అయ్యా హనుమఛ్ఛాస్త్రి గారూ: కొడుకూ కోడలు (ధారా వాహిక పేరు నేనెరుగను) అదే పేరయితే అలాగే ఉంచవచ్చును లేకుంటే కొడుకుంగోడలు అని ఉండాలి. మహా కొంగ్రొత్త - దుష్ట సమాసము అవుతుంది. ధారవాహిక అన్నారు - కొన్ని చోట్ల ఇలాగ హ్రస్వమును వాడుటను ఒప్పుకుంటారు. అలాగే కొంగ్రొత్త కాదు క్రొంగ్రొత్త (క్రొత్త + క్రొత్త)అని వాడాలి. సరిచేసుకోండి.
మీరు వ్రాసినది చదివిన పిదప 524 నం .సమస్య పూరించ మనసొప్పలేదు.ఈ వ్యక్తిగతబాధాకర సమస్యను ఉపసమ్హరించుకొండి.నం.525ను మాత్రం పూరిస్తున్నాను. 'అందలమ్ము లెక్కి రర్హత లేకయే కుమతులైనవారు కొందరయ్యొ ప్రజల హితము గోరి పాటుపడినవారు జగతి మెచ్చు జనులు జైలు పాలు.
శంకరయ్య గారూ - మీకు ఇలాంటి కష్టనష్టాలను భరించే మనోధైర్యాన్ని , నిబ్బరాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూన్నాను . మిమ్మల్ని గురుతుల్యులుగా భావించే మా అందరి ప్రార్థనలూ మీకు తోడుగా ఉంటాయి . మీ వంటి ప్రాజ్ఞుల మధ్య మనగలగాలంటే పూర్వజన్మ సుకృతం కావాలి .
గురువు గారు, మీ కుటుంబానికి త్వరలో భగవదనుగ్రహం వలన మనశ్శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ బాధలు అనుభవించిన వారికి అర్థం అయినట్టుగా ఇతరులకు అర్థం కావు అని చక్కగా తెలుసును. జరిగేదంతా మంచికే అని నమ్మండి.మరిన్ని బాధలు పడకుండా దేవుడు మిమ్మల్ని రక్షించాడని నేననుకుంటున్నాను.
నడమంత్రంపు సిరుల్ స్థిరమ్ములగునే? జ్ఞానమ్ము గోల్పోయితే?
రిప్లయితొలగించండికడు ప్రేమన్ నిను జూచుచుంటిమి కదే, కాంక్షించి నీ శ్రేయమున్
పెడమోమేలనె? ఏల యీ తగవులే? వేయేల మా కర్మమే!
కొడుకున్ బాధలు పెట్టి నేటికి విడాకుల్ కోరెదే కోడలా?
బిడియమ్మా? అతినమ్మకమ్మ? భయమా? ప్రేమా? విమూఢత్వమా?
రిప్లయితొలగించండితడబాటా? అవివేకమా? తగవుకా? తప్పందువా? కొంచెమా?
అడుగుల్ వేసితివే యెఱింగియును నీ వధ్యాపకుండంచు మా
కొడుకున్? బాధలు పెట్టి నేటికి విడాకుల్ కోరెదే కోడలా?
అడుగన్ వాంఛితమిచ్చి జీవితమునందానందముల్ నిల్పి, తా
రిప్లయితొలగించండినడచెన్ నీదెస, నీవెలోకమనుచున్, నాప్రాణమేనీవనెన్,
విడవన్ కోరికదేలగల్గె, చెపుమా? వీక్షించు మా దుర్గతిన్,
కొడుకున్ బాధలు పెట్టి నేటికి విడాకుల్ గోరితే? కోడలా!
' కొడుకు కోడలు ' టీవి సీరియల్ గురించి ఒక అత్త తన కోడలుతో..
రిప్లయితొలగించండి"కొడుకూ కోడలు ధార వాహిక మహా కొంగ్రొత్తగా నున్న దీ
విడతన్ కోడలు ప్రేమ గెల్చు కొరకై పెండ్లైన మాసంబుకే
విడిగా నుండుచు వాని రెచ్చ గొడితే, వేధించి పోరాడితే
కొడుకున్ బాధలు పెట్టి నేటికి విడాకుల్ గోరితే" కోడలా !
అయ్యా హనుమఛ్ఛాస్త్రి గారూ:
రిప్లయితొలగించండికొడుకూ కోడలు (ధారా వాహిక పేరు నేనెరుగను) అదే పేరయితే అలాగే ఉంచవచ్చును లేకుంటే కొడుకుంగోడలు అని ఉండాలి. మహా కొంగ్రొత్త - దుష్ట సమాసము అవుతుంది. ధారవాహిక అన్నారు - కొన్ని చోట్ల ఇలాగ హ్రస్వమును వాడుటను ఒప్పుకుంటారు. అలాగే కొంగ్రొత్త కాదు క్రొంగ్రొత్త (క్రొత్త + క్రొత్త)అని వాడాలి. సరిచేసుకోండి.
పడిగాపుల్ పడనేల మీరు తుదకున్ బ్రారబ్ధ మిట్లయ్యెనా
రిప్లయితొలగించండివిడిపోవన్ సుఖమౌను నేమొ బ్రతుకుల్ విశ్లేషమున్ దప్పదా
వడిగాఁ జూడరె ధన్యురాలు నొకతెన్ భద్రమ్మె యీ సారి మీ
కొడుకున్ బాధలు పెట్టి నేటికి విడాకుల్ గోరితే కోడలా ?
శ్రీ నేమాని గారూ ! ధన్యవాదములు. మీ సూచనతో సవరణ చేయుచున్నాను.
రిప్లయితొలగించండి' కొడుకూ - కోడలు ' టీవి సీరియల్ గురించి ఒక అత్త తన కోడలుతో..
'కొడుకూ - కోడలు' ధార వాహికహహా క్రొంగ్రొత్తగా నున్న దీ
విడతన్ కోడలు ప్రేమ గెల్చు కొరకై పెండ్లైన మాసంబుకే
విడిగా నుండుచు వాని రెచ్చ గొడితే, వేధించి పోరాడితే
కొడుకున్ బాధలు పెట్టి నేటికి విడాకుల్ గోరితే - కోడలా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికడు మోదమ్మునఁ బెండ్లి చేసితిమి యొక్కండే సుతుం డంచు, మీ
రిప్లయితొలగించండియెడబా టొల్లని సౌఖ్యజీవనము మా కెంతో మోద మౌ నంచు మే
మడగం జూడఁగ నెంత చేసితివి? మర్యాదల్ తృణప్రాయమై
కొడుకున్ బాధలు పెట్టి నేటికి విడాకుల్ గోరితే? కోడలా!
మీరు వ్రాసినది చదివిన పిదప 524 నం .సమస్య పూరించ మనసొప్పలేదు.ఈ వ్యక్తిగతబాధాకర సమస్యను ఉపసమ్హరించుకొండి.నం.525ను మాత్రం పూరిస్తున్నాను.
రిప్లయితొలగించండి'అందలమ్ము లెక్కి రర్హత లేకయే
కుమతులైనవారు కొందరయ్యొ
ప్రజల హితము గోరి పాటుపడినవారు
జగతి మెచ్చు జనులు జైలు పాలు.
శంకరయ్య గారూ - మీకు ఇలాంటి కష్టనష్టాలను భరించే మనోధైర్యాన్ని , నిబ్బరాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూన్నాను . మిమ్మల్ని గురుతుల్యులుగా భావించే మా అందరి ప్రార్థనలూ మీకు తోడుగా ఉంటాయి . మీ వంటి ప్రాజ్ఞుల మధ్య మనగలగాలంటే పూర్వజన్మ సుకృతం కావాలి .
రిప్లయితొలగించండిశంకరార్యా ! గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగండి !
రిప్లయితొలగించండి"అంతా మన మంచికే " అన్నారు గదా !
ఈ ‘సమస్య’పై స్పందించి సాంత్వనం పలికిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిముఖ్యంగా పండిత నేమాని గారు, మిస్సన్న గారు, సంపత్ కుమార్ శాస్త్రి గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, గోలి హనుమచ్ఛాస్త్రి గారు, ‘శ్యామలీయం’ గారు, జిలేబి గారు, శ్రీరాం గారు, శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారు, వెలమకంటి భరద్వాజ్ గారు, ‘కమనీయం’ గారు, ‘తెలుగు భావాలు’ గారు, నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారు, శివాజీ గారు, డా. విష్ణునందన్ గారు, వసంత కిశోర్ గారు, రవి గారు, శంకర్ గారు, ‘వామనగీత’ గారలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
గురువు గారు,
రిప్లయితొలగించండిమీ కుటుంబానికి త్వరలో భగవదనుగ్రహం వలన మనశ్శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను.
ఈ బాధలు అనుభవించిన వారికి అర్థం అయినట్టుగా ఇతరులకు అర్థం కావు అని చక్కగా తెలుసును.
జరిగేదంతా మంచికే అని నమ్మండి.మరిన్ని బాధలు పడకుండా దేవుడు మిమ్మల్ని రక్షించాడని నేననుకుంటున్నాను.
చిడిచిడి జేసి రాత్రి ప్రొద్దుటను వే చీత్కారముల్ చల్లుచున్
రిప్లయితొలగించండివిడిపోదమ్మని రోజురోజు మగనిన్ పీడించి వేధించుచున్
కడకున్ చీలిచి చెండి గెంటమని శృంగారంపు నత్తయ్యదౌ
కొడుకున్ బాధలు పెట్టి నేటికి విడాకుల్ గోరితే? కోడలా!