జిలేబీ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. కాని రెండవ పాదంలో ప్రాస, చివరి పాదంలో యతి తప్పాయి. దండిగ చేపలు దెచ్చె మ గండదె మీనాకుమారి ఘనముగ బేర్చెన్ రండు గన మత్స్యయంత్రము నెండగ ముంగిటను గొలిచె నిదె పండుగగా.
కృష్ణమోహన్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘నీటనుండు...ముద్దుగా నుండెనో’ అనండి. మీ బ్లాగు ‘కృష్ణమోహన్ కవితలు’ను కొద్దిరోజుల క్రితమే చూశాను. మీ ‘ఆటవెలదులు, కందాల శతకమాల’ కొన్ని పద్యాలు చదివాను. బాగున్నవి. అక్కడడక్కడ ఛందోవ్యాకరణ దోషాలున్నవి. తరువాత తీరికగా వాటిపై నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను.
చేపలెన్నొ దెచ్చి చిత్రాతి చిత్రంగ
రిప్లయితొలగించండిపేర్చినారు జూడ వింత యదియు
మత్స్య యంత్ర మదియొ మగటిమ గలిగిన
పార్థువెదక దలచి పన్ని రేమొ
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వచ్చెను మకర సంక్రాంతి పండుగనుచు
రిప్లయితొలగించండిబెస్తవారి పిల్లయె ముగ్గు వేయబోవ
ముగ్గు పిండి యింటనులేక ముచ్చటగను
పొలతి దీర్చె మత్స్యములను ముగ్గు వోలె!!
జిగురు సత్యనారాయణ గారూ,
తొలగించండిచక్కని భావంతో పద్యాన్ని వ్రాశారు. బాగుంది. అభినందనలు.
చక్కగ నల్లిరి చిత్రము
రిప్లయితొలగించండిమిక్కిలి యందముగ నున్న మీనము లవియే
మక్కువ జూపుచు కనులకు
చెక్కగ నదియంత్ర మేమొ జేరి కనంగా
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మత్స్యోదయం :)
రిప్లయితొలగించండిదండిగ చాపలు తెచ్చెను
పెండ్లము మీనా కుమారి పేర్చెను అవురా !
రండు గన మత్స్య యంత్రము
యెండగ ముంగిట గొలిచెను పండగ గానన్
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కాని రెండవ పాదంలో ప్రాస, చివరి పాదంలో యతి తప్పాయి.
దండిగ చేపలు దెచ్చె మ
గండదె మీనాకుమారి ఘనముగ బేర్చెన్
రండు గన మత్స్యయంత్రము
నెండగ ముంగిటను గొలిచె నిదె పండుగగా.
చేపల ముగ్గునుజూడుము
రిప్లయితొలగించండిఏపాపలుబెట్టిరచటయేమోకానీ
పాపల నైపుణ్యమునకు
రూపాయలనిత్తునిపుడురూఢిగ నేనున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
చేపల కన్నుల చిన్నది
రిప్లయితొలగించండిచేపల చిన్నదియు పెద్ద చేపల వరుసన్
చేపట్టి మ్రుగ్గు బెట్టెను
చేపట్టిన వాడు మెచ్చి చిటికెలు వేయన్.
రిప్లయితొలగించండిసరదాగా.....
చేపతోకచేప చేపతోకాచేప
చేపతోక చేప చేపతోక
తోక చేప తోక తోకచేపా చేప
తోక చేపతోక తోక చేప.
భళా!
తొలగించండిభళా!
తొలగించండిthank u sir
తొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ.
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పైశాచిక కృత్యంబా
రిప్లయితొలగించండిత్మాశిగణ విదార ణాతి దారుణ దృశ్యం
బే శమదమాది గుణ రహి
తాశేష ఝష హరణంబు నవివే కంబే
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పద్యం వైవిధ్యంగా ఉంది. ఉదాత్తమైన భావం. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఆ.వె. మత్స్య ములను పేర్చి మంచి ముగ్గులమర్చ
రిప్లయితొలగించండిచూడ చూడ కనుల సురత మయ్యె
వంటకముల చేసి వంగ మిత్రులకును
విందు సేయ వలెను ప్రీతి తోను.
మంథా భానుమతి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మీన రాశి దెచ్చి మించిన శోభతో
రిప్లయితొలగించండిమీననేత్రియైన చాన యోర్తు
మ్రుగ్గు మ్రుగ్గననుచు ముదితలు మెచ్చంగ
సిగ్గు నిగ్గు మెరసె బుగ్గలందు !
పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మీన రాశి దెచ్చి మించిన శోభతో
రిప్లయితొలగించండిమీననేత్రియైన చాన యోర్తు
మ్రుగ్గు మ్రుగ్గననుచు ముదితలు మెచ్చంగ
సిగ్గు నిగ్గు మెరసె బుగ్గలందు !
రంగవల్లి పోటి రంజుగా సాగంగ
రిప్లయితొలగించండిగ్రామ మందు యున్న గరిత లెల్ల
ముగ్గుపిండితోడ ముగ్గులిడయోర్తు
ముగ్గు లేసె మత్స్యములను కూర్చి.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆపదలు వీడు ననుచున్
రిప్లయితొలగించండిచూపరు లలరన్ సజీవ సురుచిర మయెడిన్
చేపల మ్రుగ్గిడి తను ముని
మాపున ముచ్చటగఁజేసె మత్స్య జయంతిన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పద్యరచన చెప్పగ ముప్పదియారే
రిప్లయితొలగించండిగొప్పగు చిత్రంబునందు కూర్పున మీనాల్
జెప్పగ వేసిన ఘనతయు
నొప్పుల కుప్పక?మగడిక?నూహించు మయా.
2.ముప్పదియారు మీనముల ముచ్చట జూడగ చక్ర బంధమా?
చెప్పగ చేరు వైనవిట చిత్ర విచిత్రపు మీనరాశియా?
మెప్పును బొందురీతి పరమేశ్వరి మండప శిల్ప చిత్రమా?
అప్పటి అర్జునుండు పదకమ్మున గొట్టిన మశ్చయంత్రమా?
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
బొచ్చచేపలుగొని ముగ్గును వే యగా
రిప్లయితొలగించండిచేపలమ్ముపిల్ల చెన్నుగాను
ముచ్చటైన ముగ్గు మురిపించ జ నులను
చేపలమ్ముడయ్యె శీఘ్రముగను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వారిజీవులన్ని వాకిట జేరెను
రిప్లయితొలగించండిముద్దు లొలుకు గొప్ప ముగ్గు యయ్యె
సృష్టి కర్త లిలను సృజియింప లేనట్టి
విషయ ముండబోదు విజ్ఞు లార.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురుమూర్తి ఆచారి గారి పద్యం....
రిప్లయితొలగించండి{అదియే విష్ణుచక్రము! మత్స్యావతారము సముద్ర౦లో జొచ్చి పైవిధమయిన చక్రమై సొమకాసురుని శిరము ఖ౦డి౦చినది}
చదువుల్ గైకొని వార్ధి గర్భమున దాచన్ దైత్యు, డవ్వాని దు
ర్మదమున్ ద్రు౦చగ, దాల్చె మాధవుడు తా మత్స్యావతారమ్ము| న
య్యది పై చిత్ర పటమ్మున౦ గల విధ౦బౌ మీన చక్ర౦ బయెన్
గద, శీఘ్ర౦బుగ. సోమకాసుర శిర: ఖ౦డ౦బు గావి౦పగన్.
గురుమూర్తి ఆచారి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
http://krishnamohan138.blogspot.in/?m=1
రిప్లయితొలగించండిఆవె
రిప్లయితొలగించండినీర నుండు చేప నేలకు చేరెనా
తీరమందుసేదతీర్చుకొనగ
మీన వేషమెంతొముద్దుగాయుండెనో
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల
మీ
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
హైదరాబాదు
9700007653
http://krishnamohan138.blogspot.in/?m=1
కృష్ణమోహన్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నీటనుండు...ముద్దుగా నుండెనో’ అనండి.
మీ బ్లాగు ‘కృష్ణమోహన్ కవితలు’ను కొద్దిరోజుల క్రితమే చూశాను. మీ ‘ఆటవెలదులు, కందాల శతకమాల’ కొన్ని పద్యాలు చదివాను. బాగున్నవి. అక్కడడక్కడ ఛందోవ్యాకరణ దోషాలున్నవి. తరువాత తీరికగా వాటిపై నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను.
దన్యవాదాలు
తొలగించండిదన్యవాదాలు
తొలగించండి