత్మకు శాంతి కలుగుగాక !
పూర్వజన్మ కర్మఫలము పూర్తిగాగ
రిప్లయితొలగించండికంస దశకంఠులు హిరణ్యకశ్యపాదు
లటు గజేంద్ర ధృవ యజామిళాదు లట్లు
భక్తి వైర మార్గముల చేబట్టి రనిన
మోక్షమందుట కేకైక శిక్ష గలదె
శివునికి మనసు నర్పించి సేవజేయ
పాయక నొసగు దైవ కృపా కటాక్ష
సంపదలచేత నరుఁడు మోక్షమ్ముఁ గనును.
మనవి: శిక్ష = శాసనము; అభ్యాసము
డా.మార్తి గారికి అన్నీ కరతలామలకములే, కణభాషిణితో సహా :-)
రిప్లయితొలగించండిపార్వతీశ్వరశర్మగారికి పితృవియోగం తట్టుకొని త్వరలోనే ముందుకు కొనసాగే ధైర్యం మనోబలం ఆ పరమేశ్వరుడు ప్రసాదించు గాక!
రిప్లయితొలగించండిమూర్తీజీ ! కణ సంభాషిణి
రిప్లయితొలగించండి" కలభాషిణి "(కళాపూర్ణోదయం)ఐతే బావుంటుందేమో !!!
ల-ణ యోరభేద: అనే చంద్రశేఖర సూత్ర ప్రకారం మూర్తిగారిది "కలభాషిణి" యే వసంతమహోదయా! దానిమీద మిత్రులు టకటక వ్రేళ్ళు ఆడిస్తూ అంతర్జాల ప్రపంచం అంతా చుట్టివస్తుంటారు. నాకు కూడా ఆ ప్రపంచం చూపించారు దాని మీద. కళ్ళు తిరిగాయనుకోండీ!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంద్రశేఖరా !
రిప్లయితొలగించండిమరి కలభాషిణి లో unicode (అంటే తెలుగు) చూడ గలమా ?
ఈ చంద్రశేఖర సూత్రాలు కూడా గురువు గారితో చెప్పి
ఒక పాఠం పెట్టిస్తే అందరికీ అందుబాటులో కొస్తాయి గదా !
అలా అఙ్ఞాతంలో ఉండకుండా !
ఏమంటారు ?
తాత తండ్రులు చేసిన తప్పిదముల
రిప్లయితొలగించండిమూట కొకకొంత చేరిచి ముల్లె గట్టి
నీవు నీ కుమారుడి కిత్తు వేవిధమున
సంపదల చేత నరుడు మోక్షమ్ము గనును ?
మిత్రులార!
రిప్లయితొలగించండిభగవద్గీత 15వ అధ్యాయములోని (5వ) శ్లోకమును చూడండి:
నిర్మాన మోహా జిత సంగ దోషా
అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః
ద్వంద్వైర్విముక్తా స్సుఖ దుఃఖ సంజ్ఞైః
గఛ్ఛం త్యమూఢాః పదమవ్యయం తత్ (దీని అధారముగా నా పూరణ)
అభిమానమును మోహమనునట్టి గుణములు
లేకుండుటయును వివేకమలర
సంగదోషమ్ము నాశన కారణముగాన
పెకలించుటద్దాని వేళ్ళ తోడ
ఆత్మ తత్త్వ మెరిగి యనవరతము నాత్మ
ననెడు ధ్యానమ్ముతో నలరుటయును
కోరికల్ పూర్తిగా తీరిపోవుటయును
స్థైర్యవైభవము స్వాంతమ్మునందు
ద్వంద్వముల కతీతస్థితిన్ దనరుటయను
సంపదలచేత నరుడు మోక్షమ్ము గనున
టంచు శ్రీకృష్ణ పరమాత్మ సాదరమున
నంచితోపాయములను బోధించె నయ్య!
నేమానివారు తమపద్యం "శ్రద్ధయును త్రికరణముల...." లో 'గురులందు భక్తి' యని ప్రయోగించారు. ఇది కొంచెం విచార్యం. 'గురువు', 'గురుడు' పదాలు సాధువులు. 'గురు' పదానికి శబ్దరత్నాకరమూ, బ్రౌణ్య మూ కూడా "మృగవిశేషము, గవయము." అనే చెప్పాయి. అందువలన గురువులు అనే బహువచపదాన్ని గురులు అని క్లుప్తీకరించారాదని నా అభిప్రాయం. కాబట్టి గురులు + అందు --> గురులందు అనే వ్యాకరణకార్యం నాకు సందేహం కలిగిస్తున్నదని మనవి.
రిప్లయితొలగించండివసంతకిశోరులు "సంపదెంత యున్నను ...." అన్నారు. 'సంపద + ఎంత --> సంపదయెంత 'అవుతుంది కాని 'సంపదెంత' కాదని నా అభిప్రాయం.
రాజారావుగారి "తాత తండ్రులు ..." పద్యం లో 'కుమారుడి కిత్తువు' అన్నారు. 'కుమారున కిత్తువు' అంటే మరికొంచెం సరిగా ఉండేదేమో.
వసంతమహోదయా! తప్పకుండా తెలుగు (యూనికోడ్) చూడగలము. ఫాంట్స్ అలా సెట్ చేసుకోవాలి అంతే.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేనుగూడా నేమానివారు అనువదించిన గీతాశ్లోకానికే నాధోరణిలో ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిమోహపాశంబులు మొదలంటగా గోసి | మానాభిమానముల్ మట్టు బెట్టి
సంగదోషంబులు చక్కగా వర్జించి | కామాది రిపుషట్క గర్వ మడచి
సుఖదుఃఖ ద్వంద్వంబు చెలగనీయక దాని | దుడుకును గద్దించి విడచి పుచ్చి
నిరతంబు ప్రీతుడై పరమార్ధచింతనా | ధన్యశీలంబున దనరువాడు
తుదకు నవ్యయం బగునట్టి పదము జేరు
నితరులకు జన్మ బంధంబు నిత్యమగును
ప్రాజ్ఞుడై యిట్లు జ్ఞానవైరాగ్యదివ్య
సంపదలచేత నరుఁడు మోక్షమ్ముఁ గనును
శ్రీ శ్యామలీయం గారూ!
రిప్లయితొలగించండిమీ సీసము భావోత్కర్షతో నలరారుచున్నది. అభినందనలు. అందొకచో "సుఖ దుఃఖ ద్వంద్వంబు" అనే సమాసములో 4వ అక్షరము ఖ గురువు అగును కదా. అందుచేత గణ భంగమని నా మనవి. పరిశీలించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ శ్యామలీయం గారు సందేహమును వెలిబుచ్చేరు - గురులు అనే ప్రయోగము సాధువా కాదా అని. నాకు సందేహము లేదు. గురుడు సాధువు కబట్టి గురులు కూడా సాధువే.
రిప్లయితొలగించండిఈ సీసపద్యపాదాన్ని మార్చుతున్నాను.
రిప్లయితొలగించండిపాత పాఠం: సుఖదుఃఖ ద్వంద్వంబు చెలగనీయక దాని | దుడుకును గద్దించి విడచి పుచ్చి
క్రొత్త పాఠం: హర్షంబు శోకంబు ననియెడు ద్వంద్వపు | దుడుకును గద్దించి విడచి పుచ్చి
నేమాని వారికి ధన్యవాదాలు.
గురులు పదం గురించి. ఇది సాధువే. కవిత్రయ ప్రయోగం కనిపిస్తోంది.
రిప్లయితొలగించండిఅడవిలో నేకాంతమతి ఘోరతపమున నున్న మాగురులపై నురగశవము
వైచుట విని యల్గివారితనూజుండు శృంగియన్వాఁడు కార్చిచ్చునట్టి
శాపంబు నీకిచ్చె సప్తాహములలోననాపరీక్షితుఁడు నాయలుకఁ జేసి
తక్షకవిషమున దగ్ధుఁ డయ్యెడు మని దానికి గురులుసంతాప మంది
ఆ. భూతలేశ నన్నుఁ బుత్తెంచి రిప్పుడు
తద్భయంబు లెల్ల దలఁగునట్టి
మంత్రతంత్రవిధలమర్చి యేమఱకుండు
నది నిరంతరంబు ననియుఁ గఱప. 1
ధర్మనిరతి,స్థిత ప్రజ్ఞ దా చరించి
రిప్లయితొలగించండిజ్ఞాన వైరాగ్యములు కల్గు ధ్యాన పరుడు
అఖిలలోకేశుడు హరి,దయాకటాక్ష
సంపదల చేత నరుడు మోక్షమ్ము గనును.
----------------
మంచి భావమ్ము గలుగు సమస్య యనుచు
రిప్లయితొలగించండిదెలుపుచుంటిని యభినందనలను దొల్లి
చక్కగా పూరణములను సలిపిరనుచు
నఖిల కవిమిత్ర బృందంబు నభినుతింతు
అయ్యా! చంద్రశేఖర్ గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యములో హిరణ్యకశ్యపుడు అని వాడేరు. హిరణ్యకశిపుడు అని వాడాలి (బంగారు శయ్య కలవాడు) అని భావము.
శ్రీ నేమానిమహాశయా! మీరు నా వెనకనుండి చూస్తున్నట్లే పట్టేశారు. అక్కడ హిరణ్యకశ్యపుడు అనకూడదని తెలిసి చేసిన పొరపాటు. ఆలోచించి ఇక రాత్రివేళ లేటు అవుతోందని వేశాను. అక్కడే పట్టుకొన్నారు. చాలా ఆనందించాను. ధన్యవాదాలు. "...కంస దశకంఠులు హిరణ్యకశిపు ప్రముఖు..." అందాం.
రిప్లయితొలగించండి"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
రిప్లయితొలగించండిదేహ విజ్ఞాన బ్రహ్మోపదేశము లిడి
యిహపరమ్ముల సాధించు హితము నొసఁగు
తండ్రి బ్రహ్మైక్య మందు బాధయె కలిగెన?
యీ తరుణమందు నా సానుభూతి యిదియె.
వారి యాత్మకు శాంతి చేకూరు గాక!
మీ ‘పుణ్యసంపదల’ పూరణ బాగుంది. అభినందనలు.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ ‘సత్య ధర్మ సంపదల’ పూరణ బాగుంది. అభినందనలు.
‘విడతురు’ ... విడుతురు అనా లనుకుంటా.
‘సర్వబంధము లన్నియు’ అన్నదానికి నేమాని వ్యాఖ్యను గమనించారు కదా! అక్కడ ‘సర్వబందము లొక్కట’ అంటే సరి!
*
పండిత నేమాని గారూ,
‘జ్ఞానసంపద’ను గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గీతాశ్లోకానికి అనువాదరూపమైన మీ పూరణ అద్భుతంగా ఉంది.
కవిమిత్రుల పూరణల గుణదోష విచారణ చేసినందుకు ధన్యవాదాలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కని పూరణ అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
ప్రశ్నార్థకమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
శ్యామలీయం గారూ,
నేమాని వారి ‘గురులు’ శబ్దప్రయోగం సాధువేనని నా అభిప్రాయం. క్రింది వేమన పద్యం చూడండి.
కారుకారు గురులు కాగుణితముఁ జెప్ప
శాస్త్రపాఠములనుఁ జదివిచెప్ప
ముక్తిదారిఁ జూపు మూలమంత్రము గదా !
విశ్వదాభిరామ! వినుర వేమ!
కవిమిత్రుల పూరణల గుణదోష విచారణ చేస్తూ నాకు ఎంతో శ్రమ తగ్గిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల విశ్రాంతి లేకుండా తిరుగుతున్న నాకు బ్లాగు కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించలేక పోతున్నాను. ఆ లోటును మీరు తీరుస్తున్నందుకు ధన్యవాదాలు.
గీతా శ్లోకానికి మీ అనుకృతి ప్రశంసనీయం.
*
కమనీయం గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘ప్రజ్ఞ దా చరించి’ని ‘ప్రజ్ఞఁ దాఁ జరించి’ అంటే బాగుంటుంది.
మా బండి చాలా లేటు.
రిప్లయితొలగించండిగాలి స్వగతం:
గనుల దోపిడీ చేసిన ఘనుడ నంద్రు
సంతు ముక్తికై దా(దో)చితి సంపదలను
ధనము నీకున్న పలుకడు దైవమైన
సంపదలచేత నరుడు మోక్షమ్మునొందు.
నేమాని పండితుల, శ్యామలీయం గారల ద్వారా అమూల్యమైన పాఠాలు బోధించబడుతున్నాయి. వారలకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీ పార్వతీశ్వర శర్మ గారి నాయన గార్కి పరమేశ్వరుడు సద్గతులను కల్గించాలని కొరుకొంటున్నాను.
రిప్లయితొలగించండి