శుభోదయం ! జయహో తెలంగాణా ! శ్రీ మేడారం జాతర తెలంగాణా ఆవిర్భావం తరువాయి మొదటి మారు !సమ్మక్క తోడ సారక్కమ్మదిని గొలిచి జిలేబి కవనము జెప్పెన్ నిమ్మది మనమున కనగను కమ్మని యీ తల్లుల కథ కందము గానన్ సావేజితజిలేబి
జిలేబీ గారూ. కొన్ని లోపాలు ఉన్నా పద్యం బాగున్నది. మీ పద్యానికి నా సవరణ.... సమ్మక్క తల్లితో సారమ్మను గొలిచియు జిలేబి రమ్యకవితలేనెమ్మదిని జెప్పె గనగనుకమ్మని యా తల్లుల కథ కందమునందున్.
బంగ రంటి నాతెలంగాణ మందునభక్త కోటి తరలు పండుగదియుసకల జనులు కొలుచు సమ్మక్క సారక్కగద్దె పైకి జేరు కాల మిదియె
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. బంగరువగు ... అనండి
అదిగో జంపన్న ఘనుడు అతడే కద కాకతీయ ఆకను పోరా డి తనువులు బాసె సమ్మక్కతోడు జంపన్న వాగు కాణాచి యనన్ సావేజితజిలేబి
జిలేబీ గారూ, మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
అదిగో జంపన్న ఘనుడు అతడే కద కాకతీయ ఆకను పోరా డి తనువులు బాసె సారక్కతోడు జంపన్న వాగు కాణాచి యనన్
మేడా రంజాతర కని వేడుకగా బోవనెంచి వేగిర పడగన్ జూడగ సమ్మక్క సారక్క లాడు గరగల సొగసుల లావణ్య మటన్
రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
మేడా రంజాతర కని వేడుకగా బోవనెంచి వేగిర పడగన్ జూడగ సమ్మక్కయు సారక్క లాడు గరగల సొగసుల లావణ్య మటన్
గద్దె నెక్కిరి యిద్దరు గనబడంగభవ్య చరితులు పుడమిని వారలుమరికనుము సమ్మక్క సారక్క కవలులగనుపూజ లందుకొనుదురట పుణ్యమిచ్చి
పోచిరాజు సుబ్బారావు గారూ,మీ పద్యం బాగున్నది. వారిద్దరూ తల్లీ కూతుళ్లు కదా.. మీరు కవలు అన్నారు.
వీరోచిత పోరాటముఘోరారణ్యమున జరుగ కోదండ ధరుల్సారమ్మయు సమ్మక్కయువీర మరణమున సురలుగ పేరొంది రిలన్
పోచిరాజు కామేశ్వరరావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మేడారమ్మున నేడున్నాడంబరముగ గిరిజన హారం బనగన్వేడుకగ జాతర జరుగునాడ పడుచులం దలచుచు నానందముగన్
కామేశ్వర రావు గారూ, మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
సమ్మక్కను సారక్కనునెమ్మనమున దలచి జనులు నీమము తోడన్నిమ్మళముగ జూడమనుచుసమ్ముదముగ గొలుతురచట జాతరనందున్!!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. ‘జాతరలోనన్/ జాతరయందున్’ అనండి.
ఎక్కిరి సమ్మ క్కయు సా రక్క మేడారమున గద్దె ప్రబ్బములోనన్ మొక్కుల దీర్చంగ ప్రజలు పెక్కురు చేరిర చట కడు వేడుకతోడన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. రెండవపాదంలో గణదోషం. ‘సా|రక్కయు మేడారమందు నాగద్దెపయిన్’ అందామా?
సమ్మక్క- సారక్క సాధనా సంపత్తి---------తెలగాణ ప్రజలకు తేరుగాగ|మేడార మందున మిక్కిలి భక్తితో------జాతర జూడగ నూత నంబె|కోట్ల ప్రజలు జేర కొండ కోనలయందు------భక్తి ముఖ్యమచట శక్తిముందుగిరిజన,పురజను లరుదెంచి పూజించ-----బెల్లమే బంగారు బేరమగును|కష్ట,నష్టము లందున కాలినడక,బండ్లు,బస్సులతోజేరు ప్రజల కచటనేల గనుపించ దెచ్చట యేలయనగ?చూపు దేవిపై నిలుపగ చూడనగున?2.దుష్టుల సంహరించుటయె దోషముగాదని యెంచ బూని సంతుష్టిగ జేరియున్ నడవితోరణ మందున నున్నమాతలేపుష్టికి మార్గమంచు తమపూర్వుల నుండియు నమ్ముటాయె|మాదృష్టికి దేవతల్ గనుక దీవెన లంటగ జాత రెంచుటౌ
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
సారలమ్మ మరియు సమ్మక్క లనువారుపోరు సల్పి తుదకు పుడమి యందుకుంకుమ భరిణులుగ కొలువు దీరుదురటకొలువ రండు జనులు కోర్కెరదీర.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. 'కోర్కె తీర' అనండి.
సమ్మక్క సారలమ్మలనమ్మకమున పూజఁ జేసి నడచెడు వారల్దమ్ముగలిగి జీవింతురుదొమ్మీల నెదర్చు బలము తోడగు మహిలో!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కదన మందు మేటి కాకతీయుల తోడపోరు సల్పి నట్టి వీర వనితచిలుక గుట్ట పైన చిత్రాతి చిత్రమైకుంకుమభరణిగను కొమ్మ మారె సమస మందు బోరి సమ్మక్క సారక్కస్వర్గ గతులు గాగ వగచి భ్రాతజయము వీడి నంత జంపన్న మరణించెజాతరయ్యె నదియె జనుల కిపుడు.చిలుక గుట్ట మీద కుంకుమ భరణిగ మారినది సమ్మక్కసంపంగి వాగులొ దూకి ఆత్మ బలిదాన మొనర్చుకున్నది సారక్క నాగక్కల సోదరుడు జంపన్న.
సమర మందు బోరి సమ్మక్క నాగక్క ( రెండవపద్య మొదటి పాదము )
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘సమరమందు’... టైపాటువల్ల ‘సమసమందు’ అయింది.
శుభోదయం !
రిప్లయితొలగించండిజయహో తెలంగాణా !
శ్రీ మేడారం జాతర తెలంగాణా ఆవిర్భావం తరువాయి మొదటి మారు !
సమ్మక్క తోడ సార
క్కమ్మదిని గొలిచి జిలేబి కవనము జెప్పెన్
నిమ్మది మనమున కనగను
కమ్మని యీ తల్లుల కథ కందము గానన్
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ.
తొలగించండికొన్ని లోపాలు ఉన్నా పద్యం బాగున్నది. మీ పద్యానికి నా సవరణ....
సమ్మక్క తల్లితో సా
రమ్మను గొలిచియు జిలేబి రమ్యకవితలే
నెమ్మదిని జెప్పె గనగను
కమ్మని యా తల్లుల కథ కందమునందున్.
బంగ రంటి నాతెలంగాణ మందున
రిప్లయితొలగించండిభక్త కోటి తరలు పండుగదియు
సకల జనులు కొలుచు సమ్మక్క సారక్క
గద్దె పైకి జేరు కాల మిదియె
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
బంగరువగు ... అనండి
అదిగో జంపన్న ఘనుడు
రిప్లయితొలగించండిఅతడే కద కాకతీయ ఆకను పోరా
డి తనువులు బాసె సమ్మ
క్కతోడు జంపన్న వాగు కాణాచి యనన్
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
అదిగో జంపన్న ఘనుడు
రిప్లయితొలగించండిఅతడే కద కాకతీయ ఆకను పోరా
డి తనువులు బాసె సార
క్కతోడు జంపన్న వాగు కాణాచి యనన్
మేడా రంజాతర కని
రిప్లయితొలగించండివేడుకగా బోవనెంచి వేగిర పడగన్
జూడగ సమ్మక్క సారక్క
లాడు గరగల సొగసుల లావణ్య మటన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
మేడా రంజాతర కని
తొలగించండివేడుకగా బోవనెంచి వేగిర పడగన్
జూడగ సమ్మక్కయు సారక్క
లాడు గరగల సొగసుల లావణ్య మటన్
గద్దె నెక్కిరి యిద్దరు గనబడంగ
రిప్లయితొలగించండిభవ్య చరితులు పుడమిని వారలుమరి
కనుము సమ్మక్క సారక్క కవలులగను
పూజ లందుకొనుదురట పుణ్యమిచ్చి
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
వారిద్దరూ తల్లీ కూతుళ్లు కదా.. మీరు కవలు అన్నారు.
వీరోచిత పోరాటము
రిప్లయితొలగించండిఘోరారణ్యమున జరుగ కోదండ ధరుల్
సారమ్మయు సమ్మక్కయు
వీర మరణమున సురలుగ పేరొంది రిలన్
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మేడారమ్మున నేడు
తొలగించండిన్నాడంబరముగ గిరిజన హారం బనగన్
వేడుకగ జాతర జరుగు
నాడ పడుచులం దలచుచు నానందముగన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
సమ్మక్కను సారక్కను
రిప్లయితొలగించండినెమ్మనమున దలచి జనులు నీమము తోడన్
నిమ్మళముగ జూడమనుచు
సమ్ముదముగ గొలుతురచట జాతరనందున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
‘జాతరలోనన్/ జాతరయందున్’ అనండి.
ఎక్కిరి సమ్మ క్కయు సా
రిప్లయితొలగించండిరక్క మేడారమున గద్దె ప్రబ్బములోనన్
మొక్కుల దీర్చంగ ప్రజలు
పెక్కురు చేరిర చట కడు వేడుకతోడన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
రెండవపాదంలో గణదోషం. ‘సా|రక్కయు మేడారమందు నాగద్దెపయిన్’ అందామా?
సమ్మక్క- సారక్క సాధనా సంపత్తి
రిప్లయితొలగించండి---------తెలగాణ ప్రజలకు తేరుగాగ|
మేడార మందున మిక్కిలి భక్తితో
------జాతర జూడగ నూత నంబె|
కోట్ల ప్రజలు జేర కొండ కోనలయందు
------భక్తి ముఖ్యమచట శక్తిముందు
గిరిజన,పురజను లరుదెంచి పూజించ
-----బెల్లమే బంగారు బేరమగును|
కష్ట,నష్టము లందున కాలినడక,
బండ్లు,బస్సులతోజేరు ప్రజల కచట
నేల గనుపించ దెచ్చట యేలయనగ?
చూపు దేవిపై నిలుపగ చూడనగున?
2.దుష్టుల సంహరించుటయె దోషముగాదని యెంచ బూని సం
తుష్టిగ జేరియున్ నడవితోరణ మందున నున్నమాతలే
పుష్టికి మార్గమంచు తమపూర్వుల నుండియు నమ్ముటాయె|మా
దృష్టికి దేవతల్ గనుక దీవెన లంటగ జాత రెంచుటౌ
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
సారలమ్మ మరియు సమ్మక్క లనువారు
రిప్లయితొలగించండిపోరు సల్పి తుదకు పుడమి యందు
కుంకుమ భరిణులుగ కొలువు దీరుదురట
కొలువ రండు జనులు కోర్కెరదీర.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
'కోర్కె తీర' అనండి.
రిప్లయితొలగించండిసమ్మక్క సారలమ్మల
నమ్మకమున పూజఁ జేసి నడచెడు వారల్
దమ్ముగలిగి జీవింతురు
దొమ్మీల నెదర్చు బలము తోడగు మహిలో!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
సారలమ్మ మరియు సమ్మక్క లనువారు
రిప్లయితొలగించండిపోరు సల్పి తుదకు పుడమి యందు
కుంకుమ భరిణులుగ కొలువు దీరుదురట
కొలువ రండు జనులు కోర్కెరదీర.
కదన మందు మేటి కాకతీయుల తోడ
రిప్లయితొలగించండిపోరు సల్పి నట్టి వీర వనిత
చిలుక గుట్ట పైన చిత్రాతి చిత్రమై
కుంకుమభరణిగను కొమ్మ మారె
సమస మందు బోరి సమ్మక్క సారక్క
స్వర్గ గతులు గాగ వగచి భ్రాత
జయము వీడి నంత జంపన్న మరణించె
జాతరయ్యె నదియె జనుల కిపుడు.
చిలుక గుట్ట మీద కుంకుమ భరణిగ మారినది సమ్మక్క
సంపంగి వాగులొ దూకి ఆత్మ బలిదాన మొనర్చుకున్నది సారక్క నాగక్కల సోదరుడు జంపన్న.
సమర మందు బోరి సమ్మక్క నాగక్క ( రెండవపద్య మొదటి పాదము )
రిప్లయితొలగించండిఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘సమరమందు’... టైపాటువల్ల ‘సమసమందు’ అయింది.