16, ఫిబ్రవరి 2016, మంగళవారం

సమస్య – 1946 (గొడ్రాలికిఁ గొడుకు పుట్టె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్.
(‘అవధానసారము’ గ్రంథమునుండి)

40 కామెంట్‌లు:

  1. వడ్రంగి వారి యింటను
    గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ , గోడండ్రేడ్వన్
    అడ్రసు దెలిపిరి విందుకు
    షడ్రుచుల వంటకొ ఱకని సంతస మందున్
    -------------------------------

    హమ్మయ్య కిట్టించాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      ‘సంతోషముతో/ సంతసమందన్’ అనండి.

      తొలగించండి

  2. మరీ ఇంత పీడకల గాంచితే పరుగిడి ఇచ్చట కు వచ్చాను :)

    నిద్రన గాంచితి నొక కల !
    గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్
    భద్రా నను కావు మనుచు
    బెడ్రూము విడిచి పరుగిడ భీతియు పోయెన్

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      భావం బాగున్నా మొదటి, మూడవ పాదాలలో ప్రాస తప్పింది.

      తొలగించండి

    2. భంశు :)

      సినబ్బా చాలా వీజీ గా పూరించే సానే అనుకున్నా :)

      నెనర్లు కంది వారు !

      ద్ర కి డ్ర కి పొత్తు కుదరదన్న మాట !

      (ద్రవిడులు డ్రావిడ్ లా ఇవి ప్రాస గూడునను కున్నా ప్చ్ :))


      జిలేబి

      తొలగించండి
  3. మెడ్రాసు నగర మందున
    షడ్రుచులను మేళవించి చక్కని మందున్
    కాడ్రే యను వైద్యుడొసగ
    గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్!!!

    రిప్లయితొలగించండి
  4. గొడ్రాల! తోటి కోడలు
    ఛిద్రము జేసెను మనమును ; చిత్రము లరయన్
    భద్రాద్రి తల్లి నికొలువ
    గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్

    జిలేబి

    రిప్లయితొలగించండి

  5. వడ్రంగి వారి గృహమున
    హై డ్రామానడుమ వారి యాడపడుచుకే
    మెడ్రాసు మందు దినగా
    గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్.

    రిప్లయితొలగించండి
  6. వడ్రంగి చిన్న సతియగు
    గొడ్రాలికి గొడుకు పుట్టె, , గోడండ్రేడ్వన్
    మెడ్రాసు మందు గలదని
    యడ్రసుయే జెప్పెనంత యానందముతో

    పైడ్రాజు మందు మహిమన
    గొడ్రాలికి గొడుకు పుట్టె గోడండ్రేడ్వ
    న్నడ్రసు నే వ్రాసిచ్చుచు
    వడ్రంగిని పంపి మందు వారికి దెచ్చెన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నా భావ సామ్యాన్ని కలిగి ఉన్నాయి.
      మొదటి పూరణ చివరి పాదాన్ని ‘...యడ్రసునే జెప్పె నంత నానందముతో’ అనండి.

      తొలగించండి
  7. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    వడ్ర౦గి పిట్ట తినినన్
    గొడ్రాలికి కడుపగు నని కోయ తెలుపగా
    బొడ్రాతి ముసలి యత్తకు -->
    గొడ్రాలికి , కొడుకు పుట్టె కోడ౦డ్రేడ్వవన్ ! !

    ి

    రిప్లయితొలగించండి
  8. గొడ్రాలనుకొనియుండగ
    వడ్రంగిన సాధువొకనిబలుకులమేర
    న్వడ్రంగి శంభు మ్రొక్కగ
    గొడ్రాలికిగొడుకుపుట్టె గోడండ్రేడ్వన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘వడ్రంగి’ శబ్దం పునరుక్తమయింది. ‘వడ్రంగిన’..? ‘వడ్రంగియు’ అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  9. వాడ్రేవున0దు దొరకిన
    వోడ్రమ్ములు వంధ్యతనము పుచ్చు నన౦గన్
    షడ్రుచులతో భుజింపగ
    గొడ్రాలికి గొడుకుపుట్టె గోడండ్రేడ్వన్

    రిప్లయితొలగించండి
  10. బొడ్రాయిని భజియించుచు
    షడ్ర సముల భోజనమ్ము సతతము గొనగన్
    మెడ్రాసున చిన యత్తగు
    గొడ్రాలికి గొడుకు పుట్టె గోడండ్రేడ్వన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. దొడ్రాయి వోలె నిలచిన
    గొడ్రాలిని జూచి తోటి కోడండ్రు నగన్
    గొడ్రాలు వేడ దేవుని
    గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని ఏకవాక్యంలో ‘గొడ్రాలు’ శబ్దం మూడుసార్లు పునరుక్త మయింది.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అది గొడ్రాలు మనోవేదనకి నా ప్రాస బాధకి దర్పణము.

      తొలగించండి
  12. . బోడ్రాతికి మొక్కఫలమ?
    గొడ్రాలికి వైద్య సలహ కూడగ జేయున్
    అడ్రసు దెలిసియు వెళ్ళగ
    గొడ్రాలికిగొడుకు పుట్టె|గోడండ్రేడ్వన్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘వెళ్ళగ’ అన్నది వ్యావహారికం. ‘వెడలగ’ అనండి.

      తొలగించండి
  13. చూడ్రా ! వదంతులీభువి
    గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ ; గోడండ్రేడ్వన్
    వడ్రంగివారి యింటను
    వాడ్రేవు శివుని సతిగనె వరుస నలుగురిన్

    రిప్లయితొలగించండి
  14. బొడ్రాయినికొలువగనే
    గుండ్రాయిని బోలినకొడుకుదయంచంగా
    కోడండ్రితరులు కుళ్ళగ
    గొడ్రాలికి కొడుకు పుట్టె;కోడండ్రేడ్వన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసించ దగినదే. కాని మూడవ పాదంలో ప్రాస తప్పింది. ‘కోడండ్రు’ శబ్దం పునరుక్తమయింది.

      తొలగించండి
  15. నడ్రేయి లేచి వగచియు
    దొడ్రాయిగ మారివేడ దురిత విదూరున్
    తోడ్రాని తోటి వారును
    గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. పైడ్రాజిచ్చె విడాకులు
    గొడ్రాలికి, గొడుకు పుట్టె గోడండ్రేడ్వన్
    మెడ్రాసు నుండి నర్సును
    వడ్రంగిని పంపి పిలిచె బాలుని సేవన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      పద్యం బాగుంది. కాని కొడుకు పుట్టింది ఎవరికి? విడాకులిచ్చిన గొడ్రాలికా?

      తొలగించండి
    2. కోడళ్ళకు,.......ఇంట్లొ పనికి గొడ్రాలు అత్తగా వుండేది ఆమే వెళ్ళిందని కొడళ్ళేడిస్తే నర్సుని తెప్పించాడని ఊహతో

      తొలగించండి
  17. దుడ్రాలు తోడికోడలు
    రాడ్రాడను వైద్యుడంది ప్రాభవమొప్పన్
    షడ్రస పూర్ణౌషధమిడ
    గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్!
    (దుడ్డు+ఆలు = దుడ్రాలు = 'డబ్బుగల తోడి కోడలు' అని వ్రాశాను ఆమోదయోగ్యమో కాదో గురుమూర్తులు పరిశీలించ ప్రార్థన)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      బాగున్నది మీ పూరణ. దుష్కరప్రాస కారణంగా అన్యదేశ్యాలు, వ్యావహారికాలు ఆమోదించక తప్పదు.

      తొలగించండి
  18. గొడ్రాలి దత్తపుత్రుల
    మడ్రాసున పెంచి పెండ్లి మంచిగ జేయన్...
    బెడ్రూము వాస్తు మార్చగ
    గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్ :)

    రిప్లయితొలగించండి


  19. మీ డ్రామా పేరేమం
    డీ? డ్రా మాలోన పురుషుడికి పాత్రయకో ?
    మా డ్రామాపేరండీ
    "గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్"!

    జిలేబి

    రిప్లయితొలగించండి