1, నవంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం - 512 (తెలుఁగు కల్పవృక్షమునకు)

*********************************************************************************
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తెలుఁగు కల్పవృక్షమునకు తెగులు పట్టె.
*********************************************************************************

45 కామెంట్‌లు:

 1. నా పూరణ ....

  అన్ని పాళ్ళ సలక్షణమైన కృతికి
  మూడు పాళ్ళ జ్ఞానము గల్గు మూర్ఖతా వి
  దగ్ధ బుద్ధి వ్యాఖ్యానింపఁ దగనిరీతి
  తెలుఁగు కల్పవృక్షమునకు తెగులు పట్టె.

  రిప్లయితొలగించండి
 2. తెలుగు కల్పవృక్షమునకు తెగులు బట్టె
  ననుట సరికాదు సకల విద్యా వివేక
  సార సుమ ఫల భర మహాక్ష్మాజ మద్ది
  తత్ఫల రసమ్ము పరమార్థదమ్ము సుమ్ము

  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 3. తేనె లొలికెడి తీపైన తెలుగు భాష
  నేర్వకుండగ నెటులైరొ నిపుణు లిపుడు
  తెగులు గాదుటె పలుకగ తేలికగను
  'తెలుగు కల్పవృక్షమునకు తెగులు పట్టె ! '

  తెగులు తెలుగు భాషకు కాదు, తెలుగు నేర్వని తెలుగు వారికి పట్టింది.

  రిప్లయితొలగించండి
 4. **********************************************************************
  ఆర్యా, పండిత నేమాని వారూ,
  ఎంతటి ఉదాత్త పదభావభరితమైన పూరణ. కల్పవృక్షాన్ని కించపఱచే వాక్యాన్ని చూడగానే మీలో కవితావేశం పెల్లుబికింది. ధర్మక్రోధం కట్టలు తెచ్చుకుంది. ఆ మహాకావ్య ప్రాశస్త్యాన్ని ఎంత చక్కగా బోధించారు? ధన్యవాదాలు.
  **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  వాస్తవాన్ని మీ పూరణలో ప్రతిఫలించారు. చక్కని పూరణ. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 5. మిస్సన్న గారూ,
  తెలుగు కల్పవృక్షానికి ఆంగ్లపు చీడ పట్టిందన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. అయ్యా! మిస్సన్న గారూ!
  మీ పద్య తొలి పాదములో యతిని చూచేరా?
  నేమాని

  రిప్లయితొలగించండి
 7. భాషలన్నిటానవధాన భాష యేది?
  వృక్షమెద్దానికి కలదు వేల్పుకీర్తి?
  ఈడ మన జాతి యడుగంటె నెందు చేత?
  తెలుఁగు. కల్పవృక్షమునకు. తెగులు పట్టె.

  రిప్లయితొలగించండి
 8. నేమని పండితులకు కృతజ్ఞలతో
  సవరించిన పూరణ

  తెలుగు సొబగులు సంస్కృత తెరల మాటు
  దాగె నందురు విబుధులు ధాత్రి నేడు
  మోడు చేసెడి నాంగ్లపు చీడ యకట!
  తెలుగు కల్పవృక్షమునకు తెగులు పట్టె

  రిప్లయితొలగించండి
 9. " స్వీట్ సిక్స్ టీన్ " అంటే నాబోటి " స్వీట్ సిక్స్ టి ఫైవ్ [ ౬౫ ] లకి కాదు తమ్మడు !.
  అమ్మాయికి ౧౬ ఏళ్ళు రాగానే ఇక్కడ పెద్ద పార్టీ అంటే మన దగ్గర పెళ్లి లాగ చేస్తారు .ఇది అమెరికా వారి పధ్ధతి .ఆరోజు అందరి స్నేహితులను ,దగ్గరలో ఉన్న -బంధువులను అమ్మాయి స్నేహితులు , ఆమె అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ స్నేహితులను మొత్తం అందర్నీ " శని ఆది వారాలు కలిసొచ్చే లాగ } పిలుస్తారు. సాయంత్రం ఏదైనా హాలు గానీ ,హోటలు లొ గానీ మందిని బట్టి ,ఎరేంజ్ చేస్తారు.హోటలు వాళ్ళే అంతా అంటే దానికి తగిన మ్యూజిక్ , ఫుడ్ మనం చెప్పిన రీతిగా సమకూరుస్తారు.
  అప్పుడు అమ్మాయి మంచి పెద్ద గౌను , [ ఇక్కడి ] వేసుకుని ఎడా పెడా చెలికత్తెలతో [ ఫ్రెండ్స్ తో ] వయ్యారంగా నడుచు కుంటు వస్తుంది. అప్పుడు తన తల్లి దంద్రులనుం ఛి [ తాత నానమ్మలను ] అక్కడ ఉంటే లేకపోతె [ఇండియాలో ఉన్న వారిని ఆశీర్వ దిం చ మని కోరుతూ ], మొదలు పెట్టి ముందుగా పెద్దవారిని ఒక్కొక్కరినే వచ్చి కాండిల్ వెలిగిమ్చ మని మైక్ లొ పిలుస్తుంది .అలా హితులు సన్ని హితులు ,బంధువులు ౧౬ కాన్ డీల్స్ వెలిగిస్తారు. తర్వాత " మన హాపీ బర్త్ డే " పాట అందరు పాడతారు. ఆ తర్వాత అందరు కలిసి డిన్నరు అమ్మాయికి కానుకలు మళ్ళీ డాన్సులు , ఇలా అర్ధ రాత్రి వరకు [ హాలు ఎన్ని గంట లవరకు బుక్ చేస్తే అంత వరకు ] సుమారు వంద మంది వరకు ఉంటారు అదే వారి సర్కిల్ ని బట్టి .స్తోమతను బట్టి ౧౦ది ౧౫ ౨౦ వేలు ఖర్చు పెడతారు. అంతే . ఇది అమెరికా వారైతే ఇలా చేసాక ౧౮ రాగానే అమ్మాయిల్ని వదిలేస్తారు. తల్లి దండ్రులతో ఉండటం వార్కి నామోషీ ఆన్న మాట . ఇక్కడ ఉన్నందుకు సరదాగా మన వాళ్లందరూ కుడా చేసు కుంటా రన్నమాట .

  రిప్లయితొలగించండి
 10. తేనే వంటిది చూడగ తెలుగు కాదె
  తేనె యన్నది చెడిపోదు తెలియ గాను
  తేనె త్రాగని వారికే తెగుల, దెచట
  తెలుఁగు " కల్పవృక్షమునకు" తెగులు పట్టె?

  రిప్లయితొలగించండి
 11. భాషలందును లేదెట్టి భాషలకును
  హంగు గామన కున్నదటయ్య లార!
  అష్ట శతసహస్రవధాన మ, కట నేడు
  తెలుఁగు కల్పవృక్షమునకు తెగులు పట్టె.

  రిప్లయితొలగించండి
 12. తల్లి గర్భమునందె నాతనువుఁజొచ్చి
  బాల్య దశవరకుపెరిగి ప్రబలమయ్యెఁ
  గాని,తదుపరి కలుపుమొక్కలెదుగంగ
  తెలుఁగు కల్పవృక్షమునకు తెగులు పట్టె.

  రిప్లయితొలగించండి
 13. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, నవంబర్ 01, 2011 12:12:00 PM

  తెలుగు కల్పవృక్షమునకు తెగులు పట్టె
  ననుచు పరవశమందిరి మనుజులెల్ల
  నరసి చూడంగ "శంకరాభరణమందు"
  నిత్యపూజల గైకొంచు నెగడ సాగె.

  నెగడు = వర్ధిల్లు

  రిప్లయితొలగించండి
 14. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, నవంబర్ 01, 2011 12:44:00 PM

  తెలుగు కల్ప వృక్షము నకు తెగులు పట్టె
  నేడు నీ వల్ల పండితా !నీవు మార
  'వదిగొ గ్రామ్య 'మందు వెరుగ వైతివి మన
  తెలుగు జనపద పదముల తియ్య దనము

  రిప్లయితొలగించండి
 15. అక్కటా!యచ్చులంద"లూ" లంతరించె
  ళ,ణ లు పలుకులో రూపొందె ల,న లుగాను
  బండిరా వ్రాయకున్న నిబ్బంది లేదు
  తెలుగు కల్పవృక్షమునకు తెగులుపట్టె

  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 16. **********************************************************************
  మిస్సన్న గారూ,
  మీ పద్యంలోని యతిదోషాన్ని నేను గమనించలేదు. నేమాని వారి వ్యాఖ్య చూసి సవరించారు కదా! సంతోషం!
  **********************************************************************
  చింతా రామకృష్ణారావు గారూ,
  ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘అన్నిటా నవధాన’ ..... ‘టా’ అనేది ‘ట’కు టైపాటా?
  **********************************************************************
  రాజేశ్వరక్కయ్యా,
  ఆ వేడుక విశేషాలు తెలిపినందుకు ధన్యవాదాలు. ఎంత పెద్దవాళ్లమైనా అలాంటి వేడుకలలో మనకూ ఒకప్పటి ‘స్వీట్ సిక్స్ టీన్’ వయస్సు జ్ఞాపకాలు రాకమానవు.
  **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  నీటిచుక్క పడితే తేనె చెడిపోతుందంటారే! మన తెలుగు తేనెలో ఆంగ్లమనే నీటిచుక్క పడింది.
  **********************************************************************
  మందాకిని గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  ఊకదంపుడు గారూ,
  ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ధన్యవాదాలు. ఇంతకంటె ఏం చెప్పను?
  **********************************************************************
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  జీవద్భాషకు పట్టంగట్టిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  అయితే బాణాన్ని నా పైకే ఎక్కుపెట్టారా ఏమిటి? ఎందుకంటే అప్పుడప్పుడు మిత్రుల పూరణలలో వ్యాకరణవిరుద్ధపయోగాలు కనిపిస్తే ‘గ్రామ్యం’ వాడరాదంటాను కదా! అందుకే భుజాలు తడుముకుంటున్నాను. :-)
  **********************************************************************
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
  అయితే మీకు దొరకని అక్షరాలను నేను వెదకి పట్టుకున్నాను.
  ‘అక్కటా!యచ్చులంద"లూ" లంతరించె’ పాదానికి నా సవరణ ......
  ‘అకట! యచ్చులలో ‘ఌౡ’ లంతరించె’
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 17. శర్మ గారు,
  తెగులు ఎక్కడ పట్టిందో సరిగ్గా చూపించారు. అభినందనలు.
  గురువుగారు, ధన్యవాదాలు.
  లు"లు ఎందులోటైప్ చేశారు?

  రిప్లయితొలగించండి
 18. అద్భుతం
  ఆర్యా అవి వ్రాసే విధానం నాకు చెప్పండి బాబ్బాబూ

  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 19. ఈ సమస్య వెనుక ప్రోద్బలం ఏమిటండి? ఎక్కడైనా వాదప్రతివాదాలు జరిగాయా?

  రిప్లయితొలగించండి
 20. ధన్యోహం మందాకిని గారూ

  శంకరార్యా, మీరు సవరించిన పాదం మరీ అద్భుతంగా ఉంది

  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 21. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, నవంబర్ 01, 2011 4:28:00 PM

  తెలుగు నాట బలుకు తియ్యని మాటతో
  తెలుగు పద్యము కొల్వు దీర వలయు
  తెలుగు జాతీయాల తియ్యం దనాలతో
  తెలుగు పద్యము కొల్వు దీర వలయు
  తెల్గు గ్రామీణుల తీరు తెన్నుల తోడ
  తెలుగు పద్యము కొల్వు దీర వలయు
  తెల్గు లోగిళ్ల వర్ధిల్లు వెల్గుల తోడ
  తెల్గు పద్యము కొల్వు దీర వలయు

  కూడి పండితుల్ దలలూచు కొరకె గాక
  తెల్గు లందరి కందంగ దివురు నటుల
  తెల్గు ముంగిళ్ల గెడన సందీప్తు లిడగ
  తెలుగు పద్యము తా గొల్వు దీర వలయు

  రిప్లయితొలగించండి
 22. మందాకిని గారూ,
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  లేఖినిలో ఆ అక్షరాలను టైపు చేయవచ్చు.. ఇలా ...
  ~l = ఌ
  ~L = ౡ

  రిప్లయితొలగించండి
 23. గురువు గారు,
  ధన్యవాదాలు.
  రావు గారు బాగాచెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. రవి గారూ,
  నిన్ననే ఒక మిత్రునితో ప్రత్యేక, సమైక్య ఉద్యామాలపై చర్చ జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించి తెలుగు సంస్కృతి, భాష, సాహిత్యాల ఏకసూత్రతపై, పురోగమన తిరోగమనాలపై మిత్రులు స్పందించాలని ఆ సమస్యను ఇవ్వడం జరిగింది.

  రిప్లయితొలగించండి
 25. తెలుగు భాష సంస్కృతులన్న తెలుసుకున్న
  నెఱిగి నడచుకొనగ నేర్తు రే,మి చేతు?
  రందఱకు నేక సూత్రమౌ యదియె లేక
  తెలుగు కల్ప వృక్షము నకు తెగులు పట్టె .

  ప్రత్యేక, సమైక్య ఉద్యామాలపై...

  రిప్లయితొలగించండి
 26. శంకరయ్యగారూ,

  అవునా, పోనీలెండి. మళ్ళీ ఏదైనా సాహిత్యవివాదం తలెత్తిందేమోనని కాస్త ఖంగారు పుట్టింది. (వార్తాపత్రికలు నేను అంతగా చదవను)

  రిప్లయితొలగించండి
 27. భాషలన్నిటనవధాన భాష యేది?
  వృక్షమెద్దానికి కలదు వేల్పుకీర్తి?
  ఈడ మన జాతి యడుగంటె నెందు చేత?
  తెలుఁగు. కల్పవృక్షమునకు. తెగులు పట్టె.

  రిప్లయితొలగించండి
 28. **********************************************************************
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  సందర్భోచితంగా అద్భుతమైన పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
  **********************************************************************
  మందాకిని గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 29. మిత్రులకు ఒక సూచన:
  మనకు స్వతంత్రము రాక ముందు పూర్వపు అణా నాణెముపై ఉండే నాలుగు భాషలలో తెలుగు ఒకటి. తెలుగు, ఉర్దు, హింది, బెంగాలి భాషలు ఉండినట్లు నాకు జ్ఞాపకము. అంటే ఆ కాలములో తెలుగునకు అంతటి ప్రాముఖ్యము ఉండేది. మరి ఇప్పుడో... ... ???
  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 30. నేమాని వారన్నది నిజం. నా చిన్నప్పుడు 'ఒక అణా' అని నాణెం పైన ఉండటం దాన్ని నేను పైకి చదువుతే మా నాన్నగారు భారతదేశంలో ఉన్న భాషలలో ప్రభుత్వం కొద్ది భాషలలోనే నాణెం పైన ముద్రించగలదు కాబట్టి అందులో తెలుగు ఉండటం చాలా ముదావహం అనీ అన్నట్లు నాకింగా సుస్పష్టంగా గుర్తుంది. ఈ రోజుల్లో తెలుగు వారింటి పిన్నపెద్దలే తెలుగు అక్షరాలు చదువలేని రోజులు వచ్చాయి. ప్రస్తుతం ప్రజల అభిప్రాయంలో తెలుగు మీడయంలో చదవటమే తప్పులాగ తక్కువతనంలాగ అయ్యాక ముందు సంగతి యేమిటా అని ఆశ్చర్య పోవటం మనవంతు.

  రిప్లయితొలగించండి
 31. భారత దేశం లో హిందీ తరువాత ఎక్కువగా మాట్లడే భాష మన తెలుగు మాత్రమే...ప్రస్తుత పరిసిస్థితి చూస్తుంటే రెండవ స్థానము లోనుండి మనము ఏస్థానములోనికి పడిపోతామో తెలియకుండా వున్నది

  రిప్లయితొలగించండి
 32. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి. తెలుగు భాషకు ఢోకా లేదండీ ,కాని మన కృషి అవసరము.

  నా పద్యములో రెండవ పాదమునకు సవరణ;

  నేర్వకుండగ యెటులైరొ నిపుణు లిపుడు

  వ్యతిరేక క్రియా పదముల తర్వాత నుగామమము రాదు కదా !

  రిప్లయితొలగించండి
 33. క్రింది లింక్ లో పాత అణాల ఫోటో లు చూడండి. అందులో తెలుగు ఉంది.
  http://vamana125kkd.blogspot.com/2011/10/blog-post_13.html
  వామన గీత గారు,
  మీ టపా లింక్ ఇచ్చినందుకు ఏమనుకోకండి.

  రిప్లయితొలగించండి
 34. శ్రీగురుభ్యోనమ:

  పరమభక్తితొ జేసెద వందనంబు
  తెలుఁగు కల్పవృక్షమునకు, తెగులు పట్టె
  నేడు జాతికి పరభాష నేర్చుకొనగ
  మాతృ భాషను మరచిన మంచిదగునె?

  రిప్లయితొలగించండి
 35. శ్రీపతిశాస్త్రిమంగళవారం, నవంబర్ 01, 2011 11:34:00 PM

  మందాకిని గారూ కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 36. శ్రీపతిశాస్త్రిమంగళవారం, నవంబర్ 01, 2011 11:47:00 PM

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ "పరవశమందిరి మనుజులెల్ల" అనుటకంటె
  "పరవశమునందగ నథములెల్ల" అంటె బాగుంటుందేమో. కొంతమందికే వర్తిస్తుంది.

  రిప్లయితొలగించండి
 37. మాస్టారూ, మీరు ఆంధ్రరాష్ట్రావతరణదివసము దృష్టి లో పెట్టుకొని ఈ సమస్య ఇచ్చారని చూడగానే అనుకొన్నాను. ఇప్పటికి సమయం దొరికింది పోస్టు చేయటానికి.
  నన్నయ, తిక్కన, పోతనార్యులకు, అచ్చతెలుగు కవి పండితాళికి క్షమాపణలతో, ఈ నాటి పూరణ వ్యాజస్తుత్యలంకారంగా:

  “నన్నయార్యుడప్పటి వేగినాట వాడు (కోస్తా)
  తిక్కనట సింహపురివాసి తెలియు నెటుల? (రాయలసీమ)
  పోతన మనవాడగు నేమి, పొరుగు వాడు (తెలంగాణా)
  వార లేమైన నాకేమి వరుస గట్ట?
  నాది నావూరు నాజిల్ల నాకు గొప్ప
  నే పలికెడిది మాత్రమె నిట్ట తెలుగు”

  ఇట్టి స్వార్థ చింతన మనకెట్లు గలిగె
  వారలూహించి యుండని దారుణమిది
  తెలుగు వారల బ్రతుకులు తెల్ల వారె
  తెలుఁగు కల్పవృక్షమునకు తెగులు పట్టె!

  రిప్లయితొలగించండి
 38. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)

  _____________________________________

  తెల్ల వారల భాషను - ధేను వనుచు
  తల్లి భాషను దిగదోయ - తగునె నీకు !
  "దేశ భాష లందున మన - తెలుగు లెస్స"
  దేవరాయల నుడువును - తెలుసు కొనుమ !


  తెలుగు వారలు నిష్క్రియా - ధీరు లవని
  తెలుఁగు కల్పవృక్షమునకు - తెగులు పట్టె
  తెలుగు భాషకు నిర్జీవ - దినము వచ్చు
  తెలుగు జాతికి నిర్లక్ష్య - తెరలు గ్రమ్మె
  ననెడి వాదును తప్పించు - మాంధ్రవీర !

  తేనె లొలికెడి తెలుగుకు - దీప్తి తెమ్ము !
  తేరి చూడుము నీ తల్లి - తెలుగు తల్లి !
  తెలిసి మసలిన నీకీర్తి - తెల్ల మౌను !
  దేశ దేశాల చాటుము - తెలుగు దీప్తి !
  _____________________________________

  రిప్లయితొలగించండి
 39. చంద్రశేఖర్ గారూ,
  చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 40. శంకరార్యా ! ధన్యవాదములు !
  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి