కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
మణులపైన యతికి మక్కువ గద!
ఈ సమస్యను సూచించిన తాడిగడప శ్యామలరావు గారికి ధన్యవాదాలు.
నిజానికి ‘శ్యామలీయం’ గారిచ్చిన సమస్య
"మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
మణులపైన యతికి మక్కువ గద!
ఈ సమస్యను సూచించిన తాడిగడప శ్యామలరావు గారికి ధన్యవాదాలు.
నిజానికి ‘శ్యామలీయం’ గారిచ్చిన సమస్య
"మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్"
అయితే ‘ణ’ప్రాసతో కందపద్యం ఔత్సాహిక కవులకు కష్టమౌతుందేమో అన్న అనుమానంతో దానిని ఆటవెలదిగా మార్చి ఇచ్చాను. అందుకు ‘శ్యామలీయం’ గారిని మన్నించమని కోరుతున్నాను.
ఉత్సాహం, సామర్థ్యం ఉన్న కవిమిత్రులు పై కందపద్య పాదాన్ని స్వీకరించి పూరణ చేయవచ్చు.
మణి మాన్యంబుల నొల్లము
రిప్లయితొలగించండిగుణమగు మీ యాశ్రమంబు గొప్పని పించెన్
క్షణమును మిము వదలమని ర
మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్
రాముడన్న భూత రాజుకు మక్కువ
రిప్లయితొలగించండిశివుడు మక్కు వగును భువిజ పతికి
పరమ పురుషు లైన పార్వతీ, సీతా ర
మణులపైన యతికి మక్కువ గద!
కమలహిత కులమణి క్ష్మాసుతా హృన్మణి
రిప్లయితొలగించండివీరమణియు సద్వివేకమణియు
రాజమణియు సుగుణ రాజన్మణియునను
మణులపైని యతికి మక్కువ గద
అయ్యా హనుమఛ్ఛాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిపరమ పురుషులైన పార్వతీ సీతా రమణులు అనే మీ ప్రయోగమును ఒక్క మారు చూడండి. పార్వతి తరువాత పరమేశ్వరుని పేరు రావాలి అనుకుంటున్నాను. లేకపోతే పార్వతికి బదులుగా వసుధజా అని ఉండాలేమో.
అయ్యా హనుమఛ్ఛాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిఒకవేళ మీ ఉద్దేశము పార్వతీ రమణుడు మరియు సీతా రమణుడు అయితే భావము బాగున్నది కానీ చదివే వారికి అలా అర్థము స్ఫురించుట లేదు. అందుచేత ఫాలాక్ష సీతారమణులు అని సమాసము చెయ్యండి.
శ్రీ నేమాని వారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిఆర్యా ! పార్వతీ రమణుడు మరియు సీతా రమణుడు వెరసి పార్వతీ, సీతా రమణులు అని నాభావం. రమణలు అని ఉండాలేమో..
పరమ సాధ్వు లైన పార్వతీ, సీతా రమణులపైన అంటే....
రణమున పార్థుని సారథి
రిప్లయితొలగించండిగుణముల పురుషోత్తముండు కోదండ ధరున్
ఫణిభూషణు హరి యంబర
మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్ !
శ్రీ పండిత నేమాని అన్నయ్యగారి పూరణ అత్యద్భుతము !
రిప్లయితొలగించండినేమాని వారూ ! ధన్య వాదములు మీ సూచన ప్రకారం సవరణ తో...
రిప్లయితొలగించండిరాముడన్న భూత రాజుకు మక్కువ
శివుడు మక్కు వగును భువిజ పతికి
పరమ పురుషు లైన ఫాలాక్ష సీతా ర
మణులపైన యతికి మక్కువ గద!
నేమాని వారూ ! ఆరు మణులను పొదుగు కున్న మీ పూరణ రమణీయంగా నున్నది.
రిప్లయితొలగించండిమూర్తి గారూ ! మీకందం అందముగా నున్నది.
అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిఫాలాక్ష సీతారమణులు అంటేనే సరిపోతుంది - రమణలు కాదు. సమస్య కూడా అలాగే ఉందికదా.
తమ్ముడు చి. నరసింహమూర్తికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండినీ ప్రయత్నము బాగున్నది. పద్యము బాగుగా రాలేదు. ప్రాస ఇబ్బందిగా ఉంది. చదివే వారికి అన్వయము సరిగా లేదనిపించుచున్నది. ఇలా వ్రాసినందులకు మరోలా భావించవద్దు. నీ భావమును నేను ప్రయత్నము చేసి చూపించెదను.
తప్పకుండా అన్నయ్య గారూ, నేనేమీ అనుకోను. మరో మంచి పద్యము మీ దగ్గఱ నుండి వస్తుంది. అందఱమూ ఆనందిస్తాము.
రిప్లయితొలగించండిశంకరయ్యగారూ,
రిప్లయితొలగించండినేను పంపిన సమస్య "మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్". మీరన్నట్లు ప్రాస కొంత ఇబ్బంది పెడుతుంది. అయితే మాకు ఇలాంటి ప్రాసలతో కూడా క్రీడించటం అలవాటు కావటం మంచిదేననుకోండి. మీరు దీనిని ఆటవెలదిగా మార్చి "మణులపైన యతికి మక్కువ గద!" అని సవరించి కొంచెం సౌకర్యం కల్పించారు. ఇది కుడా చాలా బాగుంది. ఇంత చిన్నవిషయానికి మన్నింపులు దేనికి. నాకేమీ పట్టింపు లేదు. నాబోటి ఔత్సాహికులు పంపే వాటిలో గణయతిప్రాసాదులతో, కొండొకచో వ్యాకరణకార్యాలతో, నిజంగానే సమస్య లుండవచ్చునని మాకు యెరుకే. మీరు మంచి అనుభవజ్ఞులు. దీనినే కాదు ఇకముందు నేను పంపించే యే సమస్యలనయినా మీరు పరిశీలించి తగువిధంగా ఉపయోగించుకోవలెనని విజ్ఞప్తి.
శ్రీ పండిత నేమాని అన్నయ్య గారికి నమస్సులు. ఓ సారి నిన్నటి సమస్యను ( నేనీ దినము పూరించాను ) కూడా చూడరా ?
రిప్లయితొలగించండిమణు లొల్లడు సాయి విభుడు
రిప్లయితొలగించండిప్రణతులనే స్వీకరించు భక్తులను ప్రతి
క్షణమును గాచును సద్గుణ
మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపున్
రుక్మిణీ సమేత కృష్ణా
రిప్లయితొలగించండిభామా మణి సత్య హృదయేశ్వరా
శ్యమంతక మణి తో జాంబవతి నాదా
గోపీ కాంతా మణుల మానసోల్లాసా
మణులపైన యతికి మక్కువ గద!
నా పూరణలు ....
రిప్లయితొలగించండి(1)
లోకహితముఁ గోరి లోభమోహముల సం
సారబంధనముల భార ముడుగు;
మంచివారలు ప్రవచించు సుభాషిత
మణులపైన యతికి మక్కువ గద!
(2)
క్షణిక భవబంధనమ్ములఁ
దృణముగ భావించి విడిచి దేవుని శుభస
ద్గుణవర్ణన గల పుస్తక
మణు లనిన యతీశ్వరుండు మక్కువఁ జూపున్.
గణనీయంబగు తపమున్,
రిప్లయితొలగించండిఫణిభూషణునాశ్రయంబు, పరహిత సేవా
గుణముల నొప్పెడు గురువు "ర
మణు"లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్.
రమణులు = శ్రీ రమణ మహర్షి
ఫణిభూషణునాశ్రయంబు = అరుణాచలేశ్వరుని చెంత నుండు వాడు కావున,
రణరంగశూరుడగు ఫల్
రిప్లయితొలగించండిగుణు యతిగానెంచి శ్రద్ధ గొలిచిన కన్యా
మణి నామెతోడి నారీ
మణులనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్
తమ్ముడు చి. గన్నవరపు నరసింహమూర్తి యొక్క భావములను పద్యమును కొంచెము మార్చి ఇలా పూరించేను:
రిప్లయితొలగించండిగుణమణియగు శ్రీరాముడు
ఫణిభూషణ రాజితుండు వార్ష్ణేయ గ్రా
మణియును నభ్ర భ్రాజన్
మణులనినన్ యతివరుండు మక్కువ జూపెన్
తమ్ముడు చి.నరసింహమూర్తికి అశీస్సులు:
రిప్లయితొలగించండినీ నిన్నటి పూరణ చాల బాగున్నది. ఏమి తేడాలు లేవు. (ఆమెకును నామె కూతున కతడె భర్త)
రాగ బంధ మేమొ ? యోగీశ్వరుడు కృష్ణు
రిప్లయితొలగించండిడెపుడు విడువ జాల డెంత కృపయొ !
పూర్వ జన్మ లందు మును లైన గోప ర
మణుల పైన యతికి మక్కువ గద !
సుజన-సృజన
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజారావుగారూ, "పూర్వ జన్మ లందు " అన్నారు కాని "పూర్వ జన్మము లందు" అన్నది సాధు ప్రయోగమేమో. అందుచేత " "పూర్వ జన్మ ములను " అంటే సరిపోతుంది.
రిప్లయితొలగించండిశ్రీనేమానిమహాశయా! నమస్కారములు. మీరు మూర్తి మిత్రులకిచ్చిన సవరణ పద్యంలో సమస్య పాదం "మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్" మార్చి వ్రాయబడింది. అర్థభేదం లేకపోయినా ఆ రకమైన ప్రయోగం చేయవచ్చునా?
రిప్లయితొలగించండిగుణమణియగు శ్రీరాముడు
ఫణిభూషణ రాజితుండు వార్ష్ణేయ గ్రా
మణియును నభ్ర భ్రాజన్
మణులనినన్ యతివరుండు మక్కువ జూపెన్
సందేహం- ప్రాసమైత్రి లో ఒక వ్యాకరణ సూత్రం ప్రకారం "...ఆదేశ ణకారానికి సహజ ణకార నకారాలు ప్రాసమైత్రికి చెల్లుతాయి...". కాబట్టి "న" మరియు "ణ" లు ప్రాసగా ఉపయోగించవచ్చును కదా? మరి "ణ" నిజంగా ఇబ్బంది పెట్టే ప్రాసయేనా?
రిప్లయితొలగించండిఅయ్యా! చంద్రశేఖర్ గారూ!
రిప్లయితొలగించండిసమస్యను ఎలాగ ఇస్తే అలాగే పూరించాలి. అదే ఉద్దేశముతోనే మొదలుబెట్టినా టైపు చేసేటప్పుడు కొంచెము పొరపాట్లు అప్పుడప్పుడు దొరలుతున్నాయి. వయస్సు ప్రభావము కదా. మీలా చిన్న వాణ్ణి కాదు కదా. కావాలని చేసినవి మాత్రము కాదు.
మిత్రులారా!
రిప్లయితొలగించండియతులు ప్రాసలు గురించి ఎన్నో పాఠాలు నేర్చుకొనుచున్నాము. వాటిలో చాలా వెసులుబాట్లు కనిపించుచున్నవి. ఉదా: న - ణ లకు, ల - డ లకు, త - త్ర లకు, మొ.వి. నా ఉద్దేశములో ఇవన్నీ ఉపయోగించుకొనే అవసరము లేకుండా సరళముగా యతి ప్రాసలు వేయ అలిగితే ఎంతో హాయి.
ఈ ముందర వాక్యములో వేయ గలిగితే అని టైపు చేయబోతే అది అలిగితే అని పడింది. దిద్దుకొని చదువుకుందాము.
రిప్లయితొలగించండిశ్రీనేమాని మహాశయా! నాకు వచ్చే సందేహాలు తెలుగు భాషమీద, సమస్యా పూరణం మీద సాధికారత లేకపోవటం వల్లవచ్చినవే. మీ పద్యరచనా పాటవం చూస్తే వయసు ప్రభావం మిమ్మల్ని ఇంకా యువతకు దగ్గరగా చేరుస్తోంది. మీరు మరొక కావ్యం వ్రాయగల సమర్థులు, అంతటి ధారణా శక్తిగల పండితులు. సమస్యాపూరణం మీలాంటి వారికి ఒక గారడీ విద్య లాంటిదని నాకనిపిస్తుంది. నమోవాక్కములు.
రిప్లయితొలగించండిఅయ్యా చంద్రశేఖర్ గారూ!
రిప్లయితొలగించండివరహృదయమ్మునన్ తెలుగు భాషను చక్కగ నభ్యసించి చా
తురి మెరయన్ కవిత్వమున దొడ్డతనమ్మును జూపుచున్ సుధీ
వరుల ప్రశంసలొందు కవివర్య! రసప్రియ! చంద్రశేఖరా!
నిరతము వృద్ధి చెందుచును నీ కృషి యిచ్చును సత్ఫలమ్ములన్
అన్నయ్యగారు శ్రీ పండిత నేమాని వారి పద్యము మనోహరముగా ఉంది. బహుధా కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిఅన్నయ్య గారూ, నమస్సులు. మిత్రులు చంద్రశేఖరుల వారితో నేను సంపూర్ణముగా నేకీభవిస్తాను. మీ ఆధ్యాత్మిక రామాయణమును చదివి యానందించాను. పద్యాలు మధురముగా నున్నాయి. కాని యీ మధ్య మీరు వ్రాస్తున్న పద్యాలు చదువుతుంటే మీ కవితా శక్తి ,మీ శయ్య యింకా పరిపక్వము నొందినట్లు నా కనిపిస్తుంది. దైవానుగ్రహముతో మరో కావ్య సృష్టి మీచే సంభవించ గలదని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిఈరోజు మిత్రుల పూరణలన్నీ మణి విభూషణాలే. సమస్యను ఇచ్చిన శ్రీ శంకరయ్య గారికి మరియు శ్రీ శ్యామలీయం గారికి అభినందనలు. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు, శ్రీ శంకరయ్య గారు, శ్రీ రాజారావు గారు రెండేసి పూరణలు చేసి తమ సమధికోత్సాహాన్ని చూపేరు. భలా. తమ్ముడు చి. నరసింహమూర్తి చేసిన ప్రయత్నము అభినందనీయమే. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు మరియు శ్రీ ఆదిభట్ల వారు కూడ సమర్థముగ పూరించేరు. శ్రీ శ్యామలీయం గారు కూడా చాల చురుకుగా పాలుగొనుచున్నారు. మరి శ్రీ జిలేబి గారు ఎప్పుడు నేరుస్తారో పద్య విద్య. మంచి ముహూర్తము కోసము చూస్తున్నారేమో.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిశ్యామల రావు గారూ,
మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలో బోధపడడం లేదు.
మా అబ్బాయి విడాకులకు సంబంధించిన సమస్యతో మనశ్శాంతి కరువై తీరిక లేకుండా తిరుగుతున్న నేను మిత్రుల పూరణలను విశ్లేషించే సమయం చిక్కక బాధ పడుతున్నాను. మీరు అందరి పూరణల గుణదోష విచారణ చేస్తూ నా కెంతో మేలు చేస్తున్నారు. మీకెంతో ఋణపడి ఉన్నాను. ఈ సహకారాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి. మీకు వేలవేల ధన్యవాదాలు.
కవిమిత్రులకు విజ్ఞప్తి ...
రిప్లయితొలగించండిమరి కొన్ని రోజులు నేను కేవలం సమస్యను గాని, మరేదైనా గాని పోస్ట్ చేయడమే కాని విశ్లేషించడం, చర్చలో పాల్గొని సందేహనివృతి చేయడం మొదలైనవి చేయలేను. ఆ లోటును పండిత నేమాని వారు, శ్యామలీయం గారు తీరుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. బ్లాగులో సంస్కారపూరితమైన చర్చలు జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది.
మీరు బ్లాగులో కాని, నాకు వ్యక్తిగత మెయిల్ గా కాని సందేహాలు తెలిపితే సమధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. పెద్దమనసుతో అర్థం చేసికొని సహకరించవలసిందిగా మనవి.
గత కొద్ది రోజులుగా పని వత్తిడి తీవ్రంగా ఉండటం వలన సమస్యాపూరణాలను పరశీలించటానికి సమయం చిక్కటం లేదు. పైగా ఈ రెండు రోజులు అమెరికాలో సెలవుదినాలు కావటం వలన పని అంతా మిగతా ప్రాంతాలలోని వారికి సర్దుకోవటం వలను మరొక కొద్ది దినాలు వత్తిడి యిలాగే ఉండవచ్చును. తరవాత యధాప్రకారం మరింత చురుకుగా పాల్గొనగలనని భావిస్తున్నాను.
రిప్లయితొలగించండి1. గోలి హనుమచ్ఛాస్త్రి గారి ప్రయోగం 'గొప్పని పించెన్' యడాగమం జరిగి 'గొప్పయని పించెన్' అన్నది సాధువనుకుంటాను.
రిప్లయితొలగించండి2. గోలి హనుమచ్ఛాస్త్రి గారి ప్రయోగం 'భువిజ పతికి' . ఇక్కడ ''భువిజా పతికి' అని ఉండాలనుకుంటాను.
3. గన్నవరపు నరసింహమూర్తిగారి 'రణమున పార్థుని ... ' పద్యంలో పదాలు చాలవరకు వేర్వేరు విభక్తుల్లో ఉన్నాయేమో? దానితో అన్వయం తిన్నగా రావటం లేదు. నేమాని వారు సవరించిపద్యం పరగులు త్రొక్కింది - బాగుంది.
4. సంపత్కుమారులవారి గణనీయంబగు... పద్యం లో 'గుణముల నొప్పెడు గురువు "రమణు"లనిన' అనేది కొంచెం అనవసర చిహ్నాలు లేకుండా 'గుణముల నొప్పెసగు గురు రమణు లనిన' అంటే బాగుంటుందనుకుంటాను. ఇందుకు తృతీయపాదం స్వల్పంగా సవరించవలసి వస్తున్నది.
5. రాజారావుగారి 'రాగబంధమేమొ...' పద్యం మరి కొంచెం శ్రధ్ధతో ఇంకా బాగా వచ్చేది. 'జన్మ లందు ' కాక 'జన్మము లందు ' అని నా అభిప్రాయం ముందే చెప్పాను.
6. జిలేబిగారు యేదోదీ వ్రాసారు!
*నేమానివారి 'కమలహిత కులమణి...' పద్యం నానామణిరంజితమై బాగుంది.
*రాజారావుగారి మణులొల్లడు... పద్యం సాఫీగా సాగింది. బాగుంది.
*శంకరయ్యగారి పద్యద్వయం బాగుంది. ముఖ్యంగా రెండవదయిన కందం యేకధాటిగా మంచినడక చూపింది.
*సంపత్కుమారులవారి గణనీయంబగు... పద్యం గణనీయంబగు పద్యమే.
నేమానివారి ఆధ్యాత్మిక రామాయణము నా వద్దలేదు. వీలు వెంబడి సంపాదించి చదవాలి కోరిక. నాకు పుస్తకాలు దాచుకోవటం చేతకాకపోవటం వలన దాదాపు నాదగ్గర స్టాకు అంతా పరహస్త గతం అయిపోయింది. ఈ మద్యకాలంలో యేమీ సేకరించలేదు. మా మామయ్యగారు శ్రీ ప్రసాద్ ఆత్రేయగారు కొన్ని కావ్యాలు వ్రాస్తున్నారు. కొన్ని నాకు యీ మధ్య పంపారు. వీలు వెంబడి చదవాలి.. ఎంతసేపూ, మా డాక్యుమెంటేషన్ చాదవటానికే సమయం గడచిపోతోంది!
శ్యామల రావు గారూ! పని వత్తిడి లో కూడా ఇంట విపులముగా విశ్లేషించి నందులకు ధన్యవాదములు.నా పూరణలను సవరించడానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిమణి మాన్యంబుల నొల్లము
రిప్లయితొలగించండిగుణమున మీ యాశ్రమంబు గొప్పగ నుండెన్
క్షణమును మిము వదలమని ర
మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్
శివుడు మక్కు వగును సీతా పతికి రావ
ణారి మక్కువగును నాగ ధరుకు
పరమ పురుషు లైన ఫాలాక్ష సీతా ర
మణులపైన యతికి మక్కువ గద!
అయ్యా శ్యామలరావు గారు
రిప్లయితొలగించండిమా అధ్యాత్మ రామాయణము ఈ క్రింది వెబ్ సైట్లో చూడవచ్చును.
www.lalithaedas.com./ramayanam
మీ చిరునామా తెలియ జేస్తే నేను 1 కాపి పంపగలను.(ఉచితము)
క్షణము వృధా చేయక తీ-
రిప్లయితొలగించండిక్షణముగ తపమా చరింప కనులకు దోచెన్
అణిమాది సిద్ధులా స-
న్మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్
కౌశికుండు కోపి యని నీకు కంపమా
రిప్లయితొలగించండివలపు చిలుక రించి వగపు జూప
కరగి పోవు మేనకా పొమ్ము కన్యకా
మణులపైన యతికి మక్కువ గద!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
రోమపాదుని పనుపున దరిజేరిన వారకాంతల భ్రాంతిలో
ఋష్యశృంగుడు :
01)
__________________________________
ఝణఝణ కింకిణి క్వణముల
మణిమయ భూషణ ధరులగు - మగువల వశమౌ
క్షణమున , వివశత, గణికా
మణు లనిన యతీశ్వరుండు - మక్కువ జూపెన్ !
__________________________________
కింకిణి = గజ్జె
క్వణము = a musical note or sound( ధ్వని )
వివశత = పరవశత్వము
వివశత=the state of being uncontrolled= పరవశత్వము
గణిక = వేశ్య
వెంకట శాస్త్రి గారి పూరణ ......
రిప్లయితొలగించండిఅందరికీ నమస్కారం. చాలా రోజుల తరువాత ఈ బ్లాగు చూడ గలిగేను. ఇచ్చిన సమస్య చూడగానే వచ్చిన చిన్న ఊహ.
తిరుమల గిరి వాసి, దీన జనాప్తుండు
వేడుకున్న వారి తోడునీడ
వడ్డి కాసుల గొని వరదుడౌ లక్ష్మీర
మణుల పైన యతికి మక్కువ గద!
ధన్య వాదములు.
వెంకట శాస్త్రి.
మిస్సన్న గారు మీ నిన్నటి పూరణ:
రిప్లయితొలగించండితీక్ష్ణము అంటేనే సాధువు. తీక్షణము అనే పదము లేదు.
ఆటవెలదిలో 1వ పాదములో యతి లేదు.
వసంత కిశోర్ గారు:
ఝణఝణ కింకిణి క్వణములు - కింకిణి రవములు అంటే బాగుంటుంది- లేకుంటే ణి గురువు అయి గణ భంగము అవుతుంది.
అహము వీడకుండ ,ఐహికసుఖముల
రిప్లయితొలగించండియందు వాంఛ పోక ,అర్థాంగి ,సుతులను
విడచి యడవి కేగ వీడునా భామినీ
మణులపైన యతికి మక్కువగద.
శ్రీ నేమాని పండితులకు కృతజ్ఞతలతో ..........
రిప్లయితొలగించండిక్షణము వృధా చేయక భీ
షణతపమును జేయ దోచె చక్కగ మదికిన్
అణిమాది సిద్ధులా స-
న్మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్
శ్రీ నేమాని పండితులకు కృతజ్ఞతలతో ..........
రిప్లయితొలగించండికౌశికుండు కోపి కాదన నే గాని
వలపు చిలుక రించి వగపు జూప
కరగి పోవు మేనకా పొమ్ము కన్యకా
మణులపైన యతికి మక్కువ గద!
మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
రిప్లయితొలగించండినేమానివారికి ధన్యవాదములతో :
రోమపాదుని పనుపున దరిజేరిన వారకాంతల భ్రాంతిలో
ఋష్యశృంగుడు :
01అ)
__________________________________
ఝణఝణ కింకిణి రవముల
మణిమయ భూషణ ధరులగు - మగువల వశమౌ
క్షణమున , వివశత, గణికా
మణు లనిన యతీశ్వరుండు - మక్కువ జూపెన్ !
__________________________________
కింకిణి = గజ్జె
రవము = ధ్వని
వివశత = పరవశత్వము
వివశత=the state of being uncontrolled= పరవశత్వము
గణిక = వేశ్య