30, నవంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 544 (లచ్చిమగనికి వచ్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
       లచ్చిమగనికి వచ్చెఁ గళంక మిపుడు.

41 కామెంట్‌లు:

  1. నల్లగా మారిపోయె ధనాల తల్లి
    యామెతో చేరియుండగా ననవరతము
    గాత్రములు మానసమ్ము లొక్కటిగ నగుట
    లచ్చి మగనికి వచ్చె కళంక మిపుడు

    రిప్లయితొలగించండి
  2. వచ్చె గాలికి సిరులెన్నొ వరద వోలె
    గాలి మేలుకు చేయంగ కాని పనులు
    భార్య గావున భరియించ వలసి వచ్చె
    లచ్చిమగనికి వచ్చెఁ గళంక మిపుడు.

    రిప్లయితొలగించండి
  3. గోలివారు, మీరు వార్తలు రెగ్యులర్ గా చదవటం/చూడటం మీ మాటల్లో అర్థమయ్యింది. బళ్ళారి లచ్చి మగడు కూడా అదివరకే కళంకితుడేమో :-)

    రిప్లయితొలగించండి
  4. నా పూరణ .....

    లచ్చి రంగని పెండ్లాడె ముచ్చటపడి
    గుట్టుగా వాఁడు పొరిగింటి కులుకులాడిఁ
    గూడియుండఁ బట్టుపడెను గొడవ యయ్యె
    లచ్చి మగనికి వచ్చెఁ గళంక మపుడు.

    రిప్లయితొలగించండి
  5. 'మన' చంద్ర శేఖర్ గారూ! ధన్యవాదములు.శ్రీ 'లచ్చి' మగని మీద ఏమీ ఆరోపణలు ఉన్నట్లు చదవలేదు కనుక "భార్య గావున భరియించ వలసి వచ్చె" అన్నాను.

    'మేలుకు' అనకూడ దేమో.. చిన్న సవరణ తో...

    వచ్చె గాలికి సిరులెన్నొ వరద వోలె
    గాలి మేలును' గని' చేయ కాని పనులు
    భార్య గావున భరియించ వలసి వచ్చె
    లచ్చిమగనికి వచ్చెఁ గళంక మిపుడు.


    నేమాని వారు గుట్టు గా నుండే నల్ల ధనం గురించి చెప్పారు.
    శంకరార్యులు రంగని గుట్టు విప్పారు. రెండు పూరణలు బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  6. పచ్చిపచ్చిగ జగనుడు రెచ్చిపోయి
    హద్దుమీరిన ఆస్తుల పద్దు చెప్ప
    లేక బయటెట్టె నసలుపేర్లికను గెలుపు
    లచ్చిమగనికి వచ్చెఁ గళంక మిపుడు
    మనవి: గెలుపులచ్చి= విజయలక్ష్మి- భావానికి తగ్గట్టు భాష కూడా అంతే విరుపుగా వాడటం జరిగింది.

    రిప్లయితొలగించండి
  7. సూర్యదేవుని మెప్పించి సొమ్ములిచ్చు
    మణిని పొంది, రాజొక్కడు మాట తూలె,
    సిరులు గలతల్లి పాదమ్ముఁ జేరియుండు
    లచ్చిమగనికి వచ్చెఁ గళంక మిపుడు.

    సకల సంపత్ప్రదాయిని పాదదాసి గా గల "శ్రీపతి" సత్రాజిత్తు వలన శమంతకమణి ని కాజేశాడనే నింద పడుట.

    రిప్లయితొలగించండి
  8. పిచ్చి మగనిని యింటను బెట్టి లచ్చి

    కూలి కోసము నేగగ కోట లోకి

    పాలె గాడగు సోముడు పైట లాగ

    లచ్చి మగనికి వచ్చె కళంక మిపుడు

    రిప్లయితొలగించండి
  9. ధనము గలవారి కాత్మీయ దర్శనములు
    పేదలకు లఘుదర్శనం బిచ్చు కతన
    స్వామి సమతను పాటింప డేమి యనుచు
    లచ్చిమగనికి వచ్చెఁ గళంక మిపుడు.

    రిప్లయితొలగించండి
  10. ముఖ్యమంత్రి పదవి జారి పోయినంత
    పూర్వమిత్రులె పనిగొని బురద జల్ల
    కనక యుండెదిక్కుదెసలు, కావమమ్మ
    లచ్చి! మగనికి వచ్చెఁ గళంక మిపుడు.

    రిప్లయితొలగించండి
  11. 2.
    స్వామి యందరి వాడన్న సత్యకీర్తి
    స్వామి కొందరి వాడైన జారిపోదె
    స్వామి యందని వాడాయె నేమి యనుచు
    లచ్చిమగనికి వచ్చెఁ గళంక మిపుడు

    రిప్లయితొలగించండి
  12. లక్ష్మి గురించి ప్రస్తావన వచ్చినది కాబట్టి ఒక సందేహము.
    వేదములో (శ్రీసూక్తములో) (1)సిద్ధ లక్ష్మి (2) మోక్షలక్ష్మి (3) జయలక్ష్మి (4) సరస్వతి
    (5) శ్రీర్లక్ష్మి మరియు (6) వరలక్ష్మి అని 6 రూపములు చెప్పబడినవి. కాని నేడు అనేక ప్రాంతములలో అష్ట లక్ష్మి రూపములతో సంప్రదాయములు వెలయుచున్నవి. ఇందులోని ఉచితానుచితములను విజ్ఞులైన వారు చెప్పి మాకు సందేహ నివృత్తి చేయగలరా?

    రిప్లయితొలగించండి
  13. ఇప్పటికి వచ్చిన పూరణలు చూచేను. లచ్చి మగని గురించి వచ్చినవి ముచ్చటగానే ఉన్నవి.శ్రీ గోలి వారి "గాలి" ప్రసక్తి; శ్రీ శంకరయ్య గారి ఇరుగు పొరుగు సరసాలు, శ్రీ చంద్రశేఖర్ గారి జగన్ మోహనీయం, శ్రీమతి మందాకిని గారి శమంతకోపాఖ్యానం, శ్రీ సుబ్బారావు గారి పాలెగాని చేతివాటము, శ్రీ శ్యామలీయం గారు మందిరాలలో చూచుచున్న అసమానతలు, శ్రీ ఊకదంపుడు గారి మాజీ ముఖ్యమంత్రాంగము ఇలా వివిధ కోణాలలో వచ్చిన పూరణలని అందరూ చూచేరు కదా. ఆనందింప జేస్తున్నాయి. అందరికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. స్వామి కళ్యాణ రూప వైభవమునొందె
    దృష్టి దోషమ్ము తగలని రీతి నదిగొ
    చూడు మచ్చట బుగ్గపై చుక్క నటుల
    లచ్చి మగనికి వచ్చె కళంక మిపుడు

    రిప్లయితొలగించండి
  15. 3.

    అళిసువర్ణపు టళికమునాశ్రయించె
    కొమరు కుచపాళిమంజరీకుంకుమంబు
    మేలమాడును సామి నీ లీల ముగుద
    లచ్చిమగనికి వచ్చెఁ గళంక మిపుడు

    రిప్లయితొలగించండి
  16. నా మూడవ పూరణ లిఖిస్తున్న సమయంలో శ్రీనేమాని వారి పద్యం వచ్చింది. నాది పంపగానే వారిపద్యం కూడా అప్పటికి రావటం గమనించాను. కొంచె సామ్యం ఉందేమో కదా! ఈ పద్యాలు రెండూ ప్రక్కప్రక్కన రావటంలో ఒక సొగసు ఉంది. అది చెప్పేది కాదు.

    రిప్లయితొలగించండి
  17. విఘ్న నాయక ! నిను గొల్వ వీలు పడక
    లచ్చి మగనికి వచ్చె గలంక - మిపుడు
    నీదు చవితి నా డిబ్బందు లెన్ని యున్న
    వ్రతము జేసిన నిందల వాత బడరు

    "మచ్చ లేనట్టి చంద్రుడా ! మగడ ! నీదు
    మోము నేజాణ చేర్చుక్క ముద్ర పడెను ?
    'లచ్చి మగనికి వచ్చె గళంక మిపుడు '
    చూడు డని నవ్వి వ్రేలెత్తి చూపర ?యిక "

    సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  18. నిత్య కళ్యాణ మూర్తికి నియతి నొకరు
    బుగ్గ చుక్కద్దె - నొక్కరు పూని చేసె
    పాన్పు బవలింపు సేవ - లేపగిది నింక
    లచ్చి మగనికి వచ్చె గళంక మిపుడు?

    రిప్లయితొలగించండి
  19. 4.
    మ్రుచ్చు యగునేని జడధిలో జొచ్చి యైన
    వ్రచ్చు టటులుండగా మెఱమెచ్చులాడి
    మ్రుచ్చులే యిచ్చు నగలను పుచ్చుకొన్న
    లచ్చిమగనికి వచ్చెఁ గళంక మిపుడు.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! మ్రుచ్చులే యిచ్చు నగలను పుచ్చుకొన్న - అని నింద వేస్తున్నారు స్వామిపై. స్వామి ఆ నగలను స్వీకరిస్తున్నాడా లేదా అన్నది మనమెరుగ లేము కదా. ఐనా నిందాస్తుతులన్నా స్వామికి ప్రీతియే కదా వైర భక్తి లాగ. ఒకే సమస్యకు అనేక పూరణలు చేస్తున్న మీకు అభినందనలు. మంచి పట్టు మీద వెళ్తున్నాయి మీ పద్యాలు. భలా.

    రిప్లయితొలగించండి
  21. శాస్త్రి గారూ మీరు చెప్పింది గాలి వారికి బాగా అతికింది అనుకుంటాను

    రిప్లయితొలగించండి
  22. మన తెలుగు - చంద్రశేఖర్బుధవారం, నవంబర్ 30, 2011 6:45:00 PM

    శ్రీనేమాని వారిది సొగసైన భావన "...చూడు మచ్చట బుగ్గపై చుక్క నటుల...".

    రిప్లయితొలగించండి
  23. ఆరోగ్యం సరిగాలేక నాలుగు రోజులు మిత్ర దర్శనానికి దూరమయ్యాను !

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________

    రమణి సీతను బంధించ - రావణుండు
    రాము డేతెంచి విడిపించె - లక్ష్మి నపుడు !
    లటుల గుంపులు బంధించ - లక్ష్మి నిపుడు
    రక్ష సేయగ నేమాయె - నక్షధరుడు ?
    లచ్చి మగనికి వచ్చెఁగ - ళంక మిపుడు !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  24. నేమాని వారికి ధన్యవాదములు.
    శ్యామలరావు గారూ ! వరుస పూరణలు సరసముగా నున్నవి.
    అన్నట్టు వసంత కిశోర్జీ...! మీరెక్కడ?
    రాజశేఖర శర్మ గారూ ! ధన్యవాదములు.అది గాలి 'గని' వ్రాసిన పద్యమే..

    రిప్లయితొలగించండి
  25. 02)
    _____________________________________

    లక్ష లక్షల కోట్లను - లాగు కొనెడి
    లటుల యింటింట కొలువుండె - లక్ష్మి యిపుడు !
    భార్య నీనాడు విడిచెగా - పరుల పంచ !
    లచ్చి మగనికి వచ్చెఁగ - ళంక మిపుడు !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  26. నేమానివారికి నమస్కారం. స్వామివారికి మనం నిజంగా ఇచ్చేపాటివారమా! వారు గ్రహించటం కూడా అనుగ్రహలీలయే. మనం యిస్తున్నట్లు, వారు స్వీకరస్తున్నట్లు అంతా భావనావ్యవహారమే. స్వామివారు స్వీకరించారన్నట్లుగా ఆలయాధికారులే వారితరపున యీ మధ్య కాలంలో తగనివీ స్వీకరణ చేయటం వలన పాపం స్వామివారికీ ఆక్షేపణ తగులుతున్నది. ఆయనకు మీరన్నట్లు నిందాస్తుతి కూడా పరమాన్నం వలె ప్రీతిపాత్రమే!

    రిప్లయితొలగించండి
  27. 5.
    సగటు భక్తులు వేంకటేశ్వరుని జూడ
    దుష్కరం బౌట భూదేవి దుఃఖ పడుచు
    సిరికి నిట్లను ధనికుల చెయిదములకు
    లచ్చి, మగనికి వచ్చెఁ గళంక మిపుడు.

    రిప్లయితొలగించండి
  28. బట్టలుతికెడు వాడేదొ వదర గానె
    యాలి నటవికి పంపించె జాలి లేక
    ఔను రామయ్య మరియేమొ గాని సీత
    లచ్చి మగనికి వచ్చెఁ గళంక మిపుడు.

    రిప్లయితొలగించండి
  29. శ్రీ రాజారావు గారి పూరణలు కూడా భావవైవిధ్యముతో నున్నవి.నీలాప నిందల పద్యములో: "నీదు చవితి నాడిబ్బందు లెన్నొ యున్న" - యతి సరిపోవుట లేదు. చురుకుగా పాల్గొంటూ అనేకములైన పూరణలు చేయుట ప్రశంసనీయము.

    శ్రీ వసంత కిశోర్ గారు విశ్రాంతి తీసికొని మళ్ళీ స్వాస్థ్యము కుదిరిన పిదప రావడము అభినందనీయమే. వారి ప్రయోగములు చిత్రముగా ఉంటున్నవి. లటులు అనే ప్రయోగము కాస్త వివరించ వలసి యున్నది. అలాగే అక్షధరుడు అంటే ఎవరో?

    మా చిన్న తమ్ముడు చి. ఛంద్రశేఖర్ చేసిన ప్రశంసలు బాగున్నవి - మా ఆశీస్సులు. స్వస్తి. ఇందులో పాల్గొన్న అందరికీ ప్రత్యేకముగా ప్రశంసలు.

    రిప్లయితొలగించండి
  30. అయ్యా మిస్సన్న గారూ! రాముడు మచ్చ వచ్చిన తరువాతే ఆలిని అడవికి పంపెను. జన వాక్యం కర్తవ్యం అనే ఆ ధర్మ స్వరూపునిలో చాకలి అయినా మనమైనా తప్పు పట్ట రాదు. రామునికి ఇప్పుడు మచ్చ వచ్చింది అని సమస్య - కాని మీ పూరణ ప్రకారము ఆ మచ్చ ఎప్పుడో వచ్చినది. ఆలోచించండి. మీ ప్రయత్నము ధార బాగున్నవి - ప్రశంసలు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  31. అయ్యా శ్యామలరావు గారూ!

    శుభాశీస్సులు. మీ వివరణ చాల బాగున్నది.

    శ్యామలరావు పద్ధతులు సర్వ శుభ ప్రదముల్ ప్రశస్తముల్.

    రిప్లయితొలగించండి
  32. నేమానివారికీ, గోలివారికీ అభినందనలకు ధన్యవాదాలు. వారన్నట్లు (యీరోజున పనివత్తిడిలో అడపదడప తొంగిచూచి వ్రాసినా) పద్యాలు బాగానే వచ్చాయు. వారూ మెచ్చారు.సమయముంటే రాత్రిభోజనానంతరం అందరి పూరణలూ ఒకసారి సింహావలోకనం చేయాలనుకున్నాను. నేమాని వారది యిప్పటికే పూర్తిచేసారు.

    రిప్లయితొలగించండి
  33. కాచి రక్షించు కొందరు కొలిచి నంత
    ఎంత వేడిన దయరాదు సుంత యైన
    లంచ మీయని జనులను కించ పఱచు
    లచ్చి మగనికి వచ్చెఁ గళంక మిపుడు

    రిప్లయితొలగించండి
  34. విఘ్న నాయక !...పద్యం లో 3 వ పాదం

    నీదు చవితి నా డేరీతి నేని పూని - అని చదువ గలరు

    రిప్లయితొలగించండి
  35. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    నేమాని వారికి ధన్యవాదములు !
    అయ్యా !
    దొంగ = లటుడు
    విష్ణువు = అక్షధరుడు

    ("ఆచార్య జి ఎన్ రెడ్డి " - "తెలుగు పర్యాయ పద నిఘంటువు" )

    రిప్లయితొలగించండి
  36. చవితి దినమున పాలలో చందమామ
    కాంచినట్టి తప్పిదమున కలిగె వాదు
    మణిని హరియించె దొంగ యన్ మాట పుట్టి
    లచ్చి మగనికి వచ్చె కళంక మిపుడు.
    -----------

    రిప్లయితొలగించండి
  37. ఈ కవితలు చదువుతూ ఉంటే , నేనెప్పుడు పద్య రచన చేస్తానా అని ఉత్సాహంగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  38. వామన కుమార్ గారూ,
    ‘శంకరాభరణం’లోని పద్యాలను చదివి ఉత్సాహాన్ని పొందినందుకు సంతోషం. పద్యాలు వ్రాయడం అదేమంత బ్రహ్మవిద్య కాదు. మొదలుపెట్టండి. సవరిస్తూ దారి చూపడానికి నేను, కవిమిత్రులు సిద్ధంగా ఉన్నాము. శుభమస్తు!

    రిప్లయితొలగించండి