17, నవంబర్ 2011, గురువారం

నా పాటలు - (సాయి పాట)

                           పరబ్రహ్మ సాయి

సాయి మాధవుడు - సాయి శంకరుడు
సాయినాథుడే పరబ్రహ్మ
అణువునుండి బ్రహ్మండం వరకు
నిండిన సర్వాంతర్యామి       
|| సాయి ||

ఏయే పేరున పిలిచిన వారికి
ఆయా పేరున బదులిచ్చి
ఏ రూపును భావించిన వారికి
ఆ రూపంతో కనుపించు       
|| సాయి ||

నామరూపముల కందని దేవుడు
నానాజీవుల జీవాత్మ
అన్ని నామముల కన్ని రూపముల
కాలవాలమీ పరమాత్మ       
|| సాయి ||

అన్ని మతముల సారం ఒకటే
సంప్రదాయముల గమ్యం ఒకటే
భేదభావముల హద్దులు చెరిపిన
సాయినాథుడే మన శరణం       
|| సాయి ||

2 కామెంట్‌లు:

  1. సాయి పాటలు చాలా బాగున్నాయి తమ్ముడూ !
    చాలా మంది పుస్తకాలు ప్రింటు చేయించి పంచి పెడతారు. . ఇక్కడ కుడా చాలా మంది దగ్గర పాటల పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని రాసినా కొదవేముంది ? వ్రాయ గలిగిన మీరు ధన్యులు .

    రిప్లయితొలగించండి