2, ఫిబ్రవరి 2016, మంగళవారం

పద్యరచన - 1160

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

28 కామెంట్‌లు:

 1. మిక్కిలి సంతస మొప్ప
  న్నక్కా చెల్లెండ్రు సఖులు నానందముతో
  తొక్కుడు బిళ్ళలనాడిన
  చక్కటి వ్యాయామ మదియు సంబర మదియున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘మొప్పగ| నక్కా...’ అనండి.

   తొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరింప నున్నవి !

  కల్లయే గద యవనిపై పిల్లలాట
  పిల్లలాటలు పెద్దలాటలూ సెల్లులోనే :

  01)
  ____________________________________

  తొక్కుడు బిళ్ళాట - తోలు బొమ్మల యాట
  తెల్లవారెను నేడు - తేరి జూడ

  గచ్చకాయలు లేవు - గవ్వలాటలు లేవు
  గంగెద్దులాటలున్ - గగనమయ్యె

  గుజగుజరేకులున్ - గుజ్జెనగూళ్ళునూ
  గుడుగుడుగుంచముల్ - గుఱుతు మీఱె

  కోతికొమ్మంచులు - కోలుకోలన్నలు
  కనుమూసిగంతలు - కాడుపడెను

  చక్రాలతిప్పుడున్ - చాకిబానలు లేవు
  బొంగరాలాటలు - బుగ్గిగలసె

  పిల్లలాటల గనుటన్న - కల్లగాదె
  సెల్లుఫోనులె యిల్లాయె - పిల్లలకును
  ఇల్లు యిల్లంత శబ్దించ - సెల్లు తోడ
  నుల్లసిల్లును యుల్లంబు - పిల్లలకును
  పిల్ల పెద్దల సర్వంబు - సెల్లె నేడు
  వల్లకాదన నికమీద - చెల్లదవని !
  ____________________________________

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వసంత కిశోర్ గారూ,
   వివిధ సంప్రదాయ క్రీడలను ప్రస్తావించి బాల్యాన్ని గుర్తుకు తెచ్చిన మీ సీసపద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
   ‘...నుల్లసిల్లు నుల్లంబులు పిల్లలకును...’ అనండి.

   తొలగించండి
  2. వసంత కిశోర్ గారూ మీ చక్కటి పద్యము మా హృదయాలను రంజింపజేసింది. అభినందనలు. ధన్యవాదములు.

   తొలగించండి
 3. శుభోదయం !

  మాడిమట్టు నాడె మాయింటి మాలక్ష్మి
  జోడి కట్టె నచట ఆట వెలది
  పొద్దు గుంకె నికను పోవలె నింటికి
  పద్దు లుసరి దిద్ది పదవె చెల్లి

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో యతి తప్పింది. ‘జోడికట్టి రాటచేడియ లట’ అందామా?

   తొలగించండి
 4. మరోటీ :)

  పిల్లా ఓ పిల్లా గోణిబిళ్ళాట పాటా
  అల్లాటప్పాకాదే మనాటా సొనాటా
  అల్లల్లాటా పాటే గదా యీ గలాటా
  చెల్లీ లల్లీ రావే కచేరీ భరాటా

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ ‘విశ్వదేవి’ వృత్తం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువులకు నమస్కారము
   " విశ్వదేవీ వృత్తముయొక్క" లక్షణములను తెలుపగలరు

   తొలగించండి
  3. అక్కయ్యా,
   పన్నెండవ జగతిచ్ఛందంలో 577వ వృత్తం ‘విశ్వదేవి’. దీని గణాలు మ-మ-య-య. యతిస్థానం 8. ప్రాసనియమం ఉంది.

   తొలగించండి
 5. కుంటాట దానినందురు
  ఒంటిగనటయొక్కరొకరునోపికకొలది
  న్నొంటియ పాదముతోడను
  గుంటుచునేనుందురచటకూలెడువరకున్

  రిప్లయితొలగించండి
 6. రిప్లయిలు
  1. దిక్కులు పిక్కటి లంగను
   మిక్కుటముగ రవములెల్ల మితి మీరంగన్
   చక్కగ నాడుచు నుండిరి
   తొక్కుడు బిళ్ళ ముదమారఁ దోరంపు తమిన్

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. సంతసంబును సాకెడి సంతయందు
  ఆయురారోగ్య మొసగెడి ఆటలుండు|
  పిల్లాపాపల కెంతయో ప్రీతి యనుచు
  ఆడ?ఆటల తోటలో ఆడరేల?
  2.ఆటలులేని బాల్యమన?ఆమెత యందున నుప్పు దగ్గుటే
  తోటకు పూలవోలె నిట తొక్కుడు బిళ్ళను ఆట ముఖ్యమే
  తోటియు మిత్ర బృందమున తొందర లేకననేకయాటలే
  నాటి సమాజ సంస్కృతిని నాటెడి బాల్య మమూల్య మైనదే||
  3.పిల్లల యాటలో గలదు ప్రీతి నొసంగెడి మానవత్వమే
  కల్లయు లేని భావనల కామిత సిద్దియు గానుపించు|ఆ
  చెల్లియు ఆక్కలున్ గలసి చెంగున దూకెడి నాట తీరులో
  పల్లియ నైక్యతేగనగ? బాల్యపుభాగ్యము పిల్లవాళ్ళకున్|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ, (కె అంటే ఏమిటి?)
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. త్రొక్కుడు బిళ్ళ లాట కడు దూకుడు గా నడయాడుచుంటివో,
  మక్కువ కాలి చెప్పులను మార్చు కొనంగను మానవైతివే
  గ్రక్కున బిళ్ళ నెట్టగను గంతులు వైచుటలో కడ౦గుచున్
  మిక్కిలి జాగ్రతన్ కలిగి మించుము బాలికలందు మిన్నయై

  రిప్లయితొలగించండి
 9. త్రొక్కుడు బిళ్ళ లాట కడు దూకుడు గా నడయాడుచుంటివో,
  మక్కువ కాలి చెప్పులను మార్చు కొనంగను మానవైతివే
  గ్రక్కున బిళ్ళ నెట్టగను గంతులు వైచుటలో కడ౦గుచున్
  మిక్కిలి జాగ్రతన్ కలిగి మించుము బాలికలందు మిన్నయై

  రిప్లయితొలగించండి
 10. గళ్లలో నుంచి తొక్కుడు బిళ్లనొకటి
  నొంటికాలితో నడచుచు నొకటొకటిగ
  గడుల దాటించు చుండెనో కన్య కొకతె
  నడక సరితూచినంతనే పడక గెలుచు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. చక్కగ పల్లెల పిల్లలు
  తొక్కుడు బిళ్ళాటలాడు తోషముతోడన్
  మిక్కుట వ్యాయామమ్మది
  గ్రక్కున కాలొకటితోడ గంతులు వేయన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘మిక్కుట వ్యాయామము’ అనడం దుష్టసమాసం. ‘మిక్కుటమీ వ్యాయాయము’ అనండి.

   తొలగించండి
 12. చిన్న పిల్లలు నల్గురు చేరియచట
  దిగులుచింతలు లేకుండ దీమమందు
  నాడుచుండ్రి తొక్కుడుబిళ్ళ హాయిగాను
  తరుణవయసున కడు తీపి గురుతులవియె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి