గురువు గారికీ, కవిమిత్రులెల్లరులకు నమస్సుమాంజలులు1.కోపము స్వార్థము గలిగినపాపాత్ములు భ్రష్టులు, జనవంద్యులు జగతిన్నాపద లోనున్న జనులగాపాడెడు సత్యవ్రతులు కరుణా మూర్తుల్ .2.పాపమనెంచక యున్నతమౌ పదవుల బొందదలచి మారణ కాండల్ జేపించుచు నేతలయినపాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్ .
ఆంజనేయ శర్మ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆపదలు దాట గోరిన పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్ శాపము నొందిన వారలు నేపాపము జేయకున్న నేరస్తు లగున్
రాజేశ్వరి అక్కయ్యా, పద్యం నిర్దోషంగా ఉన్నా సమస్య పరిష్కరింపబడలేదు. చివరి పాదాన్ని ‘నీ పదములె పట్టుచుంద్రు నిజముగ కృష్ణా’ అందామా?
ఆపాదమస్తక విషపుపాపాత్ములు భ్రష్టులు; జనవంద్యులు జగతిన్నాపార్థసారథుని కొలువే పారుని నెలవుగరయు వేకువ విదురుల్వేకువ విదురుల్ = early raisers :)
జిలేబీ గారూ, మీ పూరణలో చివరిపాదం అర్థం కాలేదు.
ధన్య వాదాలండీ కంది వారు !పార్థసారథి ని కొలువే పాఱుఁని -బ్రాహ్మణుని-బ్రహ్మత్వం కోసం తపించే వారి - నెలవు యని తెలిసిన వేకువ విదురుల్ జనవంద్యులు జగతిన అన్న అర్థం తో వ్రాసా అక్కడ గరయ గ అన్నది తప్పను కుంటా నరయ అని రావాలా ? ? ఆపాదమస్తక విషపుపాపాత్ములు భ్రష్టులు; జనవంద్యులు జగతిన్నాపార్థసారథుని కొలువే పాఱుఁని నెలవు నరయు వేకువ విదురుల్ జిలేబి
సరదా శారదా :) వేపాకు వలదు వలదనుపాపాత్ములు భ్రష్టులు; జనవంద్యులు, జగతిన్ మా పాకము మెచ్చుదురో తాపాలను దీర్చు రసము తాళింపు గనన్ ?సావేజితజిలేబి
జిలేబీ గారూ, మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏ పనిఁ జేసెడు వారలకా పనిలో విజయమంద యాశయముండన్శ్రీపతి దయఁగొనఁ దలతురుపాపాత్ములు, భ్రష్టులు, జనవంద్యులు జగతిన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాపమ్ములు, పుణ్యమ్ములు తాపము కోపమ్ములిలను తగ మిళితముగా ఆ పగిదిని కలిసుందురు పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గోపాలుని దూరు జనులుపాపాత్ములు భ్రష్టులు, జనవంద్యులు జగతిన్జూపుచు నౌదార్యంబున్నాపదలో నున్నవారి నాదుకొను గుణుల్ !!!
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోపావేశమ్ము లుడిగిపాపమ్ములకున్ మనమున బాధం బశ్చాత్తాపము జెందిన వారలుపాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హే పరమేశా!గొల్తురు పాపాత్ములు భ్రష్టులు, జనవంద్యులు జగతిన్బాపు మఘమ్ముల,నొసగుము నీపద కమలముల భక్తి నిరతము నిలుపన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏపఠనమ్మును చేయక భూపాలకులైన పంచి భూరిగ ధనమున్ చూపించుచు దివి మాటల పాపాత్ములు భష్టులు జన వంద్యులు జగతిన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాపములు జేయువారలు పాపాత్ములు ,భ్రష్టులు ,జన వంద్యులు జగతిన్నాపదుల గావు జనములు పాపము లంజోలి బోక బ్రదికెడు వారున్
పోచిరాజు సుబ్బారావు గారూ,మీ పూరణ బాగున్నది. ‘...న్నాపదల గాచు జనములు...’ అనండి.
* గు రు మూ ర్తి ఆ చా రి * ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,జననీ ! నిన్ను దల౦చి, పూనితిని >హస్త౦బ౦దునన్ బుస్తక౦బును|నా చేతము న౦దు నీ విక. సత౦బున్ నిల్చి,స ద్వాక్కులన్ ఘనమౌ రీతిని పల్క జేయుము |జగన్మాతా!దయారూపిణీ!వనజాతోద్భవు రాణి! వాణి! సుషమద్వాణీ!విప౦చీ ధరీ! { సుషమత్ = కోమలమగు, మనోఙ్ఞమైన ; విప౦చి = వీణ. }
ఈ పుడమి కంత తెలియును పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్ఈ పరమ సత్య మెరిగియు నేపారుచు నీతి రహితు లెదిగిరి ధరలో.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోపవశంబున వగతురుపాపాత్ములు బ్రష్టులు;జనవంద్యులు జగతిన్నాపద లొడమిన దేవునిరూపము ను దలచుచు నుందు రుర్విన్ గనగన్.2శాపవశంబున బుడుదురుపాపాత్ములు బ్రష్టులు ;జనవంద్యులుకోపరహితులై బ్రోతురుఆపన్నులచేయి విడక హర్షము తోడన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. రెండవ పూరణలో ‘బ్రోచెద| రాపన్నుల...’ అనండి.
లోపాలను గనుపించకరూపాలను సాకుచున్న?రోగిష్టులిలన్|చూపరులకు నాయకులైపాపాత్ములు,బ్రష్టులుజనవంద్యులుజగతిన్.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చూపింతు రసుర గుణములు పాపాత్ములు భ్రష్టులు ; జనవంద్యులు జగతిన్పాపాత్ములను క్షమించుచుకాపాడగ జూతు రెపుడు కరుణా మయులై
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోపము జేయంగవలదునేపాలపు మాంత్రికులిట నేతలు కాగా గోపురములు కాజేసెడి పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్!
సాపాటుకు గతి లేదు సుమా పరమాన్నముల నిత్తు మనిరి జిలేబీమా పాలకులు భళారేపాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్!జిలేబి
వ్యాపారము నందు మునిగి పోపులు ముల్లాలు హిందు పూజారులహో పేపరు టైగర్లవగా పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్
గురువు గారికీ, కవిమిత్రులెల్లరులకు నమస్సుమాంజలులు
రిప్లయితొలగించండి1.
కోపము స్వార్థము గలిగిన
పాపాత్ములు భ్రష్టులు, జనవంద్యులు జగతి
న్నాపద లోనున్న జనుల
గాపాడెడు సత్యవ్రతులు కరుణా మూర్తుల్ .
2.
పాపమనెంచక యున్నత
మౌ పదవుల బొందదలచి మారణ కాండల్
జేపించుచు నేతలయిన
పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్ .
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆపదలు దాట గోరిన
రిప్లయితొలగించండిపాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్
శాపము నొందిన వారలు
నేపాపము జేయకున్న నేరస్తు లగున్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిపద్యం నిర్దోషంగా ఉన్నా సమస్య పరిష్కరింపబడలేదు. చివరి పాదాన్ని ‘నీ పదములె పట్టుచుంద్రు నిజముగ కృష్ణా’ అందామా?
ఆపాదమస్తక విషపు
రిప్లయితొలగించండిపాపాత్ములు భ్రష్టులు; జనవంద్యులు జగతి
న్నాపార్థసారథుని కొలు
వే పారుని నెలవుగరయు వేకువ విదురుల్
వేకువ విదురుల్ = early raisers :)
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణలో చివరిపాదం అర్థం కాలేదు.
ధన్య వాదాలండీ కంది వారు !
తొలగించండిపార్థసారథి ని కొలువే పాఱుఁని -బ్రాహ్మణుని-బ్రహ్మత్వం కోసం తపించే వారి - నెలవు యని తెలిసిన వేకువ విదురుల్ జనవంద్యులు జగతిన అన్న అర్థం తో వ్రాసా
అక్కడ గరయ గ అన్నది తప్పను కుంటా నరయ అని రావాలా ? ?
ఆపాదమస్తక విషపు
పాపాత్ములు భ్రష్టులు; జనవంద్యులు జగతి
న్నాపార్థసారథుని కొలు
వే పాఱుఁని నెలవు నరయు వేకువ విదురుల్
జిలేబి
సరదా శారదా :)
రిప్లయితొలగించండివేపాకు వలదు వలదను
పాపాత్ములు భ్రష్టులు; జనవంద్యులు, జగతిన్
మా పాకము మెచ్చుదురో
తాపాలను దీర్చు రసము తాళింపు గనన్ ?
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏ పనిఁ జేసెడు వారల
రిప్లయితొలగించండికా పనిలో విజయమంద యాశయముండన్
శ్రీపతి దయఁగొనఁ దలతురు
పాపాత్ములు, భ్రష్టులు, జనవంద్యులు జగతిన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాపమ్ములు, పుణ్యమ్ములు
రిప్లయితొలగించండితాపము కోపమ్ములిలను తగ మిళితముగా
ఆ పగిదిని కలిసుందురు
పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గోపాలుని దూరు జనులు
రిప్లయితొలగించండిపాపాత్ములు భ్రష్టులు, జనవంద్యులు జగతిన్
జూపుచు నౌదార్యంబు
న్నాపదలో నున్నవారి నాదుకొను గుణుల్ !!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోపావేశమ్ము లుడిగి
రిప్లయితొలగించండిపాపమ్ములకున్ మనమున బాధం బశ్చా
త్తాపము జెందిన వారలు
పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హే పరమేశా!గొల్తురు
రిప్లయితొలగించండిపాపాత్ములు భ్రష్టులు, జనవంద్యులు జగతిన్
బాపు మఘమ్ముల,నొసగుము
నీపద కమలముల భక్తి నిరతము నిలుపన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏపఠనమ్మును చేయక
రిప్లయితొలగించండిభూపాలకులైన పంచి భూరిగ ధనమున్
చూపించుచు దివి మాటల
పాపాత్ములు భష్టులు జన వంద్యులు జగతిన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాపములు జేయువారలు
రిప్లయితొలగించండిపాపాత్ములు ,భ్రష్టులు ,జన వంద్యులు జగతి
న్నాపదుల గావు జనములు
పాపము లంజోలి బోక బ్రదికెడు వారున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘...న్నాపదల గాచు జనములు...’ అనండి.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
జననీ ! నిన్ను దల౦చి, పూనితిని >హస్త౦బ౦దునన్ బుస్తక౦
బును|నా చేతము న౦దు నీ విక. సత౦బున్ నిల్చి,స ద్వాక్కులన్
ఘనమౌ రీతిని పల్క జేయుము |జగన్మాతా!దయారూపిణీ!
వనజాతోద్భవు రాణి! వాణి! సుషమద్వాణీ!విప౦చీ ధరీ!
{ సుషమత్ = కోమలమగు, మనోఙ్ఞమైన ;
విప౦చి = వీణ. }
ఈ పుడమి కంత తెలియును
రిప్లయితొలగించండిపాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్
ఈ పరమ సత్య మెరిగియు
నేపారుచు నీతి రహితు లెదిగిరి ధరలో.
ఈ పుడమి కంత తెలియును
రిప్లయితొలగించండిపాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్
ఈ పరమ సత్య మెరిగియు
నేపారుచు నీతి రహితు లెదిగిరి ధరలో.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోపవశంబున వగతురు
రిప్లయితొలగించండిపాపాత్ములు బ్రష్టులు;జనవంద్యులు జగతిన్
నాపద లొడమిన దేవుని
రూపము ను దలచుచు నుందు రుర్విన్ గనగన్.
2శాపవశంబున బుడుదురు
పాపాత్ములు బ్రష్టులు ;జనవంద్యులు
కోపరహితులై బ్రోతురు
ఆపన్నులచేయి విడక హర్షము తోడన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో ‘బ్రోచెద| రాపన్నుల...’ అనండి.
లోపాలను గనుపించక
రిప్లయితొలగించండిరూపాలను సాకుచున్న?రోగిష్టులిలన్|
చూపరులకు నాయకులై
పాపాత్ములు,బ్రష్టులుజనవంద్యులుజగతిన్.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చూపింతు రసుర గుణములు
రిప్లయితొలగించండిపాపాత్ములు భ్రష్టులు ; జనవంద్యులు జగతిన్
పాపాత్ములను క్షమించుచు
కాపాడగ జూతు రెపుడు కరుణా మయులై
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోపము జేయంగవలదు
రిప్లయితొలగించండినేపాలపు మాంత్రికులిట నేతలు కాగా
గోపురములు కాజేసెడి
పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్!
రిప్లయితొలగించండిసాపాటుకు గతి లేదు సు
మా పరమాన్నముల నిత్తు మనిరి జిలేబీ
మా పాలకులు భళారే
పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్!
జిలేబి
వ్యాపారము నందు మునిగి
రిప్లయితొలగించండిపోపులు ముల్లాలు హిందు పూజారులహో
పేపరు టైగర్లవగా
పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్