21, ఫిబ్రవరి 2016, ఆదివారం

సమస్య – 1951

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తాత్పర్యము బోధపడదు తత్త్వజ్ఞులకున్.
ఈ సమస్యను సూచించిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

 1. గురువు గారికి కవిమిత్రులెల్లరులకు నమస్కారములు

  మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు

  తత్పరతేలే కున్నను
  తాత్పర్యము బోధపడదు, తాత్వజ్ఞులకున్
  సత్పథమీ భువిలోన ప
  రాత్పరు సేవింప భవహరమ్మని తెలియున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ఒక్క 'తత్పరత+ఏ' అన్నప్పుడు యడాగమం వస్తుంది. 'తత్పరతయె' అనండి.

   తొలగించండి
  2. మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు

   తత్పరతయె లేకున్నను
   తాత్పర్యము బోధపడదు, తాత్వజ్ఞులకున్ 
   సత్పథమీ భువిలోన ప
   రాత్పరు సేవింప భవహరమ్మని తెలియున్ 

   తొలగించండి
 2. తత్పరతయె లేకున్నను
  తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్
  సత్పురుషు లనెడి వారలు
  తత్వమును తెలిసి కొలువ ధార్మికు లనగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణలో చివరి పాదంలో ప్రాస తప్పింది. గణదోషం కూడా ఉంది.

   తొలగించండి
  2. తత్పరతయె లేకున్నను
   తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్
   సత్పురుషు లనెడి వారలు
   నుత్పలముల పూజజేయ నుత్తమ మనుచున్

   గురువులకు ధన్య వాదములు

   తొలగించండి
  3. అక్కయ్యా,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. శుభోదయం !

  తత్పర విశ్లేషణమున
  తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్
  ఉత్పత్తి జేయ ప్రేమను
  తత్పరమును గానవచ్చు తత్సత్ యనుచున్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. తత్పరత గలిగి ధరణిని
  సత్పథమున నడచు చున్న సర్వులు ధరణిన్
  ఉత్పత్తి జేయు దేవుని
  తాత్పర్యము భోధపడదు తాత్వజ్ఞులకున్!!!

  రిప్లయితొలగించండి


 5. తత్పరుని గాన వచ్చున్
  సత్పథమగు కర్మ మార్గ సత్తును గాగన్
  మత్పథ పు భక్తి మార్గము
  తాత్పర్యము బోధపడదు, తత్వజ్ఞులకున్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. సత్పధము లేనివారికి
  తాత్పర్యము బోధ పడదు ,తత్త్వ జ్ఞులకున్
  తత్పరత యుండు కావున
  తాత్పర్యము బోధపడును దండ్రీ !వినుమా !

  రిప్లయితొలగించండి
 7. తత్పరతఁ గలిగి పాలన
  సత్పురుషులుగా నడిపిన షష్ట్యబ్దములున్!?
  సత్ఫలములంద జాలని
  తాత్పర్యము బోధ పడదు తత్వజ్ఙలకుల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. తత్పర పరాత్ప రాత్పర
  మత్పర చిత్పర మువోలె మారుతి నాత్మన్
  సత్పుర రాముని సన్నిధి
  తాత్పర్యము బోధపడదు తత్త్వజ్ఞులకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   పద్యం సలక్షణంగా ఉంది. భావం…_/\_

   తొలగించండి
  2. కంది వారు :)

   నెనర్లు ! తాత్పర్యం నాకూ బోధ పళ్ళే :) (తత్వజ్ఞుల మన్న మాట :)

   జోక్స్ అపార్ట్ ->

   The Divine dwells in the heart of the Devotee. Philosophers cannot deciphers this;

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
 9. రిప్లయిలు
  1. సత్పురుషుల కనిశమ్ము ప
   రాత్పర విమలాంచిత పద లాలిత సేవా
   తత్పరులకు వెత! భగవ
   త్తాత్పర్యము బోధపడదు తత్త్వజ్ఞులకున్.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. సత్పథమున చింతించక
  తాత్పర్యము బోధపడదు, తత్వజ్ఞులకున్
  సత్పురుషుల సాంగత్యమె
  యుత్పాదించును సతతము నుత్తమ విలువన్ (బుద్ధిన్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { భ గ వ ద్గీ తా సా రా ౦ శ ము కే వ ల ము
  తా త్త్వి కు ల కు స౦ పూ ర్ణ ము గా
  బో ధ ప డ దు . ఙ్ఞా న వ౦ తు లై న. స త్పు రు షు ల కే అ ర్థ మ గు ను
  …………………………………………………


  చిత్పరి పాకము గలిగిన

  సత్పురుషావళికి " గీ త. " చక్కగ తెలియున్ |

  సత్ఫల మొసగదు , తా వ త్

  తాత్పర్యము బోధ పడదు తత్త్వఙ్ఞులకున్


  { తా వ త్ = అ౦తా , స౦పూర్ణ మైన. }

  తావత్ తాత్పర్యము = పూర్తి తాత్పర్యము

  రిప్లయితొలగించండి
 12. తత్పరమాత్మ స్వతంత్రుడు
  తత్పట్టున జీవు లస్వతంత్రు లనెడి యే
  తత్పదము గురువులేకను
  తాత్పర్యము బోధ పడదు తత్వజ్ఞులకున్
  2.తత్పరతన్ ధ్యానించిన
  తత్పరమాత్మయును,ధ్యాత,ధ్యానము నొకటన్
  తత్పథము గురువు లేకను
  తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   'తత్పట్టున' అనడం దోషమే.

   తొలగించండి
  2. గురుదేవులుసూచనమేరకు పద్యము సవరించితిని సవరించిన పద్యము
   21.02.2016.
   శంకరాభరణము సమస్య:తాత్పర్యము బోధ పడదు తత్వజ్ఞులకున్
   పూరణ:తత్పరమాత్మ స్వతంత్రుడు
   తత్పరిచర జీవు లస్వతంత్రు లనెడి యే
   తత్పదము గురువులేకను
   తాత్పర్యము బోధ పడదు తత్వజ్ఞులకున్
   2.తత్పరతన్ ధ్యానించిన
   తత్పరమాత్మయును,ధ్యాత,ధ్యానము నొకటన్
   తత్పథము గురువు లేకను
   తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్

   తొలగించండి
 13. సత్ఫలిత మొసగు చెట్లిడు
  తాత్పర్యము బోధపడదు తత్త్వజ్ఞులకున్
  యుత్పత్తి జేయుగాలిని
  ఉత్పాదక తిండి నీరు నుంచిన ద్రుంచన్|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘తత్త్వజ్ఞులకున్+ఉత్పత్తి’ అన్నపుడు యడాగమం రాదు. అలాగే ‘ఉత్పాదక తిండి’ అనడమూ దోషమే.

   తొలగించండి
 14. అన్నయ్యగారూ నమస్తే.నిన్నటి పద్యమొకసారి చూడండి.
  రావణానుజుండు రాముని కరుణచే
  లంక నేలెను రాజయి;లక్ష్మణుండు
  భ్రాతృభక్తి తోడ వనముల కేతెంచి
  విడని నీడ వోలె వెంట నడిచె.వణానుజుండు రాముని కరుణచే
  లంక నేలెను రాజయి;లక్ష్మణుండు
  భ్రాతృభక్తి తోడ వనముల కేతెంచి
  విడని నీడ వోలె వెంట నడిచె.
  నేటి పద్యము:
  తత్పరతలేనివారికి
  తాత్పర్యము బోధ పడదు;తత్వఙ్ఞులకున్,
  సత్పురుషులకున్ సతతము
  తాత్పర్యము బోధ పడును ధరలో గనుమా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   నిన్నటి పూరణ... సమస్య తేటగీతిలో ఉంటే మీరు ఆటవెలది వ్రాశారు.
   మీ నేటి పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. ఉత్పథ పథునకు జీవన
  తాత్పర్యముబోధపడదు, తత్వజ్ఞునకున్
  తత్పరతయె లోపించిన
  సత్పథమేజిక్కదనుట సత్యము సుమ్మీ

  రిప్లయితొలగించండి
 16. మన్నించండన్నయ్యగారూ. గమనించలేదు.
  ఇప్పుడు చూడండి.
  రావణానుజుండు రహితో రాము చేరి
  లంకనేలెను రాజయి;లక్ష్మణుండు
  భ్రాతృ భక్తిఁసోదరు వెంట వనము కేగి
  విడని నీడవోలెను రాము వెంట చనియె.

  రిప్లయితొలగించండి
 17. హృత్పథమున వ్యాకులమును
  సత్పురుషులు గెల్వగోరు సమరము లోన
  న్నుత్పలముల చంపకముల
  తాత్పర్యము బోధపడదు తత్త్వజ్ఞులకున్

  రిప్లయితొలగించండి