8, ఫిబ్రవరి 2016, సోమవారం

పద్యరచన - 1165

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

36 కామెంట్‌లు:

  1. గెలన గల పండు వలదుర
    యిలలో తాజా కబురులు యిచ్చుక నిచ్చున్
    తలలో కిష్కింధను కన
    వలెనన మిక్కిలి సులభము వార్తలు చదవన్

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ‘కబురులు+ఇచ్చక’మన్నపుడు యడాగమం రాదు. ‘కబురులె యిచ్చక మగురా’ అనండి. (ఇచ్చుక అన్న పద్యం లేదు, ఇచ్చకము ఉన్నది)

      తొలగించండి
  2. పద్య రచనకై యిచ్చిన పటము నందు
    హాస్య మొలుకుచు నుండుటే యద్భుతమ్ము
    గురువు గారికీ చిత్రమ్ము దొరికె నెచట
    నరుని యనుకరించునొక వానరపు బొమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ఈ చిత్రాన్ని ముఖపుస్తకం నుండి గ్రహించాను.

      తొలగించండి
  3. పండులు బాగుగ నున్నవి
    మెండుగ దినగోరి నంత మేలగు నిచటన్
    దండిగ లలలనా మణులట
    నిండుగ కనువిందు జేయు నిజమిది పేపర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      పద్యం బాగుంది కాని మీకు ఆ చిత్రంలో లలనామణు లెక్కడ కనిపించారు? చిత్రంలోని వానరచేష్ట విశేషం. దానిని మీరు ప్రస్తావించలేదు.

      తొలగించండి
    2. అంటే పేపరుచదవడం రాదుకదా అందుకని తారలపేజీ చూస్తోందని .అదన్నమాట

      తొలగించండి
    3. రవి గాంచని చోట్లను కవి
      సవివరముగ తెలుపగలడు చక్కగ చూడన్
      కవయిత్రులు కవి గాంచని
      వివరములను సునిశితముగ వీక్షింతురుగా

      తొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరింప నున్నవి

    కోతులె తాతలుగద మానవులకు
    తాతగారు పేపరు చదువుతుంటే నవ్వొచ్చా :

    01)
    ________________________________________

    మర్కటం బది గన - మానవున్ వలె దీక్ష
    జదువు చుండె నచట - జనులు నవ్వ !
    పండ్ల గెలనె మొదట - పరికించగా వచ్చు
    మనుజు కన్న మేలు - మర్కటకము !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  5. రామకథఁ జదువఁ గోమటి
    నీమముఁ దప్పక హనుమయె నెగ్గుచు వినియెన్!
    స్వామిని పత్రిక 'యంత
    ర్యామి' పుటన్ దీర్చఁ గనుచు నానందముగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. ఆ.వె. వానరముల నరుల వంశమొకటియేను
    నిజము నిజమనుచును నిశ్చయింప
    ఫలములెన్ని యున్న వార్తలే మిన్నగా
    దీక్షను చదువు మన తిమ్మ రాజు.

    రిప్లయితొలగించండి
  7. కర్తవ్యోచిత సన్ని
    ర్వర్తన సంరంభ దుర్వి వశుడా నరుడున్
    కర్తవ్య విహీనుడు కపి
    వార్తలఁ జదువఁ గనుడు నరవానర వరులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. చిత్రమునుగన విచిత్రము
    చిత్రమ్ములసాక్షిగాను చెదరనిదృష్టిన్
    పత్రిక చదివెడు అంజన
    పుత్రునిగన మానసంబు పులకించుగదా !!!



    రిప్లయితొలగించండి
  9. పేపరును పఠించుచునుండె వృక్ష చరము
    కోతిజాతికి భాగము కోరితాను
    భావినేతగ మారగ ఠీవితోడ
    నెన్నికల రంగమందున ఎదురుపడుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. కానన మందున నుండెడు
    వానరమాపీటమీద బాగుగ నుండీ
    యాననము గ్రిందనునిచియు
    మౌనముగా జదువుచుండె మూర్తీ! కనుమా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు,
      పద్యం బాగున్నది కాని 'బాగుగ నుండీ' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  11. పద్యరచన కోతి దినపత్రిక జదువ?”నీతివీడు
    జాతి|కోతిచేష్టలతో సజాతియయ్యె|
    చదువు సంస్కార మందించు|చక్కగాను
    అన్నసూత్రంబులా కోతికంటు కొనియె|
    2.కోతి చేష్టలన్ని కుర్రకారుకుబంచి
    -----కూర్చుంటివా కోతి కుదురుగాను|
    బేహారి బేజారు ,వేదనమాన్పెడి
    -----చదువన?నీవెంచి చదువుటేల?
    దినపత్రిక దిగులు తీర్చగ నెంచియే
    ------తీరికతోకోతి చేరె నేమొ|
    అంగడి సరుకులే నాశించ బోకను
    ----ఆకలి కడుపునే సాకబోక|
    మర్కటంబిట “మానవ కర్కశంబు
    మాన్పగలిగినవార్తలు మరచిరనుచు
    తెలియ జేసెడి రూపాన –తెలుపదలచి
    చిత్రమందున కోతివిచిత్ర బోధ|



    రిప్లయితొలగించండి
  12. కోతి యొకటి కొట్టు చెంత కూరుచుండి హాయిగా
    కోతి చేష్ట లన్ని మాని కుటిల బాట వీడియున్
    నీతి తోడ చదువు చుండె నిజము మీకు తెల్యునా?
    కోతిని గని మారు డనుచు కోరుచుండె నేతలన్,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగుంది. అబినందనలు.
      ‘కుటిల బాట’ దుష్టసమాసం కదా!‘కుటిలమార్గ మెడలుచున్’ అనండి.

      తొలగించండి
  13. నర వానరు లిరువురచట
    కరముల పత్రికను బట్టి కౌతుకమతితో
    స్థిరముగ చదువుచు నుండిరి
    అరుదగు దృశ్యమును గనుమ ననిలాత్మజుడా!!!

    రిప్లయితొలగించండి
  14. కోతి వచ్చె కొట్టు కొట్టేయ కదలము
    దానికొరకెయాడునాటకాలు
    వానరానికేమివార్తలతోపని
    జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

    రిప్లయితొలగించండి
  15. 1.అంగడందు వున్న యన్నివస్తువులను
    వదలి మర్కటమ్ము పట్టె పత్రి
    కొకటి చూడ చూడ కోతి చేష్టలివియే
    గాంచరండు జనులు కన్నులార.
    2.కంటికింపుగ నగుపించు కదళి ఫలము
    వదలి వార్తలు చదివేటి వానరమును
    గాంచ నచ్చెరువు మదికి గలుగు గాదె
    నలువ సృష్టియందున్నట్టి నవ్యతిదియె.

    రిప్లయితొలగించండి