29, ఫిబ్రవరి 2016, సోమవారం

పద్యరచన - 1179

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

33 కామెంట్‌లు:

  1. సౌగంధిక దినుసు లవియె
    ఖంగున కాసము జలుబుల కల్మష ములనే
    భంగము వాటిల్ల తనువుకు
    నింగలము నకసరు దీసి నేర్పుగ ద్రావన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది.
      మూడవపాదంలో గణదోషం. ‘వాటిల’ అంటే సరి.

      తొలగించండి
    2. సౌగంధిక దినుసు లవియె
      ఖంగున కాసము జలుబుల కల్మష ములనే
      భంగము వాటిల తనువుకు
      నింగలము నకసరు దీసి నేర్పుగ ద్రావన్

      తొలగించండి
  2. దినుసులను గనెన్ పలువిధ
    వనమూలికలన జిలేబి వంటన వేసెన్
    దినకరుడుదయించెను తీ
    రన ఘుమ ఘుమలాడె వంట రసముల తోడన్ :)

    రిప్లయితొలగించండి
  3. దినుసుల జూడుండిచ్చట
    దినదినమున వంటలోన తీరుగ వాడన్
    తినువారి కిచ్చు రుచినే
    పెనువ్యాధులు రావనెదరు పెద్దలు వినరా !

    రిప్లయితొలగించండి


  4. మిరియములులవంగములునుయాలకులట కానబడుచుండెజక్కగగనుడుసామి! పిండివంటలయందునవేసితినగ మంచిరుచినినేనిచ్చునుమరియుకలుగు నాయురారోగ్యములుగూడననవరతము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగుంది.
      మొదటిపాదంలో యతి తప్పింది. ‘మిరియములు లవంగములును మిక్కుటముగ| గలవవే యేలకులు నీవు గనుము స్వామి.... మంచిరుచిని తా మిచ్చును...’ అనండి.

      తొలగించండి
  5. జ్వరము వచ్చెననుచు బాధలేల మనకు
    వైద్యశాల లనుచు పరుగు లేల?
    వివిధ యౌషధములు వెచ్చాలుగా మారి
    వంట శాలజేసె వైద్యశాల

    సరుకు లనుచును జిలకఱ జాజికాయ
    దాల్చినిలవంగ మిరియాల దలప బోకు
    మేటి యౌషధ గుణమంట వీటి యందు
    మునులె తెలిపిరీ విషయమ్ము ముదమొనర్చ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యాలు బాగున్నవి.
      ‘వివిధ+ఔషధము’ లన్నపుడు వృద్ధిసంధి వచ్చి ‘వివిధౌషధములు’ అవుతుంది. ‘వివిధ భేషజములు’ అనండి. భేషజము=ఔషధము.

      తొలగించండి
    2. ధన్యవాదములండీ గురువు గారు సవరిస్తాను.

      తొలగించండి
  6. చెక్క మిరియాలు యాలకుల్ చక్కనైన
    కుంకుమ పూరాశి కనగ గుణములెన్నొ!
    దేహ బుద్ధి వికాసంపు తిరుగులేని
    మందు లగునని శాస్త్రజ్ఞ మాన్యులనిరి!

    రిప్లయితొలగించండి
  7. చెక్క మిరియాలు యాలకుల్ చక్కనైన
    కుంకుమ పూరాశి కనగ గుణములెన్నొ!
    దేహ బుద్ధి వికాసంపు తిరుగులేని
    మందు లగునని శాస్త్రజ్ఞ మాన్యులనిరి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ‘యాలకుల్’ అన్నది మాండలికం. ‘ఏలకులు’ సాధువు. రెండవపాదంలో గణదోషం. ‘మిరియమ్ము లేలకుల్...కుంకుమపువురాశి కనగ...’ అనండి.

      తొలగించండి
  8. అల్లము మిరియా లేలకు
    లుల్లము రంజింప జేయ నొప్పును మెంతుల్
    వెల్లుల్లి జాజికాయలు
    నల్ల లవంగమ్ము లిచ్చు నధికపు కోర్కెల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. అనయము భోజ్యములందున
    దినుసులు తగినన్ని కలిపి తిన్న, నిజముగా
    మన దరి చేరవు రోగము
    లని చెప్పుదురు మన పెద్ద లనవరతమ్మున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. . సౌగంధ-ద్రవ్యాలు సంతోష మందించు
    ----తాంబూల మందున తరచు వేయ
    తీపి వంటకమందు-తీరిక చేవేయ
    -------మంచివాసన నుంచి పెంచు తిండి
    నోటి పూతను మాన్పి-పోటిగాకడుపున
    ------జీర్ణ శక్తినిబెంచు చింతవలదు
    కల్తీలు లేకున్న కలవారి విందుకు
    -----ముందుండు –ద్రవ్యాలు ముఖ్య మవియె|
    యాలక,లవంగముల్,మిరియాలు,శొంటి
    చెక్క,పూతలు గలిపిన- శ్రేష్ఠ మైన
    వంటకాలన యెవరికి కంటకంబు
    రాజు,పేదకు నచ్చెడి మోజువంట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      సుగంధ ద్రవ్యాల గురించి చక్కని సీసం వ్రాశారు.
      ఏలకిని యాలక అన్నారు.

      తొలగించండి
  11. చిక్కని యౌషధ గుణములు
    మిక్కుటముగ నుండు వీని మేదిని యందున్
    పెక్కురు వంటల యందున
    చక్కగ మరి వాడు చుంద్రు సంబారములన్!!!

    రిప్లయితొలగించండి
  12. శైలజగారు, అందమైన పద్యం. మిగిలిన కందాలూ బాగున్నాయి.

    రుచి పెంచుచు, మేలగు యభి
    రుచి పెంచుచు నీ సుగంధ, రోచక నిధులున్
    పచనపు శక్తిని యొసగును,
    శుచిగా పాకములఁ జేర్చ, సులభమె కనుడీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ‘శక్తి నొసంగును’ అనండి.

      తొలగించండి
    2. ‘శక్తిని+ఒసగును’ అన్నపుడు యడాగమం రాదు. ‘శక్తిని నొసగును’ అవుతుంది. లేదా ‘శక్తిన్+ఒసగును=శక్తి నొసగును’ అవుతుంది.

      తొలగించండి
    3. గురువుగారు, ధన్యవాదాలు. సవరించుకున్నాను.

      రుచి పెంచుచు, మేలగు యభి
      రుచి పెంచుచు నీ సుగంధ, రోచక నిధులున్
      పచనపు శక్తి నొసంగును,
      శుచిగా పాకములఁ జేర్చ, సులభమె కనుడీ.

      తొలగించండి
  13. తగు మోతాదున వాడిన
    సుగంధ ద్రవ్యములొసంగు సుస్థత మనకున్!
    వెగటున్ గల్గించు నటుల
    నెగబడి తిన్నంత రోగమేర్పడు లోనన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. చెక్క మిరియమాది చక్కని దినుసులు
    చెంతనుండ నీకు చింత లేల
    రుజలు తొలగజేయు రుచులను హెచ్చించు
    నెంచి చూడ నివియె మంచి చేయు.

    రిప్లయితొలగించండి
  15. చక్కని యేలకు, దాల్చిన
    చెక్కలు, మిరియాలు, రుచులు చిందు మసాలాల్...
    మిక్కిలిగా బిరియానిని
    కుక్కగ త్రేపులును వచ్చు గుడుగుడు కడుపుల్!

    రిప్లయితొలగించండి
  16. చక్కని యేలకు, దాల్చిన
    చెక్కలు, మిరియాలు, రుచులు చిందు మసాలాల్...
    మిక్కిలిగా బిరియానిని
    కుక్కగ త్రేపులును వచ్చు గుడుగుడు కడుపుల్!

    రిప్లయితొలగించండి