కరిరాజుని బ్రోచెను,సూ కరమై,ధర నుద్ధరించె,గాచెన్ సురలన్ తరియింపగ నాబోంట్లను గిరిధారికి భార మావగింజ తలంపన్ ఆర్యా,మీరు,శాస్త్రిగారు రోజూ సమస్యలనిస్తే follow అవడం , పూరించడం చాలా కష్టం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు సైన్సు ,చరిత్ర ,సంగీతం లాంటి చాల ఇతర విషయాలు కూడా చూస్తుంటాము.అందువల్ల సమయం చాలదు.రోజు విడచి రోజు సమస్యాబా ణాల్ని వదిల్తే బాగుంటుందని మనవి.
మాకు తెలిసిన పాక శాస్త్ర ప్రవీణుడొకాయన వందలమందికి అవలీలగా వంట చేసిపడేసేవాడు. ఆయనొక్కడికి మాత్రం చేసుకోలేకపోయేవాడు. వేరే వాళ్ళు వండి పెట్టేవాళ్ళు ఆయనకి. అలాగే Five Star Hotel Chefs కూడా ఒక్కళ్ళకి వండలేరట. నాపూరణ: కరమున వందల మందికి సురుచిరముగ వంట లొండు సూపులు తమకొ క్కరికిని వండగ లేరన గిరిధారికి భార మావగింజ తలంపన్
కవిమిత్రులకు వందనాలు. ఈ రోజు ఒక ముఖ్యమైన పనిమీద గ్రామాంతరం వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. అందరి పూరణలూ చూసాను. అద్భుతంగా ఉన్నాయి. ప్రయాణపు బడలిక వల్ల మీ పూరణలపై వెంటనే స్పందించలేక పోతున్నాను. మన్నించండి. రేపు ఉదయమే నా స్పందనలను తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు.
ఆదిభట్ల వారికి సూచన: మీరు పూరణ పోస్టు చేసేటప్పుడు "ప్రొఫైల్ ను ఎంచుకోండి" అన్న చోట drop down menu నుంచి పేరు/URL సెలెక్టు చేసుకొంటే మీ పేరు టైపు చేయవచ్చు. అప్పుడు మీరు టైపు చేసినపేరు + చెప్పారు (ఉ.ఆదిభట్ల చెప్పారు) అని వస్తుంది. అప్పుడు "అజ్ఞాత చెప్పారు" అన్న గొడవ వుండదు. అలాగే మీరు పోస్టింగు లో మీ పేరు వ్రాయవలసిన అవసరం వుండదు. ప్రయత్నించి చూడండి.
********************************************************************** కొందరు కవిమిత్రులు ‘భారమా ఆవగింజ?" అని ప్రశ్నార్థకంగా పూరించారు. అయితే దీర్ఘాంతమైన ఆచ్ఛికపదాలకు సంధి కుదరదు కదా! అలా ప్రశ్నార్థకంగా ఉండాలంటే ‘భారమా యావగింజ’ అని యడాగమం రావాలి. ********************************************************************** పండిత నేమాని గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. అయితే ఇక్కడ ఒక విప్రతిపత్తి. కృష్ణావతారంలో గిరిధారి అయ్యాడు కదా! అంతకుముందు అవతారంలో సీత రాముణ్ణి ‘గిరిధారి’ అని సంబోధించడం ఎలా సబబు? ‘గిరి’ శబ్దానికి ‘పూజ్యమైనది’ అనే విశేషణార్థం ఉంది. పూజ్యమైన ధనుస్సును ధరించినవాడు రాముడనే అర్థం తీసికొని సమర్థించవచ్చు. ********************************************************************** గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ మొదటి పూరణ కాలోచితంగా సమర్థనీయంగా ఉంది. బాగుంది. రెండవ పూరణకూడ బాగుంది. అభినందనలు. మీరు చంద్రశేఖర్ గారు కామేశ్వర శర్మ గారికి ఇచ్చిన సలహా ప్రకారం మీ పేరును తెలుగులో టైప్ చేసి పేరు/URL అన్నచోట పేస్ట్ చేస్తే మీ పేరు తెలుగులో కనిపిస్తుంది కదా! ఒకసారి ప్రయత్నించి చూడండి. ********************************************************************** వసంత కిశోర్ గారూ, మీ మూడు పూరణలూ ముచ్చటగా ఉన్నాయి. అభినందనలు. మొదటి పూరణలో ‘కరుణించు ఘనుడె యెట్టుల గిరిధారికి భార మావగింజ తలంపన్ ?’ అనీ ... రెండవపూరణలో ‘పరమాత్ము డతని కెట్టుల ....’ అనీ మూడవపూరణలో ‘తా నలమేలున్ / వరియించె నతని కెట్టుల ... ’ అనీ సవరిస్తే బాగుంటుందని నా సూచన. ********************************************************************** మందాకిని గారూ, మధురమైన పూరణ. అభినందనలు. ********************************************************************** శ్యామల రావు గారూ, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. ‘నన్ను’ పునరుక్త మయింది. ‘మొఱ లిడెడువాని...’ అంటే సరి! ‘కమనీయం’ గారిని సంబోధించిన మీ పద్యాలకు ధన్యవాదాలు. ********************************************************************** శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. ********************************************************************** మిస్సన్న గారూ, ‘గిరి’ శబ్దానికి ఉన్న అర్థభేదంతో అద్భుతమైన పూరణ చెప్పారు. మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు. ********************************************************************** డా. విష్ణునందన్ గారూ, చాలా కాలానికి మమ్ము కరుణించారు. ధన్యవాదాలు. మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ********************************************************************** ‘కమనీయం’ గారూ, కమనీయమైన పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు. మీకు సానుకూలమైనప్పుడే పూరణలు చేయవలసిందిగా మనవి. ********************************************************************** లక్కాకుల వెంకట రాజారావు గారూ, ధన్యవాదాలు. మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. ********************************************************************** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మంచి ‘పట్టే’ పట్టారు. మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ********************************************************************** రాజేశ్వరి అక్కయ్యా, చక్కని పూరణ. అభినందనలు. ‘సిరికిం జెప్పకనే’ అంటే గణదోషం పోతుంది. ‘కరుణతొ’ను ‘కరుణన్’ అనండి. ********************************************************************** ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ, మీ పూరణలోని చమత్కారం అదిరింది. అభినందనలు. శర్మ గారికి మీ రిచ్చిన సలహా పనిచేసింది. ధన్యవాదాలు. అలాగే మీ మిత్రులు ‘మూర్తి’ గారికీ ఇచ్చి వారి పేరు తెలుగులో వచ్చే విధంగా చూడండి. **********************************************************************
********************************************************************** కళ్యాణ్ గారూ, చక్కని పూరణ. అభినందనలు. ‘పరిపరి’శబ్దం విశేషణం. అది తప్పక విశేష్యపూర్వమై ఉండాలి. ‘పరిపరి విధముల, పరిపరి గతుల ...’ ఇలా. అక్కడ ‘మరిమరి’ అంటే సరి! ‘అందు’ శబ్దం ద్రుతాంతం. కాబట్టి అక్కడ ‘తీరమందు నాశగ ..’ అనాలి. ‘తరుణీ విరహము నత్తరి’ అనేది ‘తరుణీ విరహ మ్మత్తరి’ అంటే అన్వయం కుదురుతుంది. **********************************************************************
(అశోక వనములో శ్రీరాముని దలచుచు సీతాదేవి చెందుచున్న ఆవేదన)
రిప్లయితొలగించండిపరిరక్షకుడు జగాలకు
సురవంద్యుడు నా యవస్థ చూడడదేలా?
కరుణించ డక్కటా నను
గిరిధారికి భార మావగింజ దలంపన్
కరుణా నిధి ;
రిప్లయితొలగించండివరపుత్రిక నా కనిమొళి
చెఱ జిక్కగ విడువడేల సింగును గింగున్
మొరలిడితె సోనియమ్మకు
గిరిధారికి భారమావగింజ దలంపన్
( అప్పుడప్పుడు కరుణనిధి వంటి వారు కూడా దైవమును తలుస్తారుట! )
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
గిరినెత్తినవానికి ఆవగింజో లెక్కా ?
01)
_____________________________________
వరమోహన రూపుడతడు
గిరి నిలిపెను వేలి కొనను - గిరిధరు డయ్యెన్ !
కరుణించెను తన వారిని !
గిరిధారికి భారమా ? వ - గింజ తలంపన్ !
_____________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమూర్తిగారి స్ఫూర్తితో :
రిప్లయితొలగించండిరామలింగరాజు ప్రార్థన విని బెయిలు ప్రసాదించాడు పరమాత్మ !
కరుణానిధి ప్రార్థన కూడా వింటాడేమో ???
02)
_____________________________________
సరి , రామలింగ రాజిక
తిరిగింటికి చేరుకొనెను - తిమిరము తొలగెన్ !
పరమాత్ముని కరుణ వలన !
గిరిధారికి భారమావ - గింజ తలంపన్ !
_____________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి03)
రిప్లయితొలగించండి_____________________________________
వరమొసగెనట యశోదకు !
ధర వెలసెను వకుళ జేరె - తన మాటకునై
వరియించెను పద్మావతి !
గిరిధారికి భారమావ - గింజ తలంపన్ !
_____________________________________
శ్రీ నేమాని వారి స్ఫూర్తితో,
రిప్లయితొలగించండిభక్త రామదాసు ;
కరిరాజుఁ బ్రోచెఁ ద్వరపడి
కరతలమున నమల మయ్యె గాచగ సురలన్
గరుణించి నన్ను గావడె
గిరిధారికి భార మావగింజ దలంపన్ !
సురలోకములే దాకును
రిప్లయితొలగించండిచిఱుపాదములన్ కనంగ; చినవారలపై
మరి యెక్కు నుట్టి యందక
గిరిధారికి భార మావగింజ దలంపన్
సురలను గోగోపకులను
రిప్లయితొలగించండికరుణించిన నీకు నన్ను కలివిషజలధిన్
మెఱలిడెడు నన్ను బ్రోచుట
గిరిధారికి భార మావగింజ తలంపన్
ఎరిగింపనొరులు బలమును
రిప్లయితొలగించండితరులను పెకలించు నబ్ధిదాటును మరితా
నెరుగనిచో సంజీవని
గిరిధారికి భార మావగింజ తలంపన్
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
పై పద్యమును ఇంకా బాగా చెప్పవచ్చు అనిపించి ఇలా సవరిస్తునాను
రిప్లయితొలగించండిఎరిగింపనొరులు బలిమియె
తరులను పెకలించు నబ్ధి దాటును తన లా
వెరుగని యా సంజీవని
గిరిధారికి భార మావగింజ తలంపన్
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
నిఘంటువులో గిరి అంటే ఒక నేత్ర రోగ విశేషమని కూడా ఉంది.
రిప్లయితొలగించండిఅందుకని సరదాగా...
'గిరి' యొక నేత్రవ్యాధియె
అరయంగా వస్తు తతుల నధికశ్రమమౌ
ధరపై జారిన, చూచుట,
గిరిధారికి భార మావగింజ తలంపన్.
కామేశ్వర శర్మగారూ మీ పూరణలోని భావం చాలా బాగుంది.
రిప్లయితొలగించండికురు రాట్సభలో శాంతికి
రిప్లయితొలగించండిపరిరక్షకుడగుచు రాయబారము నెరపన్
గురుభారమె యొరులకు ; మరి
గిరిధారికి ? భారమావగింజ తలంపన్ !!!
గిరిధారికి ఆ భారమొక లెక్కలోనిది కాదని భావం !
రాధ బాధ
రిప్లయితొలగించండిమొరలిడెనో వేదండము
పరుగిడెనో పడతి కొఱకు వలువల నిడగా
నరుదెంచడు రాధను గన
గిరిధారికి భార మావగింజ తలంపన్.
విష్ణు నందన్ గారూ బహుకాల దర్శనం.
రిప్లయితొలగించండిమంచి విరుపుతో గూడిన పూరణ.
కరిరాజుని బ్రోచెను,సూ
రిప్లయితొలగించండికరమై,ధర నుద్ధరించె,గాచెన్ సురలన్
తరియింపగ నాబోంట్లను
గిరిధారికి భార మావగింజ తలంపన్
ఆర్యా,మీరు,శాస్త్రిగారు రోజూ సమస్యలనిస్తే follow అవడం ,
పూరించడం చాలా కష్టం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు
సైన్సు ,చరిత్ర ,సంగీతం లాంటి చాల ఇతర విషయాలు కూడా
చూస్తుంటాము.అందువల్ల సమయం చాలదు.రోజు విడచి రోజు
సమస్యాబా ణాల్ని వదిల్తే బాగుంటుందని మనవి.
(వామన కృష్ణావతారముల తులనము.)
రిప్లయితొలగించండిచిన్న సవరణతో....
సురలోకములే దాకును
చిఱుపాదమ్ములఁగనంగ చినవారలపై
మరి యెక్కు నుట్టి యందక
గిరిధారికి భార మావగింజ దలంపన్
విష్ణు నందను పద్యమ్ము విరుల సరులు
రిప్లయితొలగించండిశ్యామలీయ ము పద్యమ్ము సరుల విరులు
నడకలో, భావ మందున, నన్వయాన
మల్లె దండల సౌరులు మదికి దెచ్చు
ఇక పూరణ :
పరమాణు వందు దొరకొని
పరమాత్ముడు సృష్టియంత పరి పూర్ణుండై
విరియగ- నిది పిచ్చిపలుకు
'గిరిధారికి భార మావ గింజ' తలంపన్
బ్లాగు : సుజన-సృజన
సవరించిన పద్యం. (రెండవ పాదాన్ని కొద్దిగా మార్చటం జరిగింది.)
రిప్లయితొలగించండిసురలను గోగోపకులను
కరుణించిన నీకు నిపుడీ కలివిషజలధిన్
మెఱలిడెడు నన్ను బ్రోచుట
గిరిధారికి భార మావగింజ తలంపన్
మిత్రుల పూరణలు బాగున్నవి.కానీ కొన్నింటికి ప్రశ్నార్థకంగా అన్వయం లేక పోవుట వలన కొంత లోపంగా ఉన్నట్టుంది.
రిప్లయితొలగించండిగిరి తా పేరును మోసెను
బరువులనే మోసి మోసి పరువములోనన్ (వెయిట్ లిఫ్టింగ్)
బరువాయె నొడలు ముదిమిని
గిరిధారికి భార మావ గింజ తలంపన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికమనీయం గారూ,
రిప్లయితొలగించండిదినదినము వచ్చు బాణము
లను గాచుకొనంగ మీకు లగ్గగు గాదేన్
వలసిన వాటికి ఢీ యని
కళవళ పడ కుండ వదలగల రన్యములన్
వచ్చు నవి యెల్ల నాహ్లాద బాణ వితతి
మీద పడనిండు హాయిగా మీకు తోచి
నట్టి వాని మధుర పూర ణాస్త్రములను
జేసి హర్షసువృష్టి భాసించనిండు
సిరికి చెప్పకనే చని
రిప్లయితొలగించండికరి రాజుకు మోక్షమిచ్చి కరుణతొ బ్రోచెన్ !
సిరులిచ్చి కాచె మిత్రుని
గిరి ధారికి భార మావగింజ తలంపన్ !
మాకు తెలిసిన పాక శాస్త్ర ప్రవీణుడొకాయన వందలమందికి అవలీలగా వంట చేసిపడేసేవాడు. ఆయనొక్కడికి మాత్రం చేసుకోలేకపోయేవాడు. వేరే వాళ్ళు వండి పెట్టేవాళ్ళు ఆయనకి. అలాగే Five Star Hotel Chefs కూడా ఒక్కళ్ళకి వండలేరట.
రిప్లయితొలగించండినాపూరణ:
కరమున వందల మందికి
సురుచిరముగ వంట లొండు సూపులు తమకొ
క్కరికిని వండగ లేరన
గిరిధారికి భార మావగింజ తలంపన్
కవిమిత్రులకు వందనాలు.
రిప్లయితొలగించండిఈ రోజు ఒక ముఖ్యమైన పనిమీద గ్రామాంతరం వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. అందరి పూరణలూ చూసాను. అద్భుతంగా ఉన్నాయి. ప్రయాణపు బడలిక వల్ల మీ పూరణలపై వెంటనే స్పందించలేక పోతున్నాను. మన్నించండి.
రేపు ఉదయమే నా స్పందనలను తెలియజేస్తాను.
అందరికీ ధన్యవాదాలు.
చంద్ర శేఖర్ గారూ! బాగుంది. కానీ (వంటలు + వండు ) బదులు
రిప్లయితొలగించండివంట జేయు అంటే ....
శాస్త్రిగారూ, AGREED:-) చక్కటి సవరణకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఆదిభట్ల వారికి సూచన: మీరు పూరణ పోస్టు చేసేటప్పుడు "ప్రొఫైల్ ను ఎంచుకోండి" అన్న చోట drop down menu నుంచి పేరు/URL సెలెక్టు చేసుకొంటే మీ పేరు టైపు చేయవచ్చు. అప్పుడు మీరు టైపు చేసినపేరు + చెప్పారు (ఉ.ఆదిభట్ల చెప్పారు) అని వస్తుంది. అప్పుడు "అజ్ఞాత చెప్పారు" అన్న గొడవ వుండదు. అలాగే మీరు పోస్టింగు లో మీ పేరు వ్రాయవలసిన అవసరం వుండదు. ప్రయత్నించి చూడండి.
రిప్లయితొలగించండిధన్యవాదం చంద్ర శేఖర్ గారూ
రిప్లయితొలగించండి**********************************************************************
రిప్లయితొలగించండికొందరు కవిమిత్రులు ‘భారమా ఆవగింజ?" అని ప్రశ్నార్థకంగా పూరించారు. అయితే దీర్ఘాంతమైన ఆచ్ఛికపదాలకు సంధి కుదరదు కదా! అలా ప్రశ్నార్థకంగా ఉండాలంటే ‘భారమా యావగింజ’ అని యడాగమం రావాలి.
**********************************************************************
పండిత నేమాని గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
అయితే ఇక్కడ ఒక విప్రతిపత్తి. కృష్ణావతారంలో గిరిధారి అయ్యాడు కదా! అంతకుముందు అవతారంలో సీత రాముణ్ణి ‘గిరిధారి’ అని సంబోధించడం ఎలా సబబు?
‘గిరి’ శబ్దానికి ‘పూజ్యమైనది’ అనే విశేషణార్థం ఉంది. పూజ్యమైన ధనుస్సును ధరించినవాడు రాముడనే అర్థం తీసికొని సమర్థించవచ్చు.
**********************************************************************
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ మొదటి పూరణ కాలోచితంగా సమర్థనీయంగా ఉంది. బాగుంది.
రెండవ పూరణకూడ బాగుంది. అభినందనలు.
మీరు చంద్రశేఖర్ గారు కామేశ్వర శర్మ గారికి ఇచ్చిన సలహా ప్రకారం మీ పేరును తెలుగులో టైప్ చేసి పేరు/URL అన్నచోట పేస్ట్ చేస్తే మీ పేరు తెలుగులో కనిపిస్తుంది కదా! ఒకసారి ప్రయత్నించి చూడండి.
**********************************************************************
వసంత కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ ముచ్చటగా ఉన్నాయి. అభినందనలు.
మొదటి పూరణలో ‘కరుణించు ఘనుడె యెట్టుల
గిరిధారికి భార మావగింజ తలంపన్ ?’ అనీ ...
రెండవపూరణలో ‘పరమాత్ము డతని కెట్టుల ....’ అనీ
మూడవపూరణలో ‘తా నలమేలున్ / వరియించె నతని కెట్టుల ... ’ అనీ సవరిస్తే బాగుంటుందని నా సూచన.
**********************************************************************
మందాకిని గారూ,
మధురమైన పూరణ. అభినందనలు.
**********************************************************************
శ్యామల రావు గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
‘నన్ను’ పునరుక్త మయింది. ‘మొఱ లిడెడువాని...’ అంటే సరి!
‘కమనీయం’ గారిని సంబోధించిన మీ పద్యాలకు ధన్యవాదాలు.
**********************************************************************
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
**********************************************************************
మిస్సన్న గారూ,
‘గిరి’ శబ్దానికి ఉన్న అర్థభేదంతో అద్భుతమైన పూరణ చెప్పారు.
మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
**********************************************************************
డా. విష్ణునందన్ గారూ,
చాలా కాలానికి మమ్ము కరుణించారు. ధన్యవాదాలు.
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
**********************************************************************
‘కమనీయం’ గారూ,
కమనీయమైన పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
మీకు సానుకూలమైనప్పుడే పూరణలు చేయవలసిందిగా మనవి.
**********************************************************************
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
ధన్యవాదాలు.
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
**********************************************************************
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మంచి ‘పట్టే’ పట్టారు.
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
**********************************************************************
రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని పూరణ. అభినందనలు.
‘సిరికిం జెప్పకనే’ అంటే గణదోషం పోతుంది. ‘కరుణతొ’ను ‘కరుణన్’ అనండి.
**********************************************************************
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
మీ పూరణలోని చమత్కారం అదిరింది. అభినందనలు.
శర్మ గారికి మీ రిచ్చిన సలహా పనిచేసింది. ధన్యవాదాలు. అలాగే మీ మిత్రులు ‘మూర్తి’ గారికీ ఇచ్చి వారి పేరు తెలుగులో వచ్చే విధంగా చూడండి.
**********************************************************************
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
Thank you మిస్సన్నగారూ
రిప్లయితొలగించండిశంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
అందరికీ నమస్కారం,
రిప్లయితొలగించండిఇది నా పూరణ..
పరిపరి రాధను తలచుచు
హరి యమునాతీరమందు యాశగ నిలువన్
తరుణీ విరహము నత్తరి
గిరిధారికి భార మావగింజ తలంపన్
**********************************************************************
రిప్లయితొలగించండికళ్యాణ్ గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
‘పరిపరి’శబ్దం విశేషణం. అది తప్పక విశేష్యపూర్వమై ఉండాలి. ‘పరిపరి విధముల, పరిపరి గతుల ...’ ఇలా. అక్కడ ‘మరిమరి’ అంటే సరి! ‘అందు’ శబ్దం ద్రుతాంతం. కాబట్టి అక్కడ ‘తీరమందు నాశగ ..’ అనాలి. ‘తరుణీ విరహము నత్తరి’ అనేది ‘తరుణీ విరహ మ్మత్తరి’ అంటే అన్వయం కుదురుతుంది.
**********************************************************************
అరయగ వేదములన్నియు
రిప్లయితొలగించండిపరిపరి శోధించినట్టి పండిత వర్యా!
సరి నీకీదుట రాదా!
గిరిధారికి భార మావగింజ తలంపన్!
అరచుచు కేకలు పెట్టుచు
రిప్లయితొలగించండిపరిపరి వేదము చదివిన పండితుడిలలో
కఱవడు వృశ్చిక మంత్రము:
గిరిధారికి భార మావగింజ తలంపన్