26, ఫిబ్రవరి 2016, శుక్రవారం

పద్యరచన - 1176

కవిమిత్రులారా,
శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజమ్|
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోపశాంతయే||

పై శ్లోకభావంతో మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

47 కామెంట్‌లు:

 1. శుభోదయం !

  గజముఖ విఘ్న వినాయక !
  అజరము నీవని మనమున అధిపా గొలుతున్
  రజతపు వర్ణపు నాలుగు
  భుజముల నిర్మల ముఖముగ బూజింతు నినున్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. తెల్లని వస్త్రముల్ గలిగి తేజముసర్వము వ్యాప్తి జెందుచున్
  చల్లని వెన్నెలల్ గురియు చక్కని చంద్రుని కాంతి చాయతో
  నల్లన నాల్గు చేతులును యచ్చపు శాంతపు మోము వానినే
  యుల్లమునందునన్ నిలిపి యుంచుదు విఘ్నములన్ని పోవగన్.

  రిప్లయితొలగించండి
 3. ధవళాంబరధర! వ్యాపక!
  ధవళాంగ! చతుర్భుజా! సతతము భజింతున్,
  నవహసితవదన! విఘ్నము
  దవునుంచగ నభయమునిడి దయచూపుమయా!
  దవు=దూరము

  రిప్లయితొలగించండి


 4. పోచిరాజుకామేశ్వరరావుగారిపూరణ ------
  ధవళాంబరధరునిసకల
  భువనవ్యాపిశశివర్ణుభుజచాతుష్కున్
  సువికసితప్రసన్నవదను నివిఘ్నరాహితినిమదినినిత్యముదలతున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధవళాంబర ధరుని సకల
   భువనవ్యాపి శశివర్ణు భుజ చాతుష్కున్
   సువికసిత ప్రసన్న వదను
   ని విఘ్న రాహితికి మదిని నిత్యము దలతున్

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “భుజ చాతుష్కున్” పదసాధుత్వము పై సందేహమున్నది. సాధువేనా? కానియెడల “భుజ చత్వారిన్” గా సవరణ తో పూరణ పంపితిని. పరిశీలించగోర్తాను.
   ధవళాంబర ధరుని సకల
   భువనవ్యాపి శశివర్ణు భుజ చత్వారిన్
   సువికసిత ప్రసన్న వదను
   ని విఘ్న రాహితికి మదిని నిత్యము దలతున్

   తొలగించండి
  3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   చతుష్కము(నాలుగు)నకు సంబంధించినది చాతుష్కము అనవచ్చు. నిఘంటువులలో ఈ పదం లేదు.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిఘంటువులలో కంపించక పోవడము వలనే సందేహము కల్గినది. ధన్యవాదములు. సాహస్రము వలెనే చాతుష్కమ ని వ్రాసాను. ధన్యవాదములు.

   తొలగించండి


 5. శుధ్ధవస్త్రముధరియించుసిధ్ధిగణప
  తిని,భుజములవి నాలుగునెనయువాని విఘ్ననాధునిగొలుతునుబ్రీతితోడ నహరహమ్మునువేకువనందులేచి

  రిప్లయితొలగించండి
 6. తెల్లని వలువలు దాల్చిన
  పుల్లాబ్జాక్షుండు నాల్గు భుజముల తోడన్
  చల్లగ నవ్వులు రువ్వన్
  నుల్లము రంజిల్లగ గొలుతును నుమా తనయున్.

  రిప్లయితొలగించండి
 7. అన్నయ్యగారూ నిన్నటి పద్యం ఓసారి పరిశీలించండి.
  అగ్రజునితో విభీషణుండనియె నిటుల
  "రాముడన నెవ్వడతడొక రాక్షసుండు
  కాడు"తిరిగి సీత నొసగి గనుము సుఖము
  యనుచు రావణాసురు తోడ ననుజుడనియె.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   కాని మొదటిపాదం, చివరిపాదం పునరుక్తి ఉంది. ‘అనియె నిటుల’ అని మళ్ళీ ‘అనుజు డనియె’ అన్నారు.

   తొలగించండి
 8. పట్టుబట్టల ధరియించు పద్మనాభ
  చంద్రు రూపు నాలుగు భుజ స్కంధములును
  సలలిత ముఖమ్ముతో నొప్పు చక్ర ధారి
  ప్రార్థన జలుపు చుంటిని భక్తితోడ
  సర్వ విఘ్నముల్ తొలగించు సత్వరముగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   పై శ్లోకానికి విష్ణుపరంగా కూడా అర్థం చెప్తారని విన్నాను. మీరు ఆర్థంలో వ్రాశారు. పద్యం బాగున్నది. అభినందనలు.
   వినాయకుని పరంగా విష్ణు శబ్దానికి ‘సర్వవ్యాపకు’డని అర్థం.

   తొలగించండి
 9. 1.
  చంద్ర కాంతి ఛాయ చక్కని నగుమోము
  నాల్గు భుజములున్ననవ్య రూపు
  ధవళ వస్త్రధారి శివునిపుత్రుడ నీకు
  వినతి జేతు బాపు విఘ్నములను

  2.
  ధవళాంబరమును దాల్చిన
  నవకాంతుల దేహ ఛాయ నాలుగు భుజముల్
  శివసుత కైదండ లిడుదు
  భవహర మా విఘ్నములను బాపుము దేవా

  3.
  చల్లని మోమువాడవు నిశాపతి ఛాయయు నాల్గుచేతులు
  న్నెల్లగణాలరేడువయి యెల్లెడలందున వ్యాప్తివైన ని
  న్నుల్లము నందు నిల్పితిని యుర్విని గాచెడు వాడవంచు నో
  తెల్లని వస్త్రధారి యిక దీర్చుము విఘ్నము లంచు వేడితిన్

  రిప్లయితొలగించండి
 10. . దవళపు వస్త్ర దారణ విధానమునందునవిష్ణు రూపుడై
  అవిరళ చంద్ర కాంతిగ దయాగుణ ముంచెడి నాల్గు చేతులున్
  సవరణ సాకగల్గు మనసందున భక్తిగ, ధ్యానమెంచగా
  వివరణలేక విఘ్నములు వీడును నెంచగ విఘ్న నాయకా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పద్యం బాగున్నది.
   ‘మనసు నందున’ అనడం సాధువు.

   తొలగించండి
 11. * గు రు మూ ర్తి అ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  ఉత్సాహము
  ...................

  ధవళ వర్ణ వస్త్ర ధారి !
  ద౦తి వదన ! విఘ్న నా


  శ ! విమల చరిత ! శశి హాస !
  సర్వ సత్కళా నిధీ !


  శివ కుమార ! ఏక ద౦త !
  సిధ్ధి బుధ్ధి నాయకా !


  భవహర ! గణనాధ ! నిత్య
  పరమ సద్దయా౦చితా !

  రిప్లయితొలగించండి
 12. రిప్లయిలు
  1. స్కంద పూర్వజ నీకివె వంద నములు
   ధవళ పుట్టము గట్టిన దంతి దేవ
   భక్తి గొలిచెద చతుర్భుజ భవుని తనయ
   విఘ్న నాయక తొలగించు విఘ్న ములను

   తొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది.
   మూడవపాదంలో గణదోషం. ‘భక్తి గొలుతు చతుర్భుజ...’ అనండి.

   తొలగించండి
 13. చందురుని బోలు దేహపు ఛాయవాని
  ధవళ వస్త్రముల నెపుడు దాల్చు వాని
  సర్వ విఘ్నముల నెడపు శంభుసుతుని
  నాల్గు కరముల మెరయు వినాయకుడును
  ప్రతి దినమ్మును బూజించి ప్రణతులిడుదు!!!


  తెల్లని వస్త్రము దాల్చియు
  అల్లన నాలుగు కరముల నాకృతి తోడన్
  చల్లని శశివర్ణముతో
  వెల్లివిరియు కరివదనుని వేడుదు భక్తిన్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘వినాయకుడును’ అనడం సాధువు కాదు. ‘వినాయకు నిదె| ప్రతిదినమ్మును...’ అనండి.

   తొలగించండి
 14. తెల్లని వస్త్ర ధారివట దీటుగవిశ్వముకంత వేల్పువై
  చల్లని చంద్ర వర్ణమును చక్కని నాల్గు భుజమ్ములున్ మొగ
  మల్లన నవ్వులన్ గురియు మాన్యుడ నిన్నుభజింతు రెల్లరున్
  కొల్లలు విఘ్నముల్ తొలగ కోర్కెలు దీర్చగ శాంతి యేర్పడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పద్యమ్ బాగున్నది.
   ‘విశ్వమునకంత’ అనడం సాధువు. ‘మొగ మ్మల్లన..’ అన్నచోట టైపాటు.

   తొలగించండి
 15. సర్వ విఘ్నాలు నిరతంబు శాంతి కొెఱకు
  శశిని బోలిన వర్ణుని చతుర భుజుని
  శుక్ల వస్త్రంపుధారియౌ శూర్ప కర్ణు
  విశ్వ వ్యాపి ప్రసన్నుని వేడుకొందు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. గురుమూర్తి అచారి గారి పద్యాలు.....

  శ్రీకర ! సత్కరుణా మధు
  శీకర సేచక ! సురగణ శేఖర వినుతా !
  లోకాధిప ! నిను వేడితి
  ప్రాకట మగు భక్తి యుక్త బావము తోడన్


  అనయముల బాపు దొరవని
  వినయముగా గొలుచు చు౦టి విఘ్నాద్రిపవీ!
  అనునయ మారగ తావక
  తనయుని మొర లాలకి౦చి దయజూడు మయా

  ము౦దల విఘ్ననాయకుడు పూజితు డౌనని డె౦ద మ౦దు మే
  ము౦ దలపోయుచు౦టిమి విభుత్వ మహోజ్వలమూర్తి! శాశ్వతా
  న౦ద నయస్వరూప! సుగుణప్రియ! దీనశరణ్య! పార్వతీ
  న౦దన! చల్లనైన కరుణ౦ గను మోదకహస్త! ఈశ్వరా!

  రిప్లయితొలగించండి
 17. ధవళ వర్ణంపు వస్త్రముల్ దాల్చు వాని
  మేను జాబిల్లి పోలికన్ మెరయువాని!
  సర్వవ్యాపిన్! చతుర్భుజున్!సౌమ్య వదను
  విఘ్నశాంతికి మదినమ్మి వేడుకొనెద!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది.
   ‘సర్వవ్యాపి’ అన్నచోట ‘ర్వ’ గురువై గణదోషం.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన.

   ధవళ వర్ణంపు వస్త్రముల్ దాల్చు వాని
   మేను జాబిల్లి పోలికన్ మెరయువాని!
   స్వామి విష్ణున్! చతుర్భుజున్!సౌమ్య వదను
   విఘ్నశాంతికి మదినమ్మి వేడుకొనెద!

   తొలగించండి
 18. నొసగి గనుము సుఖము
  యనుచు రావణాసురు తోడ ననునయమున
  సవరించాను.ఇదిసరిపోతుందా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   ఇప్పటికీ అన్వయలోపం ఉంది. ‘సుఖము+అనుచు’ అన్నపుడు యడాగమం రాదు. ‘సుఖ మ|టంచు...’ అనండి. పద్య ప్రారంభంలో ‘అగ్రజునితో’ అని మళ్ళీ రావణునితోడ అనడం వల్ల అన్వయం లోపిస్తున్నది.

   తొలగించండి
 19. ధవళ వస్త్రంబుల నెపుడు దాల్చునట్టి
  వాడు విష్ణువనెడి పేర పరగు వాడు
  నాల్గు భుజములతొడవుల నలరు వాడు
  అద్రిజ తనయు డీతడు యార్తి బాపు.
  గణములకధినేత గణపతి యనుపేర
  వెలసి పూజలంది వెలుగు వాడు
  ఏకదంతు డితడు యిభరాజ ముఖుడు
  యాపదలను బాపి యభయమొసగు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యాలు బాగున్నవి.
   మొదటి పద్యంలో ‘ఈతడు+ఆర్తి’ అన్నపుడు యడాగమం రాదు. ‘...డీతడే యార్తి...’ అనండి.
   రెండవపద్యంలో ‘వాడు+ఏకదంతుడు... ఇతడు+ఇభరాజ... ముఖుడు+ఆపదలను’ అన్నచోట్ల యడాగమాలు రావు. మూడవపాదంలో గణదోషం. ‘వెలుగునట్టి| యేకదంతు డితడె యిభరాజవదనుడై| యాపదలను...’ అనండి

   తొలగించండి

 20. శ్వేతాంబరధర ! నాలుగు
  చేతులు గలదొర ! శుభకర ! చేకూర్చుము సం
  ప్రీతిని శశివర్ణ ! నమో
  వ్రాతము విఘ్నోపశమన ! వారిజ నయనా !!!

  రిప్లయితొలగించండి
 21. (వచ్చె వచ్చె బొజ్జయ్యిడ వఱలు చుండి!!!)

  తెల్ల పంచెను కట్టుచు తిరుగు వోడ!
  కలువచెలి రంగు! నాలుగు కరము లోడ!
  నెయ్య మొలికెడి మోముడ! నిన్నె దలతు!
  త్రోసి పుచ్చర గడముల! వాసి గాను!

  రిప్లయితొలగించండి