16, ఫిబ్రవరి 2016, మంగళవారం

పద్యరచన - 1170

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

51 కామెంట్‌లు:

 1. అల్లపు ముక్కను చెక్కిన
  చల్లని గణపతి గమలచె చక్కగ నుండన్
  అల్లమె బెల్లమె యైనను
  నుల్లము రంజిల్లు రీతి నుత్తమ విద్యన్
  ---------------------------------
  గురువులు క్షమించాలి .అల్లపుముక్క మీద చెక్కినట్టుగా ఉంది.అందుకని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది. కాని అది చెక్కినది కాదు, సహజంగానే అలా ఏర్పడింది.

   తొలగించండి
 2. శుభోదయం !

  ఎల్లయు ఈశుని రూపము
  అల్లము సర్దన జిలేబి అల్లన గాంచెన్
  నుల్లము జల్లన విఘ్నుడు !
  ఎల్లలు లేదుర గణపతి యెచ్చట యుగనన్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం బాగున్నది. ‘సర్దన’..? ‘...గాంచె|న్నుల్లము’ అనండి. ‘విఘ్నుడు’?.. అతడు విఘ్నపతి కాని విఘ్నుడు కాదుకదా!

   తొలగించండి

 3. విఘ్న వినాయక ! కొలుతుము
  భగ్నము గాకను మనసున భరవస తోడన్
  భుగ్నపు అల్లమున మదిని
  మగ్నము జేయగ గణపతి మవ్వము గానన్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ రెండవపద్యం కూడ బాగున్నది.
   ‘భరవస’ గ్రాంధికం కాదు (శ్రీహరి నిఘంటువులో కనిపించినా) భుఘ్నపు టల్లమున... అనండి.

   తొలగించండి
 4. సతతోత్దితాయ భవాయ
  సతతము నిన్నే కొలెచెద సత్యము దేవా
  సతులే సిద్దీ బుద్దీ
  పతుడవు విఘ్నము తొలపగ పూష్ణే కృష్ణా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణమోహన్ గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం.
   ‘భవాయ’ అని బేసిగణంగా జగణం వేశారు. ‘సిద్ధీ బుద్ధీ’ అనడం వ్యావహారికం. ‘సిద్ధియు బుద్ధియు’ అనండి. చివరిపాదంలో యతి తప్పింది. ‘పతుడవు’ అనడం దోషమే. ‘గతి వీవే విఘ్నములను గడదేర్తువయా’ అందామా?

   తొలగించండి
 5. సరదాగా మాత్రమే...
  103)
  అల్లమనినతెలుసునుకద
  బెల్లమువలె పుల్లగుండు భలెబాగుండున్
  పుల్లటి బెల్లమె అల్లము
  సల్లగ తేనీరువలెనె సేవించవలెన్

  రిప్లయితొలగించండి
 6. సరదాగా మాత్రమే...
  103)
  అల్లమనినతెలుసునుకద
  బెల్లమువలె పుల్లగుండు భలెబాగుండున్
  పుల్లటి బెల్లమె అల్లము
  సల్లగ తేనీరువలెనె సేవించవలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణమోహన్ గారూ,
   మీ రెండవ పద్యం భావం కొంత గందరగోళంగా ఉంది. ‘కాకరకాయ అంటే తెలియదా? చింతకాయలాగా తియ్యగా ఉంటుంది’ అన్నట్లున్నది. రెండు, నాల్గవ పాదాల్లో యతి తప్పింది.

   తొలగించండి
 7. అల్లములో గణపతిఁగన
  నుల్లము రంజిల్లుచుండె నోముల ఫలమో!
  కల్లయు గాదిది గనుమా
  చల్లని దైవము వెలసెను సంరక్షింపన్

  2.తనువుకు మనసునకు తంపును గల్గించు
  చుండు నెండిన నిది సొంఠియౌను
  అల్లమునకుసమము బెల్లము చేర్చిన
  పైత్యమెల్ల తగ్గి వాసి యౌను.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. కారముటల్లము పై నా
  కారము జూడంగ నిలిచె గణపతి వోలెన్
  మీరిన వింతలు ప్రకృతిని
  మీరిట జూడంగ వచ్చు మేదిని లోనన్.

  రిప్లయితొలగించండి
 9. అల్లన జూడగ నిచ్చట
  నల్లము పైనిలిచెనుగ గణాధిపు రూపే
  ఎల్లెడల నుండు నతడని
  తెల్లముజేయంగ ప్రకృతి తీరుగ చూపెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 10. ఇల్లాలు కౌతుకంబున
  నుల్లము విలసిల్ల గీచె నోపికతోడ
  న్నల్లముమీదన గణపతి
  నల్లదిగోచూచిరండి యార్యా!యిపుడే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగుంది. కాని అది గీచిన చిత్రం కాదు, సహజంగా ఏర్పడిందే.

   తొలగించండి
 11. ఉల్లము లందున నిలిచిన
  చల్లని దేవుండు వాడు సామజ ముఖుడే
  బెల్లము పసుపుయు మరియును
  అల్లపు కొమ్మైననేమి అన్నిట వెలయున్

  ఇందుగలడందు లేడని
  సందేహమ్మే వలదిక శంకర సుతుడే
  యెందెందు గాంచ గలిగితె
  నందందేనిల్చునదియు నల్లమె యైనన్

  రిప్లయితొలగించండి
 12. అల్లపు వినాయకుని గని
  యుల్లము తోషణ మునొంద నుత్సాహముతో
  తల్లియు చెల్లియు సతియును
  పెల్లుగ పూజలు సలిపిరి వినయముతోడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. రిప్లయిలు
  1. వినయాంజలి నే దలతున్
   వినాయకుని వక్రతుండు విఘ్నేశ్వరునిన్
   మునిగణ సేవితు హరసుతు
   ఘన మోదక హస్తు మూషిక రధ విలసితున్

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ వినాయక స్తుతి బాగున్నది. అభినందనలు.
   కాని చిత్రంలోని అల్లం ప్రస్తావింపబడలేదు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అల్లమును నేను గమనిమనించనే లేదు. విఘ్నేశ్వరుని చూడగానే ఇదివరకు రెండు సార్లు వచ్చిందికదా యనుకున్నాను.

   తొలగించండి
 14. అల్ల-ముఖంబు గౌరి సుతుడందముజూడగకల్పితంబుతో
  అల్ల|మునీంద్రులే గొలువ?ఆశయ సిద్దియుదీర్చుగాదె|మీ
  అల్లట మాన్పు దైవమిట నద్భుత రీతిగ గానుపించగా
  అల్లమె విఘ్నరాయుడిగ అందరి మన్ననలంద చిత్రమే|{అల్ల=ఆ}{అల్ల=అల్లిక}అల్లట=కష్టనష్టము}

  రిప్లయితొలగించండి
 15. మానినీవృత్తం
  2.అల్లమునందున ఆశయసిద్దిగ అందరిసేవలు నందుటకా?
  చల్లని దైవమ చక్కటి రూపమ చంచల తత్వము మార్చుటకా?
  యుల్లమునందున యూహలు బుట్టగనుద్భవ మైతివ?నుజ్వలు డై|
  తెల్ల”గణేషుడ| తేలిక దైవమ| దీనులరక్షక |దెల్పుమిటన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పద్యంలో ‘...నందున నూహలు...’ అనండి.

   తొలగించండి
 16. అల్లమున చిత్రముగఁ బ్రభ
  విల్లెను రమణీయముగను విఘ్నేశ్వరుడే
  కల్లలు గాదన మహిమల్
  చల్లగఁ జూచును జనులను సన్నుతిసేయన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. ఎల్లెడల నుండు తానని
  తెల్లముగా నెల్ల రకును తెలుపగ నిలలో
  చల్లంగ నేకదంతుడు
  అల్లన సాక్షాత్కరించె యల్లము నందున్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పద్యం బాగున్నది.
   ‘సాక్షాత్కరించె నల్లమునందున్’ అనండి. అక్కడ యడాగమం రాదు.

   తొలగించండి
 18. బెల్లము విందు సేయగను ప్రీతిగ కోర్కెలు దీర్చు పార్వతీ
  ఫుల్ల సరోరుహాననపు పూషుడ!విఘ్న వినాయకా!మనం
  బుల్లసిలంగ గాంచితిమి ముద్దుల మోహన కుబ్జ రూపమున్
  అల్లము లోన గూర్చ,గొను మయ్య! మదర్పితమ్రొక్కులన్ సదా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
   ‘మదర్పిత మ్రొక్కులన్’ అనరాదు. ‘మదర్పిత వందనమ్ములన్’ అనండి.

   తొలగించండి
 19. చవితి నాడు తిన్న చలివిడి యుండ్రాల్లు
  పంచభక్ష్యభోజ్య పానకాలు
  స్వామికట యజీర్తి సలిపె నేము!
  యల్లమందు దాగె నయ్యవారు !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగుంది.
   మూడవపాదంలో గణదోషం. ‘సలిపెనేమో కాని’ అనండి.

   తొలగించండి
 20. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
  చవితి నాడు తిన్న చలివిడి యుండ్రాల్లు
  పంచభక్ష్యభోజ్య పానకాలు
  స్వామికట యజీర్తి సలిపినట్టి ఫలమో!
  యల్లమందు దాగె నయ్యవారు !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారు :)

   సూపర్! ఎందుకబ్బా అల్లం లో స్వామి ఉన్నారూ అని నిన్నటి నించి ఆలోచిస్తా ఉన్నా :) మీ పూరణ దానికి భాష్యం చెప్పేసే :)

   త్రీ చీర్స్
   జిలేబి

   తొలగించండి

 21. గురుదేవుల సూచనమేరకు సవరించిన పద్యము
  బెల్లము విందు సేయగను ప్రీతిగ కోర్కెలు దీర్చు పార్వతీ
  ఫుల్ల సరోరుహాననపు పూషుడ!విఘ్న వినాయకా!మనం
  బుల్లసిలంగ గాంచితిమి ముద్దుల మోహన కుబ్జ రూపమున్
  అల్లము లోన గూర్చ,గొను మయ్య! మదర్పిత వందనమ్ములన్

  రిప్లయితొలగించండి
 22. అంబరమున నుండు అల్లమందుననుండు
  ఎందును వెదకి నను యెక్కడైన
  ఒంటి కొమ్ము దేవ ఉండ్రాళ్లు భక్షించు
  విఘ్న ములను తోసి వెన్ను కాచు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంథా భానుమతి గారూ,
   మీ పద్యం బాగుంది. దానిని క్రిందివిధంగా చెప్తే ఇంకా బాగుంటుందని నా సూచన....
   అంబరమున నుండు నల్లమందున నుండు
   నెందు వెదకి చూడ నెక్కడైన
   నొంటికొమ్ముదేవు డుండ్రాళ్ళు భక్షించు
   విఘ్నములను త్రోసి వెన్ను గాచు.

   తొలగించండి
 23. రిప్లయిలు
  1. కరుణ గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘గణపతిని+ఊహను, కనగా+అల్లము’ అన్నపుడు యడాగమం రాదు. ‘భావ’ అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. మీ పద్యానికి నా సవరణ....
   ఝల్లున బొంగెను నేడే
   యుల్లము బొజ్జగణపతిని నూహను గనగా
   నల్లమునందున మనమున
   బెల్లుబికె మదీయభక్తి పెను వెల్లువయై.

   తొలగించండి

 24. కందము:
  ఝల్లున పొంగెను నేడే
  యుల్లము బొజ్జగణపతిని యూహను కనగా,
  యల్లమునందున మనమున
  పెల్లుబికినది భక్తిభావ వెల్లువ నాలో!

  రిప్లయితొలగించండి