30, నవంబర్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 135

                                   శ్రీబంధం

కం.
శ్రీమ దజ! కేశవ! వరద!
రామా! రఘువీర! దీనరక్షక! శౌరీ!
సామజవరగమనా! హరి!
దామోదర! శేషశయన! దయ జూపు మయా!

7 కామెంట్‌లు:

 1. శ్రీ శంకరయ్యా గారు చక్కని కందములో శ్రీ బంధమును వ్రాసేరు. ప్రాస మరిచిపోయేరు.
  మీ ప్రయత్నమునకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 2. మాస్టరు గారూ ! బంధ కవిత్వమునకు మీరు చుట్టిన శ్రీ కారం ఎంతో బాగుంది.శ్రీ రమణీశుని దయవలన బంధ కవిత్వంతో పద్యం తో మీకున్న అనుబంధం ఇంకా గట్టి పడి మమ్మల్ని కట్టి పడేయాలని మా కోరిక.

  రిప్లయితొలగించండి
 3. పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు. ప్రాసదోషాన్ని నేను గమనించనేలేదు. సవరించే ప్రయత్నం చేస్తాను.

  రిప్లయితొలగించండి
 4. ప్రాసదోషాన్ని సవరించాను. చిత్రాన్ని సవరించాలి.

  రిప్లయితొలగించండి
 5. " శ్రీ బంధం " పద్యం చాలా బాగుంది. అలా వ్రాయ గలగడం అదృష్టం . ఆ దేవి కటాక్షం .

  రిప్లయితొలగించండి
 6. పండిత నేమాని వారూ,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చింతా రామకృష్ణారావు గారూ,
  రాజేశ్వరి అక్కయ్యా,
  ధన్యవాదాలు. చిత్రాన్ని కూడా సవరించాను.

  రిప్లయితొలగించండి