పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘శివమణి ధరుడు’... ? ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటిపూరణలో మొదటి పాదాన్ని ‘శివు డొకండు శివమ్మును జేర్చలేడు’ అనండి. ‘వెళ్ళినా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.‘భద్రత+ఒసగు’ అన్నచోట సంధి లేదు. ‘రుద్రభూమి పోయినన్ భద్రత నిడు’ అనండి. ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పూరణ సముచితంగా ఉండి అలరించిది. శివుని పర్యాయపదాలను విష్ణువునకు అన్వయించిన విధానం ప్రశంసనీయం. అభినందనలు. నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. ‘రుద్ర’ శబ్దప్రయోగం అనుపమానం! అభినందనలు.
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, ధన్యవాదాలు. ***** గుండు మధుసూదన్ గారూ, మిత్రుల పూరణలను విశ్లేషించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ***** మిత్రులారా, బ్లాగు నిర్వాహకుడిగా నాకు కొన్ని పరిధులు, మొగమోటాలు ఉన్నవి. వచ్చే పూరణలలో కొన్ని అద్భుతంగా ఉంటాయి. కొన్ని పేలవంగా ఉంటాయి. ఉత్తమమైన పూరణను విశేషపదాలతో ప్రశంసించినప్పుడు మిగిలినవారిలో కొందరు చిన్నబుచ్చుకునే అవకాశం ఉంది. అందువల్ల నేను ‘మీ పూరణ బాగున్నది. అభినందనలు’ అని అందరికీ ఒకే రకంగా చెప్పడం జరుగుతున్నది. శబ్దసౌందర్యం, భావవైశిష్ట్యం ఉండి మహదానందాన్ని చేకూర్చే పూరణలు అప్పుడప్పుడు వచ్చినా నేను నా పరిధులకు లోబడి వాటిని ఉత్తమ పూరణలుగా చెప్పక ఉపేక్షించవలసి వస్తున్నది. చక్కని ధారతో, సమర్థమైన పూరణలు చేసిన మిత్రులు నానుండి ప్రత్యేకమైన మెచ్చుకోలు పొందక నిరుత్సాహపడుతూ ఉండవచ్చు. మీకు అటువంటి పరిధులు, మొగమోటాలు లేవు. అందువల్ల మీకు నచ్చిన పూరణలను సంకోచించకుండా విశ్లేషించండి. మీ ప్రశంసలు మిత్రులలో ఉత్సాహాన్ని నింపి ఇంకా మంచి పద్యాలు వ్రాసే ప్రేరణ లభిస్తుంది. మరొకసారి ధన్యవాదాలు. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘రమేశ’ను ‘రమేష’ అన్నారు.
పాపరాశి వలనఁ బట్టుపడితి క్రోధ
రిప్లయితొలగించుమోహరక్తి చుట్టుముట్టె నయ్య
పద్మనాభ వరద పాలింపరా నన్ను
భద్ర మొసఁగు మయ్య రుద్రవినుత.
గురువుగారు
తొలగించుమీ పద్యము చాలా సహజ సుందరంగా ఉంది
నమస్సులు
భవహర ముకుంద మాధవ
రిప్లయితొలగించుశివమును కలిగించు విభుడ శ్రీహరి కృష్ణా!
భువి రుద్రము కానీయక
భవసాగర మీద మాకు బాసట నిమ్మా!!!
రుద్రము = భయంకరము
శైలజ గారూ
తొలగించుమీ పూరణ చదవడానికి ఇంపుగానూ, వినడానికి కర్ణపేయంగానూ ఉన్నది. అభినందనలు
శైలజ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రణామములు గురువుగారు...మీ పద్యం మనోహరంగా వుంది...
రిప్లయితొలగించుశైలజ గారూ,
రిప్లయితొలగించుధన్యవాదాలు.
మాస్టరు గారూ ! చక్కని పూరణ రుచి చూపారు...
రిప్లయితొలగించుశైలజ గారూ ! బాగుంది..
ధన్యవాదములు హనుమచ్ఛాస్త్రిగారు....
రిప్లయితొలగించుగురువు గారూ
రిప్లయితొలగించుదత్తపది పూరకులకు మీ పద్యం సర్వదా మార్గదర్శకము.
రిప్లయితొలగించుశివము గలిగించు చక్రినే చేరి గొల్వ
నీరు ద్రవియించు కన్నులన్ నియతి భక్తి
నార్తి నేవేడెద నహరహమ్ము వాని
పారిపోవంగ భవబంధ పాపచయము.
విజయకుమార్ గారూ,
రిప్లయితొలగించుధన్యవాదాలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
భవ హ ర !శివమ ణి ధరుడ ! వరద !భువిని
రిప్లయితొలగించురుద్ర భూమిగ జేసెడి క్షుద్ర జనము
నణచి కాపాడు మమ్ముల యభయ మిచ్చి
నిన్నె సేవించు కొందును నిరత మయ్య !
తే.గీ:భక్తితోడగొలుతు భవ బంధములను
రిప్లయితొలగించుపరిహర మొనర్చి కరుణించు పార్థసఖుడ
శివము కలిగించి దీవించు శ్రీనివాస
రుద్రరూపముబాపుమో భద్రరూప.
రుద్రరూపము=ఉగ్రనరసింహ రూపము
లోకముల కుక్షినుంచిన రుద్ర సఖుడ
రిప్లయితొలగించుశౌరి భవభంద మోచన చక్రధారి
పాపహర భక్తవత్సల పద్మనాభ
అంబురాశి వసించెడి హరి ముకుంద
కాచి కాపాడు దయఁజూపి కంసవైరి
పాపరాశి వలన నేను భ్రష్టుఁడైతి
రిప్లయితొలగించుభవసముద్రము లోననే పతితుఁడైతి
నహరహము నీదు నామమ్ము నరయనైతి
రుద్రవినుతుఁడ కరుణాసముద్ర యశుఁడ.
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శివమణి ధరుడు’... ?
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుశ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించుఅయితి వాశివసతిగ నయ్యప్పను గన
రుద్ర రూపిగ నసురుని రూపుమాపి
గాచి ప్రహ్లాదు నానాడు బ్రోచితి విగ !
పద్మనాభ త్రివిక్రమ భవ భయ హర
రిప్లయితొలగించుఆరుద్ర కాదు పునవసు
తారను భవమ౦దె భువిసుతాపహరణ మవన్
వారధి కట్టగ రాఘవు
డా రావణు గూల్చి శివము నంది౦చె మహిన్
సీ.
రిప్లయితొలగించుశివమన్న శభమన శ్రేయమ్ము గలిగించ
జగముల కెల్ల కే శవుడు శివుడె
జన్మంబు, సంసార, జగము,ల భవమన్న
పద్మసంభవన ప్ర భవుడు భవుడె
దుఃఖముల్ ద్రోయ రుద్రు డనిన యన్నియా
ర్తులులీలఁ సమయింప రుద్రు డగును
దనుజసం హరణవి ధానమవధరింప
నరయంగ నాముర హరుడె హరుడు
తే.గీ
నీల వారాశి వర్ణుడు నిగమనుతుడు
పరమె రుగగోరు ద్రష్టల ప్రజ్ఞ వాడు
భవహరమగుచు నెల్లర భద్ర మవగ
హరిహరా! హరహరి! యందు నహరహమ్ము
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించుహరి! రథాంగపాశి! వనమాలి! రవినేత్ర!
శార్ఙ్గధర! వరాహ! రమేశ! శంఖపాణి!
పద్మనాభ! వరాంగ! సువర్ణవర్ణ!
స్వభు! గరుద్రథరథ! చక్రి! పాహి పాహి!!
మధుసూధన్ గారూ
తొలగించుమీ పూరణ చాలా బాగున్నది. ఆంధ్ర నామ సంగ్రహాన్ని, అమర కోశాన్ని మలిపి చదివినట్లున్నది. ముఖ్యంగా గరుద్రథరథ ప్రయోగం అద్భుతం.
మధుసూధన్ గారూ
తొలగించుమీ పూరణ చాలా బాగున్నది. ఆంధ్ర నామ సంగ్రహాన్ని, అమర కోశాన్ని మలిపి చదివినట్లున్నది. ముఖ్యంగా గరుద్రథరథ ప్రయోగం అద్భుతం.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో మొదటి పాదాన్ని ‘శివు డొకండు శివమ్మును జేర్చలేడు’ అనండి. ‘వెళ్ళినా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.‘భద్రత+ఒసగు’ అన్నచోట సంధి లేదు. ‘రుద్రభూమి పోయినన్ భద్రత నిడు’ అనండి.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ సముచితంగా ఉండి అలరించిది. శివుని పర్యాయపదాలను విష్ణువునకు అన్వయించిన విధానం ప్రశంసనీయం. అభినందనలు.
నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. ‘రుద్ర’ శబ్దప్రయోగం అనుపమానం! అభినందనలు.
శంకరయ్యగారికి మఱియు అశ్వత్థనారాయణమూర్తిగారికి ధన్యవాదములు!
రిప్లయితొలగించుకంది శంకరయ్యగారి పూరణ మందఱకును మార్గప్రదర్శకముగ నున్నది!
శైలజగారి పూరణము నల్లేరుపై బండి నడక వలె సులభగ్రాహ్యముగఁ బఠనయోగ్యముగ నున్నది!
అశ్వత్థనారాయణమూర్తిగారి పూరణము శివకేశవాభేద నిరూపకముగఁ జక్కని పదబంధములచే నలరారుచున్నది!
మిత్రులందఱి పూరణములును నొక్కొక్కటి యొక్కొక్క కోణమున నందముగ నమరి యొప్పారుచున్నవి!
ఈనాఁటి దత్తపదికి నిచ్చిన పదముల మహత్త్వమే యీ యద్భుతమునకుఁ గారణము! కావున శ్రీ కంది శంకరయ్యగా రభినందనీయులు!
అందఱకును నా శుభాభినందనలు!
స్వస్తి.
శివుడొకండు శివమ్మును జేర్చలేడు
రిప్లయితొలగించుభవము గల్గించు శ్రీహరి భక్తియున్న
రుద్ర భూమికిపోయినన్ ?బద్రతనిడు|
మోహ రవ్వను విడు-హరిమోజు బెంచు.
2.స్నేహ రక్ష”కుచేలుని జేయలేద?
సంభవమని శౌరి దెలిపె సర్వులకును
“వాశి, వన్నెకు శ్రీహరి భక్తియున్న
చాలు”రుద్ర వీణగ మార్చు|మేలుగూర్చు
శ్రీకెయస్ గురుమూర్తిగారి పూరణం
రిప్లయితొలగించు----------------
రుద్ర వినుత చరిత|భవరుగ్మత హర|
భవ్య గుణ రాశి వందిత దివ్య బృంద|
శ్రీకరస్వరూపా|సరసీజనాభ|
చక్ర హస్త| విషప్తరాక్షస-రమేష|
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించుధన్యవాదాలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మిత్రుల పూరణలను విశ్లేషించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
*****
మిత్రులారా,
బ్లాగు నిర్వాహకుడిగా నాకు కొన్ని పరిధులు, మొగమోటాలు ఉన్నవి. వచ్చే పూరణలలో కొన్ని అద్భుతంగా ఉంటాయి. కొన్ని పేలవంగా ఉంటాయి. ఉత్తమమైన పూరణను విశేషపదాలతో ప్రశంసించినప్పుడు మిగిలినవారిలో కొందరు చిన్నబుచ్చుకునే అవకాశం ఉంది. అందువల్ల నేను ‘మీ పూరణ బాగున్నది. అభినందనలు’ అని అందరికీ ఒకే రకంగా చెప్పడం జరుగుతున్నది. శబ్దసౌందర్యం, భావవైశిష్ట్యం ఉండి మహదానందాన్ని చేకూర్చే పూరణలు అప్పుడప్పుడు వచ్చినా నేను నా పరిధులకు లోబడి వాటిని ఉత్తమ పూరణలుగా చెప్పక ఉపేక్షించవలసి వస్తున్నది. చక్కని ధారతో, సమర్థమైన పూరణలు చేసిన మిత్రులు నానుండి ప్రత్యేకమైన మెచ్చుకోలు పొందక నిరుత్సాహపడుతూ ఉండవచ్చు.
మీకు అటువంటి పరిధులు, మొగమోటాలు లేవు. అందువల్ల మీకు నచ్చిన పూరణలను సంకోచించకుండా విశ్లేషించండి. మీ ప్రశంసలు మిత్రులలో ఉత్సాహాన్ని నింపి ఇంకా మంచి పద్యాలు వ్రాసే ప్రేరణ లభిస్తుంది. మరొకసారి ధన్యవాదాలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రమేశ’ను ‘రమేష’ అన్నారు.
శివములనిచ్చి బ్రోచు హరి జీవులకెల్లను పోషకుండునై
రిప్లయితొలగించుభవజలధిన్ మునింగి కడు బాధలనొందెడు వారి త్రాతయౌ
ధ్రువునకు దివ్యధామమిడి దుఃఖహరమ్మొనరించె లక్ష్మి ప్రే
మవరునకు సాటి లేరు ద్రఢిమన్ తమ భక్తుల నుద్ధరింపగన్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించువృత్తంలో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
చివరిపాదం ప్రారంభంలో గణదోషం. ‘లక్ష్మి ప్రే|మవరుని సాటి లేరు...’ అనండి.
గురువుగారూ పొరబాటునకు చింతిస్తున్నాను. మీ సవరణకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించుఈ రోజు మిత్రులు మధుసూదన్ గారి పూరణ ముఖ్యంగా రుద్ర ప్రయోగం అద్భుతం.
గురువుగారూ పొరబాటునకు చింతిస్తున్నాను. మీ సవరణకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించుఈ రోజు మిత్రులు మధుసూదన్ గారి పూరణ ముఖ్యంగా రుద్ర ప్రయోగం అద్భుతం.
రుద్రతన్ హేమకశ్యపు రూపుమాపి
రిప్లయితొలగించుభవము గూర్చితి ప్రహ్లాద బాలుడలర
శివము గూర్చితి సుగ్రీవు చెలువుడగుచు
హరము జేయవె పాపాల నచ్యుతుడయి
శివము రూపంబు పింఛాన చేరె నీకు
హరము జేయవె వెన్నల నతివ లిండ్ల
రుద్రతన్ వెల్గి కంసుని రూపుమాపి
భవమునైనట్టి గీతను భవితకిడవె
శివముగూర్చితి దివిజులజేర్చి సుధను
హరము జేయుదు పాపాల నందరకును
రుద్రభార్గవ!రాజుల రూపుమాపి
భవమునిచ్చితి గజరాజు పాలనమున
భవుడ!నీవేను విష్ణువు పాపమడప
రుద్రరూపపు నరసింహ రూపుడీవె
హరముజేయవె దుష్టుల నందరిలను
శివము గూర్చవె శుభముల చేర్చిజనుల
గురుదేవుల మహత్తర పూరణతో బాటు కవిమి
రిప్లయితొలగించుత్రుల పూరణలు అలరించు చన్నవి.
క్షీరరాశి వధువుఁ జేకూర్చి పెట్టగ
నహరహముల సృష్టి కన్నమిడుచు
భవహర! శుభకర! శ్రీశ! పంకజనాభ! యీ
ధరణి జనులు గనరు ద్రప్సమైన!
వేదరాశి వర్ణించెడు విష్ణువతడు!
రిప్లయితొలగించుపాప హరణమాతడి నామ జాపవిధము!
కమల నాభ, వరములిచ్చి కావ రావె,
రుద్రకళల నధర్మనిర్మూలపరుప.