11, ఫిబ్రవరి 2016, గురువారం

పద్యరచన - 1168

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

24 కామెంట్‌లు:


 1. గిట్టుట యునిజము మరలను
  పుట్టుట నిక్కము వలదన పునరపి జననమ్
  పట్టుగ నీశుని కొలువుము
  గిట్టును మోక్షము మనలకు గిరిపుర వాశా

  రిప్లయితొలగించండి
 2. దశలు మారుచు మనుజులు యశము వీడి
  చావు పుట్టుక లనెడియీ చక్ర మందు
  నడుమ మోహము లందున మునిగి తుదకు
  ప్రేత భూమిని జేరును ప్రీతి లేక

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్య గారు నమస్కారములు. మీపద్యము చక్కని భావముతో బాగుంది. మూడవ పాదము లో యతి తప్పినట్లుంది. చూడండి.

   తొలగించండి
  2. దశలు మారుచు మనుజులు యశము వీడి
   చావు పుట్టుక లనెడియీ చక్ర మందు
   నడుమ మోహము లందున నలిగి తుదకు
   ప్రేత భూమిని జేరును ప్రీతి లేక
   --------------------------
   ధన్య వాదములు కామేశ్వర రావు గారు

   తొలగించండి

 3. సుడుగాడుర మన లెల్లరి
  బడుగు బతుకు మనకు గుర్తు బరువుగ నిచ్చున్
  ఒదుగుగ బుట్టి పెరిగి యిల
  ఒడిలో గిట్టి పుటుక యన ఒజ్జగ గరపున్

  రిప్లయితొలగించండి
 4. ఈ తెల్లవారు జామున మా పెద్ద బావమరది మార్గం కొమురయ్య మరణించాడు. కరీంనగర్ వెళ్తున్నాను. ఈరోజు కూడా మీ పద్యాలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నమస్కారములు
   ఒకకదాని తర్వాత మరొకటి .చాలా బాధగా ఉంది .ధైర్యంగా ఉండండి .

   తొలగించండి
 5. పడతి గర్భమందు ప్రభవించునీరూపు
  పుడమి యందు జేరి పూర్తియగును
  బాల్య యౌవనములు వార్థక్యమనునవి
  దశలవియును మృత్యు దరికి జేర్చు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారు మీ పద్యము బాగుంది. అభినందనలు. “పుడమినందు” అనాలేమో చూడండి.

   తొలగించండి
 6. శంకరయ్య గారికి నమస్కారములు.దెబ్బమీద దెబ్బ.
  వారి యా త్మలకు శాంతి కలుగుగాక!

  రిప్లయితొలగించండి
 7. జీవన చక్ర గమన ధా
  రావాహిక నాపగల నరవరులు గలరే
  భావింప జనన మరణము
  లీవిధి ననివార్య విష్ణు లీలలు సుమ్మీ

  రిప్లయితొలగించండి
 8. పుట్టు మనుజుడు తప్పక గిట్టు కతన
  బ్రతికి యున్నంత కాలము భవునిసేవ
  జేసి కొనుముర తప్పక జేరుదువిక
  శివుని చెంతకు నిజమునే జెప్పు చుంటి

  రిప్లయితొలగించండి
 9. మానవుని పుట్టు గతులే
  కానంబడు చిత్రమందు గమనించంగా
  తానవవిధ నవతారం
  బేనిల, గర్భంబు నందు పెరుగుట జరుగున్|

  రిప్లయితొలగించండి
 10. జనన మరణములవి చక్రభ్రమణముల
  ని యెరుగంగ లేక నెలవుకొరకు
  పోరు సల్పు చుంద్రు;పుట్టి పెరిగి పెద్దై
  కడకు చేరు వల్లకాడు కాదె.

  రిప్లయితొలగించండి
 11. ఆట పాటల గడచెను బాల్య మంత
  చదువు సంద్యల కాలంబు సమసి పోయె
  మోహపాశాల యౌవనం మోక రిల్లె
  రోగబాధల వార్థకం రోత గలిగె.

  అల్పమైనది పరికించ మనిషి బ్రతుకు
  జనన మరణముల నెరుగు జనుడు లేడు
  పుట్టినందుకు సాధించు పూనిక గొని
  శాశ్వతమగును నీపేరు విశ్వమందు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూర్తి గారు నమస్కారములు. మీ పద్యాలు రెండు బాగున్నవి.
   మొదటి పద్యపుమొదటి పాదములో యతిభంగమున్నట్లున్నది.
   రెండవ పద్యములోను మొదటి పాదములో యతి భంగము. నాల్గవ పాదములో ప్రాస యతి లో ప్రాస పూర్వ పదమొకటి దీర్ఘమయితే రొండోది కూడా దీర్ఘమవ్వాలి గదా. ఇక్కడ రెండూ గురువులయ్యాయి కానీ దీర్ఘాలు కాలేదు. పరిశీలించండి.

   తొలగించండి
 12. జీవియు జీవమున్ నొదల?జీవియుజీవము బొంది గర్భమం
  దావల బాల,యవ్వన విధానము లందున వృద్దుడయ్యు|ఆ
  జీవికి కష్టనష్టముల చింతల కానుక లంద జేసి|సం
  భావన భాగ్య సంతతికి బంచునుతొమ్మిది రూపముల్ సుమా|

  రిప్లయితొలగించండి
 13. పుట్టు చున్న దెల్ల గిట్టుచు నుండును
  గిట్టు చున్న దెల్ల బుట్టు చుండు
  పుట్టి గిట్టు లోని పోకడ లేమిటో
  ఎరుక గలుగు వారు ధరను గలరె?!!!

  రిప్లయితొలగించండి
 14. పుట్టినది మొదలు తనువు గిట్టువరకు
  కలుగు కష్టసుఖమ్ములు కావడి గల
  కుండ లటుల మనుజులకు కువలయమున ,
  మంచి బుద్ధితో పయనించు డంచితముగ
  పొంద శాశ్విత యశస్సు పుడమిపైన

  రిప్లయితొలగించండి
 15. పుట్టిన వారలు గిట్టుట
  నట్టులె యాత్మ మరుజన్మ నందుట, నడుమన్
  తట్టములమయంపు బ్రతుకు
  చిట్టచివరి వరకు సాగి చెల్లుట నిజమే!


  రిప్లయితొలగించండి